నెల్లూరు జిల్లాలోని గ్రామాల్లో గురువారం ఉదయం 6.30 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది.
నెల్లూరు జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం ఉదయం 6.30 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. దుత్తలూరు మండలంలోని దుత్తలూరు, లక్ష్మీపురం, సోమలరేగడ, ముత్తరాసుపల్లి, బీసీ కలనీ ప్రాంతాల్లో రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లలోంచి బయటికి పరుగులు తీశారు. ఇక జిల్లాలోని వరికుంటపాడులో పలు మార్లు భూమి కంపించడంతో.. ప్రజలు భయకంపితులయ్యారు.