Engineering and pharmacy
-
తెలంగాణ ఈఏపీసెట్‌లో ఏపీ ప్రభంజనం
సాక్షి, హైదరాబాద్/కొమరాడ/పాలకొండ/బలిజిపేట/గుంటూరు ఎడ్యుకేషన్/కర్నూలు సిటీ: తెలంగాణలో బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఈఏపీసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ము లేపారు. ఇంజనీరింగ్, అగ్రి–ఫార్మా.. రెండు విభాగాల్లోనూ మొదటి ర్యాంకులు సాధించి సత్తా చాటారు. ఇంజనీరింగ్ విభాగంలో పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రికల్చర్–ఫార్మసీ విభాగంలో అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులతో ప్రభంజనం సృష్టించారు. రెండు విభాగాల్లోనూ టాప్ టెన్‌లో ఐదుగురు చొప్పున ఏపీ విద్యార్థులు ర్యాంకులు దక్కించుకోవడం విశేషం. తెలంగాణ ఈఏపీసెట్ ఫలితాలను శనివారం ఆ రాష్ట్ర విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఆన్లైన్ ద్వారా సీట్ల భర్తీ! టీఎస్ ఈఏపీసెట్ ఈ నెల 7 నుంచి 11 వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది పరీక్ష రాయగా 1,80,424 మంది అర్హత సాధించారు. అలాగే అగ్రికల్చర్–ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. వీరిలో 82,163 మంది అర్హత సాధించారు. ఈ ఏడాది రెండు విభాగాలు కలిపి 3,32,251 మంది రాస్తే.. ఇందులో 2,62,587 (74.98 శాతం) మంది అర్హత సాధించారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు. ఈ ఏడాది ఆన్లైన్ ద్వారా సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామన్నారు. మంచి ర్యాంకు సాధించడమే లక్ష్యంగా.. మాది పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మానాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. –నగుడసారి రాధాకృష్ణ, టీఎస్ ఈఏపీసెట్ సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా విభాగం) ఐఐటీ బాంబేలో చదవడమే నా లక్ష్యం.. మా స్వస్థలం కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నేను 10వ తరగతిలో 9.2 జీపీఏ సాధించాను. ఇంటర్లో 951 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – గొల్లలేఖ హర్ష, టీఎస్ ఈఏపీసెట్ సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఏఎస్ అధికారినవుతా.. మాది కర్నూలు జిల్లా ఆదోని. నాన్న రామసుబ్బారెడ్డి, అమ్మ రాజేశ్వరి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. 8వ తరగతి నుంచి హైదరాబాద్‌లో చదువుతున్నా. నాకు ఇంటర్లో 987 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో 252వ ర్యాంకు వచి్చంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదువుతా. తర్వాత సివిల్స్ రాసి ఐఏఎస్ అధికారినవుతా. – భోగాలపల్లి సందేశ్, టీఎస్ ఈఏపీసెట్ నాలుగో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా మాది కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. ఇంటర్లో నాకు 980 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో చదవాలనుకుంటున్నా. – మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి, టీఎస్ ఈఏపీసెట్ ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) ర్యాంకుల శ్రీ‘నిధి’ మాది పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మానాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో అఖిల భారత స్థాయిలో 261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. –ధనుకొండ శ్రీనిధి, టీఎస్ ఈఏపీసెట్ పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. మాది పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా, అమ్మ హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగాను. – సతివాడ జ్యోతిరాదిత్య, టీఎస్ ఈఏపీసెట్ ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) గుండె వైద్య నిపుణురాలినవుతా.. మాది అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్‌గా, అమ్మ కల్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగ్నిజెంట్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు పదో తరగతిలో 600కి 589, ఇంటర్ బైపీసీలో 1000కి 982 మార్కులు వచ్చాయి. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్‌గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష. –ఆలూరు ప్రణీత, టీఎస్ ఈఏపీసెట్ ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా విభాగం) -
ఇంజనీరింగ్‌లో 74 శాతం.. అగ్రి, ఫార్మాలో 89 శాతం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీఎస్ఈఏపీ సెట్–2024) ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంజనీరింగ్ విభాగంలో 78.98 శాతం, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 89.66 శాతం అర్హత సాధించారు. ర్యాంకుల్లో రెండు తెలుగు రాష్ట్రాలూ పోటీ పడ్డాయి. రెండు విభాగాల్లోనూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తొలి 10 ర్యాంకులు సమానంగా వచ్చాయి. ఇంజనీరింగ్ విభాగంలో ఏపీలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన సతివాడ జ్యోతిరాదిత్య, అగ్రి, ఫార్మసీ విభాగంలో ఏపీకే చెందిన అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన ఆలూరు ప్రణీత ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకొని టాప ర్లుగా నిలిచారు. ఈ మేరకు ఈఏపీ సెట్ ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నర్సింహారెడ్డి, సెట్ కనీ్వనర్ డీన్‌కుమార్, కో–కన్వీనర్ విజయకుమార్ రెడ్డి పాల్గొన్నారు. 74.98 శాతానికి తగ్గిన అర్హులు టీఎస్ఈఏపీ సెట్ ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు జరిగింది. ఇంజనీరింగ్ విభాగానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 2,54,750 మంది దరఖాస్తు చేశారు. వీరిలో 2,40,618 మంది సెట్‌కు హాజరయ్యారు. 1,80,424 మంది అర్హత సాధించారు. అగ్రి, ఫార్మా విభాగంలో రెండు రాష్ట్రాల నుంచి 1,00,432 మంది దరఖాస్తు చేస్తే 91,633 మంది పరీక్ష రాశారు. 82,163 మంది అర్హత సాధించారు. గత రెండేళ్ళతో పోలిస్తే సెట్ రాసిన వారి సంఖ్య పెరిగింది. కానీ అర్హత శాతం తగ్గింది. గత ఏడాది (2023) 3,01,789 మంది ఎంసెట్ పరీక్షకు హాజరయ్యారు. 2,48,814 (86.31%) మంది అర్హత సాధించారు. ఈ ఏడాది (2024) 3,32,251 మంది రాస్తే, ఇందులో 2,62,587 (74.98%) మంది అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు కనీస అర్హత మార్కులు లేకపోవడంతో రాసిన అందరూ అర్హులయ్యారు. ఆన్లైన్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ రాష్ట్ర ఈఏపీ సెట్ ఫలితాలను వారం రోజుల్లో ప్రకటించడం అభినందనీయమని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ నోటిఫికేషన్ వెలువడకుండా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసే కాలేజీలపై చర్య తీసుకుంటామన్నారు. ఈ ఏడాది ఆన్లైన్ విధానం ద్వారా ఈ సీట్లను భర్తీ చేసే ఆలోచన చేస్తున్నామని, త్వరలోనే ముఖ్యమంత్రితో చర్చిస్తామని చెప్పారు. అనుమతి లేకుండా విద్యార్థులను చేర్చుకున్న గురునానక్, శ్రీనిధి ప్రైవేటు యూనివర్సిటీలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం. నాన్న మోహనరావు సాంఘిక సంక్షేమ శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా, తల్లి హైమావతి ఆర్టీసీలో పనిచేస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తెలంగాణ ఈఏపీసెట్‌లో మొదటి ర్యాంకు సాధించగలిగా. –సతివాడ జ్యోతిరాదిత్య, ఫస్ట్ ర్యాంకర్ (ఇంజనీరింగ్)ఐఐటీ బాంబేలో చదవడమే లక్ష్యం.. మా స్వస్థలం ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల. నాన్న సూర్యకుమార్ యాదవ్ కమ్యూనికేషన్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో 311వ ర్యాంకు వచి్చంది. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సన్నద్ధమవుతున్నా. ఐఐటీ బాంబేలో ఇంజనీరింగ్ చేయడమే నా లక్ష్యం. – గొల్లలేఖ హర్ష, సెకండ్ ర్యాంకర్ (ఇంజనీరింగ్) బాంబే ఐఐటీలో సీఎస్ఈ లక్ష్యంప్రతిరోజు 10 గంటల పాటు చదివేవాడిని. తండ్రి బి.రామసుబ్బారెడ్డి, తల్లి వి.రాజేశ్వరి ఇద్దరు ప్రభుత్వ టీచర్లు. మాది ఏపీలోని కర్నూలు జిల్లా ఆదోని. ఇంజనీరింగ్‌లో 4వ ర్యాంకు వచ్చినందుకు సంతోషంగా ఉంది. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయడమే నా లక్ష్యం. – సందేశ్, 4వ ర్యాంకు, ఇంజనీరింగ్, హైదరాబాద్ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదువుతా మాది ఏపీలోని కర్నూలు. నాన్న ఎం.రామేశ్వరరెడ్డి చిరు వ్యాపారి. అమ్మ గృహిణి. జేఈఈ మెయిన్‌లో 36వ ర్యాంకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 6వ ర్యాంకు వచ్చాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంకు తెచ్చుకుని ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చదవాలనుకుంటున్నా. – మురసాని సాయి యశ్వంత్‌రెడ్డి, ఐదో ర్యాంకర్ (ఇంజనీరింగ్)నాన్నలాగే అవ్వాలని అనుకుంటున్నా.. రోజుకు 16 గంటలు చదువుతున్నా. రాబోయే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో సత్తా చాటి ఐఐటీ బాంబేలో సీటు సాధిస్తా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అవుతా. మెయిన్స్‌లో 5వ ర్యాంకు వచ్చింది. ఈఏపీ సెట్లో ర్యాంకు రావడంతో ఆనందంగా ఉంది. నా తండ్రి అనిల్‌కుమార్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. దీంతో నాన్నలాగే అవ్వాలని చిన్నప్పట్నుంచీ అనుకునేవాడిని. తల్లి మమత ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. – విదిత్, 7వ ర్యాంక్, ఇంజనీరింగ్ (మణికొండ) తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణంతండ్రి రాజేశ్వరరావు పబ్బ, తల్లి లావణ్య పబ్బ, అక్క మానస పబ్బల సహకారం, ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించా. బాంబే ఐఐటీలో సీటు సాధించి గొప్ప ఇంజనీర్‌ను కావడమే నా లక్ష్యం. – పబ్బ రోహన్ సాయి, 8వ ర్యాంకు, ఇంజనీరింగ్ (ఎల్లారెడ్డిగూడ) అమ్మా నాన్నల ఆశలు నెరవేరుస్తామంచి కళాశాలలో బీటెక్, ఆ తర్వాత ఎంటెక్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావడమే నా లక్ష్యం. ఇంటర్మీడియెట్‌లో అధ్యాపకుల బోధన, కోచింగ్‌తోనే ఉత్తమ ర్యాంకు సాధించా. ముఖ్యంగా మా చదువు కోసమే అమ్మా నాన్న ఊరు విడిచి హైదరాబాద్‌కు వచ్చారు. వారు పడుతున్న కష్టాలు రోజూ చూస్తున్నా. మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యి మా తల్లిదండ్రుల కష్టాలు తీరుస్తా. వారి ఆశలు నెరవేరుస్తా.–కొంతం మణితేజ, 9వ ర్యాంకు, ఇంజనీరింగ్, వరంగల్తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ర్యాంకులు మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దళాయిపేట. అమ్మా నాన్న సుశీల, శ్రీనివాసరావు ఇద్దరూ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. నాకు జేఈఈ మెయిన్‌లో261వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 35వ ర్యాంకు వచ్చాయి. తల్లిదండ్రుల ప్రోత్సాహమే ర్యాంకులకు కారణం. –ధనుకొండ శ్రీనిధి, పదో ర్యాంకర్ (ఇంజనీరింగ్ విభాగం) గుండె వైద్య నిపుణురాలినవుతా.. మాది ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లి. నాన్న శ్రీకర్ హోమియో మెడికల్ ప్రాక్టీషనర్‌గా, తల్లి కళ్యాణి ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నారు. అక్క సంవిధ కాగి్నజెంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేసి వైద్యురాలిని కావడమే నా లక్ష్యం. కార్డియాక్ సర్జన్‌గా స్థిరపడాలన్నదే నా ఆకాంక్ష. – ఆలూరు ప్రణీత, ఫస్ట్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) నా కష్టం ఫలించింది.. మాది ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం చిలకలపల్లి. అమ్మా నాన్న కృష్ణవేణి, నారాయణరావు వ్యవసాయం చేస్తున్నారు. మంచి ర్యాంకు సాధించాలనే పట్టుదలతో చదివా. నా కష్టం ఫలించింది. – నగుడసారి రాధాకృష్ణ, సెకండ్ ర్యాంకర్ (అగ్రికల్చర్–ఫార్మా) డాక్టర్ కావడమే లక్ష్యంమధ్య తరగతి కుటుంబం అయినప్పటికీ మా అమ్మానాన్న నా చదువు కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. డాక్టర్ కావాలన్న నా ఆకాంక్షను గుర్తించి హైదరాబాద్‌లోని కాలేజీలో చేర్పించారు. ఎలాంటి మానసిక ఒత్తిడికి గురికాకుండా చదువుపైనే దృష్టి పెట్టా. నీట్ పరీక్ష బాగా రాశా. – గడ్డం శ్రీవర్షిణి, 3వ ర్యాంకు, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ (హనుమకొండ)వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానా తల్లిదండ్రులు ఎండీ జమాలుద్దీన్, నుస్రత్ ఖాన్లు. వ్యవసాయ శాస్త్రవేత్తగా ఎదగడమే నా లక్ష్యం. ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు అండగా ఉంటూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తా. కరోనా కష్ట కాలంలో అన్ని రంగాలూ కుదేలైనా వ్యవసాయ రంగమే మన దేశాన్ని ఆదుకుంది.– అజాన్ సాద్, 6వ ర్యాంకు, అగ్రికల్చర్ ఫార్మసీ (నాచారం)వైద్య వృత్తి అంటే ఇష్టంనా తల్లిదండ్రులు జయశెట్టి సూర్యకాంత్, భాగ్యలక్ష్మి. నాకు వైద్య వృత్తిపై ఆసక్తి ఎక్కువ. సేవ చేయాలనే తపనతో నీట్ పరీక్ష రాశా. దాంతో పాటు ఈఏపీ సెట్ కూడా రాశా. ఈఏపీలో మంచి ర్యాంకు వచ్చింది. అదే విధంగా త్వరలో రానున్న నీట్ ఫలితాల్లో కూడా మంచి ర్యాంకు సాధిస్తానని ఆశిస్తున్నా. – ఆదిత్య జయశెట్టి, 9వ ర్యాంకు, అగ్రి ఫార్మసీ (కూకట్పల్లి) -
తొలి విడత కౌన్సెలింగ్‌కు 1.18 లక్షల సీట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 2022–23 విద్యా సంవత్సరానికి తొలి విడత ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌కు 203 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో 1,18,654 సీట్లను ప్రభుత్వం ఖరారు చేసింది. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు జీవో 130 విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల ఆధ్వర్యంలోని 20 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలు, 183 ప్రైవేటు అన్ ఎయిడెడ్ ఇంజనీరింగ్ కాలేజీలను ప్రభుత్వం తొలి విడత కౌన్సెలింగ్‌కి అనుమతించింది. యూనివర్సిటీల పరిధిలోని కాలేజీల్లో 5,875 సీట్లు ఉన్నాయి. వీటిలో 840 సెల్ఫ్ ఫైనాన్సు సీట్లు. ప్రైవేటు కాలేజీల్లో 1,12,779 సీట్లు ఉన్నాయి. తొలి విడత అనుమతించిన సీట్లలో అత్యధిక శాతం కంప్యూటర్ సైన్సు విభాగంలోనే ఉన్నాయి. తదుపరి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ఉన్నాయి. కొన్ని కాలేజీల్లో నిర్ణీత ప్రమాణాలు ఉన్నాయో లేదో యూనివర్సిటీలు తనిఖీ చేసి అఫిలియేషన్ మంజూరు చేయాల్సి ఉంది. యూనివర్సిటీలకు ఫీజులు బకాయి ఉండడంతో 37 కాలేజీలకు ప్రస్తుత కౌన్సెలింగ్‌కు అనుమతి లభించలేదు. వీటికి కూడా అనుమతులు వస్తే సీట్ల సంఖ్య పెరుగుతుంది. కొన్ని ప్రైవేటు వర్సిటీల్లోని ఇంజనీరింగ్ సీట్లలో 35 శాతం కోటాను కన్వీనర్ ద్వారా భర్తీ చేయనున్నారు. తొలివిడతలో ఎస్ఆర్ఎం, విట్–అమరావతి, సెంచురియన్ వర్సిటీలలోని సీట్లు మెరిట్ విద్యార్థులకు దక్కనున్నాయి. అలాగే మోహన్‌బాబు వర్సిటీ, అపోలో వర్సిటీల సీట్లపై త్వరలో ఉత్తర్వులు వస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నాయి. వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు త్వరలో శ్రీకారం ఈ ఏడాది ఈఏపీసెట్‌కు 1,94,752 మంది హాజరు కాగా, 1,73,572 మంది అర్హత సాధించారు. ఇటీవల ఇంటర్మీడియెట్ అర్హత మార్కులకు సంబంధించి ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇవ్వడంతో వీరి సంఖ్య మరికొంత పెరుగుతోంది. వాస్తవానికి తొలి విడత అడ్మిషన్ల ప్రక్రియ గత నెలలోనే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నెల 6న సీట్లు కేటాయించవలసి ఉంది. అయితే, ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి అవకాశం కల్పించేందుకు వెబ్ ఆప్షన్లను వాయిదా వేసి, ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్లు, ధ్రువపత్రాల పరిశీలన షెడ్యూల్‌ను ఈ నెల 5వ తేదీ వరకు పొడిగించారు. ప్రస్తుతం కాలేజీలు, సీట్లు ఖరారు కావడంతో వెబ్ ఆప్షన్ల ప్రక్రియ, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తరగతుల ప్రారంభానికి సంబంధించి సవరించిన తేదీలను అడ్మిషన్ల కమిటీ త్వరలో ప్రకటించనుంది. ప్రమాణాలు లేని కాలేజీలకు కోత రాష్ట్రంలోని మొత్తం 375 ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీలకు 2022–23 విద్యా సంవత్సరానికి ఏఐసీటీఈ అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 1,50,837 సీట్లు ఉన్నాయి. ఏఐసీటీఈ నిబంధనల మేరకు ఆ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, బోధన, సిబ్బంది ఉండడంతోపాటు నిర్ణీత ఫీజు లను పూర్తిగా చెల్లించారా.. లేదా.. అన్నది పరిశీలించిన తర్వాతే వాటికి యూనివర్సిటీలు అఫిలియేషన్ ఇస్తాయి. అఫిలియేషన్ ఉన్న కాలేజీలకు మాత్రమే ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతిస్తుంది. వీటిలో ఫీజులు చెల్లించకపోవడం, నిర్ణీత ప్రమాణాలు లేకపోవడంతో 203 కాలేజీలకు మాత్రమే తొలివిడత కౌన్సెలింగ్‌కు అవకాశం దక్కింది. మిగతా కాలేజీలకు కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. -
ఇంజనీరింగ్, ఫార్మసీల్లో.. ఏపీకి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ఉన్నత విద్యాసంస్థలు ఈ విద్యా సంవత్సరంలో కూడా ‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్’ (ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి. ఇంజనీరింగ్, ఫార్మసీ విభాగాల్లో గతంలో కన్నా ఈసారి ఎక్కువ సంస్థలు ర్యాంకుల సాధనలో ముందంజలో ఉన్నాయి. పది అంశాలను ప్రామాణికంగా తీసుకుని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు ఈ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులను ఏటా ప్రకటిస్తోంది. ఈ రెండు విభాగాల్లో ఏపీకి చెందిన సంస్థలు గతంలో కన్నా ఎక్కువగా ఎంపికయ్యాయి. చదవండి: సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: పాలిటెక్నిక్ అధ్యాపకులు మరోవైపు.. ఓవరాల్ విభాగంలో స్కోరు సాధించిన ఆంధ్రా యూనివర్సిటీ టాప్ 100లో చోటు సంపాదించింది. ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం) 47.97 స్కోరు పాయింట్లతో 71వ ర్యాంకు సాధించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం ఈ ఎన్ఐఆర్ఎఫ్–2022 ర్యాంకులను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఈ ర్యాంకుల కోసం 1,875 సంస్థలు పోటీపడ్డాయి. యూనివర్సిటీల విభాగంలో ఏపీలోని 5 సంస్థలకు ఈ ర్యాంకులు దక్కాయి. ఆంధ్రా యూనివర్సిటీ 50.52 స్కోరుతో 36వ ర్యాంకు, శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి)æ 45.07 స్కోరుతో 67వ ర్యాంకును సొంతం చేసుకున్నాయి. కాలేజీల విభాగంలో విజయవాడలోని ఆంధ్ర లయోలా కాలేజీ ఒక్కటే నిలిచి 94వ స్థానాన్ని దక్కించుకుంది. ‘ఇంజనీరింగ్’ విభాగంలో పెరిగిన ర్యాంకులు ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఈసారి రాష్ట్రానికి ఎక్కువ ర్యాంకులు దక్కాయి. గత ఏడాది ఏపీలోని ఆరు సంస్థలు చోటు సంపాదించుకోగా ఈసారి ఆ సంఖ్య పదికి పెరిగింది. ప్రభుత్వ సంస్థలైన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) తిరుపతి 48.16 స్కోరుతో 56వ ర్యాంకు, ఏయూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (విశాఖపట్నం) 42.76 స్కోరుతో 77వ ర్యాంకు, జేఎన్టీయూ కాకినాడ 37.79 స్కోరుతో 129వ ర్యాంకు సాధించాయి. మేనేజ్మెంటు విభాగంలో విశాఖపట్నంలోని జాతీయ విద్యాసంస్థ అయిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంటు సంస్థ 33వ ర్యాంకులో నిలిచింది. ఫార్మసీ విభాగంలో రాష్ట్రానికి తొమ్మిది ర్యాంకులు దక్కాయి. ప్రభుత్వ సంస్థలైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్సు (గుంటూరు)కు 51వ ర్యాంకు, తిరుపతిలోని శ్రీ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయానికి 66, శ్రీ వేంకటేశ్వర వర్సిటీకి 89వ ర్యాంకు లభించాయి. ఇక ఆర్కిటెక్చర్ విభాగంలో విజయవాడలోని జాతీయ విద్యాసంస్థ అయిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పా–ఎస్పీఏ) 7వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ ఐఐటీ అదుర్స్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో తెలంగాణలోని హైదరాబాద్ ఐఐటీ సహా రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు ర్యాంకులు సాధించాయి. అన్ని విభాగాలకు కలిపి (ఓవరాల్) ఇచ్చిన ర్యాంకుల్లో ఐఐటీ (హెచ్) 14వ ర్యాంకును (గతేడాది 16వ ర్యాంకు) సొంతం చేసుకుంది. ఈ సంస్థకు 62.86 జాతీయ స్కోర్ లభించింది. ఇంజనీరింగ్ కాలేజీల విభాగంలో ఐఐటీ (హెచ్) టాప్–10లో నిలిచి 9వ ర్యాంకు పొందింది. అలాగే పరిశోధన విభాగంలో 12వ ర్యాంకు సాధించింది. యూనివర్సిటీల వారీగా చూస్తే జాతీయ స్థాయిలో 10వ ర్యాంకు సాధించిన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్.. ఓవరాల్ విభాగంలో 20వ ర్యాంకును, రీసెర్చ్ విభాగంలో 27వ ర్యాంకును సాధించింది. మరోవైపు వర్సిటీల ర్యాంకుల్లో ఉస్మానియా యూనివర్సిటీ 22వ ర్యాంకు పొందింది. -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2022 పరీక్షలను ఈ నెల 4 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు. శనివారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జేఈఈ వంటి జాతీయ పరీక్షలకు అమలు చేస్తున్న మాదిరిగానే ఒక్క నిమిషం నిబంధనను ఈఏపీసెట్‌కు కూడా అమలు చేస్తున్నామన్నారు. అభ్యర్థులు వారికి కేటాయించిన పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయానికి గంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ప్రతి అభ్యర్థి హాల్‌టికెట్‌తో పాటు ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాలను తీసుకు రావాలని సూచించారు. బాల్‌పాయింట్ పెన్నులు, రఫ్ వర్క్ చేసుకోవడానికి అవసరమైన కాగితాలను పరీక్ష కేంద్రాల్లోనే ఇస్తారన్నారు. పరీక్షల సమయాల్లో విద్యార్థులకు అనువుగా ఉండేలా బస్సులు నడపాలని ఇప్పటికే ఆర్టీసీ అధికారులను కోరామన్నారు. 3 లక్షలకు పైగా అభ్యర్థుల దరఖాస్తు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏపీ ఈఏపీసెట్‌కు 3,00,084 మంది దరఖాస్తు చేశారని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు తెలిపారు. ఏపీలో 120, తెలంగాణలో 2 కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈసారి ఈఏపీసెట్‌లో ఇంటర్మీడియెట్ మార్కులకు వెయిటేజీ ఉండదని, సెట్లో వచ్చిన మార్కుల ఆధారంగానే అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటిస్తామని చెప్పారు. పరీక్షలు ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతాయన్నారు. సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహనరావు, కార్యదర్శి ప్రొఫెసర్ బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, సెట్స్ ప్రత్యేకాధికారి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ ► ఈఏపీసెట్‌లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకు రోజుకు రెండు చొప్పున 10 సెషన్లలో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ► 11, 12 తేదీల్లో 4 సెషన్లలో బైపీసీ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ► అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లోని పేరు, పుట్టిన తేదీ, జెండర్, కేటగిరీ, స్ట్రీమ్ వంటి వివరాలు సరిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. తప్పు ఉంటే ఈఏపీసెట్ హెల్ప్‌లైన్ కేంద్రానికి తెలియజేసి సరిచేయించుకోవాలి. ► హాల్ టికెట్ లేకుండా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు ► ఒకరోజు ముందే పరీక్ష కేంద్రాన్ని చూసుకోవాలి. పరీక్ష కేంద్రానికి చేరుకునేందుకు వీలుగా మ్యాప్‌ల ద్వారా మార్గాన్ని చూపించే సదుపాయం కల్పించారు. ► విద్యార్థులను ఉదయం 7.30 నుంచి 9 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 3 గంటల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ► చెక్ఇన్ ప్రొసీజర్‌లో భాగంగా బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కేప్చర్ చేస్తారు. ఎడమ వేలి ముద్ర ద్వారా వీటిని నమోదు చేయనున్నందున అభ్యర్థులు మెహిందీ వంటివి పెట్టుకోకూడదు. ► బాల్‌పెన్నుతో అప్లికేషన్ ఫారాన్ని నింపి దానికి ఫొటోను అతికించి ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి అందించాలి. అలా అప్లికేషన్‌ను సమర్పించని వారి ఫలితాలను ప్రకటించరు. ► పరీక్ష సమయంలో సాంకేతిక సమస్య ఏర్పడి వెంటనే పరిష్కారం కాకపోతే ఎంత సమయం ఆలస్యమైందో ఆమేరకు అదనపు సమయాన్ని ఇస్తారు. ► హాల్ టికెట్లను కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యే వరకు భద్రపర్చుకోవాలి. ► ఇతర వివరాలకు ‘హెచ్‌టీటీపీఎస్://సీఈటీఎస్.ఏపీఎస్సీహెచ్ఈ.జీఓవీ.ఐఎన్/ఈఏపీ సీఈటీ’ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు ► సందేహాలుంటే ‘ఏపీఈఏపీసీఈటీ2022హెచ్‌ఈఎల్‌పీడీఈఎస్‌కెఃజీమెయిల్.కామ్‌కు తెలియజేయవచ్చు. లేదా 08554–234311 లేదా 08554–232248 నంబర్లలో సంప్రదించవచ్చు. -
ఈఏపీసెట్‌లో 80,935 సీట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్–2021లో 80,935 మంది విద్యార్థులకు తొలివిడత సీట్లు కేటాయించారు. అడ్మిషన్ల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ ప్రత్యేక కమిషనర్ పోలా భాస్కర్ ఈ వివరాలు విడుదల చేశారు. మొత్తం 437 కాలేజీల్లో కన్వీనర్ కోటాకు 1,11,304 సీట్లు ఉండగా 80,935 మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 30,369 సీట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ కేటగిరీలో 488, ఎన్సీసీలో 976 మందికి సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్), ఎన్సీసీ డైరెక్టరేట్ల నుంచి ఇంకా అందనందున కేటాయించలేదని తెలిపారు. ఆప్షన్లు ఇచ్చింది 89,898 మంది ఏపీ ఈఏపీసెట్–2021కు మొత్తం 2,59,564 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,75,796 మంది ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు, 83,051 మంది అగ్రికల్చర్, ఫార్మా స్ట్రీమ్‌కు దరఖాస్తు చేశారు. అర్హత సాధించిన 1,34,205 మందిలో 90,606 మంది తొలివిడత అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నవారిలో 90,506 మంది ఆప్షన్ల నమోదుకు అర్హులుకాగా 89,898 మంది ఆప్షన్లను నమోదు చేశారు. వీరిలో 80,935 మందికి తొలివిడతలో సీట్లు కేటాయించారు. సీట్లు కేటాయించని కాలేజీ లేదు 254 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,06,236 సీట్లకుగాను 80,520 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 25,716 సీట్లున్నాయి. 121 బీఫార్మసీ కాలేజీల్లో 4,386 సీట్లుండగా 352 భర్తీ అయ్యాయి. ఇంకా 4,034 సీట్లున్నాయి. 62 ఫార్మా–డీ కాలేజీల్లో 682 సీట్లుండగా 63 భర్తీ అయ్యాయి. ఇంకా 619 సీట్లున్నాయి. తొలివిడతలోనే 37 కాలేజీల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఉన్నత ప్రమాణాల దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈసారి జీరో కేటాయింపు కాలేజీ ఒక్కటీ లేకపోవడం విశేషం. గతంలో ఒక్కసీటు కూడా భర్తీకానివి 10 వరకు ఉండేవి. ప్రమాణాలు లేని కాలేజీలను ప్రభుత్వం కౌన్సెలింగ్‌కు అనుమతించలేదు. తొలిసారి ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటా తొలిసారిగా ప్రైవేటు వర్సిటీలు వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ – అమరావతి, ఎస్ఆర్ఎం, బెస్ట్ యూనివర్సిటీ, సెంచూరియన్ యూనివర్సిటీల్లోని ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద 2,012 సీట్లను పేద మెరిట్ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రాతిపదికన కేటాయించారు. వీరికి ఇతర విద్యార్థులకు మాదిరిగానే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ లబ్ధి చేకూరనుంది. -
60,941 ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో కన్వీనర్ కోటా కింద మొదటి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. తొలి దశలో 61,169 సీట్లు ఎంసెట్ అర్హులకు కేటాయించినట్టు సాంకేతిక విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని స్పష్టం చేశారు. ఆయా కాలేజీల ఫీజుల వివరాలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల కోసం మొత్తం 71,216 మంది సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. 69,793 మంది వెబ్ ఆప్షన్స్ నమోదు చేశారు. అయితే ఇంజనీరింగ్ విభాగంలో 15 ప్రభుత్వ, రెండు ప్రైవేటు యూనివర్సిటీ కళాశాలలు, 158 ప్రైవేటు కాలేజీలతో కలిపి మొత్తం 175 ఇంజనీరింగ్ కాలేజీల్లో 74,071 సీట్లున్నాయి. మొదటి దశ కౌన్సెలింగ్ ద్వారా 60,941 సీట్లు (82.27 శాతం) భర్తీ చేశారు. ఫార్మసీలో 115 కాలేజీల్లో 4,199 సీట్లు అందుబాటులో ఉంటే 228 సీట్లను భర్తీ చేశారు. ఈడబ్ల్యూస్ కోటా కింద తొలిదశలో 5,108 సీట్లు (ఇంజనీరింగ్, ఫార్మా) కేటాయించారు. -
ఇంజనీరింగ్, ఫార్మసీ ఉద్యోగుల తొలగింపు
అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో 81 మంది , ఫార్మసీ అధ్యాపకులను 19 మంది తొలగించినట్లు తెలిసింది. తమ ఉద్యోగాలు తొలగిస్తున్నట్లు తమకు సమాచారం అందిందని పాలకమండలి సభ్యుల వద్ద ఇంజనీరింగ్ అధ్యాపకులు మంగళవారం ఎస్కేయూలో మొరపెట్టుకొన్నారు. ఉద్యోగాల భర్తీకి రోస్టర్, వాటికి సాంఘిక సంక్షేమ శాఖ అనుమతి, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహించారు. ఇందుకు ఆరుగురు సభ్యుల కమిటీ సైతం ఆమోదం తెలిపినట్లు వారికి వివరించారు. ఇప్పటికే పని చేస్తున్న ఇంజనీరింగ్, ఫార్మసీ , క్యాంపస్ కళాశాలల్లోని టీచింగ్ అసిస్టెంట్ల స్థానంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీకి కసరత్తు జరుగుతోంది. రోస్టర్ పాయింట్లుతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ ఆమోదం పొందనున్నారు. వీటిని వచ్చే పాలక మండలి సమావేశంలో ఆమోదం తెలిపి నోటిఫికేషన్ ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. టీచింగ్ అసిస్టెంట్లకు తక్కువ జీతం ఇస్తున్నారనే అంశంపై న్యాక్ కమిటీ ప్రధానంగా అభ్యంతరం తెలిపింది. వీటిని పరిగణలోకి తీసుకున్న ఎస్కేయూ యాజమాన్యం తాజాగా భర్తీ చేసే కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు రూ.21 వేలు వేతనంతో పాటు ,డీఏ (డియర్నెస్ అలవెన్స్ )ను ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. మొత్తం రూ.40 వేలు జీతం తక్కువ కాకుండా అందివ్వాలనే నిర్ణయాన్ని పాలకమండలి ఎజెండాలో చేర్చనున్నారు.