విజయనగరం ఫోర్ట్ : జిల్లా పరిషత్‌లో ఏడు స్థాయీ సంఘాలను నేడు ఎన్నుకోనున్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించే సమావేశంలో ఈ సంఘాలను ఎన్నుకోనున్నారు. ప్రణాళిక , ఆర్థిక సంఘం, గ్రామీ ణాభివృద్ధి, వ్యవసాయం, విద్యా వైద్యం, స్రీ,శిశు సంక్షేమ, సాంఘిక సంక్షేమ, పనుల కమిటీలను ఎన్నుకోనున్నారు. ప్రణాళిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి, విద్యావైద్య, పనుల కమిటీలకు చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వ్యవహరిస్తారు. జెడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు, ఎంపీలు సభ్యులుగా ఉంటారు.
జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వ్యవసాయ సంఘం చైర్మన్‌గా, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలు సభ్యులుగా వ్యవహరిస్తారు. స్త్రీ,శిశు సంక్షేమశాఖ, సాంఘిక సంక్షేమ సంఘాలకు మహిళా జెడ్పీటీసీలను చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ నియమిస్తారు. జిల్లాలో జెడ్పీటీసీలు 34 మంది, ఎంపీలు ముగ్గురు, ఎమ్మెల్యేలు తొమ్మిది మంది, ఎమ్మెల్సీలు ఇద్దరు కలిపి 48 మంది ఉన్నా రు. ఇద్దరు కోఆప్షన్ సభ్యులు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. వీరిలో ఆరు కమిటీలకు ఏడుగురు చొప్పన, ఒక కమిటీకి ఎని మిది మంది సభ్యులు ఉం టారు. జిల్లాలో 34 జెడ్పీటీసీ స్థానాలున్నా యి. వీటిలో 24 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన వారు కాగా, పది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారు. నాలుగు కమిటీలే కీలకం: ఏడు కమిటీల్లో నాలుగు కమిటీలే కీలకం. ప్రణాళికఆర్థిక సంఘం, పనులు, విద్యావైద్య, గ్రామీణాభివృద్ధి కమిటీలే కీలకం. కమిటీల్లో ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తారా, లేదో వేచిచూడాలి.
జెడ్పీలో స్థాయీ సంఘాల ఎన్నిక నేడు
Published Sun, Aug 24 2014 1:38 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 PM
Advertisement