subha rao
-
నన్ను అనువాదకుడిని చేసింది చైనా
కేంద్ర సాహిత్య అకాడమీలో స్టెనోగ్రాఫర్‌గా ఉద్యోగం ప్రారంభించి, అకాడమీ జర్నల్ ‘ఇండియన్ లిటరేచర్’ ఎడిటర్ స్థాయికి ఎదిగారు తెలుగువాడైన డాక్టర్ డి.ఎస్.రావు. మూడున్నర దశాబ్దాల పాటు పనిచేసి, 1991లో పదవీ విరమణ చేశారు. త్రిపురనేని గోపీచంద్ రెండు నవలల్ని ఇంగ్లిష్‌లోకి అనువదించారు. ‘ఎ షార్ట్ హిస్టరీ ఆఫ్ సాహిత్య అకాడమీ’, ‘మనోహర్ మాల్గోన్కర్: ఎ స్టడీ ఆఫ్ హిజ్ కంప్లీట్ ఫిక్షన్’ వెలువరించారు. కొత్తగా ‘ప్రాక్టికల్ లిటెరరీ క్రిటిసిజం: యాన్ ఇండియన్ టేక్’ పేరిట మరో పుస్తకమూ తెచ్చారు. 80 ఏళ్ల రావు ప్రస్తుతం అమెరికాలో ‘ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా’గా తన ముగ్గురు పిల్లల వద్ద ఉంటున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు సాక్షి సాహిత్యం ప్రతినిధితో స్వేచ్ఛగా సంభాషించారు. దుగ్గిరాల సుబ్బారావు అన్న తన పేరును డి.ఎస్.రావు అని పొడిగా పెట్టుకోవడానికి కారణం ఉద్యోగంలో చేరిన కొత్తలో దిల్లీవాళ్లు ‘సుబ్బా’ను ‘సుబాహ్’(ఉదయం), ‘సూబా’(రాష్ట్రం) అని పిలవడమే అంటారాయన నవ్వుతూ. సాహిత్యంతో ఏ పరిచయమూ లేని రావు కేవలం ఉద్యోగం కోసమే ఏలూరు నుంచి 1955లో దిల్లీ వెళ్లారు. అకాడమీలో స్టెనోగ్రాఫర్‌గా చేరారు. తర్వాత పీఏ టు సెక్రెటరీ అయ్యారు. పబ్లికేషన్ అసిస్టెంట్, సేల్స్ మేనేజర్, ఎడిటర్... ఇలా అంచెలుగా ఎదిగారు. ఆయన చేరిన కొత్తలో అకాడమీ కార్యదర్శి కృష్ణ కృపలానీ. ఈ యువకుడి ‘ఉత్సాహం’ గమనించి రచయితలతో జరిగే అన్ని సమావేశాలకూ వెంటపెట్టుకెళ్లేవారు. జవాహర్లాల్ నేహ్రూ, రాధాకృష్ణన్ లాంటి పెద్దవాళ్లను అలా చూడగలిగానంటారు. ‘‘నా అసలు చదువు అకాడమీలోనే ప్రారంభమైంది. గాంధీజీ శతజయంతి సందర్భంగా యునెస్కో కోసం ‘లైఫ్ అండ్ థాట్స్ ఆఫ్ మహాత్మాగాంధీ’ పేరిట ఒక పుస్తకం తెచ్చాం. దానికోసం గాంధీ వర్క్స్ అన్నీ చదివాను. అప్పుడు నా నెలజీతం 150 రూపాయలు. యునెస్కో వాళ్లు మాకు 1400 గౌరవ పారితోషికం ఇవ్వబోతే కృపలానీ వద్దన్నారు గాంధీజీ మీద గౌరవంతో చేశానని. కానీ నాకూ అందులో భాగం ఉంది కాబట్టి 250 రూపాయలు మాత్రం ఇమ్మన్నారు. భక్తితో చేశానని నేనూ వద్దన్నాను. అప్పుడదొక ఆదర్శవాదం’’ అని నవ్వుతారు. చిన్న ఉద్యోగి – పెద్ద పాత్ర నిజాయితీగా పనిచేస్తే చిన్న ఉద్యోగి సైతం ఎంత శక్తిమంతమైన పాత్ర పోషించవచ్చో తెలిపే ఒక ఉదంతం చెబుతారాయన. ‘‘అది 1983. నేను అసిస్టెంట్ ఎడిటర్‌గా ఉన్నాను. పోపటి హీరానందాని ‘హిస్టరీ ఆఫ్ సిం«ధీ లిటరేచర్’ను అకాడమీ ప్రచురణగా వేయాలి. ప్రొఫెసర్ హరీష్ వాశ్వానీ ‘కంటెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ’లో అంగీకరించారు. అదీ రెండు సార్లు రివిజన్ జరిగాక. డాక్టర్ చేతన్ కర్ణాని ‘లాంగ్వేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ’లో ఒప్పుకున్నారు. కవి నారాయణ్ శ్యామ్ ‘ఫైనల్’ చేశారు. తరవాత సిం«ధీ సలహా సంఘం సూచన మేరకు మాన్యుస్క్రిప్ట్ నా టేబుల్ మీదకు వచ్చింది. చదవగానే నా గుండె జారిపోయింది. ఒక చరిత్రను కేవలం 30 ఏళ్ల కాలావధి తీసుకుని చెప్పడం బాలేదు. దాన్నే ప్రక్రియలుగా, దశలుగా, ఉద్యమాలుగా వర్గీకరిస్తే అదే రచయితలు పునరుక్తం అవుతున్నారు. ఇంత తక్కువ కాలపు సాహిత్యం మీద స్పష్టమైన తీర్పు ఇవ్వలేం. అదీగాక బతికివున్న రచయితలను నిజాయితీగా అంచనా కట్టలేం. ఈ లోపాలన్నీ ఏకరువు పెడుతూ నా పై అధికారులకు నోట్ రాశాను. చివరకు ఆ పుస్తక ప్రచురణను అకాడమీ తిరస్కరించింది.’ తప్పులు ఎత్తిచూపితే రచయితలు సంతోషిస్తారు ‘‘లిటరేచర్ ఎడిటింగ్ అనేది చాలా నిర్మాణాత్మకమైన పని. అది తిరగేసిన పిరమిడ్‌లా వార్తలు రాసే జర్నలిజం కాదు, స్పేస్ తక్కువైతే కింద కట్ చేయడానికి. ప్రతి వాక్యమూ అమూల్యమైనదే’’ అంటారు రావు. ‘మాన్యుస్క్రిప్టుల మీద ఎర్ర ఇంకు అసలు వాడొద్దు. దాని బదులు మార్జిన్స్‌లో పెన్సిల్‌తో రాయాలి’ అనేది ఆయన సూచనల్లో ఒకటి. ‘‘రచయితలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్లు నొచ్చుకోకుండా వాళ్లకు మార్పులు సూచించాలి. ముందు అందులో ఉన్న సానుకూల అంశాలను ప్రశంసించాలి, నిజంగా నచ్చితే. తర్వాత ఫ్యాక్చువల్ ఎర్రర్స్ ఎత్తిచూపాలి. తరవాత పరస్పర విరుద్ధాంశాలను ప్రస్తావించాలి. నెమ్మదిగా వాక్యాల్లో లోపాలు, పలుకుబడుల్లో తేడాలు, కాపీ ఎలా మెరుగుపరుచుకోవచ్చు... ఇలా చెప్పాలి. అయితే ఒకటి. మనం నిజమైన తప్పుల్ని ఎత్తి చూపితే రచయితలు సంతోషిస్తారు. అది వాళ్లకే మంచిది కదా. పట్టించుకోనివాళ్లు కూడా ఉంటారు. ఫైన్. మనం చెప్పగలిగింది చెప్పకుండా ఉండకూడదు.’’ వేల్చేరు నారాయణరావు, డేవిడ్ షూల్మన్ ‘కళాపూర్ణోదయం’ అనువాదంలో కూడా ఆయన కొన్ని మార్పులు సూచించారు. ‘‘ముందుగా దాన్ని కొలంబియా ప్రెస్‌వాళ్లు ప్రచురించారు. ఆ కాపీ బానే ఉంది నాకు. తర్వాత ఆక్స్ఫర్డ్ వాళ్లు వేయదలిచినప్పుడు అభిప్రాయం కోసం నాకు పంపారు. అప్పుడు నేను ఒరిజినల్ కళాపూర్ణోదయంతో ఈ అనువాదాన్ని పోల్చి చూశాను. కొన్ని లోపాలు కనిపించాయి. వాళ్లకు రాశాను.’’ మరి వాళ్లు అవి సవరించారా? ‘‘నాకు తెలీదు. చేశారనే అనుకుంటున్నా. వాళ్లు నాకు కాపీ పంపలేదు. నేను దిద్దారా లేదా అని చూసుకోలేదు’’. ఆక్స్ఫర్డ్ వాళ్లు మర్యాదకైనా కాపీ పంపాలి కదా? ‘‘పంపలేదు మరి. మనం చెప్పిన తప్పులు వాళ్లు ఒప్పుకున్నారంటే మనకు అహం పెరుగుతుంది, దిద్దలేదని తెలిస్తే బాధ కలుగుతుంది. చూడకపోవడమే మంచిది కదా’’ అని తేలిగ్గా తీసుకుంటారు. అసమర్థుడి జీవయాత్ర అనువాదం 30 ఏళ్ల శ్రమ సాహిత్యంతో ఏ పరిచయం లేకుండా అనువాదకుడిగా ఎలా మారారు? ‘‘దానిక్కారణం చైనా’’ అంటారాయన. 1962లో చైనాతో యుద్ధకాలంలో అకాడమీకి నిధులు తగ్గిపోయాయి. రచయితలతో సమావేశాలు లేవు. ‘‘మరి ఆ సమయంలో ఉద్యోగులుగా మేమేం చేయాలి? రాయగలిగేవాళ్లను రాయమనీ, అనువాదాలు చేయగలిగేవాళ్లను చేయమనీ చెప్పారు. అలా నేను అనువాదకుడినయ్యాను’’ అని చెబుతారు. రావు తొలుత తన అనువాదానికి ఎంచుకున్న నవల గోపీచంద్ ‘అసమర్థుడి జీవయాత్ర’. దాన్ని ‘ద బంగ్లర్’ పేరుతో ఆరు నెలల్లో పూర్తి(?) చేశారు. గోపీచంద్‌దే మరో నవల ‘మెరుపులు మరక’లను ‘ఉషారాణి: ఎ టేల్ ఆఫ్ సెన్స్ అండ్ సెన్సువాలిటీ’గా ఇంగ్లిష్ చేశారు. గోపీచంద్‌నే అనువదించడానికి ప్రత్యేక కారణం? ‘‘అప్పుడు అకాడమీకి ఉన్న తెలుగు సలహా సంఘం గోపీచంద్ పేరును సూచించడమే’’ అని ఒప్పుకుంటా రాయన. అంతకుముందు గోపీచంద్ రచనలేమీ చదవలేదని కూడా అంగీకరిస్తారు. మరి అనువాదం ఇట్టే ఎలా చేయగలి గారు? ‘‘నవల అనువాదానికి చాలా అవస్థ పడ్డాను. మొదట నేను చేసిన అనువాదం నాకే నచ్చలేదు. ఎన్నోసార్లు రివైజ్ చేశాను. 30 ఏళ్లు సవరిస్తూ వచ్చాను. తెలుగు, ఇంగ్లిష్ తెలిసిన సహృదయులకూ, తెలుగు రాని ఇంగ్లిష్ పాఠకులకూ చూపించి, ఎన్నో చర్చలు సాగించి, అనువాదాన్ని ఫైనలైజ్ చేశాను’’. 300 ఏళ్ల క్రితం Wentworth Dillon అనువాదకులకు ఇచ్చిన సలహా ఇప్పటికీ ప్రాసంగికమే అంటారాయన. Take pains the genuine meaning to explore, There sweat, there strain, tug the laborious oar: Search every comment, that your care can find,Some here, some there, may hit the poet's mind... Then, seek a poet who your way does bend,And choose an author as you choose a friend. United by this sympathetic bond, You grow familiar, intimate and fond; Your thoughts, your words, your styles, your souls agree, No longer his interpreter, but he. ‘ద బంగ్లర్’ 2003లో ప్రచురితమైంది. ‘‘ప్రొఫెసర్ శివరామకృష్ణ చదివారు. ఒక్క తప్పైనా దొరక్కపోతుందా అని చూశారుట. తెలుగు–ఇంగ్లిష్ అనువాదంలో ఇది ఒక మైల్స్టోన్ అని ప్రశంసించారు’’ అని మురిసిపోతారు రావు. అనువాదం తర్వాత గోపీచంద్ మీద అభిమానం పెరిగిందా? ‘‘భారతీయ సాహిత్యంలోని ఏ ఉత్తమ గ్రంథానికీ అసమర్థుడి జీవయాత్ర తీసిపోదు’’ అని చెబుతారు. అదే ఊపులో ‘ఉషారాణి’ 2013లో వచ్చింది.చివరగా– రచయితతో సంబంధం లేకుండా రచన మంచిచెడులు చూసి మెచ్చేవాళ్లు తగ్గిపోయారని బాధపడతారు రావు. ‘‘మన దగ్గర ముఠాలెక్కువ. వీడు మనవాడు, వీడు ఏం రాసినా మంచిదే. వీడు మనవాడు కాదు, వీడు ఏం రాసినా దోషపూరితమే. ఈ ధోరణి సాహిత్యానికి తీవ్రమైన చెడు చేస్తుంది’’ అని సాహిత్యలోకానికి సలహా ఇస్తారు. -
చేతబడి
శర్మిష్ట మంచం దగ్గరకు చేరుకుని, పరిస్థితిని గమనించాడు. నాడి పట్టి చూశాడు. కనురెప్పలు తెరిచి చూశాడు. రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాడు. కళ్లు తెరిచాక అన్నాడు... ‘‘ఎవరో బిడ్డ మీద మారణ ప్రయోగం చేస్తున్నారు’’. మూసిన కన్ను తెరవకుండా మంచం మీద పడి ఉంది శర్మిష్ట. నెలరోజులుగా ఇదే స్థితిలో ఉంది. ఒక్కోరోజు ఒళ్లు కాలిపోతున్నంతగా జ్వరం... ఒక్కోరోజు ఇక అవే అంతిమ ఘడియలన్నట్లుగా చల్లబడిపోయే శరీరం. మామూలుగా ఆమె చలాకీగానే ఉండేది. నవ్వుతూ తుళ్లుతూ కాలేజీకి వెళ్లేది. అందరితోనూ కలివిడిగా ఉండేది. ఆరు నెలల కిందటే ఆమెలో అనూహ్యమైన మార్పులు మొదలయ్యాయి. ఎవరికీ అంతుచిక్కని మార్పులు. ఒంట్లో రకరకాల నొప్పులు... అర్ధరాత్రివేళ ఉలిక్కిపడి లేచి సంధి ప్రేలాపనలు! కాలం గడుస్తున్న కొద్దీ చిక్కిశల్యమవుతోంది. శర్మిష్టది కాస్త కలిగిన కుటుంబమే. తండ్రి దేబాశీష్ జిల్లాలో ఉన్నతాధికారి. తల్లి మమత సాదాసీదా గృహిణి. ఒక్కగానొక్క కూతురైన శర్మిష్టని కళ్లలో పెట్టుకుని పెంచుకున్నారు. తనకి ఉన్నట్టుండి జబ్బు చేయడంతో దేబాశీష్ బెంగటిల్లిపోయారు. చాలామంది వైద్యులకు చూపించారు. రకరకాల పరీక్షలు జరిపించారు. అయినా ఆమె పరిస్థితికి కారణమేంటో అంతు చిక్కలేదు. ఇంతకీ శర్మిష్టకు ఏం జరిగింది? ఎందుకిలా కృశించిపోయింది? సమాధానం ఇద్దరికి మాత్రమే తెలుసు. అర్ధరాత్రి దాటుతోంది. బిప్రొ, కళియాబాబా ఎదురెదురుగా కూర్చొని ఉన్నారు. వారి మధ్య వెలుగుతున్న హోమగుండం. హోమగుండంలో ఏవేవో పదార్థాలు వేస్తూ, వినీ వినిపించనట్లు తదేక దీక్షతో మంత్రోచ్ఛాటన సాగిస్తున్నాడు కళియాబాబా. చేతులు కట్టుకుని నిశ్శబ్దంగా జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్నాడు బిప్రొ. బిప్రొ గురించి అతడి ఇంటి చుట్టుపక్కల వాళ్లకు తప్ప పెద్దగా ఎవరికీ తెలీదు గానీ, కళియాబాబా గురించి కలకత్తా వరకు కూడా చాలామందికి తెలుసు. భూతవైద్యుడిగా, తాంత్రికుడిగా కళియాబాబా శక్తిసామర్థ్యాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటారు. ఊరవతల శ్మశానపు ప్రహారీని ఆనుకున్న పాడుబడ్డ గదిలో ఉంటాడతను. ఇప్పుడు ఆ గదిలోనే ఉన్నాడు. అతడి ఎదురుగా బిప్రొ. హోమగుండానికి దిగువన అడుగు పొడవున్న పిండిబొమ్మ. దాని మీద చెల్లాచెదురుగా చల్లిన పసుపు, కుంకుమలు. బొమ్మకు అక్కడక్కడా గుండుసూదులు గుచ్చి ఉన్నాయి. మంత్రోచ్ఛాటన ముగించాక ఆ బొమ్మను ఎడమ చేతిలోకి తీసుకున్నాడు కళియాబాబా. ఆ బొమ్మవైపే కొన్ని క్షణాలు తదేకంగా చూశాడు. బొమ్మ చెవిలో ఏదో చెప్పాడు. బొమ్మను మళ్లీ యథాస్థానంలో పెట్టేసి, దానికి మరో నాలుగు గుండుసూదులు గుచ్చాడు. బిప్రొ వైపు ఒక చూపు చూసి... ‘‘ఇక చెప్పు’’ అన్నాడు. ‘‘నీ దయవల్ల అంతా సజావుగానే ఉంది. ఆమె మూసిన కన్ను తెరవడం లేదు. ఎవరూ కారణాన్ని కనుక్కోలేకపోతున్నారు. ఊరకే వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్లేం చేస్తార్లే..!’’ విజయగర్వంతో చిన్నగా నవ్వాడు కళియాబాబా. ‘ఔను వాళ్లేం చేస్తార్లే’... అంటూ ఈసారి కాస్త పెద్దగానే నవ్వాడు. మరీ వికటాట్టహాసం కాదు గానీ, ఆ నవ్వు చూస్తే ఎవరికైనా వెన్నులోంచి వణుకు పుడుతుంది. ‘‘ఇంకెన్నాళ్లు...?’’ అడిగాడు బిప్రొ. ‘‘ఓపిక పట్టలేవూ..! మీ పట్నపోళ్లంతా ఇంతే. అస్సలు ఓపిక ఉండదు. ఇప్పుడే కదా ఆశ్వయుజం మొదలైంది. మాఘ పున్నమి నాటికి అంతా అయిపోతుంది’’ కాస్త విసుక్కుంటూ బదులిచ్చాడు కళియాబాబా. ‘‘కోపం తెచ్చుకోకు గురూ..! ఏదో ఆత్రం కొద్దీ అడిగాను’’ సర్దిచెబుతున్న ట్లుగా అన్నాడు బిప్రొ. ‘‘సర్లే... సర్లే... మళ్లీ వచ్చే మంగళవారం కనిపించు. మరో నాలుగు సూదులు గుచ్చేద్దాం’’... అప్పటి తతంగానికి ముగింపు పలికాడు కళియాబాబా. ‘‘వస్తా’’ అంటూ ఊరివైపు బయలుదేరాడు బిప్రొ. వీధి అరుగు మీద కుర్చీ వేసుకుని కూర్చున్నాడు బిప్రొ. దీర్ఘంగా ఆలోచిస్తు న్నాడు. సరిగ్గా ఏడాది కిందట జరిగిందా సంఘటన. అది తలచుకుంటే చాలు... ఇప్పటికీ మనసు కుతకుతలాడిపోతుంది. ఆరోజు ఎప్పట్లాగే హుషారుగా ఆఫీసుకెళ్లాడు. ఉదయం నుంచి కలెక్షన్లు బాగానే ఉన్నాయి. ఏవేవో పనుల మీద ఎవరెవరో వస్తుంటారు. వాళ్లకు అవసరం, తనకు అవకాశం. చెయ్యి తడిపితే చాలు, ఎలాంటి సర్టిఫికేట్నైనా పుట్టించగలడు తను. అందుకేగా తనకు అంత డిమాండ్ మరి! సాయంత్రంలోగా రాబోయే కలెక్షన్ల గురించి మనసులోనే లెక్కలేసుకుంటూ తాపీగా లంచ్‌కి వెళ్లాడు. తినేసి వచ్చి భుక్తాయాసంతో సీట్లో కూలబడ్డాడు. అప్పటికే ఒక రైతు తన కోసం ఎదురు చూస్తున్నాడు. కొడుకు చదువు కోసం క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటూ వచ్చాడతను. పదిరోజులుగా తిరుగుతున్నాడు. అతడిని చూడగానే విసుగ్గా ముఖం చిట్లించాడు బిప్రొ. ‘‘ఇవాళైనా డబ్బు తెచ్చావా? డబ్బు చెల్లిస్తేనే పనులయ్యేది’’ అలవాటుగా దీర్ఘాలు తీస్తూ అన్నాడు. ‘‘తెచ్చా సార్’’ అంటూ ఐదు వంద నోట్లు చేతిలో పెట్టాడా రైతు. బిప్రొ కళ్లు మిలమిల్లాడాయి. ఆ రైతు నుంచి ఎప్పట్లాగే లాకేత్వమే సమాధానంగా వస్తుందనుకున్నాడు. కానీ డబ్బు చేతిలో పెట్టేసరికి హుషారు పెరిగింది. ‘‘సరే... బయట కూర్చో. తహశీల్దారు సారు ఖాళీ అయ్యాక సంతకం పెట్టించి పిలుస్తా’’ అన్నాడు. రైతు నెమ్మదిగా బయటకు వెళ్లి, వసారాలోని బెంచీ మీద కూర్చున్నాడు. ఐదు నిమిషాలైనా గడవక ముందే అరడజను మంది బిప్రొ సీటు దగ్గరకు దూసుకొచ్చారు. వాళ్లలో ఒకతను ‘‘బల్లకు ఉన్న అరలన్నింటినీ సోదా చేయండి. ఇతని జేబులు కూడా’’ అంటూ మిగిలిన వాళ్లను ఆదేశించాడు. వాళ్లు పని మొదలుపెట్టారు. ‘‘ఏయ్.... ఏంటిది..? ఎవరు మీరు..?’’ తత్తరపడుతూ ప్రశ్నించాడు బిప్రొ. తనిఖీకి ఆదేశించిన వ్యక్తి జేబులోంచి తన ఐడీ కార్డు తీసి చూపించాడు. బిప్రొ ముఖం పాలిపోయింది. వచ్చిన వాళ్లు ఏసీబీ తనిఖీ బృందం అధికారులు. అంతకు ముందే బిప్రొను కలుసుకున్న రైతుకు డబ్బులిచ్చి పంపింది వాళ్లే. రైతు ఇచ్చిన నోట్లు బిప్రొ చొక్కా జేబులో దొరికాయి. అక్కడికక్కడే అరెస్టు చేశారు. అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాడు ఏడీఎం దేబాశీష్. కోర్టు విచారణ తర్వాత బిప్రొ డిస్మిస్సయ్యాడు. అప్పటి నుంచి దేబాశీష్పై పగబట్టాడు బిప్రొ. అతడిని ఎలాగైనా దెబ్బకొట్టాలి. దేబాశీష్ అదనపు జిల్లా మేజిస్ట్రేట్ (తెలుగు రాష్ట్రాల్లో జాయింట్ కలెక్టర్‌తో సమానం). తానేమో ఉద్యోగం పోగొట్టుకున్న గుమస్తా. అతణ్ని ఏమీ చేయ లేడు. అందుకే ఇంటర్ చదువుకుంటున్న అతని కూతురు శర్మిష్టను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. శర్మిష్ట అంటే తండ్రికి పంచప్రాణాలని తెలుసు. అందుకే ఆమెను టార్గెట్ చేసుకున్నాడు. కళియాబాబా దగ్గరకు వెళ్లాడు. అడిగినంత డబ్బు ముట్టజెప్పాడు. తన కసి తీరాలన్నాడు. అతడు చెప్పినట్లే శర్మిష్టపై బాబా ప్రయోగం మొదలెట్టాడు. మామూలు క్షుద్రప్రయోగం కాదు, ఏకంగా మారణ ప్రయోగమే! వైద్యులు తన కూతురు ప్రాణాలు కాపాడలేరని అర్థమైపోయింది మమతకు. ఆరోజే ఊరి నుంచి వచ్చిన ఆమె అన్నయ్య ప్రదీప్ కూడా అదే మాటన్నాడు. ‘‘ఇదేదో ప్రయోగంలా ఉంది’’ అని కూడా అన్నాడతను. పరిష్కారం గురించి అన్నాచెల్లెళ్లు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ‘‘ఒకసారి చిన్మయ స్వామి దగ్గరకు వెళదాం’’ అన్నాడు ప్రదీప్. ఇద్దరూ బయల్దేరారు. బజారు వీధికి వెనుక ఒక ఇరుకు గల్లీలో సాదాసీదా పాతకాలం పెంకుటింటికి చేరుకున్నారు. ముందు గదిలోని వాలుకుర్చీలో కూర్చుని ఉన్నాడు స్వామి. ‘‘ఎవరు మీరు?’’ ప్రశ్నించాడాయన. అన్నాచెల్లెళ్లు తమను తాము పరిచయం చేసుకున్నారు. సమస్య చెప్పుకున్నారు. ‘‘ఇంటికి వచ్చి బిడ్డను చూస్తా’’ అన్నాడు చిన్మయస్వామి. చేతికర్ర, భుజాన సంచి, ఒక కమండలం పుచ్చుకుని వాళ్లతో కలసి అప్పటికప్పుడే బయలుదేరాడు. శర్మిష్ట మంచం దగ్గరకు చేరుకుని, పరిస్థితిని గమనించాడు. నాడి పట్టి చూశాడు. కనురెప్పలు తెరిచి చూశాడు. రెండు నిమిషాలు కళ్లు మూసుకుని ధ్యానంలోకి జారుకున్నాడు. కళ్లు తెరిచాక అన్నాడు... ‘‘ఎవరో బిడ్డ మీద మారణ ప్రయోగం చేస్తున్నారు’’. హడలిపోయారు వాళ్లు. ‘‘మీరే నా బిడ్డకు కాపాడాలి స్వామీ’’... కన్నీళ్లతో చేతులు జోడించి వేడుకుంది మమత. ‘‘మరేం ఫర్వాలేదు... విరుగుడు చేస్తా’’ అభయం ఇచ్చాడాయన. శర్మిష్ట జబ్బకు ఒక రక్షరేకు చుట్టాడు. నుదుట సిందూరం అద్దాడు. ఆమె మంచం చుట్టూ ముగ్గుపొడితో గిరి గీశాడు. ఇంటి బయటకు వచ్చి, ఇంటికి నాలుగువైపులా కూడా గిరి గీశాడు. ‘‘ఇక భయం లేదు. మంగళవారం నాటికి బిడ్డ లేచి కూర్చుంటుంది’’ అని చెప్పి నిష్ర్కమించాడు. ఆ మంగళవారం ఎప్పట్లాగే సూర్యోదయమైంది. కానీ శర్మిష్ట ఎప్పటిలాగా మూసిన కన్ను తెరవకుండా మంచాన పడి లేదు. మెల్లగా కళ్లు తెరిచింది. తనంతట తానే లేచి, మంచానికి చారబడి కూర్చుంది. తల్లి సాయంతో బాత్రూమ్కు వెళ్లి ముఖం కడుక్కుని వచ్చింది. ‘తినడానికేమైనా కావాలి’ అడిగింది. కూతురి నోట వచ్చిన ఆ ఒక్క మాటకే మమత ఆనందంతో ఉప్పొంగిపోయింది. వెంటనే టిఫిన్ తెచ్చి తినిపించింది. అంతలో బయట ఏవో అరుపులు వినిపిస్తే పరుగు పరుగున వెళ్లింది. ఏమైంది అని అటుగా వెళ్తున్న ఒక వ్యక్తిని అడిగింది. ‘‘కళియాబాబా చచ్చిపోయాడు’’ చెప్పాడతను. ఔను..! కళియాబాబా నెత్తురు కక్కుకుని చచ్చిపోయాడు. తన గదిలో వెలుగుతున్న హోమగుండం దగ్గరే ఒరిగిపోయాడు. మరి బిప్రొ సంగతి! అతడికి పిచ్చెక్కింది. ప్రస్తుతం రాంచీలోని మెంటల్ హాస్పిటల్లో ఉన్నాడు! - కాద్రా -
జవాబుదారీతనంగా జెడ్పీ
సాక్షి, గుంటూరు : జిల్లా పరిషత్ పాలనను గాడిలో పెట్టేందుకు ప్రత్యేక కసరత్తు జరుగుతోంది. తొలుత కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణపై దృష్టి సారించిన జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి(సీఈవో) బి. సుబ్బారావు సెక్షన్ ఆఫీసర్లతో సమావేశమయ్యారు. ఫైళ్ల నిర్వహణ సక్రమంగా లేనిపక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఫైలూ జవాబుదారీతనంగా ఉండాలని తేడా వస్తే ఉపేక్షించేది లేదని ఆదేశిస్తూ ఈ సందర్భంగా కొంత మంది సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫైళ్ల నిర్వహణపై పలు సూచనలు చేశారు. మార్చి 31వ తేదీ లోపు పనులు అన్నీ పూర్తి చేసి బిల్లులు చెల్లించాలని ఆదేశించారు. జిల్లాలో మట్టి, గ్రావెల్, లింక్ రోడ్లకు సంబంధించి రూ. నాలుగు కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయి. తాగునీటికి సంబంధించి కోటి రూపాయల పనులు సాగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు ప్రాంతం వెల్దుర్తి, దుర్గి, దాచేపల్లి మండలాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. బాపట్ల, తెనాలి, అమరావతి ప్రాంతాల్లో మంచి నీటి పథకాలకు ఫిల్టర్ బెడ్లు మార్చాల్చి ఉంది. ఈ పనులు సకాలంలో పూర్తి అయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని సిబ్బందిని సీఈవో ఆదేశించారు. ఇంజనీరింగ్ విభాగం పై సమీక్ష.. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఇంజనీరింగ్ విభాగంపై సీఈవో దృష్టి సారించారు. ఇప్పటికే ఓ సారి జిల్లాలో ఉన్న అన్ని రకాల ఇంజనీరింగ్ విభాగాల సిబ్బందితో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఐదేళ్లుగా జిల్లాలో ఏ పనులు చేశారు. ఏ ఏ పద్దుల కింద వచ్చిన నిధులు ఎన్ని, వాటిని ఏ ఏ పనులకు వినియోగించారు. ఓ పద్ధతి ప్రకారం రికార్డులు తయారు చేసుకుకొని మళ్లీ సోమవారం జరిగే సమావేశానికి తీసుకురావాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు. ఇదిలావుంటే, జెడ్పీలో నిధుల వినియోగం ఓ పద్ధతి ప్రకారం జరగకపోవడంతో సిబ్బందిలో గుబులు మొదలైంది. ఈ గండం నుంచి ఎలా గట్టెక్కాలని తలలు పట్టుకుంటున్నారు. నిధుల వినియోగంలో తేడా వస్తే చర్యలు తప్పవని సీఈవో చేసిన హెచ్చరికలు ఏ పరిణామానికి దారితీస్తాయోనని సిబ్బంది ఆందోళనచెందుతున్నారు. జిల్లాకు 19 మండల రిసోర్స్ సెంటర్లు మంజూరయ్యాయని సీఈవో తెలిపారు. ఒక్కో కేంద్రం నిర్వహణకు రూ. 10 లక్షలు కేటాయించామని, త్వరితగతిన వీటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని కూడా ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశిం చారు. అలాగే జిల్లాలో ఉన్న ఎనిమిది అతిథి గృహాల మరమ్మతులు, భవనాల నిర్వహణ కోసం మరో రూ. 25 లక్షలు కేటాయించామన్నారు. ప్రత్యేక కసరత్తు ... జిల్లా పరిషత్ కార్యాలయంలో ఫైళ్ల నిర్వహణపై ప్రత్యేక కసరత్తు చేస్తున్నాం. తొలుత ఇంజనీరింగ్ విభాగంపై దృష్టి సారించాం. ఐదేళ్ల కాలంలో జరిగిన పనుల వివరాలు తెలియజేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఇప్పటికే ఆదేశించాం. బడ్జెట్ రూప కల్పనపై ప్రస్తుతం కసరత్తు చేస్తున్నాం. త్వరలో బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. - బి. సుబ్బారావు, జెడ్పీ సీఈవో -
జెడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తి
పాతగుంటూరు: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన జెడ్పీ స్థాయి సంఘాలను శనివారం ఎన్నుకున్నారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ మొదటి సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, సీఈవో సుబ్బారావు, కలెక్టర్ కాంతిలాల్ దండే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్న ఈ సమావేశంలో స్థాయీ సంఘాల చైర్మన్లు, సభ్యులను ఎంపిక చేశారు. మొత్తం ఏడు సంఘాల చైర్మన్ పదవులు అధికార టీడీపీకే దక్కాయి. మొదటిది ప్రణాళిక, ఆర్థికం.. ప్రణాళిక, ఆర్థిక అంశాలకు చెందిన ఒకటో స్థాయి సంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకొన్నారు. ఆమె పేరును ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యుడు డొక్కమళ్ల భాగ్యారావు ప్రతిపాదించగా, తుళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు బలపరిచారు. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్(తెనాలి), జీవీఎస్ ఆంజనేయులు(వినుకొండ), కొమ్మాలపాటి శ్రీధర్(పెదకూరపాడు), జెడ్పీటీసీ సభ్యులు శివరామకృష్ణ(నగరం), బండారు కుమారి(భట్టిప్రోలు), కోటా శ్రీనివాసరావు(పొన్నూరు), వెంకాయమ్మ(సత్తెనపల్లి), వలపా బాలస్వామి( కారంపూడి), కామినేని సాయిబాబు(యడ్లపాడు), గింజుపల్లి ఎలిజబెత్‌రాణి(గురజాల), దండమూడి శైలజారాణి(తాడేపల్లి), దేవళ్ల రేవతి(బెల్లంకొండ) ఉన్నారు. రెండు..గ్రామీణాభివృద్ధి.. రెండోస్థాయి సంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకొన్నారు. ఆమె పేరును తాడికొండ జెడ్పీటీసీ సభ్యుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు (వైస్‌చైర్మన్) ప్రతిపాదించగా, అచ్చంపేట జెడ్పీటీసీ సభ్యుడు నల్లమేకల వెంకటేశ్వర్లు బలపరిచారు. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(మంగళగిరి), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల), ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు బందెల కన్నయ్య(ఈపూరు), షేక్. మస్తాన్ షరీఫ్(పెదకూరపాడు), బెజవాడ నరేంద్రబాబు(తుళ్ళూరు), కాగితీల సుబ్బారావు(రేపల్లె), వెంకటరామిరెడ్డి(రాజుపాలెం), నారపురెడ్డి(పిట్టలవానిపాలెం), ప్రసాదం వాసుదేవ( నిజాంపట్నం), వీరభద్రుని రామిరెడ్డి( పిడుగురాళ్ళ) ఉన్నారు. మూడో సంఘం.. వ్యవసాయం... ఈ స్థాయి సంఘానికి చైర్మన్‌గా వడ్డమూడి పూర్ణచంద్రరావును ఎన్నుకున్నారు. సభ్యులుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, జెడ్పీటీసీ సభ్యులు లాలీబాయి( మాచవరం), గోపిరెడ్డి శౌరిరెడ్డి(మాచర్ల), నవులూరు భాస్కరరెడ్డి(రెంటచింతల), ములగండ్ల ప్రకాష్‌రెడ్డి(దాచేపల్లి), కోఆప్షన్ సభ్యుడు నక్కా సవర్ణరాజు ఉన్నారు. నాలుగు విద్య, వైద్యం.. ఈ సంఘానికి చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ కె.యస్.లక్షణరావు, రాజ్యసభ సభ్యుడు జె.డి. శీలం, జెడ్పీటీసీ సభ్యులు చందోలు పృధ్వీలత( అమృతలూరు), సాంబశివరావు(మేడికోండూరు), బత్తుల సుశీల(వినుకొండ), వి. వెంకటేశ్వర్లు(వేమూరు), యేళ్ళ జయలక్ష్మి(దుగ్గిరాల), గుంపుల కన్నయ్య(కర్లపాలెం), కళ్ళం కృష్ణవేణి(వెల్దుర్తి) ఉన్నారు. ఐదు.. మహిళా శిశు సంక్షేమం.. వట్టిచెరుకూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పటూరి సీతామహాలక్ష్మిని ఈ సంఘానికి చైర్మన్‌గా ఎన్నుకున్నారు. సభ్యులుగా ఎమ్మెల్సీలు మహమ్మద్ జానీ, నన్నపనేని రాజకుమారి, జెడ్పీటీసీ సభ్యులు ఆదెమ్మ(నూజెండ్ల), టి. శివపార్వతి(పెదకాకాని), హాజర్బీ(అమరావతి), యన్. సునీత(ఫిరంగిపురం), సంతోషమ్మ(బొల్లాపల్లి), జిల్లి శిరీషారెడ్డి(రొంపిచర్ల), అత్తోట సుధారాణి(చేబ్రోలు), కొండా శివపార్వతమ్మ(చుండూరు) ఉన్నారు. ఆరో సంఘం..సాంఘిక సంక్షేమం.. ఈ సంఘానికి చైర్మన్‌గా క్రోసూరు జెడ్పీటీసీ సభ్యులు చిలకా విల్సన్ గ్లోరిని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(నరసరావుపేట), నక్కా ఆనందబాబు(వేమూరు), బాపట్ల ఎంపీ మాల్యాద్రి, జెడ్పీటీసీ సభ్యులు రాయపూడి సుజనమ్మ(చిలకలూరిపేట), భాగ్యారావు(ప్రత్తిపాడు), రత్నమణి(బాపట్ల), ఆర్.సాంబ్రాజ్యంబాయి(నకరికల్లు), బీ.వెంకటలక్ష్మి( కొల్లిపర), యనమల మమత(ముప్పాళ్ళ), కొలకలూరు కోటేశ్వరరావు(గుంటూరు) ఉన్నారు. ఏడో సంఘం.. అభివృద్ధి పనులు, విద్యుత్, రవాణా, గ్రామీణనీటిసరఫరాకు సంబంధించిన ఈ స్థాయిసంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్ ఎన్నికయ్యారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్(పొన్నూరు), అనగాని సత్యప్రసాద్(రేపల్లె), తెనాలి శ్రావణ్‌కుమార్(తాడికొండ), జెడ్పీటీసీ సభ్యులు మల్లవరపు రవికుమార్(శ్యావల్యాపురం), క్రోసూరు అయ్యప్ప(కొల్లూరు), ఆకుల జయసత్య(మంగళగిరి), అన్నాబత్తుని జయలక్ష్మి(తెనాలి), చింతలపూడి నాగలక్ష్మి(నాదెండ్ల), కొనకంచి హైమావతి(దుర్గి), బత్తిని శారద(పెదనందిపాడు), నల్లమేకల వెంకటేశ్వర్లు(అచ్చంపేట), షేక్ నూరుల్ ఆక్తాబ్(నరసరావుపేట) ఎన్నికయ్యారు. -
నేడు ఎంపీపీల ఎన్నిక
పాతగుంటూరు : మండల పరిషత్ అధ్యక్ష, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికలు శుక్రవారం జరగనున్నాయి. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లాపరిషత్ సీఈవో సుబ్బారావు గురువారం తెలిపారు. ఎన్నికల విధి విధానాలను జిల్లాపరిషత్ కార్యాలయంలో ఆయన వెల్లడించారు. ఉదయం 10 గంటలలోపు కో ఆప్షన్ సభ్యులకు, అధ్యక్ష, ఉపాధ్యక్ష బీఫారాలను ఆయా పార్టీల అధ్యక్షులు సమర్పించాలి. 11గంటల వరకు నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ జరుగుతుంది.అనంతరం అభ్యర్థుల పేర్లను నోటీసు బోర్డులో ఉంచుతారు. మధ్యాహ్మం ఒంటిగంటకు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం, తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. సభ్యులు చేతులెత్తే పద్ధతిలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరుగుతుంది.తర్వాత కో ఆప్షన్సభ్యులతోపాటు, ఎంపీటీసీ సభ్యుల ప్రమాణ స్వీకారం.మధ్యాహ్నం 3గంటలకు సభ్యులు చేతులెత్తి పరిషత్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఎన్నికైన అభ్యర్థులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరంమండల పరిషత్ మొదటి సమావేశం నిర్వహిస్తారు. ఎన్నికైన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కో ఆప్షన్ సభ్యులు ఐదేళ్లు పదవుల్లో కొనసాగుతారు. -
మందుబాబులకు జైలు
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు చిక్కిన వారిలో కోర్టు ఇద్దరికి ఏడు రోజుల జైలుశిక్ష, వెయ్యి రూపాయల చొప్పున జరిమానా, మరో ఇద్దరికి రూ.2,500 చొప్పున జరిమానా విధించింది. పోలీసుల కథనం మేరకు..మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఇటీవల ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి నెల్లూరులోని మూలాపేట సెంటర్ వద్ద ట్రాఫిక్ సౌత్ సీఐ సుబ్బారావు బ్రీత్‌ఎనలైజర్లతో వాహనచోదకులను పరీక్షించారు. ఈ పరీక్షల్లో మూలాపేటకు చెందిన ఆటోడ్రైవర్ చాన్‌బాషా, ఎన్టీఆర్నగర్కు చెందిన ఎస్కే అహ్మద్‌బాషా, సంజయ్‌గాంధీనగర్‌కు చెందిన కె.కొం డయ్య దొరికిపోయారు. వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసిన పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు చాన్‌బాషాకు ఏడురోజులు జైలుశిక్ష, వెయ్యి రూపాయల జరిమానా, మిగిలిన ఇద్దరికి రూ. 2,500 చొప్పున జరిమానా విధించింది. చాన్‌బాషాను ట్రాఫిక్ సిబ్బంది జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. సౌత్ ట్రాఫిక్ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ మద్యం తాగి వాహనాలు నడిపడం నేరం, ప్రమాదకరమన్నారు. అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. బాలాజీనగర్‌లో.. బాలాజీనగర్ సీఐ జి.మంగారావు మంగళవారం రాత్రి మసీదు సెంటర్లో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో మద్యం తాగి ఆటో నడుపుతున్న వెంకటేశ్వరపురానికి చెందిన ఎం. శ్రీనివాసులును గుర్తించి అరెస్ట్ చేశారు. బుధవారం కోర్టులో హాజరుపరచగా ఏడు రోజుల జైలుశిక్ష, రూ. 1000 జరిమానా విధించారు.