కూతురు కనిపిస్తేనే.. ఇంటికి... | elderly couple journey to find their daughter | Sakshi
Sakshi News home page

కూతురు కనిపిస్తేనే.. ఇంటికి...

Published Sun, May 3 2015 8:47 AM | Last Updated on Wed, Sep 5 2018 2:12 PM

elderly couple journey to find their daughter

బంజారాహిల్స్ : తప్పిపోయిన కూతురి జాడకోసం రెండేళ్లుగా సొంతూరు ముఖం చూడకుండా గాలిస్తున్నారు ఓ వృద్ధ దంపతులు. తమ బిడ్డ జూబ్లీహిల్స్‌లో కనిపించిందని ఎవరో చెబితే నెల్లూరు నుంచి శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌కు  చేరుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఆరా తీశారు.

వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం పార్లపల్లికి చెందిన రమణయ్య కూతురు కృష్ణమ్మ 2013లో స్కూల్‌కు వెళ్లి తప్పిపోయింది. కూతురు తప్పిపోయిన నాటి నుంచి నేటి వరకూ ఇంటికి వెళ్లకుండా ఊరూరా గాలిస్తున్నారు. హైదరాబాద్‌కు ఇప్పటికే 10 సార్లు వచ్చిపోయామని వారు వెల్లడించారు. ఎప్పటికైనా తమ కూతురి ఆచూకీ తెలుసుకుంటామని, అప్పటివరకు ఊరికి వెళ్లబోమని  వారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement