‘అభద్రతా’ సంస్కరణలు! | 'Insecurity' versions! | Sakshi
Sakshi News home page

‘అభద్రతా’ సంస్కరణలు!

Published Thu, Aug 14 2014 11:39 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

'Insecurity' versions!

చురుగ్గా పనిచేయడం, వెనువెంటనే స్పందించే గుణం ఉండటం మం చిదే. కానీ, ఆ వేగమైనా, స్పందనైనా మెజారిటీ ప్రజలకు ఉపయోగప డేలా ఉండటం కూడా అవసరం. కనీసం వారి ప్రయోజనాలు దెబ్బతిన కుండా చూడటం ముఖ్యం. అయితే, ఎన్డీయే ప్రభుత్వం అధికారంలో కొచ్చిన వెనువెంటనే కసరత్తు ప్రారంభించి పార్లమెంటులో ప్రవేశపెట్టిన కార్మిక సంస్కరణల బిల్లులు అందుకు అనుగుణంగా లేవు. 1948 నాటి ఫ్యాక్టరీల చట్టం, 1961నాటి అప్రెంటిస్‌షిప్ చట్టం, 1988నాటి కార్మిక నిబంధనల చట్టంకు తాజా బిల్లులు సవరణలు ప్రతిపాదిస్తున్నాయి. ఇందులో అప్రెంటిస్‌షిప్ చట్టానికి గురువారం లోక్‌సభ ఆమోద ముద్ర కూడా పడింది. ఈ చట్టాలన్నిటినీ సవరించాలని కార్మిక సంఘాలు కూడా చాన్నాళ్లనుంచి డిమాండు చేస్తున్నాయి. వీటినేకాదు... వేర్వేరు సందర్భాల్లో తీసుకొచ్చిన మొత్తం 40కిపైగా కార్మిక చట్టాలను కుదిం చాలని, వాటిని ఇప్పటి అవసరాలకు అనుగుణంగా మార్చాలని కోరు తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం వలస పాలకులు తెచ్చినవి కావడం వల్ల అందులో కార్మిక వ్యతిరేక అంశాలే ఎక్కువున్నాయని అంటు న్నాయి. అలాగే, ఒక అంశానికి సంబంధించిన నిబంధనే వేర్వేరు చట్టాల్లో ఉండటం, కొన్ని సందర్భాల్లో ఆ నిబంధనలు పరస్పర విరు ద్ధంగా ఉండటంవల్ల సగటు కార్మికుడు నష్టపోయే పరిస్థితులు ఏర్పడు తున్నాయన్నది కార్మిక సంఘాల ప్రధాన ఆరోపణ. ఈ అంశాలన్నీ గతంలో వివిధ వేదికలపై చర్చకు వచ్చాయి. తాజా సవరణ బిల్లులు ఈ అంశాల్లో చాలావాటిని విస్మరించాయి.

అయితే, సవరణల్లో కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించేవి అసలే లేవని చెప్పలేం. ఫ్యాక్టరీల చట్టానికి చేసిన సవరణలనే తీసుకుంటే... ఒక త్రైమాసికంలో కార్మికులు ఓవర్‌టైం పరిమితి 50 గంటలు మించరాదని ఉన్న నిబంధనను సవరించి దాన్ని వంద గంటలకు మార్చారు. దీనివల్ల కార్మికులు అదనపు ఆదాయాన్ని సంపాదించేం దుకు ఆస్కారం లభిస్తుంది. రాత్రిపూట మహిళలు పనిచేయడంపై ఉన్న ఆంక్షలను సడలించారు. గర్భిణులు, వైక ల్యం ఉన్నవారికి యంత్రాలవద్ద పని ఇవ్వ కూడదన్న మినహాయింపునిచ్చారు.  ఏడా దికి 240 రోజులు చేసినవారికి మాత్రమే లభించే వార్షిక సెలవులను ఇకపై 90 రోజులు చేసినవారికి వర్తించేలా మార్పు చేశారు. తాజా బిల్లు ద్వారా ఈ చట్టానికి కేంద్రం 54 సవరణలను ప్రతిపాదించింది. అప్రెం టిస్ చట్టం విషయంలోనూ కార్మికులకు అనుకూలమైన సవరణలు ఉన్నాయి. శాశ్వత ఉద్యోగులకు వర్తించే సెలవులు, ప్రభుత్వ సెలవులు అప్రెంటిస్‌లకు కూడా వర్తించేలా మార్పు చేశారు. కాంట్రాక్టు కార్మి కులు, క్యాజువల్ కార్మికులు, దినసరి కూలీలు కూడా ఈ చట్టంకిందకు వస్తారు. ముందస్తు అనుమతి అవసరం లేకుండానే యాజమాన్యాలు ఐటీ సంబంధిత సేవలతోసహా కొత్త సాంకేతిక వృత్తులను ఈ చట్టం కిందకు తీసుకొచ్చే వెసులుబాటు కల్పించారు. దీనివల్ల అదనంగా 500 సాంకేతిక వృత్తులు అప్రెంటిస్‌షిప్‌లోకి వస్తాయి. ఫలితంగా లక్షలాది మంది అప్రెంటిస్‌లుగా వివిధ వృత్తుల్లో శిక్షణ పొందే అవకాశం, నైపు ణ్యాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది.

ఇంతవరకూ బాగానే ఉన్నా ఫ్యాక్టరీల చట్టానికి ప్రతిపాదించిన మరికొన్ని సవరణలు కార్మికులకు అన్యాయం చేసేవిగా ఉన్నాయి. అమల్లో ఉన్న చట్టం ప్రకారం విద్యుత్‌ను వినియోగించే ఏ తయారీ యూనిట్ అయినా ఏడాదిలో పదిమంది, అంతకుమించి సిబ్బందిని పనిలో పెట్టుకుంటే దాన్ని పరిశ్రమగా గుర్తించాలి. విద్యుత్ అవసరం లేని యూనిట్ విషయంలో ఈ సంఖ్య 20. ఇప్పుడు ప్రతిపాదించిన సవ రణ రెండింటినీ రెట్టింపు చొప్పున మార్చింది. అంటే విద్యుత్ వినియో గంలేని యూనిట్‌లో 20మందికి మించితే... విద్యుత్‌ను వినియోగించే యూనిట్‌లో 40కి మించితే తప్ప అవి పరిశ్రమలుగా పరిగణనలోకి రావు. ఫలితంగా ఇప్పటివరకూ పరిశ్రమలుగా గుర్తింపు పొందుతున్న చాలా యూనిట్లు ఆ పరిధిలోకి రాకుండా పోతాయి. అలాంటిచోట కార్మిక చట్టాలు అమలుకావు. కనుక ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు. అక్కడివారు కార్మికులుగా గుర్తింపుపొందరు.

దేశంలో లక్షా 75 వేలకుపైగా పరిశ్రమలుంటే అందులో దాదాపు లక్ష పరిశ్రమలు 30 మందిలోపు కార్మికులతో పనిచేస్తున్నాయి. ఒకపక్క మహిళలకు రాత్రిపూట పనిచేసే వెసులుబాటును కల్పించడంద్వారా పురుషులతో సమానంగా ఉత్పాదకతలో పాల్గొనే అవకాశం కల్పించా మంటూనే ఇలాంటి సవరణకు పూనుకోవడంవల్ల పర్యవసానాలు ఎలా ఉండగలవో ప్రభుత్వం గుర్తించినట్టు కనబడదు. ఐటీ రంగంలో రాత్రి వేళల్లో పనిచేసే మహిళా ఉద్యోగినులకు రక్షణ కల్పించడ ంపై అనేక నిబంధనలున్నా అవి సరిగా అమలు కావడంలేదన్న ఆరోపణలు న్నాయి. అలాంటపుడు అసలు పరిశ్రమగానే గుర్తింపు లేనిచోట మహిళా కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందో అం చనా వేయొచ్చు. అసలు వారికి కనీస సౌకర్యాలున్నాయో లేదో చూసే నాథుడే ఉండడు. ఇక ప్రభుత్వ పర్యవేక్షణ ఉండదు గనుక చిన్న తరహా యూనిట్ల మధ్య అనారోగ్య పోటీ ఏర్పడి, ఉత్పత్తిని పెంచుకోవడానికి కార్మికులపై ఒత్తిళ్లు పెంచే ప్రమాదమూ ఉంటుంది. ఫలితంగా పని పరి స్థితులు దుర్భరంగా మారుతాయి. దేశంలో పారిశ్రామిక అనుకూల వాతావరణాన్ని ఏర్పర్చదలిచామని బీజేపీ చెప్పుకుందిగానీ, ఆచరణలో అది కాస్తా కార్మిక ప్రతికూల వాతావరణానికి దారితీసే ప్రమాదం కనబ డుతున్నది. మున్ముందు పారిశ్రామిక వివాదాల చట్టానికి ఎన్డీయే సర్కారు తలపెట్టిన సవరణలు మరెలా ఉండబోతాయోనన్న భయాం దోళనలున్నాయి. మన దేశంలో సంఘటిత రంగంలో ఉండే కార్మికుల శాతమే అతి తక్కువ. వారిని కూడా అభద్రతలోనికి నెట్టే చర్యలకు పూనుకోవడం న్యాయం కాదని ఎన్డీయే సర్కారు గుర్తించాలి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement