అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో 81 మంది , ఫార్మసీ అధ్యాపకులను 19 మంది తొలగించినట్లు తెలిసింది. తమ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పాలకమండలి సభ్యుల వద్ద ఇంజనీరింగ్ అధ్యాపకులు మంగళవారం ఎస్కేయూలో మొరపెట్టుకొన్నారు.
ఉద్యోగాల భర్తీకి రోస్టర్, వాటికి సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఇందుకు ఆరుగురు సభ్యుల కమిటీ సైతం ఆమోదం తెలిపినట్లు వారికి వివరించారు. ఇప్పటికే పని చేస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ , క్యాంపస్ కళాశాలల్లోని టీచింగ్ అసిస్టెంట్ల స్థానంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీకి కసరత్తు జరుగుతోంది. రోస్టర్ పాయింట్లుతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ఆమోదం పొందనున్నారు. వీటిని వచ్చే పాలక మండలి సమావేశంలో ఆమోదం తెలిపి నోటిఫికేషన్ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
టీచింగ్ అసిస్టెంట్లకు తక్కువ జీతం ఇస్తున్నారనే అంశంపై న్యాక్ కమిటీ ప్రధానంగా అభ్యంతరం తెలిపింది. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎస్కేయూ యాజమాన్యం తాజాగా భర్తీ చేసే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు రూ.21 వేలు వేతనంతో పాటు ,డీఏ (డియర్నెస్ అలవెన్స్ )ను ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం రూ.40 వేలు జీతం తక్కువ కాకుండా అందివ్వాలనే నిర్ణయాన్ని పాలకమండలి ఎజెండాలో చేర్చనున్నారు.
ఇంజనీరింగ్, ఫార్మసీ ఉద్యోగుల తొలగింపు
Published Wed, May 18 2016 9:19 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
Advertisement
Advertisement