పెళ్లైన ఏడాదిలోపే... | Drilling machine with Killed Husband Death | Sakshi
Sakshi News home page

పెళ్లైన ఏడాదిలోపే...

Published Sat, Feb 20 2016 12:10 AM | Last Updated on Sun, Sep 3 2017 5:58 PM

Drilling machine with Killed Husband  Death

పాలకొండ రూరల్ : వెలగవాడకు చెందిన చీపురుపల్లి వసంత్‌కుమార్(27) తిరుపతి సమీపంలోని సండుపల్లిలో గురువారం ఓ భవనం మూడో అంతస్తు శ్లాబ్‌ను డ్రిల్లింగ్ మిషన్‌తో తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయనతో పాటు ఇదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు శిథిలాల కింద నలిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం శుక్రవారం ఇక్కడకు తెలియడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. భర్త మరణవార్త విని ఏడు నెలల గర్భిణి అయిన భవానీ కుప్పకూలిపోగా..వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వీరేసు, కళావతి తమకెవరు దిక్కు అంటూ రోదిస్తున్నారు.

వసంత్‌కుమార్‌కు తొమ్మిది నెలల కిందటే విజయనగరం జిల్లా జమదల గ్రామానికి చెందిన భవానీతో వివాహమైంది. ఇటీవల సంక్రాంతి వెళ్లిన తరువాత కూలీ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయూడు. మరో రెండు నెలల్లో పండంటి బిడ్డను ప్రసవించనున్న భవానీ ఈ వార్తతో కుప్పకూలింది. వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించారుు. మృతదేహం రావడానికి శనివారం కావచ్చని అక్కడి అధికారులు తెలియజేసినట్టు కుటుంబీకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement