ఎంసెట్ సీట్ల కేటాయింపు పూర్తి | EAMCET Full allocation of seats | Sakshi
Sakshi News home page

ఎంసెట్ సీట్ల కేటాయింపు పూర్తి

Published Sat, Jun 27 2015 1:42 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

ఎంసెట్ సీట్ల కేటాయింపు పూర్తి - Sakshi

ఎంసెట్ సీట్ల కేటాయింపు పూర్తి

* తొలివిడత కౌన్సెలింగ్‌లో ఇంజనీరింగ్‌లో 67.5 శాతం, ఫార్మసీలో 17.42 శాతం భర్తీ
* మిగిలిపోయిన సీట్లు 38,708
* వచ్చే నెల 9 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో కన్వీనర్ కోటా ఎంసెట్ సీట్ల కేటాయింపు తొలివిడత ప్రక్రియ శుక్రవారం పూర్తయ్యింది. ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 331 కళాశాలలున్నాయి. ఇందులో యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలు 13, ఫార్మసీ కాలేజీలు 14, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు 304 ఉన్నాయి.

ఈ కళాశాలల్లో 1,12,525 సీట్లుండగా తొలివిడత కౌన్సెలింగ్‌లో 73,817 సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 38,708 సీట్లు భర్తీకాకుండా మిగిలిపోయాయి. మొదటి సంవత్సరం తరగతులు జూలై రెండో తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఏపీ ఉన ్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాలరెడ్డి తెలిపారు. ఎంసెట్ సీట్ల కేటాయింపు వివరాలను ఆయన శుక్రవారం మీడియాకు వెల్లడించారు. సమావేశంలో మండలి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్, ప్రొఫెసర్ పి.నరసింహారావు, చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్, మండలి ఇన్‌ఛార్జి కార్యదర్శి కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఇంజనీరింగ్‌లో 67.5 శాతం, ఫార్మసీలో 17.42 శాతం సీట్లు భర్తీ అయ్యాయని ప్రొఫెసర్ ఎల్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. రెండో విడత కౌన్సెలింగ్ జూలై 9 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 9, 10 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని, 11వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని వివరించారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు వెబ్ లాగిన్‌లో లేదా హెల్ప్ లైన్ కేంద్రంలో రిపోర్ట్ చేయాలని సూచించారు. కేటాయించిన కాలేజీలకు జూలై 1లోగా వెళ్లి అడ్మిషన్లు పొందాలని చెప్పారు. తొలివిడత కౌన్సెలింగ్‌లో సీటు పొందినప్పటికీ రెండో విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనాలనుకునే విద్యార్థులు కాలేజీల్లో ఫీజులు, ఒరిజినల్ ధ్రువపత్రాలు సమర్పించరాదని పేర్కొన్నారు.
 
స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీ నిలిపివేత
నకిలీ క్రీడా ధ్రువపత్రాల వ్యవహారంపై సీబీసీఐడీ విచారణ జరుగుతున్నందున రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) సూచన మేరకు స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీని నిలిపివేశామని ప్రొఫెసర్ వే ణుగోపాల్‌రె డ్డి తెలిపారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలన కోసం శాప్‌కు పంపిస్తున్నామని, అక్కడి నుంచి నివేదిక వచ్చిన తర్వాత సీట్ల భర్తీ చేపడతామన్నారు.
 
207 కాలేజీల మనుగడ ప్రశ్నార్థకం!
ప్రస్తుత వెబ్ కౌన్సెలింగ్‌లో సీట్లు కేటాయింపు గణాంకాలను పరిశీలిస్తే 207 కాలేజీలు నిరర్థకాలుగా తేలుతున్నాయి. సగానికిపైగా సీట్లు భర్తీ అయితేనే కాలేజీలు మనుగడ సాధించగలుగుతాయి. నిర్దేశిత సంఖ్యలో విద్యార్థులు లేని కళాశాలల మనుగడ కష్టమేనని ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఎంసెట్‌లో సీట్లు పొందిన విద్యార్థుల్లో అర్హులైన వారందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం గతేడాది మాదిరిగానే యథాతథంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

10 వేల లోపు ర్యాంకులు సాధించినవారికి పూర్తిగా ఫీజులు చెల్లిస్తారని, ఆపైన ర్యాంకుల వారికి అర్హతలను అనుసరించి రూ.35 వేలు మాత్రమే చెల్లిస్తారని వెల్లడించారు. మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్‌లోని సూచనలను అనుసరించాలని చీఫ్ క్యాంప్ ఆఫీసర్ రఘునాథ్ సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement