అడిగినంతా ఇవ్వాల్సిందే.. | dwcra associations to dwcra womens | Sakshi
Sakshi News home page

అడిగినంతా ఇవ్వాల్సిందే..

Published Wed, Jun 1 2016 3:13 AM | Last Updated on Tue, Aug 14 2018 3:48 PM

అడిగినంతా ఇవ్వాల్సిందే.. - Sakshi

అడిగినంతా ఇవ్వాల్సిందే..

మచిలీపట్నం: డ్వాక్రా సంఘాలకు చేయూతనివ్వాల్సిన సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చెప్పారు. దీంతో మహిళలు బ్యాంకుల్లో తాము తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక డ్వాక్రా సంఘాలకు సంబంధించిన రుణమాపీ అంశాన్ని పక్కన పెట్టింది. ఒక్కో సభ్యురాలి పేరున రూ.3 వేలు మాత్రమే బ్యాంకులో జమ చేసింది. దీంతో డ్వాక్రా మహిళలు తాము బ్యాంకు ల్లో తీసుకున్న రుణం మాఫీ కాకపోవడంతో మొత్తాన్ని తిరిగి చెల్లించి బ్యాంకు అధికారులకు నమ్మకం కలిగేలా చేసుకున్నారు.

డ్వాక్రా సంఘాలకు రుణాలు మంజూరు చేసేం దుకు బ్యాంకర్లు కొంత మేర ముందుకు వస్తున్నారు. ఇదే అదనుగా ఇందిరాక్రాం తి పథం, మెప్మా విభాగాల్లో పనిచేసే సి బ్బంది డ్వాక్రా మహళల నుంచి కమీషన్లు గుంజుతున్నారు.జిల్లాలో 57,130 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. 2015-16 ఆర్థిక సం వత్సరంలో 33,160 సంఘాలకు రూ. 810 కోట్లు రుణాలుగా అందజేయాలని లక్ష్యం గా నిర్ణయించారు. 38,635 గ్రూపులకు రూ.1206.49కోట్లు రుణాలుగా అందజేశా రు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణం మంజూరైన వెంటనే సంఘానికి సంబంధించిన లీడరు, కమ్యూనిటీ కో-ఆర్డినేటరు, రిసోర్స్ పర్సన్, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు, బుక్‌కీపర్లు, బ్యాంకుమిత్ర తదితరులకు నగదు ముట్టజెప్పాల్సిందే.

డ్వాక్రా సంఘం సభ్యులు బ్యాంకు నుంచి లక్ష రూపాయలు రుణం తీసుకుంటే వెయ్యి రూపాయలు కమ్యూనిటీ కో-ఆర్డినేటరుకు, రూ.200 నుంచి రూ.300లు గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు, రూ.200లు బుక్‌కీపరుకు, బ్యాంకు మిత్రకు మరో రూ.100, ఇతరత్రా ఖర్చులు మరో రూ.200 కమీషన్ రూపంలో ఇవ్వాల్సి వస్తోంది. ఒక్కొక్కసారి ఈ మొత్తాన్ని పెంచి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. కమీషన్ ఇవ్వకుంటే రికార్డులపై సంతకాలు చేయబోమని కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు, రిసోర్స్ పర్సన్లు బెదిరింపులకు దిగుతున్నారు. లక్ష రూపాయలకు రూ.2 వేలు చొప్పున కమీషన్లకే పోతోంది.

డ్వాక్రా సంఘాలకు రూ.100కోట్లు రుణాలుగా అందజేస్తే దీనిలో రూ.2కోట్లు కమీషన్ల రూపంలోనే సమర్పించాల్సిన దుస్థితి నెలకొంది. ఇటీవల మచిలీపట్నంలో ఓ డ్వా క్రా సంఘానికి రూ.3లక్షలు రుణం మం జూరు కాగా కమ్యూనిటీ ఆర్గనైజరుకు రూ. 2 వేలు అందజేస్తే ఈ మొత్తం చాలదని రికార్డులు, నగదు విసిరేసినట్లు డ్వాక్రా మహిళలు చెప్పుకుంటున్నారు.
 
రుణాల మంజూరు ఇలా..
పది నుంచి 12 మంది సభ్యులతో ఒక డ్వాక్రా సంఘాన్ని ఏర్పాటు చేయాలం టే ఆరు నెలలపాటు ప్రతినెలా ఐదో తేదీ లోపు ఒక్కొక్క సభ్యురాలు రూ.100 చొప్పున పొదుపు చేసిన అనంతరం ఏడో నెలలో మొదటి విడత రూ.50వేలు రుణంగా అందజేస్తారు. 10మంది స భ్యులు ఉంటే ఒక్కొక్కరు రూ.5వేలు చొప్పున ఈ నగదును పంచుకుని మరుసటి నెల నుంచి అప్పు తీసుకున్న నగదుతో పాటు పొదుపు సొమ్మును జమ చేయాలి. మొదటి విడతలో రూ.50 వేలు, రెండో విడతలో లక్ష రూపాయ లు, మూడో విడతలో రూ.1.50 లక్షలు, నాలుగో విడత రూ.3 లక్షలు ఇంకా అం తకు మించితే రూ.5 లక్షలకు మించి రుణం ఇవ్వరు.

డ్వాక్రా సంఘానికి రుణం మంజూరు చేయాలంటే ఈ సంఘం స క్రమంగా పని చేస్తున్నట్లు ముందుగా గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ధ్రువీకరించాలి.అనంతరం ఈ సంఘం మరే ఏ ఇతర బ్యాంకులోనూ రుణం తీసుకోలేదని కమ్యూనిటీ కో- ఆర్డినేటర్లు ధ్రువీకరిస్తూ సంతకాలు చేయాలి. గ్రామైక్య సంఘాల వద్ద ఉండే బుక్‌కీపర్లు దీనికి సంబంధించిన రికార్డులు రాయాలి. దీం తోపాటు రీసోర్స్‌పర్సన్లు డ్వాక్రా సం ఘం సక్రమంగా పని చేస్తున్నట్లు నిర్ధారించాలి. వీరంతా సంతకాలు చేసి సం బంధిత పత్రాలను బ్యాంకులో సమర్పి స్తే మేనేజరు రుణం మంజూరు చేస్తారు. రుణం మంజూరైన వెంటనే గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, బుక్‌కీపర్లు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లకు మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది.
 
వసూళ్లకు పాల్పడితే చర్యలు
డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూ రు చేసిన సమయంలో ఎలాంటి వసూళ్లకు పాల్పడకూడదు. డ్వాక్రా మహిళ లు తీసుకున్న రుణంలో ఒక శాతం మేర నగదు గ్రామైక్య సంఘాల నిర్వహణ నిమిత్తం ఇవ్వాలి. ఎక్కడైనా పొ రపాటు జరిగితే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
-డీ చంద్రశేఖరరాజు, డీఆర్‌డీఏ పీడీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement