పరిణతితో వ్యవహరిస్తాం
నల్లధనంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్య
దర్యాప్తు తర్వాతే ఖాతాదార్ల పేర్లు వెల్లడిస్తాం
న్యూఢిల్లీ: విదేశీ బ్యాంకుల్లో కొందరు భారతీయుులు దాచుకున్న నల్లధనం విషయుంలో ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించబోదని, అలా చేస్తే నల్లధనానికి సంబంధించిన సమాచారంపై భవిష్యత్తులో ఇతర దేశాల సహకారం తగ్గిపోయే ఆస్కారం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శనివారం చెప్పారు. ఈ విషయంలో తాము పరిణతితో వ్యవహరిస్తావున్నారు. నల్లధనం ఖాతాలున్నవారి పేర్లను బయుటపెట్టాలన్న అంశంపై ఎన్డీఏ ప్రభుత్వం వెనకడుగు వేసిందన్న ఆరోపణలకు స్పందిస్తూ, అరుణ్ జైట్లీ తన వ్యాఖ్యలను సోషల్ వెబ్‌సైట్ ‘ఫేస్‌బుక్’లో పొందుపరిచారు. నల్లధనంపై సమాచారంకోసం ఎన్డీఏ సర్కార్ ప్రయత్నం కొనసాగుతూనే ఉందని, అరుుతే ప్రయుత్నంలో దూకుడులేదని, నల్లధనం ఖాతాలున్నవారి పేర్లను బహిర్గతం చేసేందుకు, ప్రాసిక్యూషన్ చర్యలకు, కట్టుబడి ఉన్నామన్నారు.
తప్పుదారి పట్టిస్తున్న మోదీ: కాంగ్రెస్
కాగా,.. నల్లధనం విషయుంలో మోదీ ప్రభుత్వం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. 1995లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జర్మనీతో కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా నల్లధనం విషయుంలో తవు ప్రభుత్వం చేతులు కట్టేసినట్టరుుందంటూ జైట్లీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ శనివారం ఖండించారు. అంతకు ముందే ఎన్డీఏ హయూంలో కుదిరిన 14 ద్వంద్వ పన్నుల మినహాయింపు ఒప్పందాల మాటేమిటన్నారు.
మోదీ మాటనిలబెట్టుకోవాలి: దిగ్విజయ్
విదేశాల్లో దాగిన నల్లధనాన్ని దేశానికి తెప్పించి ప్రతిఒక్క పౌరుడికీ రూ. 3 లక్షల చొప్పున పంపిణీ చేస్తామని లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో చేసిన వాగ్దానాన్ని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చే శారు.
మోదీవి తప్పుడు హామీలే: నితీశ్
నల్లధనంపై మోదీ లోక్‌సభ ఎన్నికల్లో తప్పుడు హామీలిచ్చారని జేడీయుూ వ్యాఖ్యానించింది. విదేశాల్లో దాగిన నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తావుంటూ బీజేపీ హామీ ఇచ్చిందని, నల్లధనం తెప్పించే విషయం అలా ఉంచితే, దాచుకున్న వారి పేర్లు కూడా వెల్లడించడ ంలేదని జేడీయుూ సీనియర్ నేత నితీశ్ పేర్కొన్నారు.
నల్లధనంపై మళ్లీ పోరుకు సిద్ధం: హజారే
విదేశాల్లో దాగిన నల్లధనం సవూచారవుంతా వెల్లడించడం కుదరదంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడాన్ని సావూజిక కార్యకర్త అన్నా హజారే తీవ్రంగా విమర్శించారు. అక్రమ సంపదను విదేశాలనుంచి రప్పించని పక్షంలో ఈ విషయమై తాను ఆందోళనకు దిగుతామని హజారే హెచ్చరించారు. హజారే శనివారం ప్రధాని నరేంద్ర మోదీకి ఈ మేరకు లేఖ రాశారు.