పనులు ముగిసిన తర్వాత సబ్బుతో చేతులు శుభ్రం చేసుకుంటూ..
ఏలూరు రూరల్: పల్లెల్లో శ్రమజీవులు కదిలారు. ప్రభుత్వ భరోసాతో పలుగు,పార పట్టుకుని ఉపాధి పనులు చేపట్టారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పిలుపుమేరకు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లస్థలాల పనులను వేగవంతం చేశారు. ఏలూరు మండలం కొమడవోలు గ్రామ పరిధిలో మంగళవారం ఉపాధి పనులు ఊపందుకున్నాయి. గ్రామానికి చెందిన సుమారు 300 మంది కూలీలు ఫీల్డ్ చానల్, డ్రెయిన్ పనులతో పాటు మెరక పనులు చేశారు. ఏపీఓ కిషోర్ ఆదేశాల మేరకు ఫీల్డ్ అసిస్టెంట్ కవిత పర్యవేక్షించారు. అధికారులు కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ పనులు చేసిన కూలీలు సబ్బుతో చేతులు కడుక్కుని ఇంటి ముఖం పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment