ongoing
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొనసాగుతున్న సిట్ సోదాలు
-
కొనసాగుతున్న నేపాల్ ఎన్నికల ఓట్లలెక్కింపు
-
నోట్ల రద్దుపై కొనసాగుతున్న కాంగ్రెస్ ఆందోళనలు
-
కశ్మీర్లో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట
-
600 మెగావాట్ల ప్లాంట్‌కు కొనసాగుతున్న మరమ్మతులు
గణపురం : మండలంలోని చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. బీహెచ్ఈఎల్కు చెందిన ఆరుగురు ఇంజినీర్ల బృందం జనరేటర్‌కు మరమ్మతులు చేపట్టింది. జనరేటర్లో విద్యుదుత్పత్తి చేసే కోర్స్ విభాగంలో సాంకేతిక లోపం తలెత్తడంతో దాన్ని రెండు భాగాలుగా విభజించారు. గత 25 రోజులుగా మరమ్మతులు కొనసాగుతున్నాయి. రిపేరింగ్ పూర్తికావడానికి మరో పది రోజులు పట్టొచ్చని అధికారులు పేర్కొంటున్నారు. జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు, డైరెక్టర్లు సచ్చిదానందం, రాధాకృష్ణ మరమ్మతులు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు. కేటీపీపీ సీఈ శివకుమార్ మాట్లాడుతూ.. ‘ కొత్తప్లాంట్‌కు మరమ్మతులు చేపట్టాం. వారం రోజుల్లో పనులు పూర్తి కావచ్చు’ అని తెలిపారు. -
కశ్మీర్లో కొనసాగుతున్న టెర్రర్ ఆపరేషన్
-
కేటీపీపీలో కొనసాగుతున్న మరమ్మతులు
విద్యుత్ ఉత్పత్తికి మరో నాలుగు వారాలు పట్టే అవకాశం గణపురం : మండలంలోని చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్లాంట్‌కు మరమ్మతులు కొనసాగుతున్నాయి. శనివారం బీహెచ్ఈఎల్కు చెందిన ఆరుగురు ఇంజనీర్ల బృందం జనరేటర్‌ను పరిశీలించింది. ఈసందర్భంగా జనరేటర్‌ను రెండు భాగాలుగా వీడదీసి గమనించగా కోర్స్ భాగంలో లోపం బయటపడింది. జెన్కో డైరెక్టర్లు సచ్చిదానందం, రాధాకృష్ణ మరమ్మతులను పర్యవేక్షించారు. ప్లాంట్‌లో సంవత్సరం పాటు మరమ్మతులు చేసే బాధ్యత బీహెచ్ఈఎల్ కంపెనీదే కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి అనుభవం కల్గిన ఇంజనీర్లను రప్పిం చారు. జనరేటర్లో విడిభాగాలు విదేశాల నుంచి, కొన్ని చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నందున మరమ్మతులు పూర్తయ్యేందుకు దాదాపు నెల రోజులు పట్టవచ్చని అధికారులు తెలుపుతున్నారు. -
హెచ్ సీయూలో కొనసాగుతున్న ఆంక్షలు
రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ ప్రవేశానికి నిరాకరణ హైదరాబాద్: హెచ్‌సీయూలో ఆంక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, సిబ్బంది మినహా ఎవరినీ లోనికి అనుమతించడంలేదు. శుక్రవారం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ యోగేంద్రయాదవ్‌ను లోపలికి అనుమతించలేదు. విద్యార్థుల ఆహ్వానం మేరకు క్యాంపస్‌లోని వెలివాడ వద్ద పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన వారిని ప్రధాన ద్వారం ముందు సెక్యూరిటీ అడ్డుకున్నారు. దీనిపై విద్యార్థులు మండిపడ్డారు. ఛాయారతన్ మాట్లాడుతూ యాజమాన్యాలతో పోరాడుతూ గేట్ మీటింగ్‌లు పెట్టుకునే కంపెనీలా హెచ్‌సీయూ ఉందన్నారు. ఇక్కడ నియంత పాలన నడుస్తోందని, క్యాంపస్‌లో ఉన్న పోలీసులను వెనక్కి పంపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఓ వర్సిటీ ప్రొఫెసర్ మరో యూనివర్సిటీలోకి వెళ్లకుండా అడ్డుకోవడం హేయమైన చర్యని యోగేంద్ర అన్నారు. వీసీ ఏ తప్పు చేయకుంటే మీడియాతోపాటు ఇతరులను లోపలికి రాకుండా ఆంక్షలు ఎందుకు విధించారని ప్రశ్నించారు. వర్సిటీ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ప్రతి భారతీయుడినీ ఆలోచింపజేసిందన్నారు. కాగా, వీసీ అప్పారావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు శుక్రవారం పరిపాలనా భవనాన్ని ముట్టడించారు. రిజిస్ట్రార్ సుధాకర్‌రావుతోపాటు ఇతర అధికారులు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. సాయంత్రం వరకు ధర్నా నిర్వహించారు. -
20 వేల కోట్లతో ప్రాజెక్టులన్నీ పూర్తి!
-
కొనసాగుతున్న ఎంసెట్ కౌన్సెలింగ్
కంఠేశ్వర్,న్యూస్‌లైన్ : జిల్లాలో ఎంసెట్ కౌన్సెలింగ్ కొనసాగుతోంది. గురువారం పాలిటెక్ని క్, గిరిరాజ్ కళాశాలల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరి గింది. మొత్తం 238 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. శుక్రవారం 70,001 నుం చి 80 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్ నిర్వహిం చనున్నారు. గత నాలుగు రోజులు నుంచి కౌన్సెలింగ్ జరగుతున్నా కేంద్రం వద్ద సరైన సౌకర్యా లు కల్పించకపోవడంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌన్సెలింగ్ ప్రారంభమైన రెండు రోజు ల తరువాత మంచినీటి సదుపాయం ఏర్పాటు చేశారు. కనీసం ఏదైనా సమాచారం చెప్పేం దుకు ఒక్క అధికారి కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. కేంద్రం బయట విద్యార్థులు, తల్లిదండ్రులు గంటల తరబడి నిలబడి వేచి చూ డాల్సి వస్తోంది. పలుమార్లు అధికారులు కౌన్సెలింగ్‌ను నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బం దులు పడుతున్నారు. ఇప్పటికైనా కౌన్సెలింగ్ కేంద్రాల వద్ద సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నా రు. అలాగే కేంద్రాల వద్ద ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల హడావుడి మరీ ఎక్కువైంది. మితిమీరి ప్రచారం నిర్వహిస్తున్నారు. -
సమైక్య జోరు
సాక్షి, నెల్లూరు: రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో జరుగుతున్న ఉద్యమం శనివారం 18వ రోజూ ఉధృతంగా సాగింది. నెల్లూరు నగరంలో ఆర్టీసీ ఉద్యోగులు ఆర్టీసీ బస్టాండ్ నుంచి వీఆర్సీ వరకు ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో సమైక్య ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష, వీఎస్‌యూ ఆధ్యాపక జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్సీ కూడలిలో నిరాహారదీక్ష చేపట్టారు. గూడూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు మోటార్‌బైక్ ర్యాలీ, అల్లూరులో వైఎస్సార్సీపీ నేతలు 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు తిరగలేదు. నగరంలో ములుమూడి బస్టాండ్ సెంటర్లో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానికులు రిలేదీక్ష చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట రిలే నిరాహార దీక్షలో కూర్చున్న ఎన్జీఓ సంఘం నాయకులకు జిల్లా అధికారులు, వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్ యాదవ్ సంఘీభావం తెలిపారు. గూడూరులో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు పాశం సునీల్‌కుమార్, డాక్టర్ బాలచెన్నయ్య, నాయకులు బత్తిని విజయకుమార్ సమైక్యాంధ్ర ఆందోళనలో పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నాయకుడు బత్తిని విజయకుమార్ ఆధ్వర్యలో గూడూరులో భారీ మోటార్‌సైకిళ్ల ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ కార్మికులతో కలిసి వైఎస్సార్ విగ్రహానికి క్షీరాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పొదలకూరులో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కావలిలో శ్రీపొట్టిశ్రీరాములు సెంటర్ వద్ద సైమైక్యాంధ్ర జేఏసీ శిబిరంలో తుమ్మలపెంట, సర్వాయిపాలెం, జలదంకి పీహెచ్‌సీల వైద్య సిబ్బంది రిలేనిరాహార దీక్షకు దిగారు. స్థానిక ఆర్టీసీ ఉద్యోగుల సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యాన పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కావలి ఆర్టీసీ డిపో నుంచి వెళ్తున్న బస్సులను అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అల్లూరులో 150 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్‌లో నీటిపారుదల శాఖ సిబ్బంది, అధికారులు రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. నెల్లూరు పాళెం వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఆర్టీసీ బస్సుకు ముందు టైర్లలో గాలి తీశారు. దీంతో నెల్లూరు- ముంబయి రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఉదయగిరిలో ఆర్టీసీ కార్మికులు, వివిధ సంఘాల జేఏసీల ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి పంచాయతీ బస్టాండ్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం మానవహారంగా ఏర్పడ్డారు. వైఎస్సార్సీపీ పట్టణ యూత్ ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్ వద్ద యువకులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై వాలీబాల్ ఆడారు. కొండాపురం మండ లం సత్యవోలులో గ్రామస్తులు కేసీఆర్, సోనియా దిష్టిబొమ్మలు దహనం చేసి రోడ్డుపై నిరసన తెలిపారు. సూళ్లూరుపేటలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో విభజనకు వ్యతిరేకంగా సుమారు 300 మంది మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మరో సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం, పార్లమెంట్ ఇన్చార్జి వెలగపల్లి వరప్రసాద్ పాల్గొన్నారు. కోవూరు ఎన్జీఓ హోంలో సమైక్యాంధ్రకు మద్దతుగా జేఏసీ నాయకుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందుకూరుపేటలో వైఎస్సార్సీపీ నాయకుడు గునపాటి సురేష్‌రెడ్డి ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు.