drilling machine
-
Uttarkashi tunnel collapse: శరవేగంగా డ్రిల్లింగ్
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు కొండపై భాగంలో మొదలెట్టిన డ్రిల్లింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 86 మీటర్ల లోతు తవ్వాల్సి ఉండగా 36 మీటర్ల మేర డ్రిల్లింగ్ పూర్తయిందని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) అధికారులు సోమవారం తెలిపారు. శిథిలాల గుండా భారీ ఆగర్ డ్రిల్లింగ్ మెషీన్ తవ్వుతున్నపుడు రాడ్లు అడ్డుతగిలి మెషీన్ ధ్వంసమవడం తెల్సిందే. దీంతో 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్ పైపు నుంచి డ్రిల్లింగ్ మెషీన్ బ్లేడ్లను తొలగించి అదే మార్గంలో దూరి కార్మికులు మ్యాన్యువల్‌గా రంధ్రం చేయనున్నారు. ఏమిటీ ర్యాట్–హోల్ పద్ధతి? మేఘాలయలో ఈ పద్ధతి చాలా ఫేమస్. అక్రమ బొగ్గు గనుల్లో ఈ విధానంలోనే బొగ్గు తవ్వేస్తారు. ముందుగా గని ఉపరితలంపై మనిషి దూరేంత చిన్న రంధ్రం చేసి అందులోకి వెళ్లి సమాంతరంగా చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ బొగ్గుపొరలను తొలుస్తారు. ‘‘ మేం పదేళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నాం. కార్మికులను కాపాడేందుకు పనిచేయడం ఇదే తొలిసారి. ఇక్కడ 800 మిల్లీమీటర్ల పైపులోంచి వెళ్లి పనిచేయాలి. మేం 600 మిల్లీమీటర్ల పైపులో కూడా దూరి పనిచేశాం. చిన్న గడ్డపార, పార, చిన్న తట్ట వెంట తీసుకెళ్లి చిన్న చిన్న రంధ్రాలు చేస్తూ శిథిలాలను తొలగిస్తాం. 12 మీటర్లలో కేవలం మట్టి ఉంటే పని 24 గంటల్లో పూర్తి అవుతుంది. ఒకవేళ గట్టి రాళ్లు ఉంటే 36 గంటలకుపైనే పడుతుంది. వంతుకు ఇద్దరు చొప్పున ఆరుగురం తవ్వేస్తాం’’ అని కార్మికులు వెల్లడించారు. ఈ మార్గంలో ఇంకా 8.15 మీటర్లమేర బ్లేడ్ల ముక్కలను తొలగించాల్సిఉంది. ఆ తర్వాతే మ్యాన్యువల్ డ్రిల్లింగ్ మొదలవుతుంది. మరోవైపు, కొండపైనుంచి నిట్టనిలువుగా డ్రిల్లింగ్ పూర్తయ్యాక రంధ్రంలోకి 1.2 మీటర్ల వ్యాసమున్న పైపులను అమర్చి దాని ద్వారా కార్మికులను పైకి లాగుతారు. రంగంలోకి ‘ర్యాట్–హోల్’ మైనింగ్ కార్మికులు ఈ పని పూర్తిచేసేందుకు ‘ర్యాట్–హోల్’ మైనింగ్‌లో సిద్ధహస్తులైన కార్మికులను రప్పించారు. వీరు 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న పైపు గుండా లోపలికి దూరి శిథిలాలకు రంధ్రం చేస్తూ ముందుకు కదలనున్నారు. ఇలా 12 మీటర్ల మేర డిల్లింగ్ చేయాలి. యూపీలోని ఝాన్సీకి చెందిన కార్మికులు ఇప్పటికే ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీకి చెందిన పర్సాదీ లోధీ, విపిన్ రాజ్‌పుత్ తదితరులను ఈ పనికి పురమాయించారు. -
Uttarkashi Tunnel: డ్రిల్లింగ్ పనులకు మళ్లీ ఆటంకం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో ఇంకొన్ని మీటర్లు డ్రిల్లింగ్ చేస్తే కార్మికులు చిక్కుకున్న చోటుకు చేరుకోవచ్చన్న ఆశల నడుమ అనుకోని అవాంతరం ఎదురైంది. 25 టన్నుల బరువైన భారీ డ్రిల్లింగ్ మెషీన్ అమర్చిన ‘వేదిక’కు పగుళ్లు రావడంతో డ్రిల్లింగ్‌ను ఆపేశారు. బిగించిన వేదిక సరిగా లేకుంటే డ్రిల్లింగ్ మెషీన్ అటుఇటూ కదులుతూ కచి్చతమైన దిశలో డ్రిల్లింగ్ సాధ్యపడదు. అప్పుడు అసలుకే మోసమొస్తుంది. అందుకే ముందుజాగ్రత్తగా డ్రిల్లింగ్‌ను ఆపేశారు. ‘ మరికొన్ని గంటల్లో లేదా రేపటి కల్లా ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తవుతుంది’ అని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హస్నయిన్ గురువారం సాయంత్రం చెప్పారు. ‘మనం చేస్తున్నది యుద్ధంలాంటిదే. ఖచి్చతంగా ఫలానా సమయంలోగా ఈ ఆపరేషన్ పూర్తిచేసి అందర్నీ బయటకు తెస్తామని ముందుగానే జోస్యం చెప్పడం సరైన విధానం కాదు’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ విపత్తు స్పందన దళం(ఎన్డీఆర్ఎఫ్) సభ్యులు సొరంగం వద్దే ఉండి, లోపలున్న కారి్మకులను బయటకు తీసుకువచ్చే విషయంలో రిహార్సల్ చేస్తున్నారని హస్నయిన్ తెలిపారు. కారి్మకులను బయటకు తీసుకొచ్చే క్రమంలో అనుకోని విధంగా కాల హరణం జరుగుతున్నందున సమాంతర డ్రిల్లింగ్‌లో అనుకోని అవాంతరాలు ఎదురైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేపట్టామన్నారు. ఇందుకోసం అదనంగా యంత్రాలను తెప్పిస్తున్నామని వివరించారు. బార్కోట్ వైపు నుంచి డ్రిల్లింగ్ పనులను 9.10 మీటర్ల మేర పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు నిరాటంకంగా కొనసాగుతున్నాయని వారు వెల్లడించారు. డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న టన్నెల్ ప్రాంతం -
Uttarkashi tunnel collapse: నెమ్మదించిన రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఛార్‌ధామ్ మార్గంలో సొరంగం కుప్పకూలి నాలుగు రోజులుగా లోపల చిక్కుబడిపోయిన 40 మంది కార్మికులను రక్షించే పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకోసం మరో భారీ యంత్రాన్ని తెప్పించారు. మూడు విడిభాగాలుగా యుద్ధవిమానాల్లో తరలించిన ఈ యంత్రాన్ని అసెంబుల్ చేసి, మరికొద్ది గంటల్లో డ్రిల్లింగ్ ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. కుప్పకూలిన టన్నెల్ శిథిలాల గుండా ఆగర్ మెషీన్ సాయంతో వెడల్పాటి స్టీల్ పైపులను లోపలికి పంపే పనులు అధికారులు మంగళవారం ప్రారంభించిన విషయం తెలిసిందే. 800, 900 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీలు పైపులను ఒకదాని తర్వాత ఒకటి లోపలికి పంపించి వాటి గుండా కార్మికులను వెలుపలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, రాత్రి వేళ డ్రిల్లింగ్ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి టన్నెల్ శిథిలాలు విరిగిపడటంతో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారు. ఈ ఘటనతో పనులకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి అమెరికన్ ఆగర్ అధికారులు హుటాహుటిన భారీ అమెరికన్ ఆగర్ డ్రిల్లింగ్ మిషన్ భాగాలను భారత వాయుసేన విమానాల ద్వారా 30 కిలోమీటర్ల దగ్గర్లోని చిన్యాలిసౌర్‌కు తెప్పించారు. అక్కడి నుంచి ఘటనాస్థలికి రోడ్డు మార్గంలో తీసుకువస్తున్నామని ఎస్పీ అర్పణ్ తెలిపారు. వీటిని అసెంబ్లింగ్ చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పారు. సొరంగం లోపల చిక్కుకున్న వారిని కాపాడేందుకు థాయ్‌లాండ్, నార్వే నిపుణుల సలహాలను తీసుకుంటున్నట్లు నేషనల్ హైవేస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్(ఎన్‌హెచ్‌ఐడి) డైరెక్టర్ అన్షు మాలిక్ తెలిపారు. 2018లో థాయ్‌లాండ్‌లోని ఓ గుహలో చిక్కుకుపోయిన ఫుట్‌బాల్ జట్టు జూనియర్ ఆటగాళ్లను అక్కడి సంస్థ నిపుణులు వారం పాటు శ్రమించి సురక్షితంగా తీసుకువచి్చన విషయం తెలిసిందే. -
అమానుష ఘటన: బాలుడి చేతిలో డ్రిల్లింగ్ మిషన్ దింపిన టీచర్!
ఇటీవల కాలంతో ఉపాధ్యాయులు చిన్న చిన్న విషయాలకే కాస్త ఫ్రస్టేషన్‌కి గురయ్యి విద్యార్థులకు అత్యంత అమానుషమైన పనిష్మెంట్లు ఇస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఒక ఉపాధ్యాయుడు కొడవలితో పాఠశాల్లో హల్చల్ చేస్తూ... అందర్నీ భయబ్రాంతులకు గురిచేశాడు. అంతకు ముందు మరొక ప్రబుద్ధుడు స్ప్రుహ తప్పి పడిపోయాలా ఒక విద్యార్థిని కర్రతో దాడి చేసి చంపేశాడు. ఇలాంటి ఉదంతాలను మర్చిపోక మునుపే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...ఒక విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో డ్రిల్లింగ్ మిషన్‌తో పనిష్మెంట్ ఇచ్చాడు. ఈ ఘటనలో సదరు విద్యార్థికి ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. బాధిత విద్యార్థి సిసామౌ నివాసి. అతను కాన్పూర్ జిల్లాలోని ప్రేమ్‌నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. ఐతే సదరు విద్యార్థి రెండో ఎక్కం అప్పచెప్ప లేకపోవడంతో ఆ పాఠశాల ఉపాధ్యాయుడు ఈ పనిష్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత విద్యార్థిని ఇంటికి పంపించడంతో ఫ్రాథమిక చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉపాధ్యాయుడి నిర్వాకానికి ఆగ్రహం చెందిన బాధితుడు బంధువులు పాఠశాలకు చేరుకుని గొడవ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సమాచారం అందుకున్న ప్రాథమిక శిక్ష అధికారి, బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై కాన్పూర్‌కి చెందిన ప్రాథమిక శిక్షా అధికారి సుజిత్ కుమార్ మాట్లాడుతూ...ఈ మొత్తం ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ప్రేమ్ నగర్, శాస్త్రి నగర్‌లోని బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు దీనిపై విచారణ జరిపి నివేదిక పంపుతారు. ఈ ఘటనలో ఎవరైనా దోషులుగా తేలితే వారు శిక్షార్హమైన చర్యల ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పారు. (చదవండి: క్షణికావేశంలో కన్న బిడ్డనే కడతేర్చాడు.. ) -
గుంతలు తవ్వటం భలే సులువు!
తక్కువ శ్రమ, తక్కువ ఖర్చుతో పండ్ల తోటలు, కలప తోటలు నాటుకునేందుకు ఉపయోగపడే ఓ డ్రిల్లింగ్ యంత్రాన్ని రూపొందించాడు ఓ రైతు. ఆయన పేరు సయ్యద్ అహమీద్ బాషా. ఊరు మండ్లెం. జూపాడు బంగ్లా మండలం. కర్నూలు జిల్లా. బాషా తనకున్న ఏడెకరాల పొలంలో మలబార్ వేప మొక్కలు నాటాలని సంక్పలించారు. కూలీలతో గుంతలు తీయటం ప్రారంభించారు. ఒక్కో కూలీకి రూ.500ల చొప్పున చెల్లిస్తే రోజుకు 5 గుంతలకు మించి తీయలేకపోయారు. 7 ఎకరాల పొలంలో 4 వేల మొక్కలు నాటాలంటే కూలి ఖర్చులే తడిసి మోపెడవుతాయని భావించిన హమీద్ బాషా ఇందుకు ఒక సులువైన ఉపాయం ఆలోచించారు. నడుపుకుంటూ వచ్చిన బైక్ కం డ్రిల్లింగ్ యంత్రాన్ని గుంతలు తీయడానికి సిద్ధం చేస్తున్న దృశ్యం వివిధ యంత్రాలకు చెందిన పాత సామాన్లను సేకరించి, తన పాత బైక్‌కు అమర్చి విజయవంతంగా ఒక డ్రిల్లింగ్ యంత్రాన్ని రూపొందించారు. అడుగు వెడల్పు, రెండున్నర అడుగుల లోతుతో గుంతలు తవ్వేలా డ్రిల్లింగ్ యంత్రాన్ని తయారు చేయించారు. దీనికి రూ.1.10 లక్షలు ఖర్చుచేశారు. దీని సహాయంతో స్వయంగా తానే గుంతలు తీసి మలబార్ వేప మొక్కలు నాటించారు. దీన్ని బైక్ లాగానే నడుపుకుంటూ పొలానికి తీసుకెళ్లవచ్చు. అక్కడికి వెళ్లాక అప్పటికప్పుడు కొన్ని మార్పులు చేస్తే డ్రిల్లింగ్ యంత్రంగా మారిపోతుంది. లీటరు పెట్రోలు పోస్తే 300 వరకు గుంతలు తవ్వవచ్చంటున్నారు. ఈ యంత్రం వల్ల తనకు డబ్బు ఆదా అయ్యిందని రైతు శాస్త్రవేత్త సయ్యద్ హమీద్ బాష (90596 79595) గర్వంగా చెప్పారు. – చాకలి నాగభూషణం, సాక్షి, జూపాడుబంగ్లా, కర్నూలు జిల్లా -
పెళ్లైన ఏడాదిలోపే...
పాలకొండ రూరల్ : వెలగవాడకు చెందిన చీపురుపల్లి వసంత్‌కుమార్(27) తిరుపతి సమీపంలోని సండుపల్లిలో గురువారం ఓ భవనం మూడో అంతస్తు శ్లాబ్‌ను డ్రిల్లింగ్ మిషన్‌తో తొలగించే క్రమంలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఆయనతో పాటు ఇదే గ్రామానికి చెందిన లక్ష్మణరావు శిథిలాల కింద నలిగి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం శుక్రవారం ఇక్కడకు తెలియడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. భర్త మరణవార్త విని ఏడు నెలల గర్భిణి అయిన భవానీ కుప్పకూలిపోగా..వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు వీరేసు, కళావతి తమకెవరు దిక్కు అంటూ రోదిస్తున్నారు. వసంత్‌కుమార్‌కు తొమ్మిది నెలల కిందటే విజయనగరం జిల్లా జమదల గ్రామానికి చెందిన భవానీతో వివాహమైంది. ఇటీవల సంక్రాంతి వెళ్లిన తరువాత కూలీ పని కోసం ఇతర ప్రాంతాలకు వలసపోయూడు. మరో రెండు నెలల్లో పండంటి బిడ్డను ప్రసవించనున్న భవానీ ఈ వార్తతో కుప్పకూలింది. వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించారుు. మృతదేహం రావడానికి శనివారం కావచ్చని అక్కడి అధికారులు తెలియజేసినట్టు కుటుంబీకులు తెలిపారు. -
టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో దొంగలు పడ్డారు?
కార్పెంటర్ డ్రిల్లింగ్ మిషిన్ మాయమైన వైనం హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో ఇటీవల దొంగలు పడ్డారు. ఇక్కడ పనిచేసేందుకు వచ్చిన కార్పెంటర్ డ్రిల్లింగ్ మిషిన్‌ను ఎత్తుకెళ్లారు. ఇది సిబ్బంది చేతివాటమా? బయటి వ్యక్తుల ప్రమేయమా తేలాల్సి ఉంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. సికింద్రాబాద్ బండిమెట్కు చెందిన శ్రీనివాసచారి కార్పెంటర్. చిన్నపాటి పనులు ఉండడంతో ఇతడిని వారం క్రితం టాస్క్‌ఫోర్స్ డీసీపీ కార్యాలయానికి పిలిపించారు. ఒక రోజు పని చేసిన తర్వాత ఇంకా మిగిలి ఉండటంతో తన డ్రిల్లింగ్ మిషన్, ఇతర సామగ్రిని టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలోని ఒక గదిలో పెట్టి ఇంటికి వెళ్లాడు. ఉదయం పని చేసేందుకు టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి వెళ్లగా డ్రిల్లింగ్ మిషిన్ కనిపించలేదు. దీంతో శ్రీనివాసచారి అక్కడి సిబ్బందిని వాకబు చేయగా చోరీ అయినట్టు తెలిసింది. సుమారు రూ.10 వేల విలువ చేసే ఈ మిషిన్ పోవడంతో వారం రోజులుగా శ్రీనివాసచారి పనికి వెళ్లలేక , ఇల్లు గడవక ఇబ్బంది పడుతున్నాడు. ప్రతి రోజూ టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి వెళ్లి తన డ్రిల్లింగ్ మిషిన్ గురించి వాకబు చేస్తున్న అతడి ధీన పరిస్థితి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. మహంకాళి పోలీసుకు ఫిర్యాదు చేశామని త్వరలోనే దొరుకుతుందని టాస్క్‌ఫోర్స్ పోలీసులు కాలం వెళ్లదీస్తున్నారు. అయితే, ఈ చోరీపై తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని మహంకాళి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పడం గమనార్హం. -
డీజీబీ దోపిడీకి విఫలయత్నం
కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్-చొప్పదండి ప్రధాన రహదారిపై ఉన్న దక్కన్ బ్యాంక్ తీగలగుట్టపల్లి శాఖలో దోపిడీకి దొంగలు మంగళవారం రాత్రి విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకా రం.. తీగలగుట్టపల్లిలో కరీంనగర్-చొప్పదండి ప్రధాన రహదారి పక్కన ఉన్న భవనంలో దక్క న్ గ్రామీణ బ్యాంక్ శాఖ ఉంది. సిబ్బంది మంగళవారం విధులు ముగించుకుని వెళ్లిన సిబ్బంది బుధవారం 9 గంటలకు తెరిచారు. చోరీ జరిగి నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. వారు వచ్చి క్లూస్ సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో వివరాలు నమోదు చేసుకున్నారు. పక్కా ప్రణాళిక... మూడంతస్తుల భవనంలో కింద ఫ్లోర్లో బ్యాం క్ ఉంది. పైన నివాస గృహాలు ఉన్నాయి. వెనుకభాగంలో తలుపును దొంగలు డ్రిల్లింగ్ మిషన్ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించి నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కా్యష్ కౌంటర్, లాకర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. లాకర్ తలుపులు తీసేందుక ప్రయత్నించారు. రెండు లాకర్ల హ్యాండిళ్లు విరగ్గొట్టారు. అవి తెరుచుకోక పోవడంలో సీసీ కెమెరాలు పట్టుకుని వెళ్లిపోయారు. దోపిడీ సమయంలో బ్యాంకులో కేజీన్నర బంగారం, రూ.8 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. చోరీకి యత్నించింది రాజస్థాన్‌కు చెందిన బవారియా ముఠాగా అనుమానిస్తున్నారు. పని చేయని సీసీ కెమెరాలు బ్యాంక్‌లో మొత్తం నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి. హాల్లో రెండు క్యాష్ కౌంటర్, లాకర్ గదిలో ఒక్కోటి ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. సేఫ్టీ అలారం లాకర్ తీస్తే మోగేలా ఏర్పాటు చేశారు. లాకర్ తెరుచుకోకపోవడంతో అలారం మోగలేదు. ప్రొఫెషనల్సే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రవీందర్, రూరల్ సీఐ కమాలాకర్‌రెడ్డి, సీసీఎస్ సీఐలు వెంకటరమణ, పెద్దన్నకుమార్, ఎస్సైసృజన్రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.