ప్రశాంతంగా ఎంసెట్ | EAMCET - 2014 | Sakshi
Sakshi News home page

ప్రశాంతంగా ఎంసెట్

Published Fri, May 23 2014 2:00 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ప్రశాంతంగా ఎంసెట్ - Sakshi

ప్రశాంతంగా ఎంసెట్

విజయవాడ సిటీ/పెనమలూరు, న్యూస్‌లైన్ : మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (ఎంసెట్) గురువారం ప్రశాంతంగా జరిగింది. విజయవాడలో 70 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. మొత్తం 36,845 మంది విద్యార్థులు దరఖాస్తుచేసుకోగా 35,772 మంది పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10 గంటలకు 42 కేంద్రాల్లో జరి గిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షకు 21,970 మందికి 21,162 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 2.30 గంటలకు 28 కేంద్రాల్లో జరిగిన మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్షకు 14,875మందికి 14,610 మంది హాజరయ్యారు.  

ఎక్కువ మంది విద్యార్థులు నిర్ణీత వ్యవధి కంటే అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. కొందరు మాత్రం చివరి క్షణాల్లో ఉరుకులు పరుగులతో వచ్చి పరీక్ష రాశారు. సిద్ధార్థ కళాశాల వద్ద ఇద్దరు విద్యార్థులు నిర్ణీత వ్యవధిలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోవడంతో వారిని పరీక్షకు అనుమతించలేదు. 70 కేంద్రాల్లో ఏడెనిమిది మంది మాత్రమే నిర్ణీత వ్యవధిలోగా కేంద్రాలకు చేరుకోలేదు.

పరీక్షలు ప్రశాంతంగా జరి గాయని ఎంసెట్ రీజనల్ కోఆర్డినేటర్ మోహన్‌రావు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే పోలీసు సిబ్బందిలోనికి అనుమతిం చారు. ఎండవేడిమికి పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు అల్లాడారు. తమ బిడ్డలు పరీక్ష రాసినంతసేపు సమీపంలోని చెట్ల నీడన సేదతీరారు. మెడికల్ పరీక్ష రాసేందుకు జగ్గయ్యపేట నుంచి మొగల్రాజపురంలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్ కేంద్రానికి వచ్చిన విద్యార్థిని పరీక్ష ఒత్తిడి, ఎండతో నీరసించి అస్వస్థతకు గురైయింది. పరీక్ష కేంద్రంలో వైద్యసిబ్బంది చికిత్సతో తేరుకుని యథావిధిగా పరీక్ష రాసింది.
 
ప్రాధేయ పడినా పరీక్షకు అనుమతించలేదు
 
కానూరు రవీంద్రభారతి పాఠశాల పరీక్ష కేంద్రం వద్దకు కర్నూలు జిల్లా నంద్యాలకు  చెందిన విద్యార్థిని శివసాయి నిమిషం ఆలస్యంగా రావడంతో అధికారులు ఆమెను అనుమతించలేదు. తొలుత పరీక్ష కేంద్రం వద్దకు ముందుగానే వచ్చినా హాల్‌టికెట్ మరచి పోవటంతో మళ్లీ గూడవల్లి వెళ్లి రావడం, మధ్యలో ట్రాఫిక్ సమస్య కారణంగా నిమిషం ఆలస్యమైంది. ఆ విద్యార్థి, తండ్రి పరీక్షకు అనుమతించాలని అధికారులను చేతులు పట్టుకుని ప్రాథేయపడ్డారు.

నిబంధనల మేరకు అధికారులు అనుమతిం చకపోవడంతో  తండ్రీకొడుకులు కంటతడి పెట్టారు. అక్కడే ఉన్న పలువురు తల్లిదండ్రులు అధికారులు వైఖరిని తప్పుపట్టారు. మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా అధికారుల వైఖ రిలో మార్పురాలేదని ఆరోపిం చారు. ఈ ఘటనతో కొద్ది సమయం పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయమై ఎంసెట్ రీజినల్ కోఆర్డినేటర్ మోహనరావును వివరణ కోరగా తాము చాలా రోజుల నుంచి ఆలస్యంగా రావద్దని ప్రకటన చేస్తున్నామని తెలి పారు. కావాలని తాము ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని, నిబంధనల ప్రకారమే వ్యవహరించామని స్పష్టంచేశారు.
 
అడుగడుగునా ట్రాఫిక్ జామ్
 
ఎంసెట్ సందర్భంగా నగరంలోకి వేలాదిగా కార్లు ఇతర వాహనాల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తరలి వచ్చారు. దీంతో నగరంలో అడుగడుగునా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు పోలీసులు నానాతంటాలు పడ్డారు. ఏలూరు, బందరు రోడ్డు, ఐదో నంబర్ రోడ్డు, సిద్ధార్థ కాలేజీ రోడ్డు, పిన్నమనేని పాలీ క్లినిక్ రోడ్డు, బెంజిసర్కిల్, వన్‌టౌన్, భవానీపురం తదితర ప్రాంతాల్లో పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. రామవరప్పాడు నుంచి బెంజిసర్కిల్ వరకు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది.
 
బందర్‌లో 2,751మంది హాజరు

ఈడేపల్లి (మచిలీపట్నం) : మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన ఐదు ఎంసెట్ పరీక్ష కేంద్రాల్లో మొత్తం 2,751 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం హిందూ, వరలక్ష్మి, నోబుల్, డీఎంఎస్‌ఎస్‌వీహెచ్, శ్రీ వరలక్ష్మి పాలిటెక్నికల్ కళాశాలలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్ విభాగానికి మొత్తం 2,519 మంది దరఖాస్తు చేసుకోగా, 2,408 మంది హాజరయ్యారు. నోబుల్, హిందూ కళాశాలల్లో మధ్యాహ్నం మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్‌కు 363 మందికి 343 మంది పరీక్షరాశారు. రాష్ట్ర పరిశీలకులు జనార్దన్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ రవికృష్ణ, రీజనల్ కో-ఆర్డినేటర్ వి.ఉషారాణి, చీఫ్ సూపరింటెండెంట్ జి.శ్రీనివాసబాబు పరీక్ష కేంద్రాల్ని పర్యవేక్షించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement