The NDA government
-
అభివృద్ధిని ఓర్వలేకనే అడ్డుకుంటున్నారు
కాంగ్రెస్ నాయకులపై ధ్వజమెత్తిన వెంకయ్యనాయుడు జీఎస్టీ ఆమోదం విషయమై అన్ని పార్టీలతో మాట్లాడుతాం బెంగళూరు : ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణల వల్ల జరుగుతున్న అభివృద్ధిని చూసి కాంగ్రెస్ నాయకులు ఓర్వలేక పోతున్నారని కేంద్ర పట్టణాభివృద్ధి, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ధ్వజమెత్తారు. అందువల్ల దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేసే కీలక బిల్లులు చట్టసభల్లో ఆమోదం పొందకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. బెంగళూరులో శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ముద్రా బ్యాంక్, తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల దేశంలో పెట్టుబడులు పెరుగుతున్నాయన్నారు. దీంతో ప్రస్తుతం దేశ జీ.డీ.పీ గతంలో ఎప్పుడూ లేన ంతగా 7.5గా ఉందన్నారు. ఇదే విధంగా భారత దేశం అభివృద్ధి పథంలో ప్రయాణిస్తే రానున్న రెండేళ్లలోనే ఆర్థికాభివృద్ధిలో చైనాను మించిపోతుందని ప్రపంచబ్యాంకు వంటి సంస్థలే చెబుతున్నాయని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఇలా ఎన్డీఏ పాలనకు దేశంలోని వివిధ వర్గాల ప్రజల నుంచే కాక ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ప్రశంసలను ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు జీఎస్టీ బిల్లులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జీ.ఎస్.టీ బిల్లు అమల్లోకి వస్తే భారత జీ.డీ.పీ మరో 2 శాతం వరకు పెరుగుతుందన్నారు. ఇందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలను అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే అత్యంత విలువైన వర్షాకాల పార్లమెంటు సమావేశాలను కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారన్నారు. తమతో పాటు మిగిలిన అన్ని పార్టీలు వర్షాకాల సమావేశాలు సజావుగా జరగడానికి సహకరించాలని చెప్పినా కాంగ్రెస్ మాత్రం మొండిపట్టు వీడక పోవడంతో సభాసమయం వృథా అయిపోయిందన్నారు. అయితే వచ్చే ఏడాది ఏప్రిల్‌లోపు జీ.ఎస్.టీ బిల్లును ఎలాగైనా సరే అమల్లోకి తీసుకురావాల్సి ఉందన్నారు. అందువల్ల తాము అన్ని పార్టీనాయకులతో మాట్లాడి ఈ బిల్లు ఆమోదం పొందడానికి ప్రత్యేక సమావేశాలు నిర్వహించడంతో పాటు మిగిలిన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని వెంకయ్యనాయుడు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్లమెంటు వెల్‌లోకి దూసుకుపోయి కార్యకలాపాలను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇప్పటి వరకూ ఓ ప్రధాన పార్టీ అధ్యక్షులు ఎవరూ ఇలా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని అవమాన పరిచిన దాఖలాలు లేవన్నారు. ఇలాంటి పరిస్థితులు మరోసారి ఉత్పన్నం కాకుండా పార్లమెంటు నియమావళిలో కొన్ని మార్పులు చేయడంతో పాటు వాటిని ఉల్లంఘించిన వారి పై చర్యలు తీసుకోవడంపై విస్తృత చర్చ జరిపి ఆమేరకు మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంపై మీరేమంటారు అన్న ‘సాక్షి’ ప్రశ్నకు వెంకయ్యనాయుడు బదులు చెప్పకుండా విలేకరుల సమావేశం నుంచి వడివడిగా వెళ్లిపోయారు. -
ఎఫ్‌సీఐ తప్పుకుంటే ‘మద్దతు’ ఎలా?
న్యూఢిల్లీ: యూపీఏ ప్రభుత్వం తెచ్చిన ఆహార భద్రత చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకే ఎన్డీయే ప్రభుత్వం రహస్య ఎజెండాతో ఎఫ్‌సీఐ పునర్ వ్యవస్థీకరణ, ఆహార ధాన్యాల సేకరణ అంశాలపై శాంతకుమార్ కమిటీని నియమించిందని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘మోదీ ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని, దాని ఉదాత్తమైన ఉద్దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తోంది. చట్టం కింద ఉన్న 67 శాతం లబ్ధిదారులను 40 శాతానికి తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. భూసేకరణ చట్టాన్ని రైతు వ్యతిరేక చట్టంగా మార్చినట్టే, ఆహార భద్రత చట్టాన్ని పేదల వ్యతిరేక చట్టంగా మా ర్చుతున్నారన్నారు. జనతాపరివార్ మాదిరిగా కాంగ్రెస్ పార్టీలో కూడా పునరేకీకరణ జరగాలని దిగ్విజయ్ అన్నారు. వివిధ కారణాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిపోయిన నేతలు.. కాంగ్రెస్ నుంచి వేరుపడి ఏర్పడిన ఇతర పార్టీలు అన్నీ తిరిగి కాంగ్రెస్‌లో ఐక్యం కావలసి న అవసరం ఉందని పేర్కొన్నారు. -
పరిణతితో వ్యవహరిస్తాం
నల్లధనంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్య దర్యాప్తు తర్వాతే ఖాతాదార్ల పేర్లు వెల్లడిస్తాం న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో కొందరు భారతీయుులు దాచుకున్న నల్లధనం విషయుంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించబోదని, అలా చేస్తే నల్లధనానికి సంబంధించిన సమాచారంపై భవిష్యత్తులో ఇతర దేశాల సహకారం తగ్గిపోయే ఆస్కారం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం చెప్పారు. ఈ విషయంలో తాము పరిణతితో వ్యవహరిస్తావున్నారు. నల్లధనం ఖాతాలున్నవారి పేర్లను బయుటపెట్టాలన్న అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న ఆరోపణలకు స్పందిస్తూ, అరుణ్ జైట్లీ తన వ్యాఖ్యలను సోషల్ వెబ్సైట్ ‘ఫేస్బుక్’లో పొందుపరిచారు. నల్లధనంపై సమాచారంకోసం ఎన్డీఏ సర్కార్ ప్రయత్నం కొనసాగుతూనే ఉందని, అరుుతే ప్రయుత్నంలో దూకుడులేదని, నల్లధనం ఖాతాలున్నవారి పేర్లను బహిర్గతం చేసేందుకు, ప్రాసిక్యూషన్ చర్యలకు, కట్టుబడి ఉన్నామన్నారు. తప్పుదారి పట్టిస్తున్న మోదీ: కాంగ్రెస్ కాగా,.. నల్లధనం విషయుంలో మోదీ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్మనీతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా నల్లధనం విషయుంలో తవు ప్రభుత్వం చేతులు కట్టేసినట్టరుుందంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ శనివారం ఖండించారు. అంతకు ముందే ఎన్డీఏ హయూంలో కుదిరిన 14 ద్వంద్వ పన్నుల మినహాయింపు ఒప్పందాల మాటేమిటన్నారు. మోదీ మాటనిలబెట్టుకోవాలి: దిగ్విజయ్ విదేశాల్లో దాగిన నల్లధనాన్ని దేశానికి తెప్పించి ప్రతిఒక్క పౌరుడికీ రూ. 3 లక్షల చొప్పున పంపిణీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చే శారు. మోదీవి తప్పుడు హామీలే: నితీశ్ నల్లధనంపై మోదీ లోక్‌సభ ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చారని జేడీయుూ వ్యాఖ్యానించింది. విదేశాల్లో దాగిన నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తావుంటూ బీజేపీ హామీ ఇచ్చిందని, నల్లధనం తెప్పించే విషయం అలా ఉంచితే, దాచుకున్న వారి పేర్లు కూడా వెల్లడించడ ంలేదని జేడీయుూ సీనియర్ నేత నితీశ్ పేర్కొన్నారు. నల్లధనంపై మళ్లీ పోరుకు సిద్ధం: హజారే విదేశాల్లో దాగిన నల్లధనం సవూచారవుంతా వెల్లడించడం కుదరదంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడాన్ని సావూజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. అక్రమ సంపదను విదేశాలనుంచి రప్పించని పక్షంలో ఈ విషయమై తాను ఆందోళనకు దిగుతామని హజారే హెచ్చరించారు. హజారే శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మేరకు లేఖ రాశారు. -
‘అభద్రతా’ సంస్కరణలు!
చురుగ్గా పనిచేయడం, వెనువెంటనే స్పందించే గుణం ఉండటం మం చిదే. కానీ, ఆ వేగమైనా, స్పందనైనా మెజారిటీ ప్రజలకు ఉపయోగప డేలా ఉండటం కూడా అవసరం. కనీసం వారి ప్రయోజనాలు దెబ్బతిన కుండా చూడటం ముఖ్యం. అయితే, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో కొచ్చిన వెనువెంటనే కసరత్తు ప్రారంభించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణల బిల్లులు అందుకు అనుగుణంగా లేవు. 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం, 1961నాటి అప్రెంటిస్‌షిప్ చట్టం, 1988నాటి కార్మిక నిబంధనల చట్టంకు తాజా బిల్లులు సవరణలు ప్రతిపాదిస్తున్నాయి. ఇందులో అప్రెంటిస్‌షిప్ చట్టానికి గురువారం లోక్‌సభ ఆమోద ముద్ర కూడా పడింది. ఈ చట్టాలన్నిటినీ సవరించాలని కార్మిక సంఘాలు కూడా చాన్నాళ్లనుంచి డిమాండు చేస్తున్నాయి. వీటినేకాదు... వేర్వేరు సందర్భాల్లో తీసుకొచ్చిన మొత్తం 40కిపైగా కార్మిక చట్టాలను కుదిం చాలని, వాటిని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా మార్చాలని కోరు తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం వలస పాలకులు తెచ్చినవి కావడం వల్ల అందులో కార్మిక వ్యతిరేక అంశాలే ఎక్కువున్నాయని అంటు న్నాయి. అలాగే, ఒక అంశానికి సంబంధించిన నిబంధనే వేర్వేరు చట్టాల్లో ఉండటం, కొన్ని సందర్భాల్లో ఆ నిబంధనలు పరస్పర విరు ద్ధంగా ఉండటంవల్ల సగటు కార్మికుడు నష్టపోయే పరిస్థితులు ఏర్పడు తున్నాయన్నది కార్మిక సంఘాల ప్రధాన ఆరోపణ. ఈ అంశాలన్నీ గతంలో వివిధ వేదికలపై చర్చకు వచ్చాయి. తాజా సవరణ బిల్లులు ఈ అంశాల్లో చాలావాటిని విస్మరించాయి. అయితే, సవరణల్లో కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేవి అసలే లేవని చెప్పలేం. ఫ్యాక్టరీల చట్టానికి చేసిన సవరణలనే తీసుకుంటే... ఒక త్రైమాసికంలో కార్మికులు ఓవర్‌టైం పరిమితి 50 గంటలు మించరాదని ఉన్న నిబంధనను సవరించి దాన్ని వంద గంటలకు మార్చారు. దీనివల్ల కార్మికులు అదనపు ఆదాయాన్ని సంపాదించేం దుకు ఆస్కారం లభిస్తుంది. రాత్రిపూట మహిళలు పనిచేయడంపై ఉన్న ఆంక్షలను సడలించారు. గర్భిణులు, వైక ల్యం ఉన్నవారికి యంత్రాలవద్ద పని ఇవ్వ కూడదన్న మినహాయింపునిచ్చారు. ఏడా దికి 240 రోజులు చేసినవారికి మాత్రమే లభించే వార్షిక సెలవులను ఇకపై 90 రోజులు చేసినవారికి వర్తించేలా మార్పు చేశారు. తాజా బిల్లు ద్వారా ఈ చట్టానికి కేంద్రం 54 సవరణలను ప్రతిపాదించింది. అప్రెం టిస్ చట్టం విషయంలోనూ కార్మికులకు అనుకూలమైన సవరణలు ఉన్నాయి. శాశ్వత ఉద్యోగులకు వర్తించే సెలవులు, ప్రభుత్వ సెలవులు అప్రెంటిస్‌లకు కూడా వర్తించేలా మార్పు చేశారు. కాంట్రాక్టు కార్మి కులు, క్యాజువల్ కార్మికులు, దినసరి కూలీలు కూడా ఈ చట్టంకిందకు వస్తారు. ముందస్తు అనుమతి అవసరం లేకుండానే యాజమాన్యాలు ఐటీ సంబంధిత సేవలతోసహా కొత్త సాంకేతిక వృత్తులను ఈ చట్టం కిందకు తీసుకొచ్చే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల అదనంగా 500 సాంకేతిక వృత్తులు అప్రెంటిస్షిప్లోకి వస్తాయి. ఫలితంగా లక్షలాది మంది అప్రెంటిస్‌లుగా వివిధ వృత్తుల్లో శిక్షణ పొందే అవకాశం, నైపు ణ్యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇంతవరకూ బాగానే ఉన్నా ఫ్యాక్టరీల చట్టానికి ప్రతిపాదించిన మరికొన్ని సవరణలు కార్మికులకు అన్యాయం చేసేవిగా ఉన్నాయి. అమల్లో ఉన్న చట్టం ప్రకారం విద్యుత్‌ను వినియోగించే ఏ తయారీ యూనిట్ అయినా ఏడాదిలో పదిమంది, అంతకుమించి సిబ్బందిని పనిలో పెట్టుకుంటే దాన్ని పరిశ్రమగా గుర్తించాలి. విద్యుత్ అవసరం లేని యూనిట్ విషయంలో ఈ సంఖ్య 20. ఇప్పుడు ప్రతిపాదించిన సవ రణ రెండింటినీ రెట్టింపు చొప్పున మార్చింది. అంటే విద్యుత్ వినియో గంలేని యూనిట్లో 20మందికి మించితే... విద్యుత్‌ను వినియోగించే యూనిట్లో 40కి మించితే తప్ప అవి పరిశ్రమలుగా పరిగణనలోకి రావు. ఫలితంగా ఇప్పటివరకూ పరిశ్రమలుగా గుర్తింపు పొందుతున్న చాలా యూనిట్లు ఆ పరిధిలోకి రాకుండా పోతాయి. అలాంటిచోట కార్మిక చట్టాలు అమలుకావు. కనుక ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు. అక్కడివారు కార్మికులుగా గుర్తింపుపొందరు. దేశంలో లక్షా 75 వేలకుపైగా పరిశ్రమలుంటే అందులో దాదాపు లక్ష పరిశ్రమలు 30 మందిలోపు కార్మికులతో పనిచేస్తున్నాయి. ఒకపక్క మహిళలకు రాత్రిపూట పనిచేసే వెసులుబాటును కల్పించడంద్వారా పురుషులతో సమానంగా ఉత్పాదకతలో పాల్గొనే అవకాశం కల్పించా మంటూనే ఇలాంటి సవరణకు పూనుకోవడంవల్ల పర్యవసానాలు ఎలా ఉండగలవో ప్రభుత్వం గుర్తించినట్టు కనబడదు. ఐటీ రంగంలో రాత్రి వేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగినులకు రక్షణ కల్పించడ ంపై అనేక నిబంధనలున్నా అవి సరిగా అమలు కావడంలేదన్న ఆరోపణలు న్నాయి. అలాంటపుడు అసలు పరిశ్రమగానే గుర్తింపు లేనిచోట మహిళా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందో అం చనా వేయొచ్చు. అసలు వారికి కనీస సౌకర్యాలున్నాయో లేదో చూసే నాథుడే ఉండడు. ఇక ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు గనుక చిన్న తరహా యూనిట్ల మధ్య అనారోగ్య పోటీ ఏర్పడి, ఉత్పత్తిని పెంచుకోవడానికి కార్మికులపై ఒత్తిళ్లు పెంచే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా పని పరి స్థితులు దుర్భరంగా మారుతాయి. దేశంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చదలిచామని బీజేపీ చెప్పుకుందిగానీ, ఆచరణలో అది కాస్తా కార్మిక ప్రతికూల వాతావరణానికి దారితీసే ప్రమాదం కనబ డుతున్నది. మున్ముందు పారిశ్రామిక వివాదాల చట్టానికి ఎన్డీయే సర్కారు తలపెట్టిన సవరణలు మరెలా ఉండబోతాయోనన్న భయాం దోళనలున్నాయి. మన దేశంలో సంఘటిత రంగంలో ఉండే కార్మికుల శాతమే అతి తక్కువ. వారిని కూడా అభద్రతలోనికి నెట్టే చర్యలకు పూనుకోవడం న్యాయం కాదని ఎన్డీయే సర్కారు గుర్తించాలి. -
హక్కులను హరించడం ఫాసిజమే: కేటీఆర్
హైదరాబాద్: తమ హక్కుల కోసం పోరాడడం ప్రజాస్వామ్యమ ని, ఒకరి హక్కులను హరించడం ఫాసిజం అని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కొనసాగించడానికే ఎన్డీయే ప్రభుత్వం ఉందా అని ఆయన ప్రశ్నిం చారు. అలా చేస్తే.. దానిని ప్రజలు యూపీఏ-3 గా పరిగణిస్తారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో యూపీఏని తిరస్కరించిన విషయం గుర్తు పెట్టుకోవాలని ఆయన పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు ప్రత్యేకాధికారాలు కల్పించే విధంగా కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖపై ఆయన పై విధంగా స్పందించారు. అర్హులను గుర్తించేందుకే సర్వే సిరిసిల్ల: సంక్షేమ పథకాల్లో అర్హులకు న్యా యం చేసేందుకే ఈ నెల 19న ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రణాళిక రూపకల్పనకు సర్వే దోహదపడుతుందన్నారు.