బిచ్కుంద న్యూస్‌లైన్: రబీ సాగుకు సిద్ధమవుతున్న త రుణంలో రైతన్నను కల్తీ ఎరువులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల్లో నిం డా నిర్లక్ష్యం పేరుకుపోయింది. కల్తీ ఎరువులను గుర్తించేందుకు లక్ష్యం మేరకు దుకాణాల నుం చి కనీసం శాంపిళ్లను సేకరించలేకపోతున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రతి మండల వ ్యవసాయ అధికారి తన పరిధిలో ఉన్న దుకాణాల నుంచి ఎరువుల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. ఎరువుల్లో నాణ్యత లోపిస్తే అధికారులు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి.
అయితే ఎక్కడా ఈ మేరకు అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది జిల్లాకు సుమారు 560 శాంపిళ్ల సేకరణను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 36 మండలాల నుంచి లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. కాగా అధికారుల ఇప్పటి వరకు కేవలం 280 శాంపిళ్లను సేకరించి చేతులు దులుపుకున్నారు. ఎక్కువగా ఎరువుల వినియోగం ఖరీఫ్‌లోనే ఉన్నా..ఎప్పటికప్పుడు అనుమానం కలి గి నా... రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆయా దుకాణాల నుంచి శాంపిళ్లను సేకరించి జాగ్రత్త పర్చాలి. అయితే ఇవేమీ అమలు కావడం లేదు. కల్తీ ఎరువులపై కొరడా ఝళిపించాల్సిన విజిలెన్స్ అధికారులు పత్తాలేకుండా పోయారు. అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహించామనిపించి అధికారులు తర్వాత కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
సరిహద్దులో
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న జిల్లాలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుం ద, బోధన్ మండలాల్లో జోరుగా నకిలీ ఎరువులు, స్ప్రే మందుల విక్రయాలు సాగుతున్నాయి. నాణ్యతను గుర్తించలేకపోతున్న రైతులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో నిజామాబాద్ ఏడీఏ ప్లాంట్ ప్రొటక్షన్ అధికారి చంద్రశేఖర్‌ను సంప్రదించగా జిల్లాలో ఇప్పటి వరకు 280 ఎరువుల శాంపిళ్లు సేకరించామని తెలిపారు. అందులో నిజామాబాద్ నగరంలోని దుకాణాల్లో లభించిన 10.26.26, 17.17.17, 14.35.14 ఎరువులలో నాణ్యత తక్కువగా ఉందని తెలి పారు. బిచ్కుంద ఏడీఏ వేణుగోపాల్ మాట్లాడుతూ జుక్కల్‌లో 20.20.0.13 రకాల ఎరువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలిందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
కలవరపెడుతున్న నకిలీ ఎరువు
Published Thu, Nov 28 2013 3:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement
Advertisement