ఆనవాళ్ల కోసం అన్వేషణ | due to the bus blast Fourty five people died | Sakshi
Sakshi News home page

ఆనవాళ్ల కోసం అన్వేషణ

Published Fri, Nov 1 2013 3:55 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

due to the bus blast Fourty five people died

కొత్తకోట రూరల్, న్యూస్‌లైన్: పాలెం వద్ద బుధవారం జరిగిన ప్రమాదం షాక్ నుంచి స్థానికులు ఇంకా తేరుకోలేకపోతున్నారు. కళ్లముందే ఓల్వో బస్సులో ఉన్న 45 మంది అగ్నికి దహించుకుపోతుంటే చూడటం తప్ప ఏమీ చేయలేని దుస్థితి.. నిస్సహాయులుగా, నిశ్చేష్టులుగా ఆ పెను విషాదాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కాగా, బస్సు అగ్నికి ఆహుతైన ప్రదేశంలో ప్రమాదానికి గల కారణాలు, మృతుల ఆనవాళ్ల కోసం గు రువారం పోలీసులు విసృ్తతంగా అన్వేషణ చేపట్టారు.

 కొత్తకోట మండలం పాలెం వద్ద ప్రమాదం జరిగిన స్థలాన్ని పో లీసుల పూర్తిగా ఆధీనంలోనే ఉంది. ఘటన జరిగిన రోజు సాయంత్రమే మృతదేహాలను అధికారులు ఉస్మానియా ఆ స్పత్రిలోని మార్చురీకి తరలించారు. ప్రమాదానికి గురైన బస్సును క్రేన్ సహాయంతో మరోచోటికి తీసుకెళ్లారు. బ స్సులో ఉన్న ప్రయాణికులు అగ్నికీలల్లో కాలిబూడితైన స మయంలో వారి బంగారు, వెండి ఆభరణాలు కాలిపోయి కిందపడిపోయాయి. దీంతో ఆ ప్రాంతాన్ని పోలీసులు క్షుణ్ణంగా శోధిస్తున్నారు. ఆ ప్రాంతగుండా వాహనాలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
 బంగారం, వెండి  వస్తువుల స్వాధీనం
 కొత్తకోట సీఐ గిరిబాబు ఆధ్వర్యంలో ప్రొబేషనరీ ఎస్‌ఐ పి.వెంకటేశ్వర్లు, మశ్చందర్‌రెడ్డి, రమేష్, మురళీగౌడ్, ఎ.వెంకటేశ్వర్లు, గులాం జి లానీ, యాదగిరి, ఏఎస్‌ఐ సత్తార్‌ల ఆధ్వర్యంలో పోలీసులు, కూలీలు శిథిలాల్లో గా లించగా ప్రయాణికులకు చెందిన పలు వ స్తువులు లభించాయి. వీటిలో 158 వెండి గిన్నెలు, 6 బంగారు ఉంగరాలు, రెండు బంగారు పుస్తెలు, ఒక బంగారు పుస్తెల గొలుసు, రెండు జతల బంగారు చెవిదుద్దులను గుర్తించి పోలీసులు వాటిని భద్రపరిచారు.  
 
 ఓల్వో కంపెనీ
 ప్రతినిధుల పరిశీలనలు
 మన రోడ్లకు ఓల్వో బస్సులు సరిపోవని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రమాదానికి గురైన ఓల్వో బస్సును ఆ కంపెనీకి చెందిన ప్రతినిధు లు ప్రమాదస్థలానికి వచ్చి పరిశీలించారు. ప్రమాదం ఏలా సంభవించిం ది? అందుకు గల కా రణాలపై వారు స్థానిక పోలీసులతో వివరాలను సేకరించారు. ప్రమాదానికి గురై న బస్సు ను అణువణువునా పరిశీలించా రు.
 
 అదేవిధంగా ఆర్‌టీఏ, ఎల్‌అండ్‌టీ, ఆర్టీసీ అధికారులు కూడా ఘటన స్థలా న్ని పరిశీలించి వెళ్లారు. ఈ క్రమంలో ఓ ల్వో బస్సు ఇన్సూరెన్స్‌కు సంబంధించిన సిబ్బంది సంఘటన స్థలాన్ని, కాలిపోయి న బస్సును పరిశీలించి ఫొటోలు సేకరిం చారు. వనపర్తి డీఎస్పీ బి.శ్రీనివాస్‌రెడ్డి సంఘటన స్థలానికి వచ్చి వెళ్లారు. కర్ణాట కకు చెందిన అధికారుల బృందం కూడా ఉదయమే ఇక్కడికి వచ్చి పరిశీలించి వెళ్లినట్లు సమాచారం. మధ్యాహ్నం వరకు ప్ర మాదస్థలంలో పోలీసులు పహారా ఉన్నా రు. ఓల్వో బస్సును మరోచోటికి తరలించిన తర్వాత అక్కడ కూడాసాయంత్రంవరకు పోలీసులు ఉన్నారు.
 
 ఓల్వో బస్సు డ్రైవర్, మేనేజర్ల రిమాండ్
 కొత్తకోట టౌన్, న్యూస్‌లైన్ : జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు డ్రైవర్ ఫిరోజ్‌పా ష, మేనేజర్ షకీల్‌జబ్బార్‌లను గురువారం సాయంత్రం కొల్లాపూర్ కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌ఐ మహేశ్వర్‌రావు తెలిపారు. వీ రిని జడ్జి రిమాండ్‌కు ఆదేశించారని ఆయన వెల్లడించారు. అజాగ్రత్తగా బస్సు నడిపి ప్ర మాదానికి గురిచేసిన డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల 45 మంది ప్రయాణికులు అగ్నికి ఆహుతయ్యారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement