అదనపు కట్నం కోసం వేధింపులు
► మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యాయత్నం
► చికిత్స పొందుతూ మృతి
►ముగ్గురిపై కేసు నమోదు
గద్వాల క్రైం: పచ్చని కాపురంలో కట్నం పిశాచి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. సాఫీగా సాగుతున్న కుటుం బంలో నిత్యం అదనపు కట్నం తీసుకురావాలంటూ భర్త, అత్తమామలు వేధింపులకు గురి చేయడంతో మనస్తాపం చెందిన ఓ వివాహిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. గ్రామస్తులు, ఏఎస్‌ఐ శేషిరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండల పరిధిలోని మర్లపల్లికి చెందిన తెలుగు గోకారమ్మ(35)కు కొండపలి్లకి చెందిన తెలుగు వెంకటన్నతో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.
వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. సాఫీగా సాగుతున్న వీరి సంసారంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. కట్నం తీసుకొస్తేనే ఇంట్లో ఉండాలంటూ కర్కశంగా గోకారమ్మపై దాడికి పాల్పడ్డారు. అన్ని ఓర్చుకుని సంసారం నెట్టుకొచ్చింది. అయితే ఈ నెల 19వ తేదీన మరోసారి అదనపు కట్నం తేవాలంటూ గోకారమ్మను వేధింపులకు గురి చేశారు. దీంతో మనస్థాపం చెంది గ్రామ శివారు వద్ద పురుగుల మందు సేవించి అపస్మారక స్థితిలో పడిపోయింది.
గమనించిన కుటుంబసభ్యులు హు టా హుటిన చికి త్స నిమిత్తం గద్వాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి వి షమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ సోమవా రం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. గోకారమ్మ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. సంఘటనకు సంబంధించి గోకారమ్మ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి ముగ్గురిని అదుపులో తీసుకున్నట్లు ఏఎస్‌ఐ శేషిరెడ్డి తెలిపారు.