- ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా
- జన్మభూమి కార్యక్రమాల తరువాత నిర్ణయం
- ఇప్పటికే రిలీవ్ అయిన వారికి మినహాయింపు
ఏలూరు : ఉద్యోగులు, అధికారుల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2నుంచి 20 వరకు జన్మభూమి-మన ఊరు కార్యక్రమం చేపడుతున్న దృష్ట్యా.. తిరిగి నిర్ణయం తీసుకునే వరకు బదిలీల ప్రక్రియను నిలుపుదల చేయూలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే బదిలీ అరుున ఉద్యోగులు, అధికారులకు మాత్రం మినహారుుంపు ఇచ్చారు. మిగిలిన వారిని ఎప్పుడు బదిలీ చేయూలనే విషయంపై అక్టోబర్ 20 తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. బదిలీలపై తాత్కాలిక నిషేధం విధించడంతో అధికారులు వత్తిడికి గురవుతున్నారు.
ఒకవైపు ప్రభుత్వ పథకాల హడావుడి.. మరోవైపు బదిలీల నేపథ్యంలో ఇక్కడ ఉంటామా? లేదా ? అన్న ఆందోళనలో అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు నువైన స్థానం కోసం ఎదురుచూస్తున్న వారు వాయిదాను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి అక్టోబర్ 10 నాటికే బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్న దృష్ట్యా అధికారులు, ఉద్యోగుల్ని బదిలీ చేస్తే ఆ కార్యక్రమం కుంటుపడే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాయిదా మంత్రాన్ని జపిస్తోంది.
అడుగడుగునా గందరగోళమే
బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నాటినుంచీ గందరగోళ పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నారుు. తొలుత సెప్టెంబర్ 10 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయూలని చెప్పిన ప్రభుత్వం తరువాత ఆ గడువును నెల రోజులు పెంచి అక్టోబర్ 10 వరకు అవకాశం ఇచ్చింది. తాజాగా అక్టోబర్ 20వ తర్వాతే బదిలీల ప్రక్రియ జరపాలని ఆదేశించింది. ఇదిలావుండగా జీరో సర్వీస్ పేరిట అన్ని శాఖల్లోను, అన్ని విభాగాల్లోను అధికారులు, సిబ్బందికి స్థానచలనం కల్పించాలని ఆదేశాలిచ్చింది. ఇప్పడేమో కొన్ని శాఖల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో 20 శాతం మందిని మించి బదిలీ చేయడకూడదని ఉత్తర్వులు ఇచ్చింది.
దీంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటివరకు ఎవర్ని.. ఎలా బదిలీ చేయాలన్న అంశం పై మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఎంపీడీవోలు, ఇంజినీర్లను జోన్ల వారీగా బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారుు. మరోవైపు అధికారుల బదిలీ విషయంలో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నతాధికా రులకు తలబొప్పి కట్టిస్తున్నారుు. ఇలాంటి పరిస్థితులు, గందరగోళాల నడుమ బదిలీలు పూర్తిస్థాయిలో జరుగుతాయో లేదో అన్న అనుమానాలు ఉద్యోగ వర్గాలను వెంటాడుతున్నాయి.
ఆపండి..!
Published Tue, Sep 30 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 PM
Advertisement
Advertisement