officers transfers
-
మూడేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలు, పోస్టింగ్‌లపై కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా తక్షణం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. సంబంధిత శాఖాధిపతులు, కార్యదర్శులు వెంటనే చర్యలు తీసుకుని ఈ నెల చివరి వారంలోగా బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. ఈ నెలాఖరుకల్లా బదిలీల, పోస్టింగ్‌ల నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాల్సి ఉంటుందని తెలిపారు. మూడేళ్లు ఒకచోట, ఒకే జిల్లాలో పనిచేస్తున్న అధికారులను బదిలీలు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొనే అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆ ఉత్తర్వుల మేరకు.. ♦ నాలుగు సంవత్సరాల్లో.. జిల్లాలో మూడు సంవత్సరాలు పూర్తిచేసిన అధికారులు, లేదా ఈ ఏడాది జూన్ 30 లేదా అంతకుముందు 3 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఉద్యోగులను మరో జిల్లాకు బదిలీ చేయాలి. ♦ ఎన్నికలకు సంబంధం ఉన్న ఏ అధికారిని సొంత జిల్లాలో కొనసాగించడానికి వీల్లేదు. ♦ జిల్లా అధికారులతో పాటు నిర్దిష్టంగా ఎన్నికల విధులకు నియమించిన జిల్లా ఎన్నికల అధికారులు, ఉప ఎన్నికల అధికారులు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, నోడల్ అధికారులతో పాటు డిప్యూటీ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, తహసీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులతో సహా ఇంకా ఎన్నికలకు సంబంధించిన అధికారులందరికీ బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. మున్సిపల్ కార్పొరేషన్, డెవలప్మెంట్ అథారిటీ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. ♦ పోలీసుశాఖకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, రాష్ట్ర ఆర్మ్డ్ పోలీసులు, ఎస్ఎస్పీలు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, సబ్ డివిజనల్ హెడ్ ఆఫ్ పోలీసు, ఎస్‌హెచ్‌వోలు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, జిల్లాస్థాయిలో ఎన్నికల బందోబస్తుకు ఉపయోగించే పోలీసు బలగాలకు వర్తిస్తాయి. ♦ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్లను వారి స్వంత జిల్లాలో నియమించకూడదు. ♦ ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగేళ్లలో 3 సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తిచేస్తే మరో పోలీసు సబ్ డివిజన్‌కు బదిలీ చేయాలి. ఆ సబ్ డివిజన్ అంతకుముందు పనిచేసిన అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉండకూడదు. లేదంటే మరో జిల్లాకు బదిలీ చేయాలి. ♦ ఎక్సైజ్ అధికారులకు బదిలీ నిబంధనలు వర్తిసాయి. సబ్ ఇన్స్పెక్టర్, అంతకంటే ఎక్కువ ర్యాంక్ ఉన్న రాష్ట్రంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ శాఖ అధికారులకు కూడా బదిలీల నిబంధనలు వర్తిస్తాయి. ♦ఎన్నికలతో నేరుగా సంబంధం లేని వైద్యులు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు బదిలీలుండవు. అయితే వారిలో ఎవరైనా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు వస్తే.. విచారణలో రుజువైతే.. అటువంటి అధికారిని బదిలీ చేయమని ఆదేశించడంతోపాటు శాఖాపరమైన చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తుంది. ♦ గతంలో కేంద్ర ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యలకు సిఫార్సు చేసి పెండింగ్‌లో ఉన్న అధికారులు లేదా గతంలో ఎన్నికలకు సంబంధించి ఏదైనా తప్పుపట్టిన, అభియోగాలు మోపిన అధికారులకు ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విధులను అప్పగించకూడదు. గతంలో ఎన్నికల సమయంలో బదిలీ చేసిన అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదు. ♦ అధికారిక పనితీరుకు సంబంధించిన క్రిమినల్ కేసు ఏదైనా న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంటే అలాంటి అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు. ♦ ఆరునెలల్లో పదవీ విరమణ చేయనున్న అధికారులు ఎవరైనా ఎన్నికల సంబంధిత పోస్టులో ఉంటే ఆ వ్యక్తిని ఆ విధుల నుంచి తప్పించాలి. అలాంటి వారిని బదిలీ చేయాల్సిన అవసరం లేదు. ♦ పదవీ విరమణ తరువాత వివిధ హోదాల్లో తిరిగి నియమించిన, పొడిగింపులపై ఉన్న అధికారులు ఎన్నికల సంబంధిత విధుల్లో ఉండకూడదు. ♦ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఉన్న అధికారులకు సంబంధించిన బదిలీ ఉత్తర్వులు ఏమైనా ఉంటే సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించి ఓటర్ల జాబితా తుది ప్రచురణ తర్వాత మాత్రమే బదిలీలు అమలు చేయాలి. ఏదైనా అసాధారణ కారణాల వల్ల బదిలీ చేయాల్సి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ముందస్తు అనుమతి తీసుకోవాలి. బదిలీలపై ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని సంప్రదించడంతో పాటు బదిలీ ఉత్తర్వులను ఆయనకు ఇవ్వాలి. ♦ ఎన్నికల సంబంధిత అధికారులందరూ ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికీ దగ్గర బంధువు కానని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. క్రిమినల్ కేసుల వివరాలను నిర్ధారించిన నమూనాపత్రంలో సమర్పించాలి. ఏ అధికారి అయినా తప్పుడు సమాచారం ఇస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు. ఈనెల 9న రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల సంఘం సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్ ఈ నెల 9వ తేదీన ఏపీకి రానున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియతో పాటు ఈవీఎంల సన్నద్ధత, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇతర ఏర్పాట్లపై 9, 10 తేదీల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్లు సమీక్షిస్తారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో కేంద్ర ఎన్నికల సంఘం సమీక్షలు నిర్వహించనుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, చెక్‌పోస్టుల ఏర్పాటు, మద్యం, నగదు పంపిణీలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేయనుంది. -
ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఐటీ శాఖకు చెందిన 86 మంది చీఫ్ కమిషనర్ స్థాయి అధికారులకు సోమవారం బదిలీ చేస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం(సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే పలువురికి పదోన్నతులు సైతం కల్పించింది కేంద్రం. హైదరాబాద్ ఐటీ చీఫ్ వసుంధర సిన్హాను ముంబైకి బదిలీ చేసింది సీబీడీటీ. హైదరాబాద్ కొత్త ఐటీ చీఫ్‌గా శిశిర్ అగర్వాల్‌ను నియమించింది. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. రహదారిపై వాహనాలను ఢీకొడుతూ వ్యక్తిని లాక్కెళ్లిన కారు -
రిజిస్ట్రేషన్ల డీఐజీలు, డీఆర్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో పలువురు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్స్ (డీఐజీలు), డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లను (డీఆర్‌లను) ప్రభుత్వం గురువారం బదిలీ చేసింది. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌భార్గవ ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన స్థానాల్లో బాధ్యతలు చేపట్టాలని నిర్దేశించారు. -
ఒకే జిల్లాలో మూడేళ్లుంటే బదిలీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అధికారులు సొంత జిల్లాల్లో కొనసాగరాదని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) స్పష్టం చేసింది. 2018, నవంబర్ 30 నాటికి గడిచిన నాలుగేళ్ల కాలంలో ఒకే జిల్లా పరిధిలో మూడేళ్ల సర్వీ సు పూర్తి చేసుకున్న అధికారులను బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల విధులతో నేరుగా సంబంధమున్న అధికారుల బదిలీలకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. బదిలీల్లో భాగంగా సొంత జిల్లాలకు ఎవరినీ పంపించరాదని పేర్కొంది. అలాగే గత అసెంబ్లీ ఎన్నికలు/ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల సందర్భంగా ఏదైనా అసెంబ్లీ నియోజకవర్గం/జిల్లా పరిధిలో పని చేసిన జిల్లా ఎన్నికల అధికారులు (డీఈఓ), రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలీసు ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, ఆపై హోదా కలిగిన అధికారులు మళ్లీ అదే నియోజకవర్గం/జిల్లా పరిధిలో కొనసాగరాదని సూచించింది. ఈ బదిలీల ప్రక్రియను ఈ నెల 17లోగా పూర్తి చేసి, నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వుల అమలులో ఇబ్బందులుంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించి మినహాయింపులు పొందవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ)కు సూచించింది. ఎన్నికలతో నేరుగా సంబంధం ఉన్న జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, ఎన్నికల నోడల్ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, తహశీల్దార్లు, బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఈ బదిలీ మార్గదర్శకాలు వర్తిస్తాయని తెలిపింది. అదే విధంగా ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లతో సంబంధమున్న ఐజీ, డీఐజీ, రాష్ట్ర సాయుధ బలగాల కమాండెంట్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లకు సైతం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని తెలిపింది. -
ఆపండి..!
- ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా - జన్మభూమి కార్యక్రమాల తరువాత నిర్ణయం - ఇప్పటికే రిలీవ్ అయిన వారికి మినహాయింపు ఏలూరు : ఉద్యోగులు, అధికారుల బదిలీలను తాత్కాలికంగా నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 2నుంచి 20 వరకు జన్మభూమి-మన ఊరు కార్యక్రమం చేపడుతున్న దృష్ట్యా.. తిరిగి నిర్ణయం తీసుకునే వరకు బదిలీల ప్రక్రియను నిలుపుదల చేయూలంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు అందాయి. ఇప్పటికే బదిలీ అరుున ఉద్యోగులు, అధికారులకు మాత్రం మినహారుుంపు ఇచ్చారు. మిగిలిన వారిని ఎప్పుడు బదిలీ చేయూలనే విషయంపై అక్టోబర్ 20 తరువాత నిర్ణయం తీసుకోనున్నారు. బదిలీలపై తాత్కాలిక నిషేధం విధించడంతో అధికారులు వత్తిడికి గురవుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ పథకాల హడావుడి.. మరోవైపు బదిలీల నేపథ్యంలో ఇక్కడ ఉంటామా? లేదా ? అన్న ఆందోళనలో అధికారులు, ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు నువైన స్థానం కోసం ఎదురుచూస్తున్న వారు వాయిదాను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డారు. వాస్తవానికి అక్టోబర్ 10 నాటికే బదిలీల ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే, జన్మభూమి-మన ఊరు కార్యక్రమం నిర్వహిస్తున్న దృష్ట్యా అధికారులు, ఉద్యోగుల్ని బదిలీ చేస్తే ఆ కార్యక్రమం కుంటుపడే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాయిదా మంత్రాన్ని జపిస్తోంది. అడుగడుగునా గందరగోళమే బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపిన నాటినుంచీ గందరగోళ పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నారుు. తొలుత సెప్టెంబర్ 10 నాటికి బదిలీల ప్రక్రియ పూర్తి చేయూలని చెప్పిన ప్రభుత్వం తరువాత ఆ గడువును నెల రోజులు పెంచి అక్టోబర్ 10 వరకు అవకాశం ఇచ్చింది. తాజాగా అక్టోబర్ 20వ తర్వాతే బదిలీల ప్రక్రియ జరపాలని ఆదేశించింది. ఇదిలావుండగా జీరో సర్వీస్ పేరిట అన్ని శాఖల్లోను, అన్ని విభాగాల్లోను అధికారులు, సిబ్బందికి స్థానచలనం కల్పించాలని ఆదేశాలిచ్చింది. ఇప్పడేమో కొన్ని శాఖల్లో మూడేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో 20 శాతం మందిని మించి బదిలీ చేయడకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాగా ఇప్పటివరకు ఎవర్ని.. ఎలా బదిలీ చేయాలన్న అంశం పై మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఎంపీడీవోలు, ఇంజినీర్లను జోన్ల వారీగా బదిలీ చేయాలన్న ప్రభుత్వ ఆలోచనపై భిన్నస్వరాలు వినిపిస్తున్నారుు. మరోవైపు అధికారుల బదిలీ విషయంలో ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు ఉన్నతాధికా రులకు తలబొప్పి కట్టిస్తున్నారుు. ఇలాంటి పరిస్థితులు, గందరగోళాల నడుమ బదిలీలు పూర్తిస్థాయిలో జరుగుతాయో లేదో అన్న అనుమానాలు ఉద్యోగ వర్గాలను వెంటాడుతున్నాయి. -
బదిలీలపై ఉత్కంఠ
ఏలూరు,న్యూస్‌లైన్ : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారుల బ దిలీలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరికి మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసిన జిల్లాలోని అధికారులను పొరుగు జిల్లాలకు బదిలీ చే శారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి వ చ్చిన జెడ్పీ సీఈవో, డీఆర్డీఏ పీడీ, ఇతర శాఖల ఉన్నతాధికారులను బదిలీ చేస్తారని సమాచారం. జేసీ బాబూరావునాయుడు జిల్లా లో బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈయనకు బదిలీ ఖాయంగా కనిపిస్తోంది. కలెక్టర్‌గా పదోన్నతి లభిస్తుందన్న ప్రచారం సాగుతోంది. కలెక్టర్ సిద్థార్థజైన్ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాకపోవడంతో ఆయన బదిలీ ఉండకపోవచ్చని భోగ ట్టా. అదనపు జేసీ విధుల్లో చేరి ఐదు నెలలే అవుతోంది. ఇతర శాఖల్లోకి వచ్చి న వారు కూడా కొద్ది నెలలే కావడంతో వార్ని కదిపే అవకాశం తక్కువే. ఈ పాటికే వివిధ శాఖల్లో అధికారులు, సిబ్బంది బదిలీలు పూర్తయ్యేవి. ఈ క్రమంలోనే నెలపాటు బదిలీలపై నిషే దం ఎత్తివేస్తూ ఉత్తర్వులు వచ్చేవి. ఈ సారి ఎన్నికల నేపధ్యంలో బదిలీలకు మార్గదర్శకాలు రాలేదు. ఈ నెలలో నూవచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. మరోవైపు, జెడ్పీ, పురపాలక సంఘాల్లోను నూతన పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాలి. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో బదిలీల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. -
అక్రమార్కుల్లో కొత్త గుబులు
నెల్లూరు(అర్బన్),న్యూస్‌లైన్: నెల్లూరు నగర పాలక సంస్థలోని ఉద్యోగుల్లో ప్రస్తుతం నలుగుతున్న విషయం అధికారుల బదిలీలు. ఎవరు ఉంటారు.. ఎవరు బదిలీపై వెళతారు.. ఎవరైనా అధికారి సెలవు పెట్టి ఫోన్లో అందుబాటులో లేకుండా పోతే ఇక బదిలీ అయినట్లేనంటూ చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రం విడిపోవడం, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారడంతో అధికారుల్లో గుబులు రేగుతోంది. గత ఐదేళ్లలో అధికారులు కొంతమంది ‘బాస్’ అండదండలతో అక్రమాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్, రెవెన్యూ విభాగాల్లో రాజకీయ అండదండలున్న ఉద్యోగులు ఓ మోస్తరుగానే ఉన్నారు. ఐదేళ్లలో నగర పాలక సంస్థలో వీరి హవానే సాగింది. అడ్డగోలుగా అక్రమార్జనకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ‘బాస్’ చెప్పాడంటూ ఇళ్లు కూడా కూల్చేసిన సందర్భాలున్నాయి. నగర పాలక సంస్థకు నిధులు వెల్లువెత్తడంతో అధికారుల జేబులు కూడా బాగానే నిండాయి. ముఖ్యంగా సాంకేతిక విభాగంలో కొంతమంది అధికారులు విచ్చలవిడితనానికి అదుపులేకుండా పోయింది. కొంతమంది అధికారులు ఐదేళ్లలోనే కోట్లకు పడగలెత్తారు. నగరంలోని పలు అపార్ట్మెంట్లలో ప్లాట్లు కలిగి ఉండటం, బినామీ పేర్లతో కాంట్రాక్ట్‌లు కూడా చేశారు. ఇలా దొరికినకాడికి దోచుకున్నారు. విద్యార్హతలపై అనుమానాలు సాంకేతిక విభాగంలో పని చేస్తున్న కొంతమంది అధికారుల విద్యార్హతలపై కూడా అనుమానాలున్నాయి. సాంకేతిక అర్హత లేకపోయినా నకిలీ సర్టిఫికెట్లు పొంది ఉద్యోగాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. సాంకేతిక విభాగంలో పనిచేస్తున్న కొంతమంది అధికారుల విద్యార్హతలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పలువురు సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తులు కూడా చేసినట్లు తెలిసింది. అయితే దరఖాస్తుదారులను తమ దారికి తెచ్చుకునేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిం చినట్లు సమాచారం. సెలవులో అధికారులు నగర పాలక సంస్థలోని పలువురు అధికారులు సె లవులో కొనసాగుతున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగం ఏసీపీ నాలుగురోజులుగా సెలవులో ఉన్నారు. సాధారణంగా అయితే ఆయన సెలవు పెట్టినా ఫోన్లో అందుబాటులో ఉంటారు. సెలవుపెట్టిన నాటి నుం చి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్‌లోనే ఉంది. అదేవిధంగా కమిషనర్ రెండు రోజులుగా సెలవులో ఉన్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య గత వారంలో మూడు రోజుల పాటు సెలవు పెట్టారు. తాజాగా శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. పదిహేను రోజుల పాటు ఆయన సెలవులో ఉంటారని తెలుస్తోంది. అయితే ఇది ఇక్కడి నుంచి బదిలీ చేయించుకునేందుకు చేసుకునే ప్రయత్నాల్లో భాగమేనని సమాచారం. ఇదిలా ఉండగా కొంతమంది అధికారులు అధికార పార్టీ నాయకుల వద్దకు ఇప్పుటికే క్యూ కడుతున్నారు. అక్రమార్జనపై ఆరా నగర పాలక సంస్థలో అధికారుల అక్రమార్జనపై ప లువురు అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ముఖ్య అధికారుల వద్ద నుంచి ఏఈ స్థాయి అధికారి వరకు, పలువురు కింది స్థాయి ఉద్యోగుల వ్యవహారశైలిపై అధికార పార్టీ నేతలు ఆరా తీస్తున్నారని సమాచారం. అధికారుల బారిన పడి నష్టపోయి న వారు అధికార పార్టీ నేతల వద్దకెళ్లి గోడు వెళ్లబోసుకుంటున్నట్లు తెలుస్తోంది. ’ఇప్పటికే చేతులు కాల్చుకున్నాం.. ఇంకా కాల్చుకోవాలంటే మా వల్ల కాదంటూ ఇంజనీరింగ్ విభాగంలో ఓ ముఖ్య అధికారి సన్నిహితుల వద్ద ఇటీవల వాపోవడం వినిపించింది. ఈ నాలుగైదేళ్లలో నగర పాలక సంస్థలో జరిగిన ఆర్థిక అరాచకం ఆయన మాటల్లోనే వెల్లడవుతోంది. మొత్తం మీద రాష్ట్రంలో అధికార మార్పిడి నగర పాలక సంస్థ అధికారులకు గుబులు పుట్టిస్తోంది. ఎవరిపై బదిలీ వేటు పడుతుందో, ఎవరి అక్రమాల పుట్ట బద్ధలవుతుందో మరి కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. -
బదిలీ తప్పదా...అయితే...దగ్గర్లో చూడండి!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఒకపక్క ప్రభుత్వ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతుండగా...మరోపక్క పైరవీలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు...జిల్లాలో మూడేళ్ల పాటు ఒకే చోట పనిచేస్తూ, ఇదే జిల్లాకు చెందిన, ఎన్నికలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న అధికారులకు స్థానచలనం కలిగించే కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ అన్ని శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. వివిధ శాఖల పరిధిలో మూడేళ్లకు పైగా ఒకే చోట పనిచే స్తున్న అధికారుల జాబితాను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అన్ని శాఖల ఉన్నతాధికారులు ఆ పనిలో ఉండగా...ఈవిషయంలో రాజకీయ నాయకులు రంగ ప్రవేశం చేస్తున్నారు. బదిలీ అయ్యే ఉద్యోగులు రాజకీయ నాయకులను ఆశ్రయిస్తుండడంతో వారు కలెక్టర్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులపై తీవ్రంగా ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బదిలీ తప్పనిసరి అయిన పక్షంలో తమ వారిని దగ్గరి ప్రాంతాలకు బదిలీ చేయాలని, మళ్లీ ఎన్నికల తర్వాత మంచి పోస్టింగ్ ఇచ్చేలా చూసుకోవాలని పలువురు రాజకీయ నాయకులు పైరవీలు చేస్తున్నారు. ఈ ైపైరవీల ప్రభావం జాబితా తయారీపై బాగానే పడుతుందని, అయినా ఎట్టి పరిస్థితుల్లో జాబితాను త్వరలోనే సిద్ధం చేస్తామని జిల్లా ఉన్నతాధికారి ఒకరు ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఏదిఏమైనా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు రాగానే బదిలీల ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలనే పట్టుదలతో కలెక్టర్ ఉన్నట్లు సమాచారం. 37 మంది తహశీల్దార్ల బదిలీ? జిల్లాలో 37 మంది తహశీల్దార్లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో 24మంది రెగ్యులర్ తహశీల్దార్లు కాగా, ప్రొబెషనరీ డిప్యూటీ తహశీల్దార్లు(డీటీ) 10మంది, ప్రమోషన్ పొందనున్న మరో ముగ్గురు ఉన్నట్లు సమాచారం. ఎంపీడీవోల బదిలీలు జరిగేనా? జిల్లాలో 46 మండలాలకు గాను 42మంది ఎంపీడీవోలు పనిచేస్తున్నారు. తాజాగా వచ్చిన ఆదేశాలతో జిల్లా పరిషత్ అధికారులు బదిలీల జాబితాను సిద్ధం చేస్తున్నారు. దుమ్ముగూడెం ఎంపీడీవో ఇతర జిల్లా నుంచి రావడం, గార్ల ఎంపీడీవో మరో ఆరునెలల్లో పదవీ విరమణ పొందనుండటంతో 40మంది ఎంపీడీవోలను బదిలీ చేసే అవకాశం ఉంది. అయితే గతంలో నిర్వహించిన సాధారణ ఎన్నికల సమయంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎన్నికల సంఘానికి తమ బదిలీలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేయడంతో ఆ బదిలీలను నిర్వహించలేదు. అలాగే ఇప్పుడు కూడా ఎంపీడీవోలు తమ బదిలీలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించినట్లు తెలుస్తోంది.