హక్కులను హరించడం ఫాసిజమే: కేటీఆర్
హైదరాబాద్: తమ హక్కుల కోసం పోరాడడం ప్రజాస్వామ్యమ ని, ఒకరి హక్కులను హరించడం ఫాసిజం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కొనసాగించడానికే ఎన్డీయే ప్రభుత్వం ఉందా అని ఆయన ప్రశ్నిం చారు. అలా చేస్తే.. దానిని ప్రజలు యూపీఏ-3 గా పరిగణిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో యూపీఏని తిరస్కరించిన విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే విధంగా కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖపై ఆయన పై విధంగా స్పందించారు.
అర్హులను గుర్తించేందుకే సర్వే
సిరిసిల్ల: సంక్షేమ పథకాల్లో అర్హులకు న్యా యం చేసేందుకే ఈ నెల 19న ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రణాళిక రూపకల్పనకు సర్వే దోహదపడుతుందన్నారు.