హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ల ఎన్నికల సందర్భంగా జరిగిన దౌర్జన్యాలు, అక్రమాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. వెంటనే విచారణ జరిపి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రిసైడింగ్ అధికారులపై దాడులు చేయడాన్ని ఈసీ తీవ్రంగా పరిగణించింది. దాడులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, విచారణ చేయాలని ఆదేశించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, పశ్చిమ గోదావరి కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అధికార తెలుగుదేశం పార్టీకి కొన్ని జిల్లాల్లో జిల్లా పరిషత్లను గెలుచుకోవడానికి మెజార్టీ లేకున్నా.. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరించడం వంటి సంఘటనలకు పాల్పడిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ నరసింహన్ను కలసి ఫిర్యాదు చేశారు.
ఏపీ స్థానిక ఎన్నికల్లో అక్రమాలపై ఈసీ సీరియస్
Published Mon, Jul 7 2014 8:09 PM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM
Advertisement