నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ఎంసెట్-2014 కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభమవుతోంది. రాష్ట్ర విభజన నేపథ్యం లో ఏర్పడిన వివాదాలతో పెండింగ్‌లో పడిన కౌన్సెలింగ్ నిర్వహణకు సుప్రీంకోర్టు ఆదేశాలతో మార్గం సుగమమైంది.
ఈ క్రమంలో గురువారం నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నారు. నెల్లూరులోని వెంకటేశ్వరపురం బాలుర పాలిటెక్నిక్, దర్గామిట్టలోని మహిళా పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉద యం 9 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఆన్‌లైన్ విధానంలో జరిగే కౌన్సెలింగ్‌కు మొదటి రోజు ఒకటి నుంచి 5 వేలు ర్యాంకు సాధించిన విద్యార్థులను అనుమతిస్తారు. కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ప్రభుత్వ బాలుర పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ వై.రామ్మోహన్ తెలిపారు.
నేటి నుంచి ఎంసెట్ కౌన్సెలింగ్
Published Thu, Aug 7 2014 3:10 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement