bichkunda
-
భగ్గుమన్న ‘బిచ్కుంద’
నిజాంసాగర్ (జుక్కల్): ద్విచక్రవాహన దారుడిని ఇసుక లారీ ఢీకొనడంతో సోమవారం రాత్రి కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రం భగ్గుమంది. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీకి స్థానికులు నిప్పుపెట్టడంతో పాటు మరో 12 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. వివరా లుఇలా ఉన్నాయి. గోపన్‌పల్లి గ్రామా నికి చెందిన విజయ్ బిచ్కుంద మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాం తంలో బార్బర్ షాపు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి షాపును మూసివేసిన విజయ్, ద్విచక్రవాహనంపై గోపన్‌పల్లికి బయలు దేరాడు. బిచ్కుందలోని ఎస్బీఐ బ్యాంక్ ప్రాంతంనుంచి వెళుతున్న విజయ్ను అదే సమయంలో వేగంగా వచ్చిన ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయ్ బైక్‌పై నుంచి కిందపడిపోగా లారీ అతని నడుముపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయాలైన విజయ్ను చుట్టుపక్కలవారు వెంటనే 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహం చెందిన స్థానికులు ప్రమాదానికి కారణమైన ఇసుక లారీకి నిప్పుపెట్టారు. అంతేకాకుం డా రోడ్డుపై నిలిపి ఉంచిన మరో 12 లారీల అద్దాలను ధ్వంసం చేశారు. ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడి చేరుకోగా ఆందోళనకారులు వారితో వాగ్వాదానికి దిగారు. బిచ్కుంద సీఐ సాజిద్ ఆందోళన చేస్తున్న వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు శాంతించకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. సుమా రు రెండు గంటల పాటు బిచ్కుంద పట్టణంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బాన్సువాడ డీఎస్పీ జైపాల్‌రెడ్డి ఘటనాస్థలాన్ని సందర్శించి పరిస్థితులను చక్కదిద్దారు. -
హవ్వా.. స్కావెంజర్ పర్యవేక్షణలో పరీక్షలా..!
సాక్షి, బిచ్కుంద (జుక్కల్): ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన మెరుగుపర్చి విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే క్షేత్రస్థాయిలో మాత్రం నిండా నిర్లక్ష్యం కనిపిస్తోంది. బిచ్కుందలోని ఉర్దూ మీడియం హైస్కూల్లో మంగళవారం పదో తరగతి విద్యార్ధులకు విద్యా నైపుణ్యం పెంచడానికి నెలవారీ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్ష ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల పర్వవేక్షణలో నిర్వహించాల్సి ఉండగా ఉదయం 11గంటలైనా ఒక్క ఉపాధ్యాయుడు రాలేదు. దీంతో స్కావెంజర్ ముజ్జు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు అందించి పరీక్ష నిర్వహించారు. పాఠశాలలో ముగ్గురు రెగ్యులర్, ముగ్గురు వీవీలు ఉండగా ఒక్కరు కూడా పాఠశాలకు రాకపోవడంతో స్కావెంజరే పరీక్ష నిర్వహించాడు. దీనిని చూసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. పాఠశాల మరుగుదొడ్లు, తరగతి గదులను స్కావెంజర్ శుభ్రం చేయాలి. నీటివసతి కల్పించాల్సి ఉంటుంది. కాని తమకు ఆలస్యమవుతుందని ఉపాధ్యాయులు ఫోన్ చేసి పరీక్ష ప్రశ్నపత్రాలు ఇచ్చి పరీక్ష నిర్వహించాలని ఆదేశించడంతో పరీక్ష నిర్వహించానని స్కావెంజర్ ముజ్జు తెలిపారు. తల్లిదండ్రులు ఫిర్యాదు కోసం ఎంఈవో కార్యాలయానికి వెళ్లినప్పటికీ అక్కడ ఫిర్యాదు తీసుకునేందుకు ఎవరూ లేకపోవడంతో తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు రాకపోవడం స్కావెంజర్ పరీక్ష నిర్వహించడంపై ఎంఈవో రాములు నా యక్‌ను వివరణ కోరగా విచారణ చేపట్టి ఉన్నతాధికారులకు నివేదిక పంపించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
‘దేవాడ’కు రోడ్డేశారు
సాక్షి, నిజాంసాగర్: బాన్సువాడ– బిచ్కుంద ప్రధాన రహదారిపై ఉన్న దేవాడ వాగుపై అధికారులు తాత్కాలిక వంతెన నిర్మించారు. దీంతో ప్రజల రవాణా కష్టాలు తీరాయి. ఇటీవల కురిసిన వర్షాలకు దేవాడ వాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో 15 రోజులకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి తగ్గినా తాత్కాలిక వంతెన వేయకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై శుక్రవారం ‘తాత్కాలిక రోడ్డైనా వేయరూ’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే హన్మంత్ సింధే ఆదేశాలతో ఆర్అండ్బీ అధికారులు కదిలారు. వేగంగా తాత్కాలిక వంతెన పనులు పూర్తి చేయించారు. సాయంత్రమే ఈ మార్గంలో వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. దారి కష్టాలు తీరడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
మొన్న పట్టుబడిన వ్యక్తే మళ్లీ దొరికాడు..
సాక్షి, బిచ్కుంద (కామారెడ్డి): ఖరీఫ్ ప్రారంభమైన తరుణంలో నకిలీ విత్తనాల దందా మళ్లీ ఊపందుకుంది!. ఎలాంటి అనుమతులు లేకుండా, కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా వివిధ కంపెనీల విత్తనాలను రైతులకు అంటగడుతున్నారు. ఇటీవల అనుమతి లేకుండా సోయా విత్తనాలు విక్రయిస్తూ ఓ లారీ పట్టుబడిన ఉదంతం మరవక ముందే తాజాగా మరో లారీ పట్టుబడింది. మండలంలోని ఫత్లాపూర్‌లో లారీలో విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తుండగా వ్యవసాయ అధికారులు సోమవారం పట్టుకుని, లారీని సీజ్ చేశారు. అంకాపూర్ కేంద్రంగా విత్తనాల దందా కొనసాగుతుందని అధికారులు గుర్తించారు. దీనిపై గట్టి నిఘా పెట్టినట్లు వారు తెలిపారు. అక్రమంగా విక్రయాలు.. వితనోత్పత్తి పథకం కింద కంపెనీ పేరుతో విత్తనాలు అమ్మడానికి అనుమతి తీసుకోవాలి. అలాగే, గ్రామాల్లో ఏజెన్సీ ద్వారా విక్రయించడానికి లైసెన్సు కావాలి. కానీ, వీటన్నిటిని తుంగలో తొక్కి యథేచ్ఛగా సోమవారం ఫత్లాపూర్ గ్రామంలో లారీలో 500 బస్తాలు తీసుకొచ్చి విక్రయిస్తుండగా ఏవో పోచయ్య పట్టుకున్నారు. ఈ నెల 15వ తేదీన గుండెకల్లూర్‌లో పట్టుబడిన అంకాపూర్ విఘ్నేశే.. తాజాగా ఫత్లాపూర్‌లో విత్తనాలు విక్రయిస్తూ దొరికిపోయాడు. కమీషన్ పేరుతో గ్రామంలో ఒకరిద్దరిని మచ్చిక చేసుకుని విత్తనాలు విక్రయిస్తున్నారు. రకరకాల కంపెనీల పేర్లతో.. విఘ్నేశ్ మొన్న గుండెకల్లూర్‌లో కర్ణాటక రాష్ట్రానికి చెందిన అరుణోదయ ఆగ్రో సీడ్స్ కంపెనీ విత్తనాలు విక్రయించాడు. తాజాగా ఫత్లాపూర్‌లో హై దరాబాద్‌కు చెందిన వర్ధ కంపెనీ విత్తనాలు విక్రయిస్తూ పట్టుబడ్డాడు. రకరాకల కంపెనీల పేరుతో విత్తనాలు విక్రయించడంపై అధికారులు విగ్నేష్‌ని విచారించగా, పలు విషయాలు వెల్లడించాడు. అంకాపూర్ గ్రామంలో గోదాం ఉందని, అక్కడ సుమాంజలి, అరుణోదయ, వర్ధ తదితర 10 రకాల కంపెనీల విత్తనాలు ఉన్నాయని చెప్పా డు. అక్కడి నుంచి విత్తనాలను తీసుకొచ్చి జుక్క ల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో విక్రయిస్తున్నామని వివరించాడు. మూడు మండలాల్లో వివిధ కంపెనీల పేరుతో సుమారు 4 వేల బస్తాలు విక్రయించినట్లు అధికారులు గుర్తించారు. బిల్లుపై అనుమానం.. ఫత్లాపూర్ గ్రామ కమిటీ పేరుతో 500 వస్తాలు ఉన్నాయని బిల్లులో రాసి ఉంది. అయితే, విత్తనాలకు సంబంధించిన డబ్బులు ఎన్ని, విలువ ఎంత, జీఎస్టీ ఎంత అనేది మాత్రం అందులో రాయలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కలెక్టర్ స్పందించి విచారణ జరిపించి రైతులు కోరుతున్నారు. లారీ సీజ్.. రెండ్రోజుల క్రితం గుండెకల్లూర్‌లో, తాజాగా ఫత్లాపూర్‌లో సోయా విత్తనాలు విక్రయిస్తుండగా లారీని పట్టుకున్నామని ఏడీఏ ఆంజనేయులు ‘సాక్షి’కి తెలిపారు. అంకాపూర్ విగ్నేశ్ అనే వ్యక్తి లైసెన్సు, ఇతర ధ్రువీకరణ పత్రాలు లేకుండానే వివిధ కంపెనీల విత్తనాలు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడని, దీంతో లారీ (టీఎస్16 యూబీ 3632)ని సీజ్ చేశామని చెప్పారు. గుండెకల్లూర్‌లో పట్టుకున్నప్పుడు లైసెన్సు తీసుకొచ్చి చూపిస్తామని చెప్పిన విఘ్నేశ్ మూడు రోజులైనా తీసుకురాలేదని తెలిపారు. తాజాగా ఫత్లాపూర్‌లో విత్తనాలు అమ్ముతుండగా పట్టుకున్నామని వివరించారు. అనుమతి లేకుండా ఎక్కడైనా విత్తనాలు విక్రయిస్తే సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. రైతులు మోసపోకుండా ఉండడానికి గట్టి నిఘా పెట్టామని, రైతులు ఇతరుల మాటలు మోసపోవద్దని సూచించారు. రైతులు జాగ్రత్తపడాలి.. ప్రభుత్వం అందిస్తున్న ధరకే విక్రయిస్తున్నామంటూ రైతులను మభ్యపెట్టి విత్తనాలు అంటగడుతున్నారు. ఎలాంటి బిల్లులు లేకుండా విక్రయిస్తున్నారు. అయితే, ఆ విత్తనాలు మొలకెత్తక పోయినా, దిగుబడి సరిగా రాకపోయినా రైతులు ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే, విత్తనాలు తీసుకునే సమయంలో రైతులు చాలా జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. -
గుప్త నిధుల వేటలో అపశ్రుతి
బిచ్కుంద : శాంతాపూర్ గండిలో బుధవారం రాత్రి గుప్త నిధుల కోసం తవ్వుతుండగా ఓ వ్యక్తిపై పెద్ద రాయి పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బిచ్కుంద మండలం పెద్దకొడప్గల్, బేగంపూర్, అంజని, జుక్కల్ మండలం ఖండేబల్లూర్, పోచారం తండాకు చెందిన సు మారు 25 మంది, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తితో కలిసి గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో బండరాళ్ల మధ్యలోనుంచి పది అడుగుల లోతు తవ్వారు. బుధవారం రాత్రి తవ్వకాలు కొనసాగిస్తుండగా గుంతలోపల ఉన్న పోచారం గ్రామానికి చెందిన జైత్రాంపై పెద్ద రాయి పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టినవారు అక్కడినుంచి పరారయ్యారు. ఆ నోట ఈ నోట విషయం బయటికి పొక్కింది. అదే రాత్రి ఎస్సై ఉపేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకున్నామని, నిందితుల కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు. అత్యాశతో.. వరాల కోసం దేవుడిని వేడుకునే మనిషి.. అత్యాశకు పోయి గుప్తనిధుల కోసం ఆ దేవుడి ఆలయాల వద్దే తవ్వకాలు జరుపుతున్నాడు. పాత మందిరాలు, చారిత్రక కట్టడాలను తవ్వేస్తున్నాడు. మందిరాలను కూల్చుతున్నాడు. బిచ్కుందలో, శాంతాపూర్ గండిలో కౌలాస్ ఖిల్లాలో గుప్త నిధులు ఉన్నాయని నమ్ముతున్నవారు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. కౌలాస్ ఖిల్లాను పరిపాలించిన రాజులు శాంతాపూర్ గండిలో బంగారు నాణాలను పాతిపెట్టారని ప్రచారంలో ఉంది. దీంతో గుప్తనిధుల కోసం ఆ ప్రాంతం లో తరచూ తవ్వకాలు జరుపుతున్నారు. అలా తవ్వకాలు జరుపుతున్న క్రమంలోనే బుధవారం రాత్రి ఘటన చోటు చేసుకుంది. గతంలో.. బిచ్కుంద -తక్కడపల్లి రోడ్డులో ఉన్న 500 ఏళ్ల నాటి ఆలయాన్ని గతంలో గుప్తనిధుల కోసం కూల్చేశారు. బిచ్కుంద కమ్మరి చెరుపుట్ట, శాంతాపూర్, కందర్ప ల్లి, బడారెంజల్ గ్రామాల్లో తవ్వకాలు జరిపారు. నాలుగేళ్ల క్రితం బిచ్కుదలో ఏడేళ్ల బాలుడిని బలి ఇచ్చారని వదంతులు వ్యా పించాయి. అత్యాశతో పలువురు చారిత్రక కట్టడాలను కూల్చేస్తూనే ఉన్నారు. -
ఆ గ్రామాలు..శోక సంద్రాలు
నిజాంసాగర్/బిచ్కుంద, న్యూస్‌లైన్ : బిచ్కుంద మండలంలోని గోపన్‌పల్లి, మద్నూర్ మండలంలోని లక్ష్మాపూర్, మొగ గ్రామాలు శోక సంద్రాలయ్యాయి. జుక్కల్ చౌరస్తాలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గోపన్‌పల్లికి చెందిన రాజు, లక్ష్మాపూర్‌కు చెందిన గంగవ్వ, లక్ష్మీబాయి, మొగ గ్రామానికి చెందిన బస్వంత్, అనుష్క మరణించిన విషయం తెలిసిందే. సోమవారం వారి అంత్యక్రియలు నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గోపన్‌పల్లికి చెందిన రాజు ఐదుగురు అన్నదమ్ములలో మూడోవాడు. తండ్రి అనారోగ్యంతో మరణించాడు. వ్యవసాయం చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేవాడు. బంధువుల పెళ్లి ఉండడంతో ఆదివారం మహమ్మద్‌నగర్ వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడడంతో మరణించాడు. శుభ కార్యానికి వెళ్లిన వ్యక్తి విగత జీవుడై శ్మశానానికి వెళ్లడంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు రోదిస్తున్నారు. లకా్ష్మపూర్ గ్రామానికి చెందిన సర్డెవార్ గంగవ్వ, సర్డెవార్ లక్ష్మీబాయి కూలీలుగా పనిచేసేవారు. పిల్లలను పెద్దకొడప్‌గల్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో చదివిస్తున్నారు. వారిని చూసి రావడానికి ఆదివారం హాస్టల్‌కు వెళ్లారు. పిల్లల యోగక్షేమాలు తెలుసుకొని ఇంటికి పయనమయ్యారు. అంతలోనే రోడ్డు ప్రమాదం వారిని అనంత లోకాలకు తీసుకొని వెళ్లింది. కొద్ది సేపటి క్రితం తమతో మాట్లాడి వెళ్లిన వారు కానరాని లోకాలకు వెళ్లారంటే ఆ హాస్టల్ విద్యార్థులు నమ్మలే కపోతున్నారు. మొగకు చెందిన బస్వంత్ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన కూతురు పెద్దకొడప్‌గల్‌లోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. ఆదివారం నాడు భార్య కూలి పనులకు వెళ్లింది. హాస్టల్లో ఉన్న పెద్ద కూతురును చూసిరావడానికి బస్వంత్ చిన్న కూతురు అనుష్కతో కలిసి వెళ్లాడు. స్వగ్రామానికి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతుళ్లు మరణించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకేసారి మృత్యువాత పడడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. -
కలవరపెడుతున్న నకిలీ ఎరువు
బిచ్కుంద న్యూస్‌లైన్: రబీ సాగుకు సిద్ధమవుతున్న త రుణంలో రైతన్నను కల్తీ ఎరువులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నియంత్రించాల్సిన అధికారుల్లో నిం డా నిర్లక్ష్యం పేరుకుపోయింది. కల్తీ ఎరువులను గుర్తించేందుకు లక్ష్యం మేరకు దుకాణాల నుం చి కనీసం శాంపిళ్లను సేకరించలేకపోతున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రతి మండల వ ్యవసాయ అధికారి తన పరిధిలో ఉన్న దుకాణాల నుంచి ఎరువుల శాంపిళ్లను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించాల్సి ఉంటుంది. ఎరువుల్లో నాణ్యత లోపిస్తే అధికారులు వ్యాపారులపై చర్యలు తీసుకోవాలి. అయితే ఎక్కడా ఈ మేరకు అధికారులు స్పందించిన దాఖలాలు కనిపించడం లేదు. ఈ ఏడాది జిల్లాకు సుమారు 560 శాంపిళ్ల సేకరణను వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లాలోని 36 మండలాల నుంచి లక్ష్యాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. కాగా అధికారుల ఇప్పటి వరకు కేవలం 280 శాంపిళ్లను సేకరించి చేతులు దులుపుకున్నారు. ఎక్కువగా ఎరువుల వినియోగం ఖరీఫ్‌లోనే ఉన్నా..ఎప్పటికప్పుడు అనుమానం కలి గి నా... రైతులు ఫిర్యాదు చేసినా అధికారులు ఆయా దుకాణాల నుంచి శాంపిళ్లను సేకరించి జాగ్రత్త పర్చాలి. అయితే ఇవేమీ అమలు కావడం లేదు. కల్తీ ఎరువులపై కొరడా ఝళిపించాల్సిన విజిలెన్స్ అధికారులు పత్తాలేకుండా పోయారు. అప్పుడప్పుడూ తనిఖీలు నిర్వహించామనిపించి అధికారులు తర్వాత కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆనుకొని ఉన్న జిల్లాలోని జుక్కల్, మద్నూర్, బిచ్కుం ద, బోధన్ మండలాల్లో జోరుగా నకిలీ ఎరువులు, స్ప్రే మందుల విక్రయాలు సాగుతున్నాయి. నాణ్యతను గుర్తించలేకపోతున్న రైతులు వాటిని కొనుగోలు చేసి తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ విషయంలో నిజామాబాద్ ఏడీఏ ప్లాంట్ ప్రొటక్షన్ అధికారి చంద్రశేఖర్‌ను సంప్రదించగా జిల్లాలో ఇప్పటి వరకు 280 ఎరువుల శాంపిళ్లు సేకరించామని తెలిపారు. అందులో నిజామాబాద్ నగరంలోని దుకాణాల్లో లభించిన 10.26.26, 17.17.17, 14.35.14 ఎరువులలో నాణ్యత తక్కువగా ఉందని తెలి పారు. బిచ్కుంద ఏడీఏ వేణుగోపాల్ మాట్లాడుతూ జుక్కల్‌లో 20.20.0.13 రకాల ఎరువులు నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని తేలిందని చెప్పారు. ఎవరైనా ఇలాంటి ఎరువులు విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. -
ఉపాధి హామీలో అక్రమాలు
బిచ్కుంద, న్యూస్‌లైన్: మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో జరిగిన ఉపాధి హామీ పనులపై బుధవారం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజా వేదికలో ఈజీఎస్, ఐకేపీ సిబ్బంది చేతి వాటం బహిర్గతమైంది. కూలీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ సిబ్బం ది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించకుండా ఆయా గ్రామాలలో అడుగడుగునా అవినీతికి పాల్పడినట్లు బహిర్గతమైంది. మండలంలో 2013-14కుగాను రూ 3 కోట్ల 70 లక్షల పనులు జరిగాయి. సామాజిక తనిఖీ బృందం ఒక్కొక్కరి అక్రమాలు బయటకు తీసింది. పెద్ద దడ్గి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ కూలీలతో పనులు చేయించకుండా యంత్రాలతో చేయించారని తనిఖీ బృందం గుర్తించింది. ఆయా గ్రామాలలో కూలీలకు కూలి డబ్బులు రాలేదని, కందకాలు, కాలువల పనులు చేయకుండానే పను లు చేసినట్లు రికార్డులు చూపించడం, మంజూరు లేని పనులు చేసి డబ్బులు కాజేయడం తదితర అవినీతికి పాల్పడ్డారు. చిన్న దేవాడలో సహదేవ్ పేరుతో విద్యార్థి లేకపోయినా ఐకేపీ సిబ్బంది స్కాలర్షిప్ రూ 2,400 డ్రా చేసుకున్నారు. అలాగే గుండెకల్లార్లో దమ్ముల శీలా విద్యార్ధి పేరుతో రూ 1,200, వడ్లం గ్రామంలో జ్యోతి, సుజాత, శివరాం, భూమయ్య, సవిత విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ 1,200 స్కాలర్షిప్ అందలేదు. ఫోర్జరీ సంతకాలు చేసి ఐకేపీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారని సామాజిక తనిఖీ బృందం గుర్తించింది. కూలిడబ్బు లు, స్కాలర్షిప్ డబ్బులు తమకు అందలేదని వి ద్యార్థులు, కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి విచారణ చేపట్టి అవినీతి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని, అందని వారికి డబ్బులు అందిస్తామని ఏపీడీ కుమార స్వామి హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు. కార్యక్రమంలో సోషల్ ఆడిట్ అధికారి భూమేష్, ఏపీవో రాజు, ఈయా గ్రామల సర్పంచులు, కూలీలు పాల్గొన్నారు.