బదిలీలపై ఉత్కంఠ
ఏలూరు,న్యూస్‌లైన్ : రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో జిల్లాస్థాయి అధికారుల బ దిలీలపై ఉత్కంఠ నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరికి మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసిన జిల్లాలోని అధికారులను పొరుగు జిల్లాలకు బదిలీ చే శారు. ఖాళీగా ఉన్న పోస్టుల్లోకి వ చ్చిన జెడ్పీ సీఈవో, డీఆర్‌డీఏ పీడీ, ఇతర శాఖల ఉన్నతాధికారులను బదిలీ చేస్తారని సమాచారం. జేసీ బాబూరావునాయుడు జిల్లా లో బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయింది. ఈయనకు బదిలీ ఖాయంగా కనిపిస్తోంది. కలెక్టర్‌గా పదోన్నతి లభిస్తుందన్న ప్రచారం సాగుతోంది. కలెక్టర్ సిద్థార్థజైన్ బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా కాకపోవడంతో ఆయన బదిలీ ఉండకపోవచ్చని భోగ ట్టా. అదనపు జేసీ విధుల్లో చేరి ఐదు నెలలే అవుతోంది. ఇతర శాఖల్లోకి వచ్చి న వారు కూడా కొద్ది నెలలే కావడంతో వార్ని కదిపే అవకాశం తక్కువే. ఈ పాటికే వివిధ శాఖల్లో అధికారులు, సిబ్బంది బదిలీలు పూర్తయ్యేవి. ఈ క్రమంలోనే నెలపాటు బదిలీలపై నిషే దం ఎత్తివేస్తూ ఉత్తర్వులు వచ్చేవి. ఈ సారి ఎన్నికల నేపధ్యంలో బదిలీలకు మార్గదర్శకాలు రాలేదు. ఈ నెలలో నూవచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. మరోవైపు, జెడ్పీ, పురపాలక సంఘాల్లోను నూతన పాలకవర్గాలు పగ్గాలు చేపట్టాలి. దీంతో జూలై, ఆగస్టు నెలల్లో బదిలీల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.