చిత్తూరు: ఏనుగులు మరోసారి విరుచుకుపడి పంటపొలాలను ధ్వంసం చేశాయి. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలం నంద్యాల అటవీ ప్రాంతంలో శుక్రవారం చోటుచేసుకుంది. గజరాజుల దాడిలో మండల పరిధిలోని మొక్కజొన్న, వరి, మామిడి పంటలకు తీవ్ర నంష్టం వాటిల్లింది. కాగా.. పది రోజుల్లో ఏనుగులు దాడి చేయడం ఇది మూడోసారి కావడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.