నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కిన వారిలో కోర్టు ఇద్దరికి ఏడు రోజుల జైలుశిక్ష, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా, మరో ఇద్దరికి రూ.2,500 చొప్పున జరిమానా విధించింది. పోలీసుల కథనం మేరకు..మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవల ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి నెల్లూరులోని మూలాపేట సెంటర్ వద్ద ట్రాఫిక్ సౌత్ సీఐ సుబ్బారావు బ్రీత్‌ఎనలైజర్లతో వాహనచోదకులను పరీక్షించారు. ఈ పరీక్షల్లో మూలాపేటకు చెందిన ఆటోడ్రైవర్ చాన్‌బాషా, ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన ఎస్‌కే అహ్మద్‌బాషా, సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన కె.కొం డయ్య దొరికిపోయారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు చాన్‌బాషాకు ఏడురోజులు జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, మిగిలిన ఇద్దరికి రూ. 2,500 చొప్పున జరిమానా విధించింది. చాన్‌బాషాను ట్రాఫిక్ సిబ్బంది జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. సౌత్ ట్రాఫిక్ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపడం నేరం, ప్రమాదకరమన్నారు. అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు.
బాలాజీనగర్‌లో..
బాలాజీనగర్ సీఐ జి.మంగారావు మంగళవారం రాత్రి మసీదు సెంటర్‌లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం తాగి ఆటో నడుపుతున్న వెంకటేశ్వరపురానికి చెందిన ఎం. శ్రీనివాసులును గుర్తించి అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా ఏడు రోజుల జైలుశిక్ష, రూ. 1000 జరిమానా విధించారు.
మందుబాబులకు జైలు
Published Thu, Dec 12 2013 4:29 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement