సాక్షి, విజయవాడ : సీనియర్ పాత్రికేయుడు, కాలమిస్ట్ నగరానికి చెందిన తుర్లపాటి కుటుంబరావును 2019 సంవత్సరానికి గానూ డాక్టర్ రావూరి భరద్వాజ స్మారక పురస్కారానికి ఎంపిక చేసినట్లు ట్రస్ట్ చైర్మన్ రావూరి వెంకట కోటేశ్వరరావు, రావూరి సాయిసుమంత్ మంగళవారం సాక్షికి వివరించారు. రావూరి కాంతమ్మ సంగీత సేవా పురస్కారానికి గుంటూరుకు చెందిన రామరాజు లక్ష్మీ శ్రీనివాస్‌కు ప్రదానం చేస్తునట్లు తెలిపారు. రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రతీ ఏటా రావూరి భరద్వాజ, కాంతమ్మ పురస్కారాలను అందిస్తున్నట్లు తెలిపారు. 5వ తేదీ సాయంత్రం మెగల్రాజపురంలోని ది కల్చరల్ సెంటర్ ఆఫ్ అమరావ తి విజయవాడలో పురస్కార వీటిని అందచేస్తామని, కార్యక్రమానికి పూర్వ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, చారిత్రక పరిశోధకులు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డిలు పాల్గొంటారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment