- రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
- దశలవారీగా పోలీసులకు శిక్షణ
- చిత్తూరు ఎస్పీ శ్రీనివాస్
చిత్తూరు(అర్బన్): జిల్లాలోని ప్రతి మునిసిపాలిటీ, మేజర్ పట్టణాల్లో ట్రాఫిక్ పోలీసు స్టే షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు చిత్తూరు పో లీసు జిల్లా ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ చెప్పారు. ఇందుకోసం పోలీసులకు దశలవారీగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపా రు. తొలిదశగా చిత్తూరు నగరంలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో 96 మం ది పోలీసులు, హోమ్‌గార్డులకు ట్రాఫిక్ వ్యవస్థపై శిక్షణ నిర్వహించారు. ఈ కా ర్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు.
రోడ్డు ప్రమాదాలను నివారించడంలో భా గంగా నగరి, పుత్తూరు, పీలేరు, పలమనేరు, కుప్పం, పాకాల, పుంగనూరు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసు స్టేషన్లు ఏ ర్పాటు చేయనున్నట్లు ఎస్పీ విలేకరులకు చెప్పారు. ట్రాఫిక్ నియంత్రణ కో సం ప్రతి స్టేషన్‌కు నలుగురు కానిస్టేబు ళ్లు, నలుగురు హోమ్‌గార్డులు, ఇద్దరు ఏఎస్‌ఐలను నియమించనున్నట్లు తెలి పారు. చిత్తూరు, మదనపల్లెలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందన్నారు. కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఇతర శా ఖల సమన్వయంతో రోడ్ల ఆక్రమణలు తొలగిస్తామన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్, ఐలాండ్స్‌ను పునరుద్ధరించనున్నామన్నారు. ఐదు రోజుల పాటు జరిగే ఈ శి క్షణ కార్యక్రమంలో పోలీసులకు ట్రా ఫిక్ నియంత్రణపై మెళకవలు నేర్పుతారన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు అదనపు ఎస్పీ అన్నపూర్ణారెడ్డి, ఏఆర్ అదనపు ఎస్పీ శేఖర్, డీఎస్పీలు రామకృష్ణ, రామసుబ్బయ్య, సీఐలు గిరిధ ర్, రాజశేఖర్, రమేష్‌కుమార్, శ్రీకాం త్, విజయశేఖర్, పలువురు ఎస్‌ఐలు పాల్గొన్నారు.