నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో బుధవారం సాయంత్రం 5గంటల సమయంలో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. జిల్లాలోని ఉదయగిరి, వరికుంటపాడు, దుత్తలూరు, వెంకటగిరి, వింజమూరు మండలాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఇళ్లలోపలి వస్తువులు కదలటంతో భయభ్రాంతులకు లోనై జనం వీధుల్లోకి పరుగులు తీశారు.