
నెల్లూరు జిల్లాలో భూప్రకంపనలు
దుత్తలూరు(ఉదయగిరి): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో ఆదివారం రాత్రి భూమి స్వల్పంగా కంపించింది. రాత్రి 9.54 గంటల ప్రాంతంలో కొన్ని సెకండ్లపాటు భూమి కంపించింది.
దత్తలూరు, లక్ష్మీపురం, కొత్తపేట, బండకిందపల్లి తదితర గ్రామాల్లో పెద్దశబ్దాలతో ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. రాత్రివేళ మళ్లీ భూకంపం వస్తుందేమోనని తీవ్ర ఆందోళనకు గురయ్యారు.