డీజీబీ దోపిడీకి విఫలయత్నం | DCB attempted robbery | Sakshi
Sakshi News home page

డీజీబీ దోపిడీకి విఫలయత్నం

Published Thu, Aug 29 2013 2:58 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కరీంనగర్-చొప్పదండి ప్రధాన రహదారిపై ఉన్న దక్కన్ బ్యాంక్ తీగలగుట్టపల్లి శాఖలో దోపిడీకి దొంగలు మంగళవారం రాత్రి విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకా రం..

కరీంనగర్ క్రైం, న్యూస్‌లైన్ : కరీంనగర్-చొప్పదండి ప్రధాన రహదారిపై ఉన్న దక్కన్ బ్యాంక్ తీగలగుట్టపల్లి శాఖలో దోపిడీకి దొంగలు మంగళవారం రాత్రి విఫలయత్నం చేశారు. పోలీసుల కథనం ప్రకా రం.. తీగలగుట్టపల్లిలో కరీంనగర్-చొప్పదండి ప్రధాన రహదారి పక్కన ఉన్న భవనంలో దక్క న్ గ్రామీణ బ్యాంక్ శాఖ ఉంది. సిబ్బంది మంగళవారం విధులు ముగించుకుని వెళ్లిన సిబ్బంది బుధవారం 9 గంటలకు తెరిచారు. చోరీ జరిగి నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. వారు వచ్చి క్లూస్ సేకరించారు. డాగ్ స్క్వాడ్‌తో వివరాలు నమోదు చేసుకున్నారు.   
 
 పక్కా ప్రణాళిక...
 మూడంతస్తుల భవనంలో కింద ఫ్లోర్‌లో బ్యాం క్ ఉంది. పైన నివాస గృహాలు ఉన్నాయి. వెనుకభాగంలో తలుపును దొంగలు డ్రిల్లింగ్ మిషన్ సాయంతో తొలగించి లోనికి ప్రవేశించి నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం కా్‌‌యష్ కౌంటర్, లాకర్ వద్ద ఉన్న సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. లాకర్ తలుపులు తీసేందుక ప్రయత్నించారు. రెండు లాకర్ల హ్యాండిళ్లు విరగ్గొట్టారు. అవి తెరుచుకోక పోవడంలో సీసీ కెమెరాలు పట్టుకుని వెళ్లిపోయారు. దోపిడీ సమయంలో బ్యాంకులో కేజీన్నర బంగారం, రూ.8 లక్షల నగదు ఉన్నట్లు సమాచారం. చోరీకి యత్నించింది రాజస్థాన్‌కు చెందిన బవారియా ముఠాగా అనుమానిస్తున్నారు.
 
 పని చేయని సీసీ కెమెరాలు
 బ్యాంక్‌లో మొత్తం నాలుగు సీసీ కెమెరాలు ఉన్నాయి. హాల్‌లో రెండు క్యాష్ కౌంటర్, లాకర్ గదిలో ఒక్కోటి ఏర్పాటు చేశారు. వీటిలో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. సేఫ్టీ అలారం లాకర్ తీస్తే మోగేలా ఏర్పాటు చేశారు. లాకర్ తెరుచుకోకపోవడంతో అలారం మోగలేదు.  ప్రొఫెషనల్సే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ రవీందర్, రూరల్ సీఐ కమాలాకర్‌రెడ్డి, సీసీఎస్ సీఐలు వెంకటరమణ, పెద్దన్నకుమార్, ఎస్సైసృజన్‌రెడ్డి పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement