నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో స్వల్ప భూప్రకంపనలు
Published Fri, Jun 3 2016 11:00 PM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
ఉదయగిరి/ఒంగోలు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పది మండలాల్లో శుక్రవారం రాత్రి భూమి కంపించింది. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు, కలిగిరి, కొండాపురం, దుత్తలూరు, వరికుంటపాడు, ఉదయగిరి, సీతారామపురం మండలాలతో పాటు ఆత్మకూరు, మర్రిపాడు మండలాలలో రెండుమూడు సెకన్ల పాటు భూమి కంపించడంతో జనం భయకంపితులయ్యారు.
వారం రోజుల్లోనే రెండోసారి భూప్రకంపనలు రావడంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈ భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్ మీద ఇంచుమించు 3.0గా ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రకాశం జిల్లా పామూరు, లింగసముద్రం, సియస్.పురం మండలాలలో కూడా ఇదే స్థాయిలో ప్రకంపనలు వచ్చినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement