కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా వచ్చిన పౌసుమి బసు బుధవారం విధుల్లో చేరారు. ఇంతకాలం ఇన్‌చార్జ్ జేసీగా ఉన్న వివేక్‌యాదవ్ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఉదయం కలెక్టరేట్‌లోని జేసీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం సర్య్కూట్ అతిథి గృహానికి వెళ్లారు. సాయంత్రం కార్యాలయంలో డీఆర్వో సురేంద్రకరణ్, ఆర్డీవోలు, పౌరసరఫరాల సంస మేనేజరు రాజేంద్రకుమార్, ఇతరు అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా : జేసీ
విధుల్లో చేరిన జేసీ పౌసుమి బసును బుధవారం సాయంత్రం జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు ఆధ్వర్యంలో ఉద్యోగులు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. జిల్లాలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని ఉద్యోగ సంఘాల నేతలతో జేసీ అన్నారు. జిల్లాలో సుమారు 70 శాఖల ఉద్యోగులు జేఏసీగా ఏర్పడి పనిచేస్తుండటం అభినందనీయమన్నారు.
జేసీని కలిసినవారిలో గెజిటెడ్ అధికారుల సంఘం కార్యదర్శి జగన్మోహన్‌రావు, టీఎన్జీవోస్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌గౌడ్, కార్యదర్శి రత్నవీరాచారి, రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మార్గం కుమారస్వామి, కార్యదర్శి రాజ్‌కుమార్, డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ, నాయకులు చీకటి వెంకటేశ్వర్లు, మహేష్, వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు దొండపాటి రత్నాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కాందారి బిక్షపతి, శ్రీశైలం, రంజిత్, చుంచు రవీందర్, నాల్గవ తర గతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు దాస్యనాయక్, ఐసీడీఎస్ ఉద్యోగుల సంఘం బాధ్యుడు శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
విధుల్లో చేరిన కొత్త జేసీ
Published Thu, Oct 10 2013 3:13 AM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM
Advertisement
Advertisement