మరియాపురంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరిన యువకులతో కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా
సాక్షి, కడప కార్పొరేషన్: కడప నగరం 40వ డివిజన్‌లోని మరియాపురంలో 50 కుటుంబాల వారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం వైఎస్‌ఆర్‌సీపీ డివిజన్ ఇన్‌చార్జి బాలస్వామి రెడ్డి, అల్ఫోన్స్, నాగరాజు, జయపాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజద్‌బాషా సమక్షంలో వారు వైఎస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారిని పేరు పేరునా పరిచయం చేసుకొని కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, అందుకే అందరూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైనున్న విశ్వాసంతో వైఎస్‌ఆర్‌సీపీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి వైఎస్‌ఆర్‌సీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఎస్. ప్రశాంత్, ఎస్. బాలస్వామి, వై. గోపాల్, ఎన్. వినీత్, ఎం. వంశీ, పి. అశ్వనీ, లక్ష్మి, అమర్, శ్రావణ్ ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే ఎంవీఆర్ సమక్షంలో 80 మంది యువకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
ప్రొద్దుటూరు : ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తప్పక ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని ఖాదర్‌బాద్‌లో ఉన్న ఆయన స్వగృహంలో మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు, కడప పట్టణాలకు చెందిన 80 మంది యువకులను వైఎస్సార్‌సీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమంలో యువత తన వెంట నడిచిందన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారన్నారు.
రాష్ట్రంలో ప్రజలంతా వెల్లువలా జగన్‌వైపు పరుగులు తీస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి యువత ఎక్కువగా జగన్‌ను ఇష్టపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వెంట ప్రచారంలో తిరగడానికి తన ఆరోగ్యం సహకరించలేదన్నారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాత్రం వచ్చే ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నానన్నారు. పార్టీలో చేరిన వారిలో అమరనాథరెడ్డి, అహ్మద్‌బాషా, ముజాహిర్, మహబూబ్‌బాషా, సమీవుల్లా, విశ్వనాథ్, సుధీర్, తాహిర్, గిరి, హేమంత్ తదితరులు ఉన్నారు.
జమ్మలమడుగులో...
జమ్మలమడుగు రూరల్: పట్టణంలోని కన్నెలూరులో 30 కుటుంబాలు వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మంగళవారం వైఎస్‌ఆర్‌సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు రామమోహన్, చంద్రమౌళి, సత్యం, శివగంగయ్య, సాగర్, సుబ్బరామయ్య, ఫకృమోద్దీన్, ఎం.సుబ్బరాయుడు, ఎన్.శేఖర్, శ్రీరాములు, గిద్దలూరుశేఖర్, మురళీ, సుధాకర్, రామన్నలతోపాటు 16 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి సమన్వయకర్త పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈంసదర్భంగా వారు మాట్లాడుతూ తాము మంత్రివర్గంలో ఉన్నామని అయితే తమకు ఎలాంటి గుర్తింపులేకపోవడంతో తాము పార్టీమారినట్లు పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి తమ సత్తాచాటుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో కన్నెలూరు నాయకులు వేణుగోపాల్ యాదవ్, గురుమూర్తి, రమేష్, పుల్లారెడ్డి, వెంకటస్వామి, శివశంకర్‌రెడ్డి కిరణ్, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, గౌస్‌లాజం పోచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలసపాడులో...
మండలంలోని ఎగువరామాపురం గ్రామానికి చెందిన 15 ముస్లీం మైనార్టీ కుటుంబాలు మంగళవారం తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. స్థానిక నాయకులు పోడెద్దుల బాలఅంకిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్యలు వీరికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఆర్మీరహీమ్, జలీల్‌బాష, రషీద్‌బాష, అబ్దుల్‌ఖాదర్, మూలపల్లెపెద్దమాబు, మూలపల్లెఖాజా, మూలపల్లె మహబుబ్‌వలి, అబ్దుల్‌గఫూర్, ఉయ్యాలవాడ నుండి ఖాదర్‌వలి, ఉయ్యాలవాడ ముస్తఫా, శ్రీను, ఎనుముల శ్రీనివాసులరెడ్డి, అంకయ్య, పెద్దమస్తాన్, వెంకటయ్య తదితర కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరాయి.
తంబళ్లపల్లెలో...
తంబళ్లపల్లె గ్రామానికి చెందిన మాజీ ఆయకట్టు ప్రెసిడెంట్ గంగసానివెంకటరెడ్డి, ఎంపీటీసీ బికారి మంగళవారం ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుదర్శన్, మండల వైఎస్సార్‌సీపీ నాయకులు సూద రామకృష్ణారెడ్డి, సింగమాల వెంకటేశ్వర్లు, దాదాన రాంభూపాల్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, కొండా దామోదర్ రెడ్డి, లక్ష్మికాంత్ రెడ్డి, తంబళ్లపల్లె నారాయణ రెడ్డి, అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి, బాల అంకిరెడ్డి, మస్తాన్‌వలి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment