ఉద్యాన సాగుకు ప్రోత్సాహం
కడప అగ్రికల్చర్: ఉద్యానతోటల సాగు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ఉద్యానశాఖ నడుంబిగించింది. పండ్ల, కూరగాయల సాగులో రైతుకు ప్రోత్సాహం కల్పించడమే ధ్యేయంగా జిల్లాకు కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. రైతులను చైతన్యపరిచి ఉద్యాన పంట లు సాగు చేసేలా కొత్త ప్రణాళికలు రూపొందించింది. రెండు రోజుల క్రితం జిల్లాలోని ఉద్యానశాఖ-1, 2కు నిధులు విడుదలయ్యాయి.
పండ్లతోటల విస్తరణ, పునరుద్ధరణ, పాతతోటల అభివృద్ధికి జిల్లాకు రాష్ట్ర ఉద్యాన శాఖ రూ. 13.21 కోట్లు విడుద ల చేసింది. వీటిలో ఆధునిక పద్ధతిలో హైబ్రిడ్ కూరగాయలను సాగుచేసే రైతులను ప్రోత్సహించేందు రూ.2 లక్షలు కేటాయించారు. ఇందులో రాష్ట్ర ఉద్యానశాఖ సగం సబ్సిడీ ఇస్తుండగా, మరో సగం రైతులు భరించాల్సి ఉంటుంది.
పండ్లతోటల విస్తరణలో భాగంగా ఉద్యానశాఖ-1 ద్వారా అరటికి 238 హెక్టార్లకు రూ.1.28 కోట్లు, మామిడి 10 హెక్టార్లకు రూ.2.34 లక్షలు, చీనీకి 70 హెక్టార్లకు రూ.16.21 లక్షలు, దానిమ్మ 30 హెక్టార్లకు రూ.8.87 లక్షలు రైతులకు సబ్సిడీ ఇవ్వనున్నారు. ఉద్యానశాఖ-2లో అరటి 140 హెక్టార్లకు రూ.75.74 లక్షలు, మామిడి 300 హెక్టార్లకు రూ.70.20 లక్షలు, దానిమ్మ 30 హెక్టార్లకు రూ. 8.87 లక్షలు సబ్సిడీ ఇవ్వనున్నారు. అలాగే ముదురు తోటల అభివృద్ధికి సంబంధించి రూ.1.10 కోట్లు ఖర్చుచేయనున్నారు. ఒక్కో రైతుకు హెక్టారుకు (2 1/2 ఎకరాకు) గరిష్టంగా రూ. 6 నుంచి రూ. 20 వేల వరకు సబ్సిడీ అందజేస్తారు.
హైబ్రిడ్ పూలసాగుకు.. ఈ ఏడాది నూతన పద్ధతిలో హైబ్రిడ్ పూలసాగుకు ఉద్యానశాఖ-1,-2లలో 65 హెక్టార్లకు రూ .9.08 లక్షలు, పండ్ల్లు, కూరగాయ తోటల్లో సమగ్ర సస్యరక్షణకు రూ. 20.58 లక్షలు ఖర్చు చేయనున్నా రు. అలాగే మల్చింగ్‌కు 320 హెక్టార్లలో రూ.51.02 లక్షల సబ్సిడీ ఇవ్వాలని రాష్ట్ర హార్టికల్చర్ మిషన్ నిర్ణయిం చింది. యాంత్రీకరణలో భాగంగా పరికరాల కొనుగోలుకు రూ. 50.70 లక్షలు అందించాలని నిర్ణయించారు.
డ్రిప్ ఇరిగేషన్ ఉంటేనే .. ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ముందుగా బిందు, తుంపర సేద్య యూనిట్లు ఏర్పాటు చేసుకుంటేనే సా గు అనుమతులు ఇవ్వాలనే నిబంధనలు పెట్టారు.