కట్నం రక్కసికి బలి
Published Tue, Jan 7 2014 3:37 AM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
రాజమండ్రి, న్యూస్‌లైన్: వరకట్న భూతం కోరల్లో చిక్కుకుని ఓ మహిళ తనువు చాలించింది. భర్త వేధింపులు తాళలేక ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి క్వారీ ప్రాంతంలోని టీవీ రోడ్డులో ఆది వా రం రాత్రి జరిగిన ఈ సంఘటన ఆల స్యంగా వెలుగుచూసింది. త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఆత్మహత్య చేసుకుందంటూ భర్త పోలీసులతో చె ప్పాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీ సులు.. సంఘటన స్థలానికి చేరుకున్నారు. లో పల నుంచి గడియ పెట్టి ఉండడంతో, పోలీ సు లు తలుపు పగులగొట్టారు. డీఎస్పీలు నామగి రి బాబ్జీ, కె.శ్రీనివాసరావు, సీఐ రమేష్ ఇంట్లో వెళ్లి చూడగా, మృతదేహం వేలాడుతూ కనిపించింది. పోలీసుల కథనం ప్రకారం.
శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామానికి చెందిన దీపిక (20)కు, అదే ప్రాంతానికి చెందిన దవళ మల్లేశ్వరరావుకు రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. కట్నం గా రూ.మూడు లక్షలు, రెండు తులాల బం గారం, రూ.20 వేలు ఆడపడుచు కట్నం ఇచ్చేం దుకు పెద్దల మధ్య అంగీకారం కుదిరింది. పెళ్లినాటికి అన్ని లాంఛనాలు పూర్తి చేయగా, కట్నంలో తక్కువైన లక్ష రూపాయలు కొద్దిరోజుల తర్వాత ఇస్తామని దీపిక తల్లిదండ్రులు తెలిపారు. తండ్రి ఉద్యోగరీత్యా మల్లేశ్వరరావు, దీపిక రాజమండ్రికి కాపురం వచ్చారు. పెళ్లయిన ఏడాదిన్నరకు కుమార్తె చైత్ర పుట్టింది. రాజమండ్రిలోని హోండా షోరూంలో మల్లేశ్వరరావు సెక్యూరిటీ గార్డుగా పనిలో చేరాడు.
ఇదిలా ఉండగా పెళ్లికి ఇస్తామన్న కట్నంలో లక్ష రూపాయలు బాకీ ఉండడంతో దీపిక అత్త రా ణమ్మ, భర్త మల్లేశ్వరరావు, అతడి తమ్ముడు చంద్రశేఖర్, ఆడపడుచులు కలిసి దీపికను తర చూ వేధించేవారు. కొద్దినెలల క్రితం దీపిక నో ట్లో గుడ్డలుకుక్కి హతమార్చేందుకు యత్నిం చారు. ఈ విషయాన్ని శ్రీకాకుళంలో ఉన్న తల్లిదండ్రులకు ఆమె చెప్పడంతో, వారు వచ్చే సం క్రాంతికి బాకీ డబ్బు ఇస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఏడాది పాపను ఇంట్లోనే ఉంచి దీపిక గది తలుపు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ సమయంలో అత్త, ఆడపడుచులు బయటకు వెళ్లినట్టు చెబుతున్నారు. ఇంట్లో ఎవరూ కనిపించకపోవడంతో పాప చా లాసేపు ఏడ్చింది. స్థానికులు గమనించి ఇం ట్లోకి వెళ్లిచూడగా, విషయం వెలుగుచూసింది. కట్నం డబ్బు ఇచ్చేందుకు సమయాత్తమవుతుం డగా, ఇంతలోనే తన కుమార్తెను పొట్టన పెట్టుకున్నారని దీపిక తల్లి ఆదిలక్ష్మి బోరున విలపిం చడం స్థానికులను కంటతడి పెట్టించింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పోలీసులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement