తాగునీరు నిల్.. మద్యం ఫుల్ | drinking Nil alcohol Full .. this commented on MLA RK Roja | Sakshi
Sakshi News home page

తాగునీరు నిల్.. మద్యం ఫుల్

Published Tue, May 3 2016 3:43 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

తాగునీరు నిల్.. మద్యం ఫుల్ - Sakshi

తాగునీరు నిల్.. మద్యం ఫుల్

రాష్ట్రప్రభుత్వ తీరుపై
ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజం

 
నగరి: చంద్రబాబు పాలనలో తాగునీరు దొరకటం కష్టమని.. కానీ మద్యం మాత్రం అన్నిచోట్లా ఫుల్‌గా లభిస్తుందని నగరి ఎమ్మె ల్యే ఆర్కే రోజా అన్నారు. నగరి రూరల్ మండలం తెరణి గ్రామం లో చలివేంద్ర ప్రారంభించి గ్రామస్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఇంకుడుగుంత తవ్వా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక.. రాష్ట్రం కరువు రాజ్యంగా మారిందని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైస్సా రాజశేఖర్ పాలనలో నిత్యం వర్షాలు పడి, పంటలు పండి, రైతులు, ప్రజలు సుఖసంతో షాలతో ఉండేవారని గుర్తు చేశారు.

చంద్రబాబు కరువుకు బ్రాండ్ అంబాసిడర్ మారరని, కరువు, చంద్రబాబు కవలపిల్లలని విమర్శించారు. ఎన్నికలకు ముందు  బాబొస్తే.. జాబోస్తుందని, బ్యాంకుల్లోని బంగారు ఇంటికొస్తుందని తెగ ప్రచారం చేశారని విమర్శిం చారు. ప్రస్తుతం అన్ని వర్గాలకూ మొండిచెయ్యి చూపించారని ఆరో పించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అంతతమాత్రం సాయంపై ప్రశ్నిం చే దమ్మూ, ధైర్యం చంద్రబాబుకు లేదని విమర్శించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement