కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్
Published Fri, Aug 23 2013 5:16 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
కంఠేశ్వర్,న్యూస్‌లైన్ : జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. గురువారం పాలిటెక్ని క్, గిరిరాజ్ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరి గింది. మొత్తం 238 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. శుక్రవారం 70,001 నుం చి 80 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నారు. గత నాలుగు రోజులు నుంచి కౌన్సెలింగ్ జరగుతున్నా కేంద్రం వద్ద సరైన సౌకర్యా లు కల్పించకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభమైన రెండు రోజు ల తరువాత మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు.
కనీసం ఏదైనా సమాచారం చెప్పేం దుకు ఒక్క అధికారి కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. కేంద్రం బయట విద్యార్థులు, తల్లిదండ్రులు గంటల తరబడి నిలబడి వేచి చూ డాల్సి వస్తోంది. పలుమార్లు అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు. ఇప్పటికైనా కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నా రు. అలాగే కేంద్రాల వద్ద ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల హడావుడి మరీ ఎక్కువైంది. మితిమీరి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Advertisement
Advertisement