MV Ramanaa Reddy
-
మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి మృతికి సీఎం జగన్ సంతాపం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎం.వీ. రమణారెడ్డి ఆకస్మిక మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. రమణారెడ్డి కుటుంబ సభ్యులకు సీఎం జగన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమణారెడ్డి బుధవారం కర్నూలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు రాజకీయ నేతలు తమ సంతాపాన్ని తెలియజేశారు. చదవండి: Proddatur: మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి కన్నుమూత -
వైఎస్ జగన్‌తోనే సంక్షేమ పాలన
సాక్షి, కడప కార్పొరేషన్: కడప నగరం 40వ డివిజన్లోని మరియాపురంలో 50 కుటుంబాల వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్చార్జి బాలస్వామి రెడ్డి, అల్ఫోన్స్, నాగరాజు, జయపాల్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజద్‌బాషా సమక్షంలో వారు వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారిని పేరు పేరునా పరిచయం చేసుకొని కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని, అందుకే అందరూ వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనున్న విశ్వాసంతో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ ప్రకటించిన సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో చేరిన వారిలో ఎస్. ప్రశాంత్, ఎస్. బాలస్వామి, వై. గోపాల్, ఎన్. వినీత్, ఎం. వంశీ, పి. అశ్వనీ, లక్ష్మి, అమర్, శ్రావణ్ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే ఎంవీఆర్ సమక్షంలో 80 మంది యువకులు వైఎస్సార్సీపీలో చేరిక ప్రొద్దుటూరు : ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్పక ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎమ్మెల్యే ఎంవీ రమణారెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు మండలంలోని ఖాదర్‌బాద్‌లో ఉన్న ఆయన స్వగృహంలో మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు, కడప పట్టణాలకు చెందిన 80 మంది యువకులను వైఎస్సార్సీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ ఉద్యమంలో యువత తన వెంట నడిచిందన్నారు. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారన్నారు. రాష్ట్రంలో ప్రజలంతా వెల్లువలా జగన్‌వైపు పరుగులు తీస్తున్నారని పేర్కొన్నారు. ప్రత్యేకించి యువత ఎక్కువగా జగన్‌ను ఇష్టపడుతున్నారన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి వెంట ప్రచారంలో తిరగడానికి తన ఆరోగ్యం సహకరించలేదన్నారు. కొత్తపల్లి గ్రామ పంచాయతీలో మాత్రం వచ్చే ఆదివారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నానన్నారు. పార్టీలో చేరిన వారిలో అమరనాథరెడ్డి, అహ్మద్‌బాషా, ముజాహిర్, మహబూబ్‌బాషా, సమీవుల్లా, విశ్వనాథ్, సుధీర్, తాహిర్, గిరి, హేమంత్ తదితరులు ఉన్నారు. జమ్మలమడుగులో... జమ్మలమడుగు రూరల్: పట్టణంలోని కన్నెలూరులో 30 కుటుంబాలు వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నాయి. మంగళవారం వైఎస్ఆర్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో గిద్దలూరు రామమోహన్, చంద్రమౌళి, సత్యం, శివగంగయ్య, సాగర్, సుబ్బరామయ్య, ఫకృమోద్దీన్, ఎం.సుబ్బరాయుడు, ఎన్.శేఖర్, శ్రీరాములు, గిద్దలూరుశేఖర్, మురళీ, సుధాకర్, రామన్నలతోపాటు 16 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. ఈ సందర్భంగా వారికి సమన్వయకర్త పార్టీ కండువాలు వేసి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈంసదర్భంగా వారు మాట్లాడుతూ తాము మంత్రివర్గంలో ఉన్నామని అయితే తమకు ఎలాంటి గుర్తింపులేకపోవడంతో తాము పార్టీమారినట్లు పేర్కొన్నారు.రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని గెలిపించి తమ సత్తాచాటుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో కన్నెలూరు నాయకులు వేణుగోపాల్ యాదవ్, గురుమూర్తి, రమేష్, పుల్లారెడ్డి, వెంకటస్వామి, శివశంకర్‌రెడ్డి కిరణ్, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, గౌస్‌లాజం పోచిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కలసపాడులో... మండలంలోని ఎగువరామాపురం గ్రామానికి చెందిన 15 ముస్లీం మైనార్టీ కుటుంబాలు మంగళవారం తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. స్థానిక నాయకులు పోడెద్దుల బాలఅంకిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్యలు వీరికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఆర్మీరహీమ్, జలీల్బాష, రషీద్బాష, అబ్దుల్‌ఖాదర్, మూలపల్లెపెద్దమాబు, మూలపల్లెఖాజా, మూలపల్లె మహబుబ్వలి, అబ్దుల్‌గఫూర్, ఉయ్యాలవాడ నుండి ఖాదర్‌వలి, ఉయ్యాలవాడ ముస్తఫా, శ్రీను, ఎనుముల శ్రీనివాసులరెడ్డి, అంకయ్య, పెద్దమస్తాన్, వెంకటయ్య తదితర కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరాయి. తంబళ్లపల్లెలో... తంబళ్లపల్లె గ్రామానికి చెందిన మాజీ ఆయకట్టు ప్రెసిడెంట్ గంగసానివెంకటరెడ్డి, ఎంపీటీసీ బికారి మంగళవారం ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో టీడీపీ నుండి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీలో చేరారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సుదర్శన్, మండల వైఎస్సార్సీపీ నాయకులు సూద రామకృష్ణారెడ్డి, సింగమాల వెంకటేశ్వర్లు, దాదాన రాంభూపాల్‌రెడ్డి, పురుషోత్తంరెడ్డి, కొండా దామోదర్ రెడ్డి, లక్ష్మికాంత్ రెడ్డి, తంబళ్లపల్లె నారాయణ రెడ్డి, అట్లూరు మాజీ ఎంపీపీ బాలమునిరెడ్డి, బాల అంకిరెడ్డి, మస్తాన్‌వలి పాల్గొన్నారు. -
అయ్యో నా తెలుగు తల్లీ...!
అందరమూ తెలుగువా ళ్లమే; చదువుకున్న ప్రతి ఇంటికీ ఒక ఇంగ్లిష్ నిఘం టువు ఉండేవుంటుంది; తెలుగు నిఘంటువు మా త్రం కనిపించదు. ‘‘మన పిల్లలకు అవసరమైంది ఇంగ్లిషే కదా; మనమేమో అమెరికాకు గుమాస్తాలను ఉత్పత్తి చేసే యంత్రాలమై ఉంటిమి! పేరుకు తెలు గోళ్లం గానీ, తెలుగు చదువుతో పూట గడుస్తుం దా?’’ అనేది కల్తీలేని అంతరంగం. మంచి తెలుగు పుస్తకాన్ని మార్కెట్లో అమ్ముకో వాలంటే, వెయ్యికాపీలు వదిలించుకునేందుకు ఏడా దిపాటు ఎదురుచూడాలి. తెలుగు జాతి జనాభాది ఎనిమిది కోట్ల పైచిలుకు. అందులో చదువుకున్న వారి మోతాదు అరవైశాతం కంటే ఎక్కువే. పేరొ చ్చిన ఒకే ఒక రచనతో జీవితమంతా చీకూచింతా లేకుండా గడిచిపోయేది ఇంగ్లిష్ రచయితల జాత కం. మనబోటివాళ్లం కూడా ఖరీదును ఖాతరు చెయ్యకుండా కొనేవి ఇంగ్లిష్ పుస్తకాలేనాయె. తన రచన అందరూ చదవాలని కోరుకోవడమే తప్ప, కొట్టుకు వెళ్లి ఇతరుల పుస్తకం కొనే తెలుగు రచయితలే అరుదు. తెలుగును ఉద్ధరించాలనే నాటకానికి బహు విశాలమైన రంగస్థలం ‘ప్రపంచ తెలుగు మహాసభలు’. ఆ జాతరలో వేది కను ఆక్రమించే పెద్దలను ఎన్నుకొనే ప్రాతి పదిక ఏమిటో నాలాటి వారికి బోధపడదు. వాళ్లందరూ తెలుగువాళ్లే కావచ్చు. కానీ వాళ్లకూ, తెలుగు విజ్ఞానానికీ వీసమెత్తు సాంగత్యం కనిపించదు. భాష అనేది మతా తీత వ్యవహారమనే ఇంగితమైనా లేకుండా వైదిక ప్రార్థనతో కార్యక్రమం మొదలవుతుంది. ఆహ్వానితులందరి చేతుల్లో తెలుగులో అచ్చే సిన బ్రోచర్లు కనిపిస్తాయి. ఇవన్నీ నిర్వాహకులు ఉచి తంగా పంచే కాగితాలు. ఆవరణలో తెలుగు పుస్త కాల ఎగ్జిబిషన్లు ఏర్పాటయ్యే ఉంటాయి. ఐనా, వం ద రూపాయలు చేసే తెలుగు రచన ఏ చేతా కనిపిం చదు. హాజరయ్యే సభికులంతా దొరలూ, దొర సానులకు మల్లే ఖరీదైన కార్లలో దిగేవాళ్లే. వేల ఖరీదు చేసే కాలిజోళ్లతో నాలుగడుగులు హుందాగా నడిచేవాళ్లే. వేమనదో, సుమ తిదో ఒక పద్యం బట్టీ పట్టించిన చంటో ళ్లను వెంటదీసుకొచ్చే కుటుంబాలు కూడా కొన్నుంటాయి. ఆ పిల్లో, పిల్లోడో మైకు ముందు నిలబడి, వచ్చీరాని తెలుగులో కంఠస్థం చేసిన పద్యాన్ని వేదికమీద చీదేసి, చప్పట్ల మధ్యన కిందికి దిగి. సిగ్గుపడుతూ తల్లిదగ్గరికి పరుగులు తీస్తారు. తల్లితో ఆత్రంగా ‘హౌ డు యు ఫీలిట్ మామ్?’ అంటూ కాన్వెంట్ భాషలో అడుగుతారు. ‘సో నైస్’ అంటూ బుగ్గమీద చిటికేస్తుంది తల్లి. ‘హౌ డిడ్ డ్యాడీ ఫీల్?’ అనేది పిల్లల రెండో ప్రశ్న. ‘వెరి మచ్ ఇంప్రెస్డ్’ అనేది తల్లి జవాబు. ఆత్మీయ సంబంధా లను ‘అమ్మా’, ‘నాన్నా’ అనే పలుకులతో పిలిపిం చుకునేందుకు సిగ్గుపడే సభాసదులతో సాగే సంబ రాలకు తెలుగు తల్లి విస్తుపోతుంది. తన ముఖ మెట్లుంటుందో కడుపున పుట్టిన బిడ్డలకే తెలియని గొడ్రాలి రాత ఈ తల్లిది. ఉమ్మడి మదరాసు రాష్ట్రం నుంచి విడిపోవా లన్న కోరిక ఉదయించిన రోజుల్లో మన పెద్దలు నూరిపోసిన ఉగ్గు ‘తమిళ ద్వేషం.’ ఆ అవసరం గతించి అరవయ్యేళ్లు దాటిపోయినా కైపు మాత్రం మనకు దిగిపోలేదు. అందుకే తమిళనాడులో మాతృ భాషను కాపాడుకునేందుకు జరుగుతున్న కృషి మన కు ఎండమావి. బడి కావచ్చు. గుడి కావచ్చు. వాడ వలసిన భాష మాత్రం తమిళమొక్కటే ఉండాలన్నది ఆ జాతి పట్టుదల. మతమేదైనా ప్రార్థన తమిళం లోనే జరుగుతుందనేది మనం నమ్మలేని యథార్థం. పాఠశాలల్లో తమిళం తరువాతిదే ఇతర భాషల స్థాయి. పాలనకోసం జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలకు విధిగా నియమితమైన భాష తమిళం. జిల్లా కలెక్టరు స్థాయి ఆఫీసరైనా, ఇంట్లో తప్ప ఇతరత్రా మాట్లాడ వలసింది తమిళమే. ‘ఇంత నామోషీగా ఉంటారనే కదా అరవలను మనం అసహ్యించుకునేది’ అను కునే తృప్తి తెలుగు జాతి సౌభాగ్యం. పట్టుదలను రుద్రమదేవికీ, పౌరుషాన్ని బాలచంద్రునికీ, పాండి త్యాన్ని విజయనగరానికీ అప్పగించి, మనం నిశ్చిం తగా బతుకుతున్నాం. ఎం.వి. రమణారెడ్డి (వ్యాసకర్త మాజీ శాసనసభ్యులు) మొబైల్: 94402 80655 -
టూకీగా ప్రపంచ చరిత్ర 106
వేకువ ఇంద్రుడు అనేక పురాలను కూల్చినట్టు రుగ్వేదం చెబుతున్నా, అవి సింధూ ప్రాంత పట్టణాలుగా ఆనవాళ్లు దొరకలేదు. ఇంద్రుడు ఏకాకిగా పోరాడటం తప్ప, సమూహంగా ఆర్యులు దండయాత్ర చేసిన సందర్భం వేదాల్లో ఒక్కటైనా కనిపించదు. దండయాత్ర చేసిగానీ, చెయ్యకగానీ - సనాతన ప్రపంచంలో ఆర్యులు ప్రవేశించిన ప్రతి ప్రదేశంలోనూ అనివార్యంగా మనకు కనిపించేది ఆర్యభాష అధికారం. బహుశా శబ్దాల సంఖ్య బహుళంగా ఉన్న సౌకర్యం కారణంగా ఈ ఆధిపత్యం సాధ్యమై ఉండొచ్చు. అంతమాత్రాన ఇతర భాషలకు చెందిన పదాలను, శబ్దాలను ఆర్యులు గ్రహించలేదని కాదు. ఆర్యభాషా కుటుంబానివిగా గుర్తించిన ఏవొక్క యూరోపియన్ భాషలోను ‘ణ’, ‘ళ’ శబ్దాలు కనిపించవు. ఒక్క భారతీయ భాషల్లోనే ఆ ఉచ్ఛారణ ఉంది. బహుశా ఆర్యులు పంజాబ్ ప్రాంతంలో నివసించే సమయంలో మెలుహ్హన్ల నుండి వీటిని స్వీకరించి ఉండవచ్చు. ఏదో కొంత మోతాదులో స్థానిక భాషనూ సంప్రదాయాన్నీ మిళితం చేసుకోకుండా ఏ జాతివారికైనా కొత్త జాతితో విలీనం జరగడం ఊహాతీతం. ఈ దశలోనే ఆర్య వనితలకు చెవి దిద్దులు, చేతి గాజులు అలంకార సాధనాలుగా సంక్రమించి ఉండవచ్చు. అంతేగాదు, కేవలం పశుపోషణ మీదే ఆధారపడకుండా వ్యవసాయంలో దిగేందుకు వాళ్లు చేసిన ప్రాథమిక ప్రయత్నాలు రుగ్వేదం ద్వారా తెలుస్తున్నాయి. పంజాబ్ చేరుకున్న ఆర్యులు అనతికాలంలోనే తదుపరి విస్తరణకు తావులు వెదుక్కోవలసిన అవసరం కలిగినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే, ఖాళీ అయినవి మెలూహన్ల నగరాలు, వాటిని ఆశ్రయించి బతికిన గ్రామాలు మాత్రమే. స్వయంపోషఖ సదుపాయం గల గ్రామాలు చెక్కుచెదరకుండా నిలిచే ఉన్నాయి. ఆ ప్రాంతానికి ఆర్యసంతతి మొత్తాన్ని ఇమిడించుకునేంత వసతి లేదు. అందువల్ల, వాళ్లు తదుపరి విస్తరణకు తూర్పుదిశను ఎన్నుకున్నారు. తూర్పు దిశనే ఎన్నుకున్న కారణం మనం ఊహించలేం. రథాలను ఆవలకు దాటుకోనివ్వమని సింధూను, దాని ఉపనదులను పదేపదే బతిమాలుకునే రుగ్వేద మంత్రాలను గమనిస్తే, క్రీ.పూ. 1400 కాలంలో ఆర్యులు సప్తసింధును దాటుకునే ప్రయత్నంలో ఉన్నట్టు అర్థమౌతుంది. అందువల్ల వాళ్లకు ఘగ్గర్ - హాక్రా గురించి గానీ, గంగా యమునల గురించి గానీ తెలిసుండే అవకాశమే లేదు. మొదటి నుండి తుదిదాకా ప్రక్షిప్తమని (అసలు పేరుతో ఇతరులు జొప్పించినవని) భాషా నిపుణులు నిస్సంకోచంగా తేల్చిన రుగ్వేదం పదవ మండలంలో గంగా-యమునల ప్రస్తావన ఒకే వొక్కసారి కనిపించడం మినహా మిగతా మండలాల్లో ఆ నదుల ఎరుకే కనిపించదు. దీన్నిబట్టి ఆర్యులు సప్తసింధును దాటుకునే సమయానికి ఘగ్గర్ - హాక్రా ఉనికే లేకుండా అంతరించి ఉండాలి. ఆర్యులు గంగామైదానం చేరుకునే పాటికే సింధూ నాగరికత జనావాసాలు అక్కడ పల్చగా విస్తరించి ఉన్నాయి. మెలూహన్ల భాషనూ, సంప్రదాయాలను కొంతమేరకు ఇమిడించుకుని అక్కడికి చేరిన ఆర్యులకు ఈ కొత్త నివాసాలతో సహజీవనం కష్టమైందిగాదు. ఆ ప్రాంతంలో స్థిరపడిన తరువాత మెలుహ్హన్ల వ్యవహారిక భాష అచ్చంగా ఇదివరకటి ఉండేందుకు వీలులేదు. స్థానిక భాషలతో మిళితమై, కొత్త తరహా భాషలు పుట్టుకొచ్చాయి. ఈ పామర భాషలను తరువాతి కాలంలో ‘ప్రాకృతం’ అన్నారు. ప్రాకృతాల్లో ఒక వైవిధ్యానికి ‘అర్ఘమాగధి’ అనే పేరుంది. బహుశా అది మగధ పరిసరాల స్థానిక వ్యవహారంతో సమ్మిళితమైన మెలూహన్ల భాష వంటిది కావచ్చు. అందులో కొంత ‘పాళీ’ భాష కూడా కలిసుండొచ్చు. ఎందుకంటే, మగధ సరిహద్దుకు ఇరుగుపొరుగున ఉన్నవి పాళీ భాష మాట్లాడే హిమాలయ పర్వత జాతులు కాబట్టి! గంగా మైదానంలో కుదుటపడిన తరువాత ఆర్యుల భాష, సంప్రదాయం, జీవన విధానాలు పూర్తిగా మారిపోయాయి. విరాటులు, యాదవులు వంటి కొన్ని వంశాలను మినహాయిస్తే, మిగతా వంశాలకు పశుపోషణ వృత్తిగా తప్పిపోయింది. వాళ్ల భాష సంస్కృరించబడిన ‘సంస్కృతం’గా మారిపోయింది. ఆ భాషలో తర్కశాస్త్రం, వ్యాకరణాల వంటి ప్రత్యేక నైపుణ్యాలకు పునాది ఏర్పడింది. వాటి ఆధారంగా సాహిత్యం బహుముఖంగా పరిగెత్తడం ప్రారంభించింది. సప్తసింధును దాటుకునే సమయానికి వేదత్రయం మినహా ఇతర సాహిత్యం లేని ఆర్యులకు గంగామైదానంలో అధర్వవేదం మొదలు ఉపనిషత్తులు, బ్రాహ్మణులు, అరణ్యకాలు, పూర్వగాథల ఆధారంగా ఎదిగిన ఇతిహాసాలు, దేవుళ్లకు స్వరూప స్వభావాలు కలిగించిన పురాణాలు మొదలైనవి సాహిత్య సంపదగా ఏర్పడ్డాయి. ఆ సాహిత్యంలో సింధూనది ప్రసక్తి అట్టడుగు పడిపోవడం గమనిస్తే, ఆర్యుల జ్ఞాపకాల నుండి సింధూనది మాసిపోయినట్టు కనిపిస్తుంది. ఉత్తర దక్షిణంగా హిమాలయాల నుండి వింధ్య వరకు విస్తరించిన భూభాగం సంస్కృత సాహిత్యం మూలంగా ‘ఆర్యావర్తం’ అయిపోయింది. ఇంత పురోభివృద్ధి జరిగినా సంస్కృతానికి ‘లిపి’ లేని కొరత కొన్ని శతాబ్దాల పర్యంతం కొనసాగింది. వ్యాకరణానికి మూలపురుషుడుగా ప్రసిద్ధికెక్కిన ‘పాణిని’ చదువు మౌఖికంగా సాగినదే. ప్రపంచంలో సాటిలేని సాహిత్య గ్రంథంగా నిలిచిపోయిన ‘మహాభారతం’ తరువాతి తరాలకు మౌఖికంగా అందుబాటుకొచ్చిందే. ఆర్యులు గంగామైదానం చేరుకునే పాటికే సింధూ నాగరికత జనావాసాలు అక్కడ పల్చగా విస్తరించి ఉన్నాయి. మెలూహన్ల భాషనూ, సంప్రదాయాలను కొంతమేరకు ఇమిడించుకుని అక్కడికి చేరిన ఆర్యులకు ఈ కొత్త నివాసాలతో సహజీవనం కష్టమైందిగాదు. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర
పుస్తక రూపంలో ప్రపంచ చరిత్ర... గత 80 రోజులుగా పాఠకులను అలరిస్తున్న ఎం.వి. రమణారెడ్డి రచన ‘టూకీగా... ప్రపంచ చరిత్ర’ ఇప్పుడు పుస్తకరూపంలో కూడా లభ్యం అవుతోంది. వివరాలకు: కవిత పబ్లికేషన్స్, 3/75, రాయవరం, ఖాదరాబాద్ పోస్ట్, పొద్దుటూరు - 516 362, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెం. 9063077367 రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 80
ఏలుబడి కూకట్లు పర్షియా సువిశాలమైన ప్రదేశమేగానీ, రాతిగుట్టల మూలంగా పచ్చిక బయళ్లు తక్కువ. ఇక్కడి నుండి పడమటికి సాగాలంటే, జాగ్రోస్ పర్వతపంక్తి అడ్డగిస్తుంది. దాన్ని దాటుకున్నా అప్పటికే బలమైన రాజ్యాధికారంగా ఎదిగిన సుమేరియన్లను అక్కడ ఎదుర్కోవాలి. దానికంటే, తూర్పు దిశగా ఉన్న సింధుస్థాన్ (ఇప్పటి ఆఫ్గనిస్థాన్, పడమటి పాకిస్థాన్‌లు) అనువైనదిగా ఆర్యులు ఎంచుకున్నారు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో ఆ దిశగా సాగిన ఆర్యులు, స్థానిక ప్రజలతో యధేచ్ఛగా మమేకమౌతూ సింధూనదిని చేరుకున్నారు. నడుమ నడుమ నాగరికతకు ఎదగని ఆటవికులతో అక్కడక్కడ ఇబ్బందులు ఎదురైవుండొచ్చు. మహాభారతంలో భీమసేనుడు రాక్షసకన్య హిండిబిని పెళ్లాడిన రీతిలో కయ్యము, వియ్యాలతో ఆర్యులు ఆ సమస్యలు ఎదుర్కొంటూ సింధూనది వరకు వేగంగా విస్తరించారు. ఈ పరిణామం గమనిస్తే, సింధూనాగరికత అంతరించిపోయేందుకు కారణం వాతావరణంలో వచ్చిన మార్పువల్ల భూములు బీడుపడటంగా కొందరు చేస్తున్న వాదనగూడా వాస్తవం కాదని తెలుస్తుంది. అదే నిజమైతే, పచ్చికబయళ్లకోసం పాకులాడే ఆర్యులు ఇటువైపుగా విస్తరించే అవసరమే ఉండేదిగాదు. వేదంలో తొలుత సూచనప్రాయంగా కనిపించే వ్యవసాయానికి తరువాతి కాలంలో ప్రాముఖ్యత పెరగడం గమనిస్తే, సింధూపీఠభూమికి చేరిన ఆర్యులు వ్యవసాయంలో దిగినట్టు అర్థమౌతుంది. అప్పుడుగాని వాళ్లకు సేవకులతోనూ బానిసలతోనూ అవసరం ఏర్పడలేదు. పరిమితమైన వ్యాపారం, వ్యవసాయాలతో ఆర్యన్ భారతీయుల్లో వర్ణవ్యవస్థ సంపూర్ణంగా చోటుచేసుకుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు గోత్రాలుగా విభజించబడిన ఆర్యులుగానూ, సేవకులుగా వినియోగించుకునే శూద్రులు కులాలవారీగా విభజింపబడిన అనార్యులుగానూ కాలక్రమంలో స్థిరపడినట్టు అర్థమౌతుంది. వ్యవసాయం అనగానే స్థిరనివాసం తప్పనిసరి. ఆ అవసరం ఏర్పడినప్పుడు కూడా ఆర్యులు అదివరకటి వాళ్లు వదిలిపోయిన గృహాలను ఆక్రమించలేదు. వాళ్లు ఏ కారణంగా వాటిని బహిష్కరించారో ఊహించడం కష్టం. గ్రామాలుగా స్థిరపడిన ఆర్యులు మట్టిగుడిసెలతోనే గడుపుకున్నారు. యమునా, గంగా తీరాలకు విస్తరించిన తరువాత కూడా, పౌరాణిక గాథల్లో వినిపించే నగరాలూ, చక్రవర్తులు మినహా, ఆర్యులకు నగరాలున్నట్టు నిరూపించే ఆధారాలు కనిపించవు. ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం. పురాణాల్లో కనిపించే ‘హస్తినాపురం’, ‘ఇంద్రప్రస్థం’ వంటి పట్టణాలను వదిలేస్తే, క్రీ.పూ. 6వ శతాబ్దంలో అక్కడ మగధ, కోసల, కాశీ, వత్స, అంగ, పాంచాల, అవంతి, విదర్భ, గాంధార, కాంభోజ వంటి కొన్ని రాజ్యాలూ, శాక్య, మల్ల, వృజి, లిచ్ఛవి వంటి కొన్ని గణతంత్రాలూ ఏర్పడివున్నట్టు సమకాలీన సాహిత్యం ద్వారా తెలుస్తూంది. పేరుకు రాజ్యాలేగానీ, చెప్పుకోదగ్గ వైశాల్యం కలిగినవిగా ఇవి కనిపించవు. ఆ శతాబ్దం చివరిలో (బహువా క్రీ.పూ. 580 ప్రాంతంలో) కాశీ, కోసల రాజ్యాలనూ, వృజి గణతంత్రాన్నీ హస్తగతం చేసుకుని, విశాలంగా విస్తరించిన మొట్టమొదటి సామ్రాజ్యం మగధ. కట్టుకథలను దాటిన వాస్తవచరిత్ర భారతదేశానికి ఇక్కడ మొదలౌతుంది. ‘రాజగృహ’ పట్టణం రాజధానిగా, ‘హర్యాంక’ వంశానికి చెందిన ‘బింబిసారుడు’ మొదటి చక్రవర్తిగా మగధ సింహాసనం అధిరోహించాడు. చైనా చరిత్ర గూడా మనదానికి మల్లే పురాణ చక్రవర్తులతో మొదలౌతుంది. ఆధారాలులేని ఐదుగురు చక్రవర్తులూ, గ్జియా వంశాలను వదిలేస్తే, ‘షాంగ్’ వంశంతో వాస్తవ చరిత్ర మొదలౌతుంది. క్రీ.పూ. 1750 ప్రాంతంలో వీళ్ల పాలన మొదలైన తరువాత, పోగు తెగకుండా చైనా రాచరికచరిత్ర ఆనవాళ్లతో కొనసాగుతుంది. కనీసం క్రీ.పూ. 200 వరకూ ఆ రాజులు పాలించినవి ఒక మోస్తరు భూ భాగాలే తప్ప, సామ్రాజ్యాలని పిలిచేందుకు వీలుపడేది కాదు. ఒకప్పుడు సింధూనదికి తూర్పున మొదలై, ఉత్తరావర్తమంతా విస్తరించిన ‘ద్రవిడ నాగరికత’ ఒకటుండేదనీ, ఆర్యులు వాళ్లను దక్షిణాదికి తరిమేసి ఉత్తరాపథం ఆక్రమించారనీ, ఒక కొత్త వాదన ఇటీవల ముమ్మరంగా ప్రచారమైంది. క్రీ.పూ. 8వ శతాబ్దం దాకా ఉత్తరావర్తంలో నగరాల ఆనవాళ్లే చరిత్రకు అందనప్పుడు, ఏదో నాగరికత అక్కడ గొప్పదశలో ఉండేదని వాదించడం ఊహకు అతీతమైన తర్కం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 79
ఏలుబడి కూకట్లు మంచు కరిగేకొద్దీ ఉత్తరంగా జరుగుతూ, ఉత్తర ఆఫ్రికాతీరం నుండి ఆదిమకాలంలోనే యూరప్ ఖండాన్ని చేరుకున్న ‘ఐబేరియన్’ తెగలు కొన్ని అప్పటికే యూరప్‌లో ఉన్నాయి. యూరప్ ఉత్తరార్థంలో వాటి జనసంఖ్య పలుచన. దానికితోడు సామాజిక స్థాయిలో ఎదుగుదల కూడా అంతంత మాత్రమే. అందువల్ల, తారసపడిన తెగలను తమలో జీర్ణించుకుంటూ, పోలెండ్, ఆర్మీనియా, జర్మనీ, స్కాండినేవియా ప్రాంతాల్లో ఆర్యుల ఆక్రమణ నల్లేరు మీద బండి నడకలా సాగింది. నడిమి యూరప్‌లోని రుమేనియా, హంగెరీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ ప్రాంతాల్లో సవాళ్లు ఎదురైనా సత్తాతో జవాబిస్తూ, స్థానికులతో పలురకాల సంబంధాలు నెరుపుతూ, దొంతర్లు దొంతర్లుగా వాళ్లు ఇంగ్లండు చేరుకున్నారు. అప్పటికి కూడా ఆ స్థానికులూ వ్యవసాయదారులు కాదు, వచ్చినవాళ్లకూ వ్యవసాయం తెలీదు. మట్టిగోడలూ, పూరికప్పుతో తాత్కాలిక మజిలీగా పనికొచ్చే గుడిసెలే తప్ప, క్రీ.పూ. 3000 వరకు అక్కడ స్థిరనివాసానికి అనువైన కట్టడం దొరకదు. పగలంతా పశువులు మేపుకుంటూ ఆరుబయట గడపడం, చీకటిపడే ముందు మందలను మళ్లించుకుని, రాత్రి వేళ తలదాచుకునేందుకు పూరిపాకకు చేరడం వాళ్ల దినచర్య. వేదాలు విధించిన కర్మకాండ ఆ ఆర్యులకు తెలిసినట్టు లేదు. అక్కడ దొరికే పొట్టిజాతి గుర్రాలు ఆహారానికేగానీ వాహనంగా పనికొచ్చేవిగావు. కాస్పియన్ సముద్రం వెనక్కు తీసిన అంచుల్లో పచ్చదనం ఏర్పడినప్పుడు ఆర్యుల దృష్టి తూర్పు దిశకు మళ్లింది. ఆ సందుగుండా వాళ్లకు ‘బొటాయ్’ నివాసులతో సంబంధాలు ఏర్పడ్డాయి. బొటాయ్ ప్రాంతం ఇప్పటి కజికిస్థాన్లోని పడమటి రాష్ట్రం. అక్కడి నివాసులు మంగోలియన్ తెగలనుండి ఎదిగినవాళ్ళు; వ్యవసాయం, లోహం తెలిసినవాళ్లు; క్రీ.పూ. 4000 సంవత్సరాల నాడే వాళ్లు గుర్రాలను మచ్చిక చేసుకున్నవాళ్లు. అక్కడ దొరికేది భారీ శరీరం, అమితమైన వేగంగల గుర్రాలజాతి. వ్యవసాయానికీ, చక్రాలుండే బండ్లును లాగటానికీ వాళ్లు అప్పటికే గుర్రాలను ఉపయోగిస్తున్నారు. వాళ్లతో పరిచయం ఏర్పడిన తరువాతే ఆర్యులకు గుర్రమూ, దానివల్ల ప్రయోజనమూ తెలిసొచ్చింది. వాళ్ల స్నేహంవల్ల గుర్రాలూ, వాటి తర్ఫీదు, రథాలు ఆర్యులకు అందుబాటయ్యాయి. వాళ్ల సంపర్కం వల్ల ఆర్యులకు ఉరల్ పర్వతాల తూర్పు పాదం వెంట ఉత్తరంగా ఉన్న రష్యాలోకీ, కాస్పియన్ సముద్రం తూర్పు తీరం వెంట దక్షిణ దిశగా పర్షియా (ఇప్పటి ఇరాన్)లోకి మార్గం దొరికింది. కాస్పియన్ తూర్పుతీరం వెంట దక్షిణంగా దిగివస్తున్న ఆర్యుల్లో యజ్ఞ యాగాదుల ఆచూకీ కనిపిస్తుంది. అక్కడి మొదలు ఆఫ్గనిస్తాన్ వరకు ‘సోమలత’ సమృద్ధిగా దొరుకుతుంది. సోమరసం లేకుండా యజ్ఞం లేదు. బహుశా కాస్పియన్ దక్షిణానికి చేరుకున్న దశలో ఒకే మూసగా ఉన్న ఆర్యులమధ్య విభేదాలు ఏర్పడినట్టు కనిపిస్తుంది. అవి కేవలం తాత్విక వైరుధ్యాలు. యజ్ఞయాగాదులనూ, సురాపానాన్నీ విసర్జించినవాళ్లు ‘అసురులు’. వాళ్లే తరువాతి జొరాస్ట్రియన్లు. వైదికకర్మలను ఆచరించేవాళ్లు ‘ఆర్యులు’. ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే - సుర, సోమరసాలు వేరువేరు పానీయాలని! సోమలతను నలగదంచి పిండగా వచ్చేది సోమరసం. తృణధాన్యాన్ని పులియబెట్టి, కాచినప్పుడు వచ్చే ఆవిరిని చల్లబరిస్తే తయారయ్యేది సుర. అసురులు విసర్జించింది సురాపానమేగాని, సోమపానం గాదు. కొన్ని పండుగ సందర్భాలకు ఎండినదైనా సరే, ఎన్ని తంటాలైనా పడి, ఇప్పటికీ సోమలతను సంపాదించుకుంటున్నవాళ్లు జొరాస్ట్రియన్ తత్వాన్ని అనుసరించే పారసీలు మాత్రమే. రుగ్వేదం పుట్టిన తొలినాటి ఆర్యుల్లో వర్ణభేదం కనిపించదు. పశుపోషణ మినహా ఇతర వ్యాపకం లేని రోజుల్లో సామాజిక అంతస్తులు ఏర్పడే అవకాశం ఉండదుకూడా. తాత్కాలిక మజిలీలకు పరిమితమైన తావులు మారే సంచారజాతికి సంతలూ వ్యాపారాలూ ఊహకందని విషయాలు. కాకపోతే ఇప్పుడు చక్రాలమీదే దొర్లే రథాలూ, వాటిని పరిగెత్తించే గుర్రాలూ చేతికి చిక్కడంతో పశువులు మేపుకురావడం సులభతరమయింది; వలసల్లో వేగం పుంజుకుంది. రుగ్వేదం నడిమి దశలో ‘రాజు’ అనే పదం అరుదుగా కనిపిస్తుంది. యజ్ఞాలు నిర్వహించేవాళ్లల్లో ఎక్కువభాగం యజమానులే. రుక్కులు నిర్మించిన రుషివర్గ మొక్కటీ ప్రత్యేక హోదాకు ఎదిగింది. సోమలతను నలగదంచి పిండగా వచ్చేది సోమరసం. తృణధాన్యాన్ని పులియబెట్టి, కాచినప్పుడు వచ్చే ఆవిరిని చల్లబరిస్తే తయారయ్యేది సుర. అసురులు విసర్జించింది సురాపానమేగాని, సోమపానం గాదు. కొన్ని పండుగ సందర్భాలకు ఎండినదైనా సరే, ఎన్ని తంటాలైనా పడి, ఇప్పటికీ సోమలతను సంపాదించుకుంటున్నవాళ్లు జొరాస్ట్రియన్ తత్వాన్ని అనుసరించే పారసీలు మాత్రమే. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 78
ఏలుబడి కూకట్లు గుంపును చీల్చి దూరంగా పంపవలసిన అవసరం వచ్చినప్పుడు, ఒక భార్యతోపాటు ఆమె సంతానాన్ని విభజించి తరలించడం ఆర్యుల ఆచారమైనట్టు తెలుస్తుంది. మహాభారతంలో పాండవులను వారణావతానికి కుంతితోసహా తరలిస్తారు. రుగ్వేదంలో యజ్ఞానికి అతిథిగా విచ్చేసేది దేవమాత ‘అదితి’ మాత్రమే; ఆమె భర్త కశ్యపుడు ఎప్పుడూ వెంటరాడు. పడమటి నుండి వచ్చిన ఆర్యులు, సింధూ ప్రాంతంలోని నగరాలను ధ్వంసం చేసి, అక్కడి ప్రజల్లో కొందరిని తరిమేసి, మిగతావాళ్లను సేవకులుగా చేసుకున్నారనే వాదన ఒకటుండగా, ఆర్యులు పరాయిచోటు నుండి వచ్చినవాళ్లు కారనీ, అసలు సింధూ నాగరికత ఆర్యులదేననేది మరోవాదన. మొదటిది ఎంత నిజమో రెండవదీ అంతే నిజం. సింధూనది నుండి భారత ఉపఖండం పడమటి సరిహద్దు వెడల్పునా విస్తరించి ఉండిన సింధూనాగరిక పౌరుల మూలంగా ఆర్యుల వలసలకు తీవ్రమైన ఆటంకం ఏర్పడిన దాఖలాలు లేవు. సింధు నాగరికతలోని ఏ జనావాసంలోనూ దాడులవల్ల సంభవించిన దుర్మరణాలకు నిదర్శనం కనిపించదు. సింధూ నాగరికవాసులు ఎవరైనా అయ్యుండొచ్చుగానీ, ఆర్యులు మాత్రం కారని నిస్సంకోచంగా చెప్పవచ్చు. ఆర్యుల ఆచారాలు యజ్ఞయాగాదులతో విడదీయరానివి. సింధూ నాగరికతలో ఆ కర్మకాండకు సంబంధించిన యజ్ఞకుండం, యూపస్తంభం వంటి ఉపకరణాలు ఏవొక్క తావులో కనిపించలేదు. శవసంస్కారంలో ఆర్యులవిధానం ‘దహనం’ అయ్యుండగా, సింధూ నాగరికుల విధానం ‘ఖననం’. సింధూ ప్రాంతంలో కనిపించే ‘తాళిబొట్టు’ ఆచారం వేదంలో కనిపించదు. ఆర్యుల వంటకాల్లో గుర్రపు మాంసం, ఎద్దు మాంసం, దున్నపోతు మాంసాలే కనిపిస్తాయి గానీ, చేపలు వండినట్టు వేదంలో ఎక్కడా కనిపించదు. సింధూప్రాంతీయులు స్థానికంగా దొరికే చేపలు చాలనట్టు, గల్ఫ్నుండి ఎండుచేప దిగుమతి చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే మరో పుస్తకమౌతుంది కాబట్టి ఇంతటితో చాలిద్దాం. ఇంతకూ ఈ ఆర్యులు ఎవరు, ఎక్కడివారు? ఎలాగూ ఇంతదూరం వచ్చాము కాబట్టి, ఆర్యుల గురించి మరికొన్ని విషయాలు తెలుసుకునేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోవడం ప్రయోజనంగా ఉంటుంది. ఎక్కడివారో చెప్పుకొచ్చే వాదనలు వందల్లో ఉన్నాయి. ఎక్కువ మంది ఏకీభవించిన మూలస్థానాలు రెండు. వాటిల్లో మొదటిది - నైరుతీరష్యాలోని ‘డాన్యూబ్ నది’ పరిసరాలు. రెండవది - దక్షిణరష్యాలోని ‘ఓల్గా నది’ పరిసరాలు. మధ్యధరా సముద్రం ఏర్పడక ముందు, ఉష్ణమండలం నుండి వేట జంతువును వెదుక్కుంటూ యూరప్ ఖండానికి విస్తరించిన ఇతర రాతియుగం మనుషుల్లాగే, ఏ 14 వేల సంవత్సరాలనాడో అక్కడికి చేరుకున్న విల్లనమ్ముల మానవులు వీళ్లు. అక్కడి వాతావరణ ప్రభావంతో వాళ్ల గోధుమరంగు చర్మం నలుపు విచ్చి, తెలుపు రంగుకు మారడం సహజం. అక్కడికి చేరుకున్న రెండు మూడు వేల సంవత్సరాలకు వాళ్లు పశుపోషకులయ్యారు. ఆ తరువాతి దశకు ఎదగకుండా, క్రీ.పూ. 3వ శతాబ్దం వరకూ పశువుల కాపరులుగానే మిగిలిపోయారు. తాత్కాలిక నివాసాలేతప్ప, వాళ్లింకా స్థిరనివాసాలకు ఎదగలేదు. కానీ, పచ్చికబయళ్ల కోసం వాళ్లు విస్తరించని దిక్కు లేదు; యూరప్ ఖండంలో వాళ్లు ఆక్రమించని ప్రదేశం లేదు. ఇంత విస్తీర్ణానికి చాలేంత జనసంఖ్య ఆర్యులకు ఎలా వచ్చింది? సంస్కృత సాహిత్యం ద్వారా కొంతవరకు మనం ఊహించగలిగే కారణం ఏదంటే - ఆర్యులకు సంతానేచ్ఛ ఒక సంస్కృతి. ఎక్కువ సంతానానికి కారకుడైన పురుషుడు ‘ప్రజాపతి’గా విశిష్టగౌరవం సంపాదించుకుంటాడు. అనేకమంది భార్యల్లో, ఒక్కొక్కరివల్ల వేల సంతానానికి కారకుడు కావడం అతిశయోక్తి కావచ్చుగానీ, ప్రతివొక్క ప్రజాపతికి విస్తారమైన సంతానం ఉండటం అబద్దం కాకపోవచ్చు. వేటజంతువులు పలుచబడినా, పచ్చిక కొరకు వేరు పడినా, ఒకేతెగ రెండు మూడుగా చీలి, వేరువేరు దిశల్లో దూరప్రాంతాలకు తరలిపోవడం కొత్తగాదు. గుంపును చీల్చి దూరంగా పంపవలసిన అవసరం వచ్చినప్పుడు, ఒక భార్యతోపాటు ఆమె సంతానాన్ని విభజించి తరలించడం ఆర్యుల ఆచారమైనట్టు తెలుస్తుంది. మహాభారతంలో పాండవులను వారణావతానికి కుంతితోసహా తరలిస్తారు. రుగ్వేదంలో యజ్ఞానికి అతిథిగా విచ్చేసేది దేవమాత ‘అదితి’ మాత్రమే; ఆమె భర్త కశ్యపుడు ఎప్పుడూ వెంటరాడు. జనసాంద్రత మూలంగా ఆర్యులు డాన్యూబ్ నదీప్రాంతం నుండి తూర్పునకు ఓల్గానది వరకో లేదా ఓల్గా తీరం నుండి పడమటి డాన్యూబ్ తీరానికో అతివేగంగా విస్తరించి ఉండాలి. ఓల్గా నుండి మరింత తూర్పుకు సాగే అవకాశం లేకుండా ‘ఉరల్’ పర్వతశ్రేణీ, దక్షిణానికి సాగకుండా కాస్పియన్, నల్లసముద్రాల సంగమం అడ్డుకొని ఉండాలి. ఒకప్పుడు ఆ రెండు సముద్రాలు ఒకటిగా కలిసుండేవి. రెండుగా విడిపోయిన తరువాత, వాటి మధ్యన ఏర్పడిన కాకేసియన్ పర్వతాలు వాళ్ల దక్షిణ గమనాన్ని తేలిగ్గా అనుమతించవు. ఆ తరువాత కాస్పియన్ సముద్రం కుంచించుకుని, దానికీ యూరల్ పర్వతాలకూ నడుమ చదునునేల ఏర్పడినా, ఆ నేలలో ఉప్పు తొలగక, చాలాకాలం వరకూ గడ్డి మొలవని బీడుగా నిలిచిపోయింది. అందువల్ల, ఆర్యుల విస్తరణ విధిగా మధ్య యూరప్ ప్రాంతాలవైపు మరలింది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 77
మెసొపొటేమియాకు సమాంతరంగా నడిచిన నాగరికత ఈజిప్టుది. క్రీ.పూ 5500 కాలంలో, నైలునది ఎగువప్రాంతాన నగరాల నిర్మాణానికి పూనుకున్న ఈజిప్షియన్లు స్థానికులు కాదేమోనని కొందరి అనుమానం. ఎందుకంటే. క్రీ.పూ. 5000కు ముందు ఆ ప్రాంతంలో నివసించిన మనుషుల అవశేషాలకూ, తరువాతి కాలం అవశేషాలకూ వ్యత్యాసం కనిపిస్తుండడం వల్ల ఆదిమకాలం తరహా సంప్రదాయం ఒక్కసారిగా అంతరించి, పైపొరల్లో ఎదిగిన మనుషుల సంప్రదాయంలోని అవశేషాలు బయటపడుతున్న కారణంగా వీళ్ళు మెసొపొటేమియా నుండి వచ్చిన వలసలై ఉండొచ్చని అనుమానం. దేవాలయాలూ, చిత్రలేఖనం వంటి నేర్పుల్లో మెసొపొటేమియాతో ఈజిప్టుకు పోలికలూ ఉన్నాయి, తేడాలూ ఉన్నాయి. నైలునదీ ప్రాంతంలో రాతికి కొరతలేని కారణంగా ఇక్కడి దేవాలయాలు రాతికట్టడాలు. ఈ దేవుళ్ళ ఆకారాలు వేరు, పేర్లు వేరు. అక్కడిలాగే ఇక్కడ కూడా అర్చకుల ఏలుబడిలో నగరపాలన మొదలైంది గానీ, పెద్ద ఆలస్యం కాకుండా ముగిసి, రాజవంశాల ఏలుబడికి సమాజం గెంతేసింది. అనాది నుండి ఈజిప్టు పాలకులు ‘ఫ్యారో’లుగా ప్రసిద్ధి. ఈ పాలకుల ప్రత్యేకత ఏమంటే - వీళ్ళు దేవుని సేవకులు కాదు; స్వయంగా దేవతామూర్తులు. క్రీ.పూ. 3వ శతాబ్దంలో నివసించిన ‘మ్యానెథో (క్చ్ఛ్టజిౌ)’ పేరుగల అర్చకుడొకాయన, అనాది కాలం నుండి తన జీవితకాలం దాకా పరిపాలించిన రాజులందరిని 30 వంశాలుగా విభజించాడు. ఆ వంశాలకు విడివిడి పేర్లు లేకపోవడంతో, 1వది, 2వది, 3వది అంటూ లెక్కించడం ఆనవాయితీగా రూపొందింది. ఉత్తర, దక్షిణ నైలునదీ ప్రాంతాలను ఏకం జేసి, ఈజిప్టు మొత్తాన్ని ఒకే సామ్రాజ్యంగా నెలకొల్పిన ఘనతను అతడు ‘మెనెస్’ పేరుగల ప్రభువుకు ఆపాదించాడు. ఐతే, చారిత్రక పరిశోధనల్లో అలాంటి పేరుండే చక్రవర్తి ఆనవాళ్ళు దొరకలేదు. ‘నేర్మెర్ ప్యాలెట్ మీద, రాజలాంఛనాలు ధరించి వేటినో ఏకం చేస్తున్న భంగిమలో కనిపించే క్రీ.పూ. 3150 నాటి ‘ఫ్యారో నేర్మర్’ చక్రవర్తే ఆ మెనెస్ అయ్యుండొచ్చునని చరిత్రకారులు భావిస్తున్నారు. అత్యంత విస్తారమైన ప్రాచీన నాగరికతగా పేరుగాంచిన ‘సింధూ’ పీఠభూమి పరిపాలనా విధానం గురించి చెప్పేందుకు ఎంతైనా ఉందిగానీ, నిరూపించేందుకు ఆధారాలు శూన్యం. తవ్వకాల్లో బయటపడిన కట్టడాల్లో స్మారకచిహ్నాలుగానీ, రాజమందిరాలుగానీ, దేవాలయాలుగానీ మచ్చుకైనా కనిపించవు. చక్కని వ్యూహరచనతో నిర్మితమైన పట్టణాలూ, ప్రతి ఇంటిని అనుసంధానం చేసే మురుగునీటి తరలింపు సౌకర్యం, ప్రామాణీకరించబడిన తూనికలూ, కొలతలూ తదితర విధానాలు పరిపాలన లేకుండా జరిగేవిగావు. అది ఏ తరహా పాలో తెలుసుకునేందుకు గోరంత ఆధారం లేదు. ఆలయాలు గానీ, అర్చక వ్యవస్థగానీ లేకపోవడంతో సింధూ ప్రాంతీయుల ఆధ్యాత్మిక భావాలను గురించి తెలుసుకునేందుకు వీలుపడటం లేదు. ముద్రికల మీద అస్పష్టంగా ఉన్న బొమ్మల ఆధారంగా వాళ్ళు ‘పశుపతి’ని ఆరాధించేవాళ్ళని అన్వయిస్తున్నారేగానీ, యోగ ముద్రలో కూర్చోనున్నట్టు కనిపించే బొమ్మలను దేవుళ్ళతోనూ పోల్చుకోవచ్చు, కళావికాస ప్రయత్నంగానూ భావించొచ్చు. క్రీ.పూ. 5వ శతాబ్దం వాడైన హెరొడొటస్ మొదలు క్రీ.శ.1900 దాకా ఏ చరిత్రకారునికి సింధూ నాగరికత మీద దృష్టి పడకపోయేందుకు కారణం అందులోని పౌరజీవితం నోచుకున్న ప్రశాంతత. వంచితే వంగిపోయేంత బలహీనమైన బరిసెలు, కొన్ని కత్తులు తప్ప అక్కడ ఇతర ఆయుధాల జాడ కనిపించదు. డాలు, ఖడ్గం వంటి పరికరాలు లేకుండా ఆ బరిసెలతో యుద్ధాలు చెయ్యడం సాధ్యపడదు. కొన్ని పట్టణాల చుట్టూ బలమైన గోడలు కనిపించినా, వాటి ప్రయోజనం అనూహ్యమైన వరదను అడ్డుకునేందుకే తప్ప ఆత్మరక్షణ కోసం కట్టుకున్నవిగా కనిపించదు. ఈజిప్టుకుమల్లే సింధూ పీఠభూమిది స్వయం సంరక్షిత నైసర్గిక స్వరూపం. ఉత్తరంలో హిమాలయ పర్వతాలు; పడమట బెలూచీ పర్వతాలు; దక్షిణాన అరేబియా సముద్రం, వింధ్య పర్వతాలు; తూర్పుదిశ నుండే యమునా గంగా మైదానం దట్టమైన అరణ్యం. అందువల్ల, పరాయి దండయాత్రల బెడద ఈ ప్రాంతానికి లేదు. రాచకుటుంబాల మధ్య అధికారం కోసం జరిగిన కుమ్ములాటల వల్ల చరిత్రకారుల దృష్టిని ఆకర్షించగలిగింది ఈజిప్టు. ఇతరుల దృష్టిని ఆకర్షించగల సంఘటనే సింధూ నాగరికతలో కనిపించదు. క్రీ.పూ. 1500 ప్రాంతంలో హఠాత్తుగానూ, మూకుమ్మడిగానూ, వారసులనైనా మిగల్చకుండా ఈ నాగరికత ఎలా, ఎందుకు అంతరించిందో అంతుదొరకని చిక్కుముడిగా మిగిలిపోయింది. ఆ నాగరికులు మిగిలించిపోయిందల్లా, ‘వాళ్ళు మావాళ్ళే’ నని భారతదేశంలో ఏవొక్కడైనా ఎగబడగల హక్కు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 75
ఏలుబడి కూకట్లు వృత్తులవారీగా పౌరజీవితం విడిపోయి, ఏ వర్గానికావర్గం కూటమిగా ఏర్పడింది. వృత్తిపరమైన నైపుణ్యాలు ఆయా కుటుంబాలనూ, కూటములనూ దాటిపోకుండా వృత్తిరహస్యాలయ్యాయి. పరిశ్రమ ఏదైనా, నిర్వహణలో కుటుంబానికంతా భాగస్వామ్యం ఉండడం వల్ల, ఇంటికి కొత్తగా వచ్చే కోడలు కూడా ఆ వృత్తికి అలవాటుపడినదై ఉండవలసిన అవసరం వల్ల, చివరకు పెళ్లి సంబంధాలు సైతం వృత్తుల పరిధిలోకి కుదించుకున్నాయి. మారిన సామాజిక పరిస్థితులనూ, పౌరసంబంధాలనూ సమన్వయించగల కేంద్రం దేవాలయం. ఆ అర్చకుడు ఆ నగరానికి పాలకుడు. అది సహజమైన పరిణామం. ఎందుకంటే, మానవుణ్ణి సేద్యానికీ, స్థిరనివాసానికీ పురిగొల్పిన అంశాలు - సహజీవనం, సమృద్ధి, దేవుణ్ణి గురించి తలెత్తిన ఆలోచన. ఈ రూపంగా సంచార జీవితం నాటి ఆనవాయితీలకూ, సమిష్టి ఆలోచనలకూ శాశ్వతంగా తెర పడిపోయింది. నగరమూ, దానికి అనుబంధంగా ఉన్న కుగ్రామాలూ కలిసి ఒక ప్రామాణిక రాసి (యూనిట్). అర్చకుల నాయకత్వంలో ‘నగరపాలన’ ఏర్పడింది. మెసొపొటేమియా పీఠభూమి నిలువునా ఉనికిలోకి వచ్చిన వందలాది నగరాలన్నీ ఇదే మార్గాన్ని అనుసరించాయి. ఆ ఒక్క చోటునే కాదు, అనాది నాగరికతల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ‘నగర పాలికల’తోనే ఏలుబడి ప్రారంభమయింది. విడిగా బ్రతికే జంతువుకున్న స్వేచ్ఛ, ఉమ్మడిలో భాగంగా బ్రతికే జంతువుకు ఉండదు. కొన్ని నిబంధనలకు అలవాటు పడితే తప్ప సహజీవనం సాధ్యపడదు. అంటే, తన స్వేచ్ఛలో కొంతభాగాన్ని వదులుకునేందుకు సిద్ధపడితే తప్ప సాంఘిక జీవనం ప్రశాంతంగా సాగదు. సమాజం పెరిగేకొద్దీ నిబంధనల సంఖ్య అనివార్యంగా పెరుగుతుంది. హక్కులతోపాటు మోపెడన్ని బాధ్యతలు కూడా ప్రవేశిస్తాయి. అర్చకుల పాలనలో స్వేచ్ఛ ఎంత కుదించుకున్నా, హక్కులకు మాత్రం భంగం కలుగలేదు. ఎవరి ఇల్లు వాళ్లకు సొంతం; ఎవరి భూమి వాళ్లకు సొంతం; ఎవరి వ్యాపారం వాళ్లకు సొంతం. కాకపోతే, పాలనకయ్యే ఖర్చుకోసం చిన్న మోతాదులో శిస్తు చెల్లించాలి. ‘శిస్తు’ అనే విధానం పరిపాలనకు తోబుట్టువు. మెసొపొటేమియన్ పీఠభూమిలో నివసించిన నాగరికులను ‘సుమేరియన్’ జాతిగా పేరొచ్చింది. క్రీ.పూ.40వ శతాబ్దంలో మొలకెత్తిన ఆలయ పాలన దాదాపు 1000 సంవత్సరాలు సుమేరియన్లను నడిపించింది. అంతకుమించి నిలువలేక రాచరికాలకు తలుపులు తెరిచింది. విజ్ఞానం, దేవుని మీద ప్రజలకున్న విశ్వాసం అర్చకులకుండే బలం. ఆత్మరక్షణకు యుద్ధం ఆవశ్యకమైనప్పుడు ఒక్క పిలుపుతో పౌరులందరిని అర్చకులు కూడేయగలరు. కానీ, యుద్ధతంత్రంలో ప్రావీణ్యతలేని అర్చకుల నాయకత్వంలో జరిగే పోరాటం సారంలేని చెరుకుపిప్పి. పరిసరాల్లోని సంచారతెగలతో చేసుకున్న ఒప్పందాల కారణంగా, యుద్ధంతో అవసరం తీరిపోయిన తరువాతి కాలం అర్చకుడు ఆలయానికే అంకితమైన వ్యక్తిగా మారిపోయాడు. కౌమారంలో అర్చకుడిగా తన జీవితాన్ని ఆలయానికి చేర్చి, దానికి సంబంధించిన తర్ఫీదుమీదనే దృష్ట కేంద్రీకరించడంతో యుద్ధతంత్ర అతని పిడికిలినుండి జారిపోయింది. దేవతలూ, దేవాలయాల సంఖ్య పెరగడంతో, ప్రజల విశ్వాసం మరో దేవునివైపు మరలకుండా, సంపూర్ణంగా అది తన దేవునికే ఉండేలా చేసుకునే తహతహవల్ల అర్చక వర్గంలో విభేదాలు తలెత్తి, ఆ వర్గాన్ని ముక్కలకింద చీల్చేసింది. అర్చకుల ఈ బలహీనతను ఆధారం చేసుకుని కండబలం కలిగిన యోధులు పరిపాలనను హస్తగతం చేసుకున్నారు. దేవుళ్ళందరికీ సమాన గౌరవం ప్రకటించి, ఏయే అర్చకుణ్ణి ఆయా దేవాలయాలకు పరిమితం చేశారు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 74
ఏలుబడి కూకట్లు మెసొపొటేమియా ఈజిప్టుల్లో చెప్పుకోదగ్గ నగరం ఏర్పడిన ప్రతిచోట ఒక దేవాలయం ఉండే తీరుతుంది. సాధారణంగా అది ఊరికి మధ్యలో ఉంటుంది. దాని గోపురం కంటే ఎత్తై కట్టడం ఆ నగరంలో మరొకటి ఉండదు. చివరకు రాజభవనమైనా సరే, దానికి మించగూడదు. అడపాదడపా సంచారజాతుల దాడులను ఎదుర్కోవడం మినహా, స్థిరనివాసుల జీవితంలో నిలకడ ఏర్పడింది. సంపద పెరగడంతో పాటు విశ్రాంతి పెరిగింది. ఆందోళనలేని విశ్రాంతి మనిషిని వినోదాలవైపు, ఉత్సవాలవైపు నడిపిస్తుంది. ఆ కాలంలో వినోదానికైనా, ఉత్సవానికైనా కేంద్రం దేవాలయమే. గాయకులతో కథాగానాలు జరిపించడమేగాక, తన అనుభవంతో ఇతరులకు సలహాలివ్వడం, మూలికలతో జబ్బులకు చికిత్స చెయ్యడం, నక్షత్రాల గమనాన్ని గుర్తించి రుతువుల రాకపోకలు ఎరిగించడం వంటి సామాజిక కార్యక్రమాలకు దేవాలయం కూడలి కావడంతో, అర్చకుల ప్రాముఖ్యత అత్యున్నత స్థాయికి ఎదిగింది. అరుదుగా వచ్చే పండుగ రోజుల్లోనే కాకుండా, ఏ పని తలపెట్టినా మొదట దేవుణ్ణి బుజ్జగించి ముందుకు సాగటం మంచిదనే నమ్మకాలు పెరిగేకొద్దీ దేవాలయ కార్యక్రమాల్లో రద్దీ పెరిగింది. బ్రతుకుతెరువు విధానాల్లో వైవిధ్యాలు పెరిగేకొద్దీ బుజ్జగించుకోవలసిన దేవుళ్లసంఖ్య అదే నిష్పత్తిలో పెరుగుతూ పోయింది. ప్రతి వృత్తికి ఒక సొంతదేవుడు; ఆ దేవుని ఒక నివాసం, ఒక భార్య, ప్రత్యేక వ్యవస్థగా తయారైంది. అందులో పలురకాల పనులకు వినియోగింపబడే సేవకుల బృందం ఏర్పడింది. ఆ సేవకులు ధరించే దుస్తులు కూడా ఇతరులు ధరించే వాటికి భిన్నంగా మారిపోయాయి. నెత్తురు బంధాలు తెంచుకుని, అర్చకులు కుటుంబరహిత వ్యక్తులుగా మారిపోయారు. దాంతో ఆలయాలది ఒక ప్రత్యేక కుటుంబంగా రూపొందింది. నాగరికత పెరిగేకొద్దీ అదే నిష్పత్తిలో నైతిక విలువలు దిగజారడం సహజం. క్రమబద్ధం చేసేందుకు పాతకాలం ఆనవాయితీలు చాలవు. కొత్త అవసరాలు తీర్చేందుకు సరికొత్త నిబంధనలు అవసరమయ్యాయి. వ్యాపారం విస్తరించడంతో కొలతలూ, తూనికలకు ఒక ప్రామాణికత తీసుకురావడం కూడా అవసరమయింది. ఆ బాధ్యతలు నిర్వహించడం అనుభవజ్ఞులకే సాధ్యం. అందువల్ల అర్చకులు శాసనకర్తలయ్యారు. దేవాలయాలు న్యాయస్థానాలయ్యాయి. దేవాలయ నిర్వహణకు ప్రతి కుటుంబం వస్తురూపంలో కొంత విరాళంగా చేరుతుండటంతో, వాటి జమాఖర్చులూ, అత్యవసరమైన కొన్ని సంఘటనలూ జ్ఞాపకం నుండి జారిపోకుండా ఉండేందుకు ఏదోవొక రూపంలో వాటిని నమోదు చేయవలసిన అవసరం ఏర్పడింది. ఆ అవసరం నుండి చిత్రలిపి పుట్టుకొచ్చింది. అర్చకుల పరస్పర సంప్రదింపులతో చిత్రలిపి వైశాల్యం ఒనగూరదు. వ్రాయగలగడం, చదవగలగడం కలిసి ‘విద్య’. ఆ కాలంలో గుడికీ బడికీ తేడా లేదు. చదవడం, రాయడం ఎంత వేగంగా పెరిగినా, దేవాలయం వెలుపలున్న సమాజమంతా విద్యలేని వాళ్లే. తమ పెద్దరికానికి సవాలు ఎదురయ్యే ఉపద్రవాన్ని నిరోధించేందుకు, ‘విద్య’ తమ హద్దును దాటిపోకుండా అర్చకవర్గం కట్టుదిట్టాలు పాటించింది. ‘అర్చకులంతా సంకుచితులే’ అనేందుకు వీలు లేదు గానీ, సంకుచితులవల్ల శాస్త్రవిజ్ఞానానికి ఎంత హాని జరిగిందో భారతీయులకు తెలిసినంతగా మరొకరికి తెలియరాదు. విద్యలను కుటుంబ పరిధిలో నిబెట్టుకోవాలనే తాపత్రయంతో అమూల్యమైన వైద్యవిజ్ఞానాన్నీ, ఖగోళవిజ్ఞానాన్నీ లోహపరిజ్ఞానాన్నీ చేతులారా ధ్వంసం చేసుకున్న జాతి మనది. తనసంతానం మేథోశక్తి చాలుతుందా చాలదా అనే విచక్షణ వదిలేసి, ఆసక్తిని వారసులకు సంక్రమింపజేసే చాదస్తంతో విద్యల సారాన్ని సంపూర్ణంగా ఇగురబెట్టింది. ఈ విషయంలో ప్రపంచంలోని పురాతన నాగరికతలన్నింటికి భిన్నంగా ప్రవర్తించింది చైనా, ఆ దేశంలో చదవడం, రాయడం ఒక వర్గం సొత్తుగాదు. ఆసక్తి ఉంటే ఎవరైనా అర్హులే. ఆ విధానం వల్ల సమాజంలో వాళ్ల నైపుణ్యాలు విస్తరిస్తూ వచ్చాయి. మెసొపొటేమియా ఆలయాల దృక్పథం పెద్దదైనా, చిన్నదైనా, అవి ఆ నగరవాసుల విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. పైగా, సామాజిక వ్యవహారాలను సమన్వయించేందుకు విజ్ఞత కలిగిన కేంద్రంగా వాటి అవసరం రోజు రోజుకు పెరిగిపోయింది. ఇదివరకటి పౌరుల వ్యాపకాలు వ్యవసాయం, పశుపోషణ, ఆత్మరక్షణలకు పరిమితం. ఇప్పుడు లోహపు పనిముట్ల తయారీ, వర్తకం, నౌకాయానం వంటి కొత్త వ్యాపకాలు సమాజంలో ప్రవేశించాయి. ఎవరెవరి వ్యాపకం వాళ్లది కావడంతో నగర రక్షణకు ఒక సైనికదళాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవడం ఆవశ్యకమయింది. ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 73
లిపి వాస్తవ చరిత్ర కంటే అలౌకిక శక్తులతో మిళితమైన కథ (ఫాంటసీ) ప్రజలకు ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కోవకు చెందిన కథలను గానంగా ప్రజలకు వినోదాన్ని కలిగించిన ‘బార్డ్స్’ కాలంలోనే ఈ ప్రక్రియ సమాజంలో ప్రవేశించి ఉండొచ్చు. అదే కోవలో, గిల్గమేష్ పేరుండే ఒక పాలకుని కథ ఈ పదకవిత. చరిత్రకు దొరికిన సాహిత్యంలో ఇదే మొదటిది. అంతమాత్రాన ఇదే మొదటి సాహిత్యమని చెప్పలేం. ఎన్నో తరాలకు ముందే పుట్టిన సాహిత్యం మౌఖికరూపంలో ఉండిపోవడంతోనో, కాలానికి నిలువని పదార్థాల మీద లిఖితం అయ్యుండడం వల్లనో అవి చరిత్రకు దొరకలేదు. అనాది లిపిగా మనమెరిగిన క్యూనిఫాం లిపిలో ఉండడం వల్లనూ, అనాది పరికరమైన మట్టిపలక మీద లిఖించివుండడం వల్లనూ, తరువాతి కాలానిదిగా ఎరిగిన బైబిల్లో కొన్ని పాత్రలూ సంఘటనలూ గిల్గమేష్కు పోలివుండడం వల్లనూ, ఇలియడ్ వంటి కథాగానాలు దీన్ని ఒరవడిగా స్వీకరించడం వంటి కారణాల మూలంగా, ప్రస్తుతానికి ప్రపంచంలోని మొట్టమొదటి గ్రంథంగా గిల్గమేష్కు ఆదరణ దక్కింది. గ్రంథరచన స్థాయికి ఎదిగినా, తనలోని వెలుతులను సంపూర్ణంగా పూడ్చుకునేందుకు క్యూనిఫాం లిపి సాధ్యపడలేదు. చిత్రలిపి ఏ తరహాదైనా, దాని ఇబ్బందులు దానికి ఉంటూనే వచ్చాయి. మార్పులు ఆశిస్తున్న చిత్రలిపి కొంతకాలానికి కుంచెకు తేలిగ్గా ఉండే సరళీకృత రూపం సంతరించుకుంది. ఆ రూపాలను రోడ్క్రాసింగ్, కుటుంబ నియంత్రణ వంటి ప్రకటనల్లో మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ఉదాహరణకు - ఒక నిలువు గీత మోసిన వృత్తం తల, తలకింద ఇరువైపులకు సాగే ఏటవాలు గీతలు చేతులు; గీత అడుగున లిఖించిన నిలువుగీతల జంట కాళ్లజత; దానిపక్కన రెండు సెంటీమీటర్లు చిన్నదిగా గీసిన అదేబొమ్మ తలకు కొప్పును చేర్చితే భార్య; వాళ్లపక్కన అదే తరహాలోని గీసిన పొట్టిబొమ్మలు చిన్నబొమ్మల్లో బోడిగా ఉండేది బాలుడు, రెండు జడలుండేది బాలిక. ఈ తరహా చిత్రసంకేతాల పద్ధతి కుంచెకు తేలిక. చిత్రలిపికి తరువాతి దశ ‘భావచిత్రలిపి (ఇడియోగ్రామ్); అంటే, ఒకే బొమ ఆక్రమించే స్థలంలో మరో బొమ్మను జతగూర్చి భావన్ని కలుగజేయడం. ఉదాహరణకు ఎడంఎడంగా ఉండే రెండు నిలువుగీతల మీద మూత కప్పినట్టుండే ఏటవాలుగీతను కలిపితే ఇల్లు; ఆ గీతల మధ్య మనిషి బొమ్మను గీస్తే ‘స్వగృహం’; అలాగే పంజరం, అందులో పక్షి మొదలైనది. దీనికి తరువాతి దశ ‘శబ్దచిత్రలిపి (ఫొనోగ్రామ్)’. ఒక్కొక్కసారి ఒకే శబ్దం అనేక అర్థాలకు ప్రతీకగా ఉండటమేగాక, ఒకే శబ్దం కొన్నిసార్లు నామవాచకంగానూ, మరికొన్నిసార్లు క్రియగానూ వాడబడటంవల్ల, శబ్దచిత్రలిపితో అవసరం ఏర్పడింది. ఉదాహరణకు ఇంగ్లీషు పదం ‘బాక్స్’ అనేది పెట్టెనూ సూచిస్తుంది, పిడికిళ్లతో కొట్టుకోవడాన్నీ సూచిస్తుంది. ఇలాటి సమస్యలకు పరిష్కారంగా ఫోనోగ్రాఫిక్ లిపి అవతరించింది. చతురస్రంగా గీసిన నాలుగు గీతల మీద తెరిచివున్న మూతలాగా ఒక ఏటవాలు గీతను కలిపితే అది పెటే దాని లోపల నాణెంను సూచించే చిన్న వృత్తం గీస్తే గళ్లాపెట్టె లేదా ఖజానా; వృత్తానికి మారుగా పెట్టేమీద రెండు ఏటవాలుగా ఢీకొంటున్న కత్తులు గీతస్తే అది ముష్టియుద్ధం. సవరణలు ఎన్ని తీసుకొచ్చినా, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్న భాషను ఇమిడించుకోవడం చిత్రలిపికి సాధ్యపడిందిగాదు. ఇలాటి సంధి సమయంలో, ఉచ్చారణకు సంకేతమైన అక్షరరూపాలను (ఆల్ఫాబెట్స్) తొట్టతొలిగా ఆవిష్కరించి ఫొయెనీసియన్లు (ఇప్పటి లెబనాన్ ప్రాంతం). దాన్ని గ్రీకులు అందుకుని మెరుగులు దిద్ది, క్రీ.పూ. శతాబ్దంలో అచ్చులనూ హల్లులనూ వేరువేరుగా గుర్తించే అక్షరమాలను ప్రవేశపెట్టింది. యూరప్‌లోని భాషలన్నీ గ్రీకు సంప్రదాయాన్ని అనుసరించగా, తూర్పుదేశాలు మరో సంప్రదాయంగా చేరినప్పుడే శబ్దం ఉత్పన్నమౌతుంది. ప్రాచర్యపద్ధతిలో ఏ అక్షరానికి ఆ అక్షరమే శబ్దం. ఈ పరిణామం తరువాత, చిత్రలిపి చిన్నపాటి ఉపాంగంగా మిగిలిపోయింది. మిగతావాళ్లకు మల్లే చైనీయుల రాత చిత్రలిపితో మొదలయింది. అయితే చదువుకునే క్రమం ఎడమ నుండి కుడికీగాడు, కుడి నుండి ఎడమకూ కాదు; ఎగువ నుండి దిగువకు నడపడం వాళ్ల ప్రత్యేకత. అనాదికాలంలో వ్రాతకు ఉపరితలంగా వాళ్లు ఉపయోగించినవి తాబేటి చిప్పలు, పశువుల గూడబొమికె (స్కాపులా). ఆ తరువాత పట్టురుమాళ్లూ, వెదురుబిళ్లలూ రంగంలోకొచ్చాయి. బట్టమీద రంగుదారాల అల్లిక (ఎంబ్రాయిడరీ)లో చైనీయులది అందెవేసిన చెయ్యి. ఆ దేశం పట్టుకే కాదు, వెదురుకు కూడా ప్రసిద్ధి. వెదురుతో వస్తువుల తయారుజేసే ప్రావీణ్యత ఇంతింతగా పెరిగి, కాగితం తయారీకి ఆస్కారం అందువల్లే కలిగించింది. ఐనా, వాళ్ల లిపి మాత్రం ఇప్పటికీ ఫొనోగ్రఫీకి దగ్గరలోనే ఆగిపోయింది. వేలాది సంకేతాలను క్షుణ్ణంగా నేర్చుకుని, చూడగానే గుర్తించగలిగేంత చురుకుకు అలవాటు పడితేగాని ఆ భాషను చదివేందుకు వీలుపడదు. ఆ లిపి మిగతావాళ్లకు ఒరకరాని కొయ్య. తేలికైంది కాదని తెలిసి గూడా, చైనా, జపాన్, కొరియాలు తమ రాతను అక్షరలిపికి మార్చుకునేందుకు సుముఖత చూపడంలేదు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 73
వ్రాత ఉపరితలంగా ఈజిప్టులో పుట్టుకొచ్చిన మరో సాధనం ‘పపైరస్’. ఈ పదం నుండే ‘పేపర్’ అనే పదం పుట్టుకొచ్చింది. వెదురు చువ్వకు సమానమైన చుట్టుకొలతతో పెరిగే నీటి మొక్క పపైరస్. బెరడు గోకేసి, కాండాన్ని 40 సెం.మీ. నిడివితో పల్చటి పొరలుగా చీల్చి, అంచులను అతికించి తొలి పొరమీద మరో పొరను అంటించి కాగితపు టావులాగా తయారుచేస్తారు. క్రీ.పూ. తొలి శతాబ్దంలో పుట్టిన ఈ సాధనం మధ్యధరా తీరంలోని అన్ని నాగరికతలకూ వేగంగా విస్తరించింది. ఇదే తరహాలో ప్రవేశించిన మరో సాధనం ‘తాళపత్రం’. రాతకు అనుకూలించేంత నునుపుగా తీర్చిన తాటాకు మీద, కంచు ఘంటంతో ఆకారాలు గోకి, స్పష్టంగా కనిపించేందుకు వీలుగా ఆ గాట్లను నల్లటి మసితో నింపుతారు. తాటిచెట్టు దొరకని ఉత్తరభారతదేశంలోని దీని స్థానాన్ని ఆక్రమించింది ‘భూర్జపత్రం’. అడుగు పెట్టీ పెట్టకముందే ఈ పరికరాలన్నిటినీ ఒక్క విసురుతో తోసేసింది ‘కాగితం.’ క్రీ.శ. 206-220ల మధ్య కాగితం అనే సాధనం చైనాలో రూపుదిద్దుకుని, ‘సిల్క్ రూట్’ ద్వారా నాగరిక ఫ్రపంచానికి విస్తరించి, గత 1600 సంవత్సరాలుగా సార్వభౌమాధికారం చెలాయిస్తూనే వుంది. తిరిగి మరోసారి వెనుకటి తరాకు చేరుకుంటే,చిత్రలిపికి సంభవించిన మార్పులు కూడా మనం తెలుసుకోవచ్చు. క్రీ.పూ. 3000 నాటికి వ్యాపారం ఎంత విస్తరించినా, అది సమాజంలో ఒక భాగమే తప్ప సర్వస్వం కాదు. అనాది నుండి కాలక్షఏపం కోసం ఆదరించబడిన కథాగానాలు ఇప్పుడు లిఖితరూపంలోకి మార్చుకునేందుకు పురోహిత, పూజారి వర్గాలు తాపత్రయపడుతున్నాయి. కానీ, ఆ భావాల విస్తృతిని ఇమిడించుకునేందుకు తొలితరాల చిత్రలిపి పొలిమేరలు చాలకొచ్చాయి. చిత్రలిపి ప్రధానంగా ప్రాతినిధ్యం వహించేది ఆకృతులకు మాత్రమే. మేక గుర్తు గీస్తే ఒక మేక, ఐదు మేకలను సూచించాలంటే అదే బొమ్మను మరో నాలుగుసార్లు వరుసగా చిత్రించేంత స్థలం అవసరమౌతుంది. అందువల్ల, స్థలాన్ని పొదుపు చెయ్యాలంటే, మేక బొమ్మకు సంఖ్యను తెలిపే సంకేతం అదనంగా జతచెయ్యాలి. ఇబ్బందులు అంతటితో తీరేవిగావు. చిత్రలిపి గోచర పదార్థాలకు పరిమితమైన సంకేతం. చూపుకు అతీతమైన పదార్థాలనూ, దృశ్యాలనూ, భావాలనూ తెలియబరిచే మార్గమేది? అంతేకాకుండా, చిత్రలిపిలో క్రియలకు స్థానం తక్కువ. తనకు తానుగా భావాన్ని సంపూర్ణంగా వ్యక్తం చేయడం చిత్రలిపికి సాధ్యపడదు. ఉదాహరణకు - ఒక యక్షుని శిల్పం ఉంది. శిల్పంలో యక్షుని కుడిచేతి చూపుడువేలు అతని బొడ్డు మీద ఉంటుంది. ఎడమచేతి చూపుడు వేలు విగ్రహానికి ఎడమవైపు ఆనించి వున్న గదను చూపిస్తూంది. ఆ గదతో తన పొట్టను పగలగొట్టమని ఆ యక్షుడు కోరుతున్నట్టు మనకు తెలియజేయాలంటే మార్మిక సంకేతాలతో పరిచయముండే మధ్యవర్తి అవసరం. వ్యాఖ్యాత లేకుండా, తనకు తానుగా ఆ శిల్పం మనకు అర్థం కాదు. అందువల్ల క్రీ.పూ. 3500 కాలంలో ఏర్పడిన ముడి లిపి, కాలానుగుణ్యమైన మార్పులూ చేర్పులతో మెరుగుపడుతూ వచ్చింది. మెసొపొటేమియా ప్రాంతంలోని క్యూనిఫాం లిపికి, పరిణామ క్రమంలోని ఒకానొక దశలో, సాహిత్యానికి వీలయ్యే రూపం ఏర్పడిందనటానికి తార్కాణం ‘గిల్గమేష్’ గ్రంథం. ఎడమనుండి కుడికి నడిచే పంక్తులతో, క్యునిఫాం లిపిలో రచించిన ‘పదకవిత’ ఈ గ్రంథం. మెసొపొటేమియా పీఠభూమి దక్షిణ కొసలో ఏర్పడిన ‘బాబిలోనియా’ సామ్రాజ్యానికి చిట్టచివరి పాలకుడైన ‘అషుర్బానిపాల్’ (క్రీ.పూ. 668-627) గ్రంథాలయంలో, అక్కాడియన్ భాషలో రచించిన ఈ పదకవితా కథ 12 మట్టిపలకలుగా దొరికింది. క్రీ.పూ. 1800 ప్రాంతానికే ఇది ఉనికిలోకి వచ్చినా, పరిష్కరించబడిన పాఠ్యాంతరం క్రీ.పూ. 1300-1000 మధ్యలో వెలువడిందిగా నిర్ధారించబడింది. రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 72
లిపి సంఖ్యకు సంకేతంగా అంకెల రూపంతో ఉనికిలోకి వచ్చిన లిపి, అనతికాలంలోనే పదార్థాలను గుర్తించేందుకు ప్రాకులాండింది. ఒక వృత్తం గీస్తే పున్నమి చంద్రుడు; ఆ వృత్తం వెలుపలిగా చుట్టూరా చిన్న చిన్న గీతలు గీస్తే సూర్యుడు; గీతలులేని అర్ధవృత్తం కొసలను వంకర చాపంతో కలిపితే మిగతా రోజులు చంద్రుడు; వృత్తాన్ని నలుపుతో నింపితే అమావాస్య! ఈ విద్యకు రాతియుగం నాటి నేపథ్యం ఉండనే ఉంది. చెట్టూ గుట్టూ పిట్టల వంటి ఇతర పదార్థాలకు రూపం సమకూర్చుకోవడం పెద్ద విశేషం గాదు కూడా. ఆలోచన తట్టగానే కసరత్తు మొదలయింది. సమృద్ధిగా రాయి దొరికే ఈజిప్టు వంటి ప్రాంతాల్లో శిల్పం, చిత్రలేఖనంతో ప్రయోగాలు ఊపందుకున్నాయి. లోహపు పనిముట్లు అందుబాటైన మీదట శిల్పంతో రూపొందించే చిత్రలిపికి నాణ్యత ఏర్పడింది. ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణం నాటికి ఈ ‘చిత్రలిపి’ గొప్పగా ప్రాచుర్యం సంపాదించుకుంది. పిరమిడ్ల అంతర్భాగంలో గోడలమీద మలచిన శిల్పాలు అలంకారప్రాయమైనవి మాత్రమే గాదు; కొన్ని సంఘటనలను గుర్తుజేసే చిత్రలిపి సంకేతాలు కూడా. దక్షిణ అమెరికాలో నివసిస్తున్న ‘అమెరిండియన్ల’లోనూ, దక్షిణ ఆఫ్రికాలో నివసిస్తున్న కొన్ని ఆటవిక జాతుల్లోనూ వ్యవహారాలు ఇప్పటికీ చిత్రలిపిలోనే సాగుతున్నాయి. అంతెందుకు - అక్షరజ్ఞానం లేనివాళ్లు సౌకర్యం కోసం రహదారుల వెంట కనిపించే గుర్తులకు ఉపయోగించేది చిత్రలిపే. రోడ్డు వంకరను తెలిపేందుకు వంకరగీత, రైల్వేగేటును తెలిపేందుకు గేటు గుర్తు, స్పీడ్‌బ్రేకర్‌ను తెలిపేందుకు మధ్యలో మూపురమున్న అడ్డగీత మొదలైనవి నిత్యం మన చూస్తూనే ఉన్నాం. వేరువేరు భాషలకు చెందిన ప్రయాణీకులకు ఆలవాలమైన అంతర్జాతీయ విమానాశ్రయాల్లో - ‘కప్పు సాపరు’ గుర్తు అల్పాహారశాలనూ, ‘నైఫ్ అండ్ ఫోర్క్’ గుర్తు భోజనశాలనూ, అనేక తదితర సదుపాయాలు ఇతర గుర్తులతోనూ సూచిస్తూ, ఇప్పటికీ తన సేవలను చిత్రలిపి మనకు అందిస్తూనే ఉంది. రాయి దొరకని మెసపొటేమియా, సింధుస్థాన్ వంటి ప్రదేశాల్లో లేఖనానికి అనువైన ఉపరితలంగా ప్రత్యామ్నాయాలు అవసరమయ్యాయి. ఆ ప్రాంతాల్లో అచ్చులుగా పోసేందుకు వీలయ్యే బంకమట్టి సమృద్ధిగా దొరుకుతుంది కాబట్టి, మట్టిపలక-మొనదేరిన పుడకలు లేఖనా సామగ్రీ ఉపయోగంలో కొచ్చాయి. అయితే, పచ్చిగా ఉండే పలకమీద కర్రములికితో వంపుగీతలు తొలచడం తేలికైన పనిగాదు. పైగా, వేగం పుంజుకుంటున్న వర్తకం తీరుబాటుగా నొక్కులు తీర్చేంత అవకాశం కల్పించదు. అందువల్ల, పచ్చిపలకమీద కర్రములికి తొలిచే నిలువు గీతలూ అడ్డగీతలూ వాళ్ల లేఖనానికి ఆధారాలయ్యాయి. ములికి విసురు (స్ట్రోక్)తో తొలిచే గీత, మొదటగా ములికి మోసిన తావులో కాసింత వెడల్పుగానూ, పైకి లేచిన చోట కోసుగానూ ఏర్పడటం సహజం. దరిమిలా ఆ లేఖనానికి అడ్డదిడ్డంగా పేర్చిన పొడవాటి మేకుల ఆకారం ఏర్పడటంతో, ‘క్యూనిఫాం లిపి’గా శాస్త్రజ్ఞులు నామకరణం చేశారు. తూకమైన రాతిపలకలూ, మట్టిపలకలకు మారుగా, దూరప్రాంతాలకు వర్తమానం చేరవేసేందుకు వీలయ్యే తేలికపాటి పరికరాలకోసం మరోవైపు అన్వేషణ మొదలయింది. పలుచటి చర్మం మీదనో, దళసరి బట్ట మీదనో రంగు మట్టి నుండీ, ఆకుల రసం నుండి లభ్యమయ్యే చిక్కటి ద్రవంలో మొనదేరిన లేఖిని ముంచి, సంకేతాలను పొందుపరచడం అమలులోకొచ్చింది. ఇలాంటి ఉపరితలం మీద వంకర తీగలకు అవరోధం తక్కువ. అద్ది రాసేందుకు తయారు చేసిన రంగు ద్రవం ‘సిరా’ (ఇంక్). సిరాను ఉపరితలం మీదికి బదిలీ చేసే లేఖినిగా చాలాకాలం ఉపయోగపడిన సాధనాలు - కుంచె, పక్షి ఈక, ఎన్నో దశలుగా ఎదిగి, నిన్నామొన్నటి దాకా లేఖినిగా ఉపయోగపడిన సాధనం ‘పాళీ’ (నిబ్). లోహ పరిశ్రమ నైపుణ్యం పెరిగిన తరువాత, ఇత్తడి పలకలూ, రాగి రేకులు కూడా వ్రాతపరికరాలుగా ప్రవేశించాయి. వీటి మన్నిక దీర్ఘమైనదే కానీ, లభ్యత ఖరీదులు అందరికీ అందుబాటయ్యే పరిమితిలో ఉండవు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 71
లిపి ‘లిపి’ అనేది మాటకు కల్పించబడిన రూపం. చెవులతో మాత్రమే గ్రహించేందుకు వీలయ్యే మాటను కంటితో గ్రహించేందుకు వీలుగా ఏర్పాటైన సౌకర్యం లిపి. గొంతు నుండి వెలువడే పలురకాల శబ్దాలను దేనికి దానిగా తెలుసుకునేందుకు వీలుగా ఏర్పాటైన అక్షరాల సమాహారం లిపి. ఒక తరంలో పుట్టిన విజ్ఞానం ఆ తరంలోనే అంతరించకుండా, తరువాతి తరాలకు అందించే సాధనంగా నాగరికతకు కొత్తకోణం ఆవిష్కరించిన ఘనత లిపికే దక్కుతుంది. అందులోని అక్షరాల ఉచ్చారణ వల్ల గోచరరూపం దాల్చిన మాట, తిరిగి శబ్దరూపానికి బదిలీ అవుతుంది. అక్షరాలకంటే ముందు సమాజంలో ప్రవేశించినవి అంకెలు. రాతియుగం పరికరాల్లో పాచికలను పోలిన గుర్తుండే గులకరాళ్లు దొరికిందాన్ని బట్టి, ఒకటి రెండు లెక్కించుకునే పరిజ్ఞానం అప్పటికే ఏర్పడి వుండొచ్చు. అయితే, అంకెలతో ప్రయోజనం అప్పట్లో అంతగా ఉండి ఉండదు. మానవుడు పశువుల కాపరి జీవితంలో ప్రవేశించిన వెనువెంటనే అంకెల పరిజ్ఞానాన్ని మెరుగు పెట్టుకోవలసిన అవసరం తన్నుకొచ్చింది. తన మందలో జీవాలు ఎన్ని ఉన్నాయో లెక్కించుకునేందుకు ప్రాథమికమైన గణితం కావాల్సి వచ్చింది. పెద్ద పెద్ద బండలమీద బొగ్గుతోనో, సుద్దతోనో వేలెడంత నిడివిగల గీతలతో అతని గణితం మొదలయింది. జీవాల సంఖ్య పెరిగినప్పుడు గీతలు పెంచడం, తరిగినప్పుడు నిలువుగీతను చిన్న అడ్డగీతతో రద్దుపరచడం. వలస జీవితంలో నివాసం మారినప్పుడల్లా రద్దుకాకుండా మిగిలిన నిలువు గీతలన్నింటిని కొత్త ప్రదేశంలో తిరిగి గీసుకుంటూపోవడం ప్రయాసతో కూడిన పనిగా కొంతకాలానికి తెలిసొచ్చింది. ప్రత్యామ్నాయంగా, సంఖ్యను గుర్తుంచుకునేందుకు గులకరాళ్లనూ, బంకమట్టి బిళ్లలనూ ఆశ్రయించాడు. బండరాళ్లు దొరకని మెసపొటేమియా వంటి ప్రదేశాల్లో బంకమట్టి బిళ్లలు అంతకుముందే ఉనికిలోకి వచ్చిండొచ్చు కూడా. ఈ దశలో అతనికి ఇష్టమైనవి జత, ఉడ్డా (నాలుగు), డజను (పన్నెండు) వంటి సరిసంఖ్యలు. వాటిని భాగించడం తేలిక. భాగించేందుకు బేసి సంఖ్యతో తకరారు. ఆ రాళ్లనో బిళ్లలనో పాత్రలో భద్రంచేసి, ఉరువు (ఐటెమ్) కలిసొచ్చినప్పుడు ఒక బిళ్లను కలపడం. తరిగినప్పుడు పాత్ర నుండి ఒకటి తీసేయడం ద్వారా తన జ్ఞాపకశక్తికి సహకారంగా భౌతికమైన ఆధారాన్ని కల్పించుకున్నాడు. ఒంటిగీత బిళ్ల ఒకటి సంఖ్యకు, రెండుగీతలు రెండుకు, మూడు గీతలు మూడుకు సంకేతాలయ్యాయి. ఒకే బిళ్లమీద నాలుగు గీతలకు మించి ఇమడకపోయినా, ఈ పద్ధతివల్ల బిళ్లల సంఖ్య ఇదివరకటి కంటే చాలా తగ్గుతుంది. కానీ, అదే పనికి ఇంకా ఇంకా తేలికైన మార్గాలను అన్వేషించేందుకు తపనపడే మెదడు, ఉన్నచోటునే ఆగిపోదు. దానికి తోడు, జీవితంలో వర్తకం ప్రవేశంతో, దానికి అనుకూలంగా తమ రూపు రేఖలు దిద్దుకోవలసిన అగత్యం అంకెలకు ఏర్పడింది. దశలవారీగా అంకెలకు సంభవించిన మార్పుకు సూచనగా ‘రోమన్’ అంకెలతో తయారైన గడియారాలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ పద్ధతిలో ఒకటి, రెండు మూడు సంఖ్యలకు మన మామూలుగా వాడుతున్న అంకెలకు మారుగా, ఐ, ఐఐ, ఐఐఐ అనే సంకేతాలుంటాయి. రోమన్లు ఇటీవలి కాలం దాకా (బహుశా ఇప్పుడు కూడా) అంకెలకు నిలువు గీతలే వాడుకున్నారు. గీతల వరుస ఇలా అనంతంగా పొడిగించుకుపోతే సౌకర్యం తగ్గుతుంది. ఆ ఇబ్బందిని అధిగమించేందుకు, కొన్ని కొన్ని స్థానాల్లో వాటిని తెంచుకుంటూ వచ్చారు. ఉదాహరణకు - ఐదు అంకెకు సంకేతం, గ, పదికి గీ, యాభైకి ఔ, నూటికి ఇ - ఇలా. ఈ పెద్ద సంఖ్యల నుండి ఒకటి తగ్గించాలంటే దానికి ఎడమవైపు గీత, పెంచాలంటే కుడివైపు గీతలతో సూచించారు. రోమన్లకు వలెనే మిగతా నాగరిక ప్రదేశాల్లో కూడా వారివారి సదుపాయాన్నీ, ఆలోచననూ బట్టి, రకరకాల అంకెలు ఏర్పడుతూ వచ్చాయి. కానీ, విస్తరించే వాణిజ్యం ధాటికి తట్టుకోలేక అవి వాడుక నుండి తప్పుకోవడంతో, అరబిక్ సంప్రదాయంలో పుట్టిన అంకెలు ఇప్పటి ప్రపంచాన్ని ఏలుతున్నాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 69
ఆచారాలు-నమ్మకాలు వైదికకర్మ ప్రాధాన్యతకు భిన్నంగా ‘భక్తి’ని సారాంశంగా మలుచుకున్న రచన భాగవతం. ఐనా, భాగవతంలో దేవతలకు ఆలయాలున్న విరివి కనిపించదు. క్రీ.పూ. 400 కాలానిదైన పాణిని వ్యాకరణం ద్వారా ‘వాసుదేవుని ఆరాధన’ ప్రజల్లో చొరబడినట్లు సూచనలగా తెలుస్తుంది. మౌర్య చంద్రగుప్తుని పాలనలో స్థానికసంస్థలు నిర్వహించే బాధ్యతల జాబితాలో దేవాలయాల నిర్వహణ కూడా ఒక అంశంగా ‘ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ’వారి హిందూదేశ చరిత్రలో మాటమాత్రంగా కనిపించడం మినహా, ఆ వంశం రాజులు దేవాలయాలు నిర్మించినట్టు ఆధారాలు లేవు. క్రీ.శ. 213లో ఇక్ష్వాకు వంశానికి (ఇది రామాయణ ఇక్ష్వాకువంశం కాదు) చెందిన ఎహువళ శాంతమూలుడు అనే రాజు కట్టించిన ‘పుష్కభద్రస్వామి’ దేవాలయం (నందికొండ, నల్గొండ జిల్లా) భారతదేశంలోనే మరో నాలుగు ఆలయాలు కూడా నిర్మాణమైనట్టు చరిత్రకు తెలుస్తూంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి సమీపంలోని ‘గుడిమల్లం’ గ్రామానికి చెందిన శివాలయం భారతదేశానికి మొదటిదని మరికొందరి వాదన. ఇవి కాకపోతే మరొకటో మరొకటో మొట్టమొదటి దేవాలయంగా వెలుగుచూసే అవకాశం దక్షిణ భారతదేశానికే ఉంది. దానికి కారణాలు రెండు. పడమటి నాగరికతలతో సింధూనాగరికతకు బలిష్టమైన వ్యాపారసంబంధాలు చిరకాలంగా కనొసాగినా, తాత్విక సంప్రదాయాలను వాళ్ల నుండి అది స్వీకరించకపోవడం మొదటిది. ఆ తరువాతి కాలంలో విగ్రహారాధన ఇచ్చగించని ఆర్యసంప్రదాయం సింధూనది పొడవునా పటిష్టమైన కోటగోడగా నిలవడం రెండవది. అందువల్ల ఉత్తరభారతదేశంలో దేవాలయాల స్థాపనకు ఆస్కారం లేకుండా పోయింది. అటువంటి అవరోధం దక్కన్ (దక్షిణ) పీఠభూమికి లేదు. సముద్రమార్గంలో దక్కన్కు పడమటి వైపుండే మెసొపొటేమియాతోనూ, తూర్పు వైపుండే ఆగ్నేయ ఆసియాలోని ఇండోనేషియా, మలేషియా, థాండ్లాండ్, కాంబోడియా తదితర దేశాలతోనూ క్రీ.పూ. 1500 నాటి నుండే నిరవధికమైన వ్యాపార సంబంధాలు కొనసాగాయి. ద్రవిడ నాగరికత ఏ కారణంగానో మెసొపొటేమియా నుండి దేవాలయాల సంస్కృతిని స్వీకరించింది. ఆ సంస్కృతి దక్షిణభారతదేశంలో నెరుసుకున్న తరువాత ఉత్తర భారతదేశంలో క్రీ.శ. 12వ శతాబ్దం దాకా ఆలయనిర్మాణం జరిగిన దాఖలాలు చరిత్రకు దొరకలేదు. ఆగ్నేయ ఆసియాలోని థాయిలెండ్, కాంబోడియా వంటి దేశాల్లోని దేవాలయాలు దక్కన్‌లోని ఆలయాల నమూనాకు నకళ్లు మాత్రమే. ఇంతదాకా ప్రస్తావించిన నాగరికతలకు దూరంగా, వెలుపలిగా ఎదిగిన నాగరికత చైనాది. పడమటి సరిహద్దుగా దుర్గమమైన పర్వతాలూ, తూర్పున పసిఫిక్ మహాసముద్రాల అవరోధంవల్ల, ప్రాచీనకాలంలో ఆ దేశానికి ఇతర నాగరికతలతో సంబంధాలు పరిమితం. క్రీ.పూ. 3000 నాటికే, ‘పట్టుమార్గం’ (సిల్క్ రూట్) ద్వారా ఇతర ప్రదేశాలకు చైనా నుండి పట్టుబట్టల రవాణా జరిగేదని చరిత్రకు కొన్ని ఆధారాలున్నాయి. పట్టుబట్టలకు ‘చీనాంబరాలు’గా గుర్తింపు మన ప్రాచీన సాహిత్యంలోనూ కనిపిస్తుంది. రావాణా మార్గమంటూ ఏర్పడిన తరువాత ఎగుమతులూ ఉంటాయి, దిగుమతులూ ఉంటాయి. ఈ మార్గాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, సంస్కృతుల బదిలీలు జరుగుతాయి. ఐనా, చిత్రమేమిటంటే, ఇతర ప్రాచీనసంస్కృతుల్లోని ఏవొక్క దానితో ఏమాత్రం పోలికలేనిది చైనీయుల తాత్వికచింతన. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 68
మెసొపొటేమియాలో మొదలైన దేవాలయ సంస్కృతి, అనతి కాలంలోనే పడమరగావున్న ఈజిప్టుకూ, ఉత్తరంగా మధ్యధరాసముద్రానికి ఆవలిగట్టునున్న గ్రీసుకూ ఆగమేగాల మీద ప్రాకిపో?ఇంది. ఐతే, ఈజిప్టు దేవాలయాలకూ మెసొపొటేమియా దేవాలయాలకూ నమునాలో కొంత తేడా ఏర్పడింది. మెసొపొటేమియన్ దేవాలయాలు విధిగా తూప్పు ముఖానివై ఉంటాయి. నిర్దేశించిన పండుగనాడు సూర్యోదయం తొలికిరణాలు, కుడి ఎడమల చీకటి మయంగా ఉండే నడవను ప్రాకి, బలిపీఠం వెనకుండే విగ్రహాన్ని కొన్ని క్షణాలపాటు దేదీప్యమానం చేసే దిశగా ముఖద్వారం ఏర్పాటైవుంటుంది. ఈజిప్టు పిరమిడ్లు కూడా చాలావరకు తూర్పు ముఖానివే. అరుదుగా పడమటి ముఖాలవి కూడా కనిపిస్తాయి. ఈజిప్టు పాలకుడు ‘ఫ్యారో’ తల అమర్చిన సింహం ప్రతిమలు (స్పింక్స్) తూర్పు ముఖంగానే ఉన్నాయి. కానీ, నైలునది దక్షిణ ప్రాంతంలోని గుళ్ళు ‘సిరియస్’ నక్షత్రానికి అభిముఖంగా ఉత్తరానికి తెరుచుకుంటూ ఉన్నాయి. దీన్నిబట్టి, సూర్యునికీ నక్షత్రాలకూ మధ్యనున్న అనుబంధం మీద ఈజిప్షియన్లకు కొంత అవగాహన మొదలైనట్టు తెలుస్తుంది. క్రీ.పూ. 4000 సంవత్సరాలనాడు ఏర్పడిన సంతలకు క్రమేణా ప్రాధాన్యత విస్తరించి, మెసొపొటేమియాకు నలుదిక్కులతో వాణిజ్య సంబంధాలు నెలకొనడంతో, ఈజిప్టు, గ్రీకు, సింధూ నాగరికతల్లోని స్థిరనివాసాలతో అనుబంధం ఏర్పడడమేకాక, దరిదాపుల్లోని సంచారజాతులతో శత్రు-మిత్ర సంబంధాలు ఉనికిలోకొచ్చాయి. దరిమిలా, సరుకుల ఎగుమతి దిగుమతులేగాక, వణిజుల రాకపోకలు కూడా ముమ్మరం కావడంతో సరుకుల రవాణా కంటే వేగంగా సాంస్కృతికమైన అభిప్రాయాలూ, విశ్వాసాలూ విస్తారంగా నెరుసుకునే వాతావరణం ఏర్పడింది. పరాయి ప్రదేశంలో పుట్టిన విశ్వాసాల్లో ఏది అనుకూలమో దాన్ని స్వీకరించడం, ఏది ప్రతికూలమో దాన్ని వదిలెయ్యడం మూలంగా, నాగరికజాతుల సంస్కృతి కలగాపులగమైన మిశ్రమంగా చాలాకాలం మనుగడ సాగించింది. ఆ మధ్యకాలంలో, దేవాలయాల నిర్మాణం సందర్భంగా ‘దేవునికి ఒక రూపం కల్పించడం ఎలా?’ అనే సమస్య తలెత్తింది. ‘మనిషీ, జంతువూ తదితర ప్రాణికోటి సమస్తం ఆయన సృష్టే అయినప్పుడు దేవుని ఆకారం ఒకానొక మానవునికి మల్లే ఎందుకుంటుంది? తన పోలికలోనే వున్న ఆకారం మనిషి నుండి విధేయతను శాసించగలదా?’ అనే చింతన ఈజిప్టు, మెసొపొటేమియాల్లోని విగ్రహాల స్వరూపాన్ని నిర్ణయించింది. ఈ విగ్రహాలు గొంతునుండి కాళ్ళదాకా మానవుని ఆకారంలో వున్నా, తలమాత్రం పక్షిదో పశువుదో అయ్యుంటుంది. చేప దేవతలైతే, బొట్టు కిందిభాగం చేప, పైభాగం మనిషి. ఎందుకోగానీ గ్రీకులు మాత్రం ఈ నమ్మకానికి చోటివ్వలేదు. వాళ్ల దేవతల విగ్రహాలన్నీ మానవుని పోలికలోనే వుంటాయి. దేవునికి ఒట్టిచేతులతో, వినయపూర్వకమైన భంగిమలతో తృప్తిపరచడం చాలదనే ఆలోచన ఆలయాల నిర్మాణానికి పూర్వమే ఏర్పడిందో, తరువాత ఏర్పడిందో గానీ, దేవాలయాల్లో ‘బలి’ అనేది విధిగా ప్రవేశించింది. ప్రతి దేవాలయంలోనూ విగ్రహానికి ఎదురుగా కొంతదూరంలో బలిపీఠం వెలిసింది. బలిని సమర్పించే ముందు, భక్తుని విధేయతను కళ్ళారా చూసేందుకు ఆ దేవుడ్ని ఆహ్వానించాలి. అందుకు తగిన మనిషి కావాలి, తగిన వాగ్ధాటి కావాలి. ఫలితంగా ప్రతి దేవాలయానికీ ఒక అర్చకుడు (పూజారి) అవసరమయ్యాడు. అతను స్థిరంగా పాదుకున్నాడు. ఆ అర్చకుని మూలంగా ఆచారాలూ, నమ్మకాలు మరింత జటిలంగా పెనవేసుకుని, సమాజంలోని కట్టుబాట్లను శాసించడం మొదలెట్టాయి. రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 67
ఆచారాలు - నమ్మకాలు పశుపోషణ వల్ల మానవుని నివాసం గుహల్లో నుండి తోలు గుడారాలకు మారింది. ఐనా, అది పచ్చికబయళ్ళను వెదుక్కుంటూ సాగిన సంచార జీవితమే. కాకపోతే, వంటకు మట్టిపాత్రలు ప్రవేశించినట్టు కనబడుతుంది. చాలా శతాబ్దాల తరువాత, సంచారజీవనం మందగించింది అనటానికి ఆనవాళ్ళు మట్టిగోడలమీద పూరి కప్పుతో నిర్మించుకున్న గుడిసెలు, ఆ సమయానికి మట్టి పాత్రల నాణ్యత, వైవిధ్యం బాగా పెరిగింది. మట్టిగోడలనూ పాత్రలనూ రంగుతోనో పూజలతోనో అలంకరించడమే గాక, ఆ అలంకరణల్లో సూర్యుడూ చంద్రుడూ, పాములూ, నదులూ, చెట్లవంటి ప్రకృతి దృశ్యాలు చోటు చేసుకోవడం కనిపిస్తుంది. క్రీ.పూ.6000-5000ల ప్రాంతంలో నదుల పరీవాహక పీఠభూములను ఆశ్రయంచి మానవుడు స్థిర నివాసాలకు పూనుకున్నాడు. ఇటుకలతో కట్టిన గోడలూ, స్తంభాలూ దూలాలూ దంతెలతో పటిష్టమైన పైకప్పు ఏర్పడిన విశాల నివాసానికి అతని జీవితం మారిపోయింది. క్రీ.పూ.5000 సంవత్సరాల తరువాతి కాలంలో మానవుని స్థిర నివాసాలు పెద్ద పెద్ద గ్రామాలుగానూ, నగరాలుగానూ రూపొందుతున్న దశలో, జనావాసాలకు మధ్యలో ఒక దేవాలయాన్ని నిర్మించుకునే సంప్రదాయం మెసొపొటేమియాలో మొదలయింది. యూఫ్రాటెస్ నదీతీరంలో, పర్షియన్ గల్ఫ్ ఉత్తరాన త్రవ్వకాల్లో బయటపడిన ‘నిప్పల్’ నగరంలోని దేవాలయాన్ని ప్రపంచ మొత్తంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయంగా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఇతర ఆధారాల మూలంగా అది ‘ఎన్-లిన్’ దేవునికి (గాలి దేవునికి) కట్టిన ఆలయంగా భావించారు. ఐతే ఆ దేవాలయ శిధిలాల్లో ఎలాంటి ప్రతిమ దొరక్కపోవడంతో దృగ్గోచరంగాని ‘గాలి’కి రూపం ఎలాంటిది కల్పించారో తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. రాతిలో మలచిన విగ్రహం కాక, అది మట్టితో తయారైన ప్రతిమే అయ్యుంటే గోపురం కూలినప్పుడు చితికిపోయైనా ఉండాలి. లేదా ప్రతిమను ప్రతిష్టించేలోపే కూలిపోయిందైనా అయ్యుండాలి. ‘దేవుని విగ్రహాన్ని మట్టితో ఎందుకు చేస్తారు’ అనే సంశయం రానక్కరలేదు. నిన్నా మొన్నటి వరకు వినాయకుని బొమ్మలు మట్టితో చేసినవిగానే ఉండేవి. దక్షిణ భారత దేశంలో జరుగుతున్న ‘దేవర’ అనే గ్రామదేవతల ఉత్సవానికి ఇప్పుడు గూడా పెద్దమ్మ చిన్నమ్మ ప్రతిమలు బంకమట్టితో చేస్తున్నారు. అలాంటప్పుడు, రాయి దొరకడం దుర్లభమైన దక్షిణ మెసపొటేమియాలో బంకమట్టి ప్రతిమలు అసంభవంగాదు. ‘ఒకవేళ ఆ దేవాలయానికి వాళ్ళు ప్రతిమను స్థాపించాలని ఉద్దేశించలేదేమో’ అనుకునేందుకూ వీలుగాదు. రూపానికి అతీతుడైన ‘ఎహోవా’ పట్ల ఏకోపాసకుడైన ఇజ్రేలీ పాలకుడు సాల్మన్, తన రాజధాని ‘జెరూసెలం’లో ప్రతిమలేని దేవాలయం నిర్మించక పూర్వమున్న ప్రతి దేవాలయ శిధిరలంలోనూ విధాగా విగ్రహం కనిపిస్తుంది. ఇప్పుడున్న దానికంటే పర్షియన్ గల్ఫ్ ఆ రోజుల్లో భూభాగంలోకి మరింత లోతుగా చొచ్చుకుని ఉండేది. అందువల్ల, సముద్రతీరానికి చేరువలో ఉన్న నిప్పర్ నగరం విదేశావర్తకానికి ప్రసిద్ధి కెక్కిన కేంద్రమై ఉండొచ్చు. తెడ్లూ తెరచాపల సహాయంతో పయనించే ఆనాటి నౌకలకు గాలివాటు మిక్కిలి ప్రాధాన్యత కలిగిన అంశం. గాలి అనుకూలిస్తే అనుకున్న దిశగా ఫ్రయాణం సాగి, గమ్యం చేరుకోవడం తేలిక. విజృంభిస్తే నావికుల జీవితాలు అల్లకల్లోలమై చావుబ్రతుకుల అంచుకు చేరుకుంటాయి. అందువల్ల, గాలిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలనే తాపత్రయం నావికుల బృందంలో బలంగా ఏర్పడేందుకు అవకాశాలు మెండు. కాబట్టి, నిప్పర్లో నిరిచిన దేవాలయం గాలిదేవుని ప్రీతికోసం ఏర్పాటుచేసుకున్నదే అయ్యుండాలి. రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 66
ఆచారాలు - నమ్మకాలు అదే దశలో, మనిషికి చేయవలసిన పనులూ (కర్తవ్యాలు), మనుషులు చేయడగూడని పనులూ (నిషేధాలు) అనేవి ఒక క్రమంలో పటిష్టమై, ఆచారాల జాబితాలో కలిసి, అనుభవజ్ఞుల జ్ఞాపకంలో పొడవాటి సరంగా పాదుకొని ఉండాలి. అలా కాకపోతే, గుంపును క్రమశిక్షణలో ఉంచడం సాధ్యాపడదు. క్రమశిక్షణ లేని గుంపుకు మనుగడ ఉండదు. ఆనాటి గుంపులు నిరవధికంగా మనుగడ కొనసాగించడమేగాక, తెగలుగానూ, జాతులుగానూ ప్రపంచవ్యాప్తంగా విసృ్తతి చెందడమే పై సమాచారానికి రుజువు. మరికొంత ముందుచూపు ఏర్పడిన తరువాత, సంచార జీవితంలోనే పశువుల కాపరిగా నెలకొన్న దరిమిలా, సూర్యచంద్రులవల్ల ప్రయోజనం తనకు ఇదివరకు తెలిసినదానికంటే చాలా ఎక్కువగా ఉందని మానవుడు గ్రహించాడు. వలసలకు పగిటివేళలు అనుకూలమైనవిగా ఎన్నుకున్నాడు. పొద్దు పొడుపు, పొద్దు క్రుంకు ప్రదేశాలను తూర్పు పడమరలుగా విభజించుకున్నాడు. నక్షత్రాలను గుర్తించడం ద్వారా ఉత్తర దక్షిణాలను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. పిల్ల తెమ్మర, విసురుగాలి, హోరుగాలి, ప్రచండమారుతం, ప్రళయమారుతం వంటి తేడాలతో గాలి ప్రవర్తించడం గమనించాడు. చిరుజల్లు మొదలు జడివాన దాకా వర్షపాతంలోని తేడాలను తెలుసుకున్నాడు. వాటి అనుకూలతను బట్టి వలసలను మలుచుకోవడమేగాదు, వాటిని సర్వసాధారణమైనవిగాకాక, ఏదో ప్రత్యేకతలు వాటిలో ఉన్నట్లు అనుమానించాడు. పశువుల కాపరిగా ఇప్పుడతనికి దిక్కులతోనూ, వాతావరణంతోనూ, వర్షాలతోనూ అనుబంధం ఏర్పడటమేగాక, నేల కొలతలతో గూడా అవసరం తన్నుకొచ్చింది. అవెస్టాలో ప్రకృతి శక్తుల సమాచారం ఉన్నప్పటికీ వాటి ప్రాముఖ్యత పెద్దగా కనిపించదు. న్యాయం, ధర్మం వంటి సామాజిక అంశాలకే అందులో ప్రాధాన్యత కనిపిస్తుంది. రుగ్వేదంలో భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నిప్పు, నీరు వంటి దృగ్గోచర పదార్థాలకేగాక, గాలికీ, శౌర్యప్రతాపాల వంటి గుణాలకూ, జ్ఞానానికి, శరీరంలో ఉత్పన్నమయ్యే ఉద్రేకాలకూ రూపం కల్పించి, వాటివల్ల ఒనగూరే ప్రయోజనాలను పొందేందుకూ, వాటివల్ల కలిగే నష్టాలను నివారించుకునేందుకూ, ఆశక్తులకు ‘ప్రీతి’ కలిగించే కార్మకాండ ప్రారంభమయింది. ఈ అడుగుతో, ప్రలోభాలతోపాటు భయం కూడా నమ్మకాల జాబితాలో చేరిపోయింది. రుగ్వేద కాలంనాటికి తిథులూ, మాసాలూ ఏర్పడిన దాఖలాలు కనిపించవు. కానీ ‘సినీవాలి’ ప్రస్తావనతో చాంద్రాయణాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు బోధపడుతుంది. బైబిల్లోని ‘నోవా అండ్ ది ఆర్క్’ వృత్తాంతం వివరంగా పరిశీలిస్తే, ఆ ఘోరమైన జలప్రళయం నాటికి చాంద్రాయణమాసం, దినాలూ మెసపటోమియా ప్రాంతంలో అప్పటికే ఏర్పడినట్టు అర్థమౌతుంది. ‘బుక్ ఆఫ్ జెనిసిస్’ తొలి అధ్యాయంలో దేవుడు మొదటి రోజు నుండి ఆరవరోజు వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించి, ఏడవరోజు విశ్రాంతి తీసుకున్నట్టుగా ఉండడంతో, బైబిల్ తయారౌతున్న సమయానికి కాలాన్ని రోజులుగా విభజించి, ఏడురోజులు కలిపి ఒక ‘వారం’గా చేసుకున్న ఏర్పాటు వెల్లడౌతుంది. లెక్కింపు కోసం కాలాన్ని విభజించుకునే ప్రయత్నం రుగ్వేదకాలం తరువాతి ఆర్యుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాంద్రాయణ మాసాన్ని నాలుగు వారాలుగా కాకుండా, రెండు ‘పక్షాలు’గా విభజించుకున్నారు. చంద్రుడు పెరగడం మొదలుపెట్టి పూర్ణబింబంగా ఎదిగేవరకు నడిచేది ‘శుక్లపక్షం’. చంద్రుడు తరిగేది మొదలై పూర్తిగా మాయమయ్యేవరకు నడిచేది ‘బహుళపక్షం’ వారంలోని విభజన ఏడు రోజులై ఉండగా, పక్షంలోని విభజన పదిహేను తిథులకింద జరిగింది. మహాభారత కాలంనాటికి కూడా దినాలను తిథులతోనేగాని, ‘సోమవారం, మంగళవారం’ వంటి రోజులుగా లెక్కించడం కనిపించదు. ఆ తిథుల్లో కొన్ని మంచివిగానూ, మరికొన్ని చెడ్డవిగానూ భావించే సంప్రదాయం ఏర్పడినట్టు కనిపించదు. ఎందుకంటే, మహాభారతంలో శుభకార్యాలకు సుముహూర్తాలు కనిపించవు గాబట్టి. లెక్కింపు కోసం కాలాన్ని విభజించుకునే ప్రయత్నం రుగ్వేదకాలం తరువాతి ఆర్యుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. చాంద్రాయణ మాసాన్ని నాలుగు వారాలుగా కాకుండా, రెండు ‘పక్షాలు’గా విభజించుకున్నారు. చంద్రుడు పెరగడం మొదలుపెట్టి పూర్ణబింబంగా ఎదిగేవరకు నడిచేది ‘శుక్లపక్షం’. చంద్రుడు తరిగేది మొదలై పూర్తిగా మాయమయ్యేవరకు నడిచేది ‘బహుళపక్షం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 63
ఆచారాలు-నమ్మకాలు సింహం కలలోకొచ్చిన ఏనుగు, తిరిగి మెలకువలోకి రాకుండా, అదే నిద్రలో చనిపోతుందనేది ఒక నమ్మకం. ఏనుగు కాదుకదా, మాటలొచ్చిన మనిషైనా నిద్రలో హఠాత్తుగా చనిపోతే, తను ఏ కల కారణంగా అంతటి అవాంతరానికి గురయ్యాడో చెప్పుకోలేడు. పైగా, జంతువులకు కలలుగనే స్థోమత ఉందో లేదో మనకు తెలీదు. కలలు కనాలంటే అనేక సోపానాలుగా పనిచేయగల స్థాయికి మెదడు ఎదిగుండాలి. మైకంలోకి జారిపోయిన మనిషికి ‘ఉలుకూ లేదు, పలుకూ లేదు’ అంటుంటాం. పలుకు అనేది స్పృహలో ఉంటే తప్ప జరగని చర్య. ఉలుకు అంటే అసంకల్పిత చర్య. బాగా నిద్రలో వున్న మనిషికి ఎక్కడైనా ఏదైనా చురుకు తగిలితే మెలకువలోకి రాకుండానే దూరంగా సర్దుకుంటాడు. లేదా చేత్తో రుద్దుకుంటాడు. అది అసంకల్పిత చర్య. ఈ రెండు చర్యలు మెదడు అనే పదార్థం శరీరంలో ఏర్పడిన ప్రతి జీవిలో కనిపిస్తాయి. సందర్భ శుద్ది లేకుండా ఎవరైనా మాట్లాడితే - ‘మన లోకంలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. లేదా ‘స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా?’ అంటాం. అంటే మాట్లాడడం అనే చర్య స్పృహలోనూ జరుగుతుంది, స్పృహ తగ్గినప్పుడూ జరుగుతుంది కానీ, స్పృహ కోల్పోయినప్పుడు జరగదు అని మనందరికీ తెలుసు. దీన్నిబట్టి, మనిషి మెదడు స్పృహ, మగత, లేదా మత్తు, మైకం అనే సోపానాల్లో పనిచేయగల స్థాయికి ఎదిగిపోయిందని తెలుస్తుంది. ఏళ్ల తరబడి సంపాదించిన అనుభవాలను విశ్లేషించి, ప్రోగు చేసుకుని, ఎన్నో ఏళ్లు గడిచేదాకా దాచుకుని, అవసరమైన ప్రతి సందర్భంలోనూ ఆలోచనతో అనుసంధానం చేసే ప్రక్రియ ‘స్పృహ’. ఆలోచనా సంబంధంగా కాకుండా, దాచుకున్న సమాచారాన్ని అస్తవ్యస్తంగా వెళ్లగక్కే ప్రక్రియ ‘మగత’. ఇది కలలో దృశ్యంగానూ జరగొచ్చు, ప్రేలాపనలోనూ జరగచ్చు. ఈ రెండే కాకుండా మరిన్ని సోపానాల్లో ఆరోహణ, అవరోహణ చేయగల సమర్థత మనిషిలోని పెద్దమెదడుకు ఏర్పడింది. అందువల్లే మనిషికి ‘కల’ అనే ఒక అవస్థ సాధ్యపడింది. ఉదాహరణకు - మందలో తనతోటి జంతువొకటి చనిపోతే, ఆ ఎడబాటు మందలో మిగతా జంతువులకు ఎంతసేపు గుర్తుంటుందో చెప్పలేం. చావును వాసనబట్టే శక్తి ఉందిగాబట్టి అది చనిపోయిందని తెలుసుకోగలవు. అయినా దాన్ని అక్కడే వదిలేసి దూరంగా తొలగిపోతాయి. చంటిబిడ్డ చనిపోయినప్పుడు, చావు వాసన తెలిసికూడా, కడుపు తీపితోనో లేక తిరిగి ప్రాణం తెచ్చుకుంటుందనే ఆశతోనో రెండు మూడు రోజులదాకా శవం దగ్గరే కాపలా కాచే జంతువులు కూడా కనిపిస్తాయి. ఆ స్వల్పమైన వ్యవధి దాటిపోయిన తరువాత ఆ జంతువు జ్ఞాపకాల్లో ఆ బిడ్డ ఎన్నిరోజులు నిలుస్తుందో మనకు అర్థం కాదు. ఆ విషయంగా జంతువు ప్రవర్తనకూ, మనిషి ప్రవర్తనకూ పోలిక లేనంత వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ వ్యత్యాసం పాత రాతియుగం కాలానికే ఏర్పడిందని మనం కచ్చితంగా చెప్పుకోవచ్చు. సన్నిహితుల్లో ఎవరైనా చనిపోతే, వాళ్ల జ్ఞాపకాలు మనిషిని ఏళ్ల తరబడి వెంటాడడమే కాదు,అడపాదడపా వాళ్లు కలలో కనిపించడం కూడా కద్దు. పాత రాతియుగం మనిషి కూడా చనిపోయిన నేస్తానికి తిరిగి ప్రాణం వస్తుందనే ఆశతో కొంతకాలం దాకా కాచుకుని గడిపి వుండొచ్చు. నిరాశతో శవాన్ని వదిలేసి ముందుకు సాగిపోయిన తరువాత కూడా జ్ఞాపకాల దాడిని తట్టుకోలేక శవమున్న చోటికి తిరిగిరాగానే - కుక్కలూ, నక్కలూ, కాకులూ, గద్దలూ ఛిద్రం చేసిన దృశ్యాన్ని సహించలేక, తనకు కావలసినవారి మృతదేహం వాటి బారిన పడకుండా చూసే మార్గాలను ఆలోచించే అవసరం అప్పుడు కలిగుండొచ్చు. ఆ ఆలోచన ఫలితంగా పుట్టిన ఆచారమే ‘శవసంస్కారం’. ఈ సంస్కారం ప్రధానంగా మూడు పద్ధతుల్లో కనిపిస్తుంది. (సశేషం) రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర - 61
జాతులు నుడికారాలు ‘‘వాళ్ళందరూ ఒకే ప్రజ. వాళ్ళందరిది ఒకే భాష. తూర్పుదిశ నుండి పడమరగా పయనిస్తూ వాళ్ళు ‘షినోర్’ పీఠభూమి చేరుకుని, ఆ ప్రదేశాన్ని నివాసం చేసుకునేదాకా వాళ్ళ ప్రయాణం కొనసాగింది. ‘పదండి. ఇటుకలు తయారుజేసి వాటిని బాగా తంపటం పెడదాం.’ అంటూ వాళ్ళు పరస్పరం మాట్లాడుకున్నారు. రాళ్ళకు బదులుగా ఇటుకలు సమకూర్చుకున్నారు. అడుసుకు బదులుగా జిగురును రూపొందించుకున్నారు. ‘పదండి. మనమొక నగరాన్ని నిర్మించుకుందాం. శిఖరం స్వర్గాన్ని తాకేలా ఒక గోపురం నిర్మిద్దాం. మనకు ఒక పేరు పెట్టుకుందాం. ఆనవాలు లేకపోతే మనం ఈ నేలమీద ఎక్కడెక్కడికో చెదిరిపోతాం’ అనుకున్నారు. మానవసంతానం నిర్మించిన నగరాన్నీ, గోపురాన్నీ చూసేందుకు దేవుడు దిగివచ్చాడు. ‘ఔరా! వీళ్ళంతా ఒకే ప్రజ. వీళ్ళందరికీ ఒకే భాష. కాబట్టే ఇంతటి కార్యానికి పూనుకున్నారు. తమ ఊహకు ఏది అందితే దాన్ని సాధించకుండా వీళ్ళను అడ్డుకోవడం ఎవ్వరికినీ సాధ్యంగాదు. పద. కిందికి దిగి వాళ్ళ భాషను అయోమయం చేద్దునుగాక. ఒకరు మాట్లాడింది మరొకరికి అర్థంగాకుండా చేద్దునుగాక’ అనుకున్నాడు. దరిమిలా దేవుడు వాళ్ళను నేల నాలుగు చెరగులకు వెదజల్లాడు. దాంతో వాళ్ళ నగర నిర్మాణం ఆగిపోయింది. ఆ కారణంగా దానికి ‘బేబెల్’ అనే పేరొచ్చింది. ఇది శాస్త్ర విజ్ఞానం పరిణతి చెందని కాలంలో ఏర్పడిన ఊహలకు ప్రతిబింబంగా నిలిచే కథ మాత్రమే. మానవులు జాతులుగా విడిపోయే ప్రక్రియ క్రీస్తుకు పూర్వమే జరిగిపోయిందనే సూచన మినహా, ఈ కథ వల్ల చరిత్రకు ఒనగూరే ఉపకారం పెద్దగా లేదు. దొరికిన ఆధారాలను బట్టి, క్రీ.పూ. 5000 సంవత్సరాల దరిదాపుల్లో కొంత జనసమూహం కొన్ని కొన్ని జాతులుగా ఏర్పడినట్టు చరిత్రకారులు నిర్ణయిస్తున్నారు. మధ్యధరా సముద్రం దక్షిణ కోస్తా - ఎర్ర సముద్రానికి తూర్పు భాగంలో నివసించిన వాళ్ళు సెమైట్లు, ఎర్రసముద్రానికి పడమరగా నివసించినవాళ్ళు ఇజిప్సియన్లు, వీళ్ళకు ఉత్తరంగా లిడియన్లూ హిట్టిటేట్లు, సెమైట్లుకు తూర్పున సుమేరియన్లూ అస్సీరియన్లు, మధ్యధరా సముద్రానికి ఉత్తరకోస్తా వెంట ఏజియన్లు - ఇలా వేరువేరు జాతులుగా వాళ్ళను గుర్తించారు. అయితే, తమ జాతిని తాము ఏ పేరుతో వాళ్ళు పిలుచుకున్నారో మనకు తెలీదు. ఇందాకా అనుకున్న పేర్లన్నీ వారివారి నివాస ప్రాంతాలనుబట్టో, ఆచార వ్యవహారాలనుబట్టో, అవశేషాల ఆధారంగా నిర్ణయించిన పోలికనుబట్టో చరిత్రకారులు ఏర్పాటుజేసుకున్న అనుకూలత మాత్రమే. చనిపోయినవాళ్ళను పాతిపెట్టడం కాకుండా, దహనం చేయడం ఆచారంగా అవలంభించడం వల్ల అవశేషాల రూపంలో ఆర్యులకు సంబంధించిన ఆధారాలే కరువయ్యాయి. దానికి తోడు, వాళ్ళు వినియోగించిన సామగ్రి మొత్తం కొయ్య, వెదులు వంటి శాఖాజనిత పరికరాలు కావడంతో, అనతికాలానికే అవి కాలగర్భంలో కలిసిపోయి, భౌతికమైన ఆధారాలు దొరికే ఆస్కారం లేకుండా చేశాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర 59
జాతులు-నుడికారాలు చిలుక వేరు పావురం వేరు. చూసీ చూడగానే చిలకేదో పావురమేదో చిన్నపిల్లలైనా చెప్పేస్తారు. అలాగే ఏది కుక్కో ఏది ఏనుగో తేలిగ్గా పోల్చుకుంటారు. అన్నీ ఒకేలా ఒకే జాతి పక్షులగుంపులోగానీ, పశువుల గుంపులోగానీ ఒకదాన్నుండి మరొకదాన్ని విడివిడిగా గుర్తించడం ఎంతో పరిచయంతో తప్ప పెద్దలకైనా సాధ్యపడదు. ఉదాహరణకు, మందంగావున్న గొర్రెలన్నీ మొదటమొదట ఒకేలా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు కనిపించే తేడాలు ఉంటే తప్ప, దేనికి దాన్ని విడివిడిగా గుర్తించడం మనకు చేతగాదు. వాటి కాపరి మాత్రం నిత్యసాంగత్యం కారణంగా, దేనికిదాన్ని వేరువేరుగా పోల్చుకోగలడు. మనుషుల విషయంలోనూ కొన్ని సందర్భాల్లో ఇదే తరహా అయోమయం ఏర్పడటం కద్దు. ఎంత గుంపులోనైనా ఎవరు భారతీయులో, ఎవరు యూరోపియన్‌లో, ఎవరు నీగ్రోలో గుర్తించడం పెద్ద కష్టంగా తోచదుగానీ, ఒకే జాతీయులైన పదిమంది విదేశీయుల్లో - వాళ్ళు నీగ్రోలే కావచ్చు, ఆంగ్లేయులే కావచ్చు, మరేజాతైనా కావచ్చు - ఏ మనిషికామనిషి విడివిడిగా పోల్చుకునేందుకు పరిచయం పెరిగిందాకా మనకు వీలుపడదు. అదే సొంతజాతి మనుషులైతే ఒకటిరెండు చూపులతో తేలిగ్గా గుర్తుండిపోతారు. దీన్నిబట్టి మనకు తెలిసొచ్చేదేమంటే - మనుషుల మధ్య పోలికల్లో వున్న తేడాల్లో కొన్ని తాటికాయంతవి కాగా, మరికొన్ని ఆవగింజ పరిమాణంలో కూడా ఉండొచ్చునని! మొత్తంమీద, వెలుపలి ఆకారంలో ఎంత వైవిధ్యం ఏర్పడినా మౌలికమైన శారీరక నిర్మాణంలో మనిషికీ మనిషికీ తేడాలు ఏర్పడకుండా ఆగిపోయిన కారణంగా, లక్షలాది సంవత్సరాల నుండి మానవజాతి ఒకే ‘స్పీసీస్’గా నిలబడిపోయింది. ‘స్పీసీస్’ అనేది జీవశాస్త్రపరమైన సాంకేతిక పదం. దీన్ని సులభంగా అర్థం చేసుకునేందుకు పరిచితమైన జంతుజాతుల్లోకి ఒక్కసారి తొంగిచూద్దాం. కుక్కలు పెంచుకునే అలవాటు మనందరికీ లేకపోవచ్చుగానీ, ఆ అలవాటున్న స్నేహితులు ఉండేవుంటారు. సాధారణంగా ముచ్చటకోసం ఆడవాళ్ళు పెంచుకునేది ‘పొమేరియన్’ జాతి కుక్కలైవుంటాయి. వీటి శరీరం చంకలో ఇమిడేంత చిన్నదిగా ఉంటుంది. ఒళ్లంతా పొడవాటి వెంట్రుకలు ఉండడం వల్ల ముతకభాషలో వీటిని ‘బొచ్చుకుక్కలు’ అంటుంటాం. తోడేలుకుమల్లే కనిపించే మరోజాతి పెంపుడుకుక్క ‘అల్సేషన్.’ ఇలాంటి పెంపుడు కుక్కలు ఎదకొచ్చిన సమయంలో వాటి యజమానులు బెంబేలెత్తి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేస్తుంటారు. ఈ జాగ్రత్తలు ఎందుకంటే, తమది ఎంత ఉన్నతమైన జాతికుక్కైనా, దాటేందుకు నాటుకుక్కలకు అవకాశం దొరికితే దానికి కడుపు రావడమూ తప్పదు, సంకరసంతానం కలుగకా తప్పదు. దానికి కారణం ఖరీదైన జాతికుక్కలూ, ఏమాత్రం విలువజేయని వీధికుక్కలు ఒకటే ‘స్పీసీస్’కు చెందినవి కావడం. కుక్కను నక్కతో దాటిస్తే సంతానం కలగదు; చిరుతను పెద్దపులితో దాటిస్తే సంతానం కలుగదు. జన్యుపరమైన తేడాల మూలంగా ఇతరేతర ‘స్పీసీస్’కు చెందిన బీజంతో సంయోగాన్ని ఆడజంతువులో ఏర్పడిన అండం తిరస్కరిస్తుంది. అందువల్ల సంతానానికి ఆస్కారం లేకుండాపోయింది. అండబీజాల సంయోగానికి ఆస్కారం కలిగిన జీవులన్నీ, చూపులకు కనిపించే తేడాలకు అతీతంగా, జన్యుతారతమ్యంలేని ఒకే సమూహానికి చెందినవిగా, అంటే ఒకే ‘స్పీసీస్’గా, శాస్త్రం పరిగణిస్తుంది.ఒకే ‘స్పీసీస్’కు చెందిన వాళ్ళు కావడం మూలంగానే తెల్లటి అమెరికన్ యువతికి నల్లటి నీగ్రో పురుషునివల్ల సంతానం కలిగేందుకు జన్యుపరమైన అవరోధం లేకపోవడం. ఒకే ‘స్పీసీస్’కు చెందిన పక్షులైతేనేమి పశువులైతేనేమి మనుషులైతేనేమి - మొత్తం ఒకే పోలికలో ఉండకుండా ఇన్ని తేడాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎందుకంటే - ఏర్పడక తప్పదుగాబట్టి. ఇంత పెద్ద భూగోళం మీద పలురకాల పరిసరాల్లో, పలుపలు వాతావరణాల్లో, పొంతనలేని పరిస్థితుల్లో, ఏ తావున నివసించే జీవి ఆ తావుకు అనుకూలంగా తన స్వరూపాన్ని మార్చుకోగలిగితేనే అది పదికాలాలు మనగలుగుతుంది. ఈ పద్ధతిని శాస్త్రంలో ‘అడాప్షన్’ అంటారు. అందుకు తిరస్కరించిన జీవి స్పీసీస్గా నిలబడలేక భూగోళం మీద ఉనికిని కోల్పోతుంది. ఇంత పెద్ద భూగోళం మీద పలురకాల పరిసరాల్లో, పలుపలు వాతావరణాల్లో, పొంతనలేని పరిస్థితుల్లో, ఏ తావున నివసించే జీవి ఆ తావుకు అనుకూలంగా తన స్వరూపాన్ని మార్చుకోగలిగితేనే అది పదికాలాలు మనగలుగుతుంది. ఈ పద్ధతిని శాస్త్రంలో ‘అడాప్షన్’ అంటారు. అందుకు తిరస్కరించిన జీవి స్పీసీస్గా నిలబడలేక భూగోళం మీద ఉనికిని కోల్పోతుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 58
ఆడ-మగ అనుబంధం ఈ కణ విభజన తేలిగ్గా అర్థమయ్యేందుకు నాలుగే క్రోమోజోములుండే ఒక కణాన్ని ఉదాహరణగా తీసుకుందాం. వీటిల్లో రెండు ‘ఎ’ గనివి, మిగతా రెండు ‘బి’ గనివి. మియాసిస్ విభజన రెండు అంచెలుగా జరుగుతుంది. మొదటి అంచె ప్రారంభంకాగానే, వీటిల్లో ప్రతివొక్కటి నిట్టనిలువుకు చీలి, రెండు పోగులుగా ఏర్పడుతుంది. ఇది మైటాసిస్లో ఇదివరకు చూసిందేగానీ, అక్కడికీ ఇక్కడికీ చిన్న తేడావుంది. అక్కడ దేనికదిగా పోగులు పూర్తిగా విడిపోతుండగా, మియాసిస్ పద్ధతిలో అలాకాకుండా. ఒకచోట ‘రివిట్’తో బిగించినట్టు అతుక్కుని, పట్టకారులా విచ్చుకుంటాయి. పట్టకారుకు ఉన్నట్టే ఈ ‘గీ’ ఆకారానికి, రివిట్కు (centromere) పైనుండే చేతులు కురుచ, కిందికుండే కాళ్ళు పొడవు. చూసేందుకు ఆ క్రోమోజోములు ఎనిమిదిగా విడిపోయినట్టు కనిపిస్తున్నా, రివిట్తో అతుక్కున్న మూలంగా వాస్తవానికి నాలుగే. ఈ దశలో ఎ గుంపు నుండి బి లకూ, బి గుంపు నుండి ఎ లకూ కొంత జన్యుపదార్థం ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ ద్వారా బదిలీ అవుతుంది. ఒక చేతినో, ఒక కాలినో అవతలిగుంపు క్రోమోజోముకు బదిలీచేసి, మారుగా దాన్నుండి అదే మోతాదు పదార్థాన్ని తనకు అతికించుకుంటుంది. ఈ బదిలీ తరువాత కూడా కణంలో ఉండే పోగులు ఎనిమిది, క్రోమోజోములు నాలుగు. వాటినుండి ఎ1, బి1లు ఒక ధ్రువానికి, ఎ2, బి2లు మరో ధ్రువానికి చేరుకుంటాయి. మధ్యకు కణకవచం చొచ్చుకొచ్చి విడదీయడం మూలంగా రెండు వేరువేరు కణాలుగా ఏర్పడుతుంది. ఒక్కొక్క కణంలో ఇప్పుడుండేవి నాలుగు పోగులు, వెరసి రెండు క్రోమోజోములు. అంటే క్రోమోజోముల సంఖ్య సగానికి పడిపోయింది. రెండవ అంచే పూర్తిగా మైటాసిస్‌ను పోలిందే. క్రోమోజోములోని పోగులు పూర్తిగా విడిపోయి నాలుగుగా ఏర్పడతాయి. ఒక ఎ పోగు, ఒక బి పోగు ఒక ధ్రువానికీ, మిగిలిన రెండూ మరో ధ్రువానికీ చేరుకుని కణం విభజించబడుతుంది. మొదటి అంచె తరువాత ఏర్పడినవి రెండు కణాలుకాగా, రెండవ అంచెలో ఒక్కొక్కటి రెండుగా ఏర్పడడంతో మొత్తం పిల్లల సంఖ్య నాలుగవుతుంది. రెండవ అంచెలో క్రోమోజోముల సంఖ్య తరగనందున, ఒక్కొక్క పిల్లకు రెండేసి క్రోమోజోములుంటాయి. ఏర్పడిన నాలుగు పిల్లల్లో ఏవొక్కటికి జన్యుపరంగా మరొకదాన్ని పోలిందిగాదు. ఇలా ఏర్పడిన కణాలను ‘గ్యామేట్స్’ అంటారు. సెక్స్ కణాలంటే ఇవే. మగ, ఆడ జీవులు దేని గ్యామేట్లను అవి ఉత్పత్తి చేసుకుంటాయి. పురుషగ్యామేట్ను బీజం (sperm) అంటారు, స్త్రీగ్యామేట్ను అండం (egg) అంటారు. అవి రెండూ సంయోగమైనప్పుడు ఏర్పడేది విశ్వజన్యురాశి (genome). ఆ సగం క్రోమోజోములూ, ఈ సగం క్రోమోజోములు కలిసి, పిండం తిరిగి నాలుగు క్రోమోజోములు కలిగినదై, ఆ స్పీసీస్‌కు ఉండవలసిన క్రోమోజోముల సంఖ్య యదాతథంగా నిలుపుకోవడంతో, స్పీసీస్లో మార్పు జరగకుండా నిలుస్తుంది. గ్యామేట్ల కలయికలో ఆరోగ్యకరమైన సంయోగంతో ఏర్పడిన సంతానం పరిసరాల ప్రభావాన్ని తట్టుకుని బలంగా ఎదిగే శక్తిని కలిగుంటుంది. మగ, ఆడ జీవులు దేని గ్యామేట్లను అవి ఉత్పత్తి చేసుకుంటాయి. పురుషగ్యామేట్ను బీజం (sperm) అంటారు, స్త్రీగ్యామేట్ను అండం (egg) అంటారు. అవి రెండూ సంయోగమైనప్పుడు ఏర్పడేది విశ్వజన్యురాశి (genome). రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 57
ఆడ-మగ ‘ఎన్ని తరహాల సంతానం ఉత్పత్తి చేసినా, మనుగడ కోసం పోరాటం అనేది నిరంతరం కొనసాగేదేగానీ, ఒకచోట ఆగేదిగాదు. ఉన్నచోటునే ఉండేందుకు పరిగెత్తి పరిగెత్తి ఆయాసం తెచ్చుకున్నట్టుంది ఈ వ్యవహారం’ అనేవాళ్ళు కొందరు. ‘వాతావరణంలో సంభవించే మార్పులు ఎప్పుడు ఎలావుంటాయో తెలిసేందుకు వీలయ్యేవిగాదు. దానికోసమే సెక్సువల్ పద్ధతి ఏర్పడిందనేది నమ్మశక్యంగా లేదు’ అంటూ పెదవి విరిచేవాళ్ళు కొందరు. ‘మార్పును పునాదిగా చేసుకోకపోతే, ఈ భూమిమీద పరిణామమనేది జరిగుండేదే కాదు. అందువల్ల, సెక్స్ ద్వారా జరిగే మార్పుకు కారణం తెలుసుకునేందుకు ఇప్పట్లో కష్టమైనా, ఏదోవొక రోజు తెలుసుకోగలం’ అనే ధీమా కొందరిది. ‘ఒక ఒరిజినల్‌ను ఫొటోకాపీ చేసి, ఆ ఫొటోకాపీని తిరిగి ఫొటోకాపీ చేసి, మళ్ళీమళ్ళీ అలాగే చేసుకుపోతే ఫలితంగా తయారయ్యే చివరికాపీ రాసి (క్వాలిటీ) ఎలా తగ్గుతూపోతుందో అలాంటిది ఎసెక్సువల్ రిప్రొడక్షన్. అందువల్లనే సెక్సువల్ పద్ధతి ఉత్తమమైంది’ అంటారు కొందరు. ‘చెడిపోయిన జన్యుపదార్థం ముక్కను గ్రహించిన ఆడగ్యామేట్లు కొన్ని పక్వదశ చేరకముందే నశిస్తున్నాయి. అలాగే, అండాన్ని చేరుకునే పోటీలో బలహీనమైన మగబీజకణాలు వెనుకబడుతున్నాయి. అడపాదడపా చోటుచేసుకుంటున్న పొరబాట్లను లెక్కలోకి తీసుకుని వెక్కిరించడం కంటే, ఈ పద్ధతి వల్ల మొత్తంగా సమకూరే ప్రయో జనాన్ని మెచ్చుకోవాలి’ అంటూ కొందరు సమర్థిస్తున్నారు. ‘జన్యుపదార్థాన్ని మార్చుకునేందుకు అలవాటుపడిన బ్యాక్టీరియాలు యాంటీబయోటిక్ మందులకు లొంగని ‘డ్రగ్ రెసిస్టెంట్’ సంతానాన్ని పొందగలుగుతున్నప్పుడు, జన్యుమార్పిడిని అనుకూలించే సెక్స్ విధానాన్ని నిరుపయోగమని చెప్పేందుకు వీలులేదు’ అంటున్నారు ఇంకాకొందరు. మానవుని విజ్ఞానానికి ‘ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా, ఎవరు, ఏది, ఏ (ఠీజ్ఛి, ఠీజ్ఛిట్ఛ, ఠీజిడ, జిౌఠీ, ఠీజిౌ, ఠీజ్చ్టి, ఠీజిజీఛిజి)’ అనే ఏడు ప్రశ్నలే గురువులు. వీటి సంకలనం జిజ్ఞాస. ఇవి నిరంతరం మెదడును పరిశోధనవైపుకు తరుముతూనే ఉంటాయి; విజ్ఞానంలో ఏర్పడిన సందులను నింపుకునేందుకు ప్రోత్సహిస్తూనే ఉంటాయి. ఈ గురువుల మూలంగా భవిష్యత్తులో ఏ సమాధానం దొరుకుతుందో మరికొంతకాలం వేచిచూద్దాం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 56
ఆడ-మగ ‘ఎప్పుడు’ అనే ప్రశ్నకు ఇటీవలి కాలంలో సమాధానం దొరికింది. ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ వచ్చిన తరువాత, జన్యుపదార్థ నిర్మాణాన్నిబట్టి, జీవులను రెండు తరగతులుగా విభజించారు. మొదటి తరగతి ‘ప్రొకార్యోట్స్ కాగా, రెండవ తరగతి ‘యూకార్యోట్స్. ‘ప్రొకార్యోట్స్’ మొత్తం ఏకకణజీవులే. వీటిల్లో న్యూక్లియస్ ఉండదు; చిక్కటి జన్యుపదార్థం కణం మధ్యలో ఉంటుందేగానీ, దాని చుట్టూ న్యూక్లియార్ మెంబ్రేన్ ఏర్పడివుండదు. యూకార్యోట్లలో ఏకకణజీవులూ ఉన్నాయి, బహుకణజీవులూ ఉన్నాయి. కణాలసంఖ్య ఎంతైనా, ప్రతికణంలోని జన్యుపదార్థం పొరతో ఉండడం కారణంగా, అది న్యూక్లియస్‌గా కనిపిస్తుంది. ఈ తరగతిలోని బహుకణజీవుల్లో జన్యుపదార్థం వేరువేరు గనుల నుండి వచ్చిన మిశ్రమం కావడంతో, కణవిభజనకు ‘మైటాసిస్’నే కాకుండా, పరిమితంగా ‘మియాసిస్ పద్ధతిని గూడా అవలంబించే జీవుల దగ్గర సెక్స్ మొదలౌతుంది. వేరువేరు గనులనుండి పొందిన రెండురకాల జన్యువులు, తమ పదార్థాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడం ద్వారా వైవిధ్యం సంపాదించుకోవడం మియాసిస్ కణవిభజనలోని ప్రత్యేకత. పొరపాటుకు తావివ్వకుండా ఇక్కడ గుర్తుంచుకోవలసిన కీలకాశం ఏమిటంటే - ఆడ, మగ జీవుల్లో ప్రత్యేకంగా ఏర్పడిన జననేంద్రియాల్లో తయారయ్యే కణాలకు మాత్రమే మియాసిస్ విభజన పరిమితం. దేహంలోని మిగతా కణాలన్నీ పెరిగేదీ, యథాస్థితిని పోషించుకునేదీ మైటాసిస్ విభజన ద్వారానే. (అర్థం చేసుకునేందుకు మియాసిస్ విభజన కొంత కష్టంగా ఉంటుంది గాబట్టి, పాఠకులకు ఇబ్బంది కలగకుండా ఆ వివరణ అనుబంధంగా చేర్చబడింది. తెలుసుకోవాలనే కుతూహలం కలిగినవాళ్ళు ఈ అధ్యాయం చివరిలోని అనుబంధం నుండి తెలుసుకోగలరు) ‘ఇంత తతంగంతో అవసరం ఎందుకు ఏర్పడింది?’ అనే ప్రశ్నకు జవాబుగా ఎవరి ప్రతిపాదన వాళ్ళది. ‘ప్రయోజనం కోసం ఏర్పడింది కాదు. ఏదో సమయంలో సృష్టి పరిణామంలో జరిగిన యాక్సిడెంట్ కారణంగా ఏర్పడింది మాత్రమే. దీన్ని పట్టుకుని శాస్త్రజ్ఞులు కొందరు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు’ అనేవాళ్ళు లేకపోలేదు. కానీ, ఎక్కువమంది శాస్త్రజ్ఞులు సృష్టిని అంత తేలిగ్గా తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ‘అది కేవలం యాక్సిడెంటే అయ్యుంటే, సృష్టి దాన్ని పక్కకు తొలగించుకోకుండా రెండువందల కోట్ల సంవత్సరాలుగా ఎందుకు కొనసాగిస్తుంది? కాబట్టి, ఏదోవొక ప్రయోజనం ఉండే ఉండాలి.’ అనేది మిగతావాళ్ళ నమ్మకం. ఇది కూడా తోసిపుచ్చేందుకు వీలులేని వాదనే. మనుగడ నిలుపుకునే విధానంలో జీవి ఎన్నో గాయాలను మాన్పుకోగలుగుతోంది. అవసరం తీరిపోయిన తోకను రాల్చేసింది; సంతానం సంఖ్య పడిపోయిన తరువాత స్తనాల సంఖ్యను కుదించుకుంది; ‘అపెండిక్స్’ను ఖాతరులేని అవయవంగా మూలకు నెట్టేసింది. ప్రయోజనం లేనివాటిని తనకుతానై తొలగించుకోగలిగిన ప్రాణి సెక్స్‌ను వందల కోట్ల సంవత్సరాలు కొనసాగించడం నిరర్థకమని భావించేందుకూ వీలుగాదు. కానీ, ఏమిటి ఆ ప్రయోజనం అనేది మాత్రం స్పష్టంగా తేల్చుకోలేకపోతున్నాం. ‘ఈ తరహా కణవిభజనకు పట్టే కాలం ఎక్కువ, ఖర్చయ్యే శక్తిగూడా ఎక్కువ. సంయోగంలో బలమైన గ్యామేట్లే కలుస్తాయో, బలహీనమైనవి కలుస్తాయే ముందుగా తెలియని లాటరీ ఫలితం వంటిది. ఇంతమాత్రానికి అంత ప్రయాస అవసరమా? పైగా, సెక్స్ లేకుండా పుడుతున్న సంతానం గూడా ఈ రెండువందల కోట్ల సంవత్సరాలుగా కొనసాగుతూనేవుంది గదా’ అంటారు కొందరు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 55
ఆడ-మగ జంతుప్రపంచంలో కంటికి కనిపిస్తున్న చీమ మొదలు ఏనుగుదాకా సెక్స్ మూలంగానే సంతానం పొందుతున్నాయి. సెక్స్లేని సంతానోత్పత్తి ఎక్కడైనా ఉందా? ఉంటుందని ‘మైక్రోస్కోప్’ రాకముందు ఎవరూ ఊహించలేదు. వచ్చిన తరువాతగానీ సూక్ష్మజీవుల్లో సెక్స్లేని సంతానోత్పత్తి (్చ ట్ఛ్ఠఠ్చ ట్ఛఞటౌఛీఠఛ్టిజీౌ) జరుగుతుందని జీవశాస్త్రానికి తెలీలేదు. దాని వివరాలు తెలుసుకునేందుకు ‘అమీబా’ అనే ఏకకణజీవిని ఉదాహరణగా పరిశీలిద్దాం. ఒకటే కణమైనా దీనిచుట్టూ కవచం వంటి పొర ఏర్పడి వుంటుంది. ఆ పొరను సెల్ మెంబ్రేన్ అంటారు. పొరలోపల జీవపదార్థం నిండుకోనుంటుంది. పొరకింద అది కాసింత చిక్కగానూ, మిగిలింది పల్చగానూ ఉంటుంది. కణం మధ్యలో మరింత చిక్కటి జీవపదార్థమొకటి కనిపిస్తుంది. దీన్ని న్యూక్లియస్ అంటారు. న్యూక్లియస్‌లో దండలు దండలుగా ఇరికిరికి కనిపించేవి క్రోమొజోములు. ఇవి చెల్లాచెదరు కాకుండా చుట్టూ బిర్రుగా నొక్కిపట్టుకునే మరోపొర న్యూక్లియార్ మెంబ్రేన్. ఎన్నో సందర్భాల్లో మనం వింటున్న మాటొకటుందే ‘జీన్స్’ అనేది, ఆ జీన్స్‌కు స్థావరం ఈ క్రోమొజోములే. జీవి రంగు, ఆకారం, ఆహారం, మనుగడ, పరిమాణం, సంతానోత్పత్తి వంటి జీవకార్యక్రమాల సర్వస్వాన్నీ శాసించేవి ఈ జీనులే. అమీబాకు మిగతా అవయవాలు ఏవీ లేకున్నా ఇతర జంతువుల్లాగే స్థలం మారుతుంది, భోం చేస్తుంది, లక్షణంగా జీవిస్తుంది. సెక్స్ లేదు; అయినా సంతానాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆహారం ద్వారా అందే మాంసకృత్తులు (ఞట్ట్ఛౌ్చ) ఏరుకుని, రసాయనిక సంయోగంతో ఈ జీవిలోని జీన్స్ అచ్చంగా తమను పోలిన మరో రూపాన్ని సృష్టించుకుంటాయి. అందుకు తగిన మోతాదులో ప్రొటీన్లు లభించిన వెంటనే న్యూక్లియస్‌లో గుత్తిగా పెనవేసుకున్న క్రోమొజోములు చిక్కును విదిలించుకుని దేనికదిగా విడిపోతాయి. ఈలోపు కణం ఆకారం గుండ్రంగా తయారై, క్రోమొజోములను పట్టిపెట్టిన న్యూక్లియర్ మెంబ్రేన్ కరిగిపోతుంది. క్రోమొజోములు జీవకణం మధ్యకు చేరి, నిలువు గీత మీద పేర్చినట్టు ఒకదాని కింద మరొకటి నిటారుగా నిలబడి, నిట్టనిలువున రెండు సమానభాగాలుగా చీలిపోతాయి. అంటే, ఇదివరకు ఎన్ని క్రోమొజోములు ఉండేవో ఇప్పుడు అన్ని జతలు తయారయ్యాయి. ఈ జతలో ఎడమవైపు నిలిచినవి ఒక గుంపు, కుడివైపువి మరోగుంపు. ఏ గుంపుకాగుంపు పరస్పర విరుద్ధమైన దిశగా జరుగుతూ దూరమవగానే, వాటిచుట్టూ దేనిపొర దానికి పుట్టుకొచ్చి రెండు న్యూక్లియస్లుగా ఏర్పడతాయి. ఈ పరిణామం జరుగుతుండగనే కణం వెలుపలి కవచం ఆ న్యూక్లియస్‌ల మధ్యకు చొచ్చుకొచ్చి కణవిభజనను సంపూర్ణం చేస్తుంది. ఏ ముక్కకాముక్క విడిపోయి రెండు అమీబాలుగా తయారై, దేని బ్రతుకు దానిదౌతుంది. ఈ తరహాలో జరిగే కణవిభజనను ‘మైటాసిస్’ అంటారు. తల్లికణానికి ఎన్ని క్రోమోజోములు ఉంటాయో, ఒక్కొక్క పిల్లకు అన్నే ఉంటాయి తప్ప సంఖ్య మారదు. ఎందుకంటే, ఆ సంఖ్య జీవి జాతిని బట్టి (స్పీసీన్ను బట్టి) ఏర్పడేది, జాతిని నిర్ణయించేదీను. ఆ సంఖ్యే ఏ స్పీసీస్ సంతతికి ఆ స్పీసీస్ జీవికుండే ప్రాథమిక లక్షణాలను కలిగించేది. వీటి సంఖ్య మారితే జాతి అంతరిస్తుంది. ఈ తరహా సంతానోత్పత్తి వేగంగానూ, తేలిగ్గానూ జరగడమే కాక, ఖర్చయ్యే శక్తి (ఎనర్జీ) చాలా తక్కువ. దీనికి ప్రత్యేకమైన పునరుత్పత్తి అవయవాలు అవసరం లేదు. నిరంతరం వాటిని పోషించుకునే భారం లేదు. తోడు వెదుక్కునే తంటా లేదు. దీర్ఘకాలం పిండాన్ని గర్భంలో పోషిస్తూ ప్రసవంకోసం కాచుకునే యాతన లేదు. నల్లపూసంత ప్రయాసలేని ఎసెక్సువల్ సంతానోత్పత్తి విధానాలను వదిలేసి, సెక్స్ జంజాటంలో జీవులు ఎందుకు ఇరుక్కున్నాయి, ఎప్పుడు ఇరుక్కున్నాయి? రచన: ఎం.వి.రమణారెడ్డి రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర 54
ఆడ-మగ ‘సంతానం కోసమే సంపర్కమైతే ఏడాదికి ఒక్క ఋతువు చాలదా?’ అన్నదిగాదు ఈ పాఠం నుండి మనం గ్రహించవలసిన అంశం. కంటిముందు కనిపించే ప్రతి వింతకు సమాధానం వెదికే ఆనాటి మానవుని జిజ్ఞాస. ప్రయోజనకారిగా ఉండే నేలమీద మొక్క మొలిచేందుకు వీలులేని చౌటిపర్రు ఎందుకొచ్చింది? కాలో వేలో తెగిన జంతువుకు తిరిగి అది మొలవనప్పుడు చెట్టుకు మాత్రమే ఆ శక్తి ఎలా సాధ్యపడింది? అలాగే - జంతు ప్రపంచంలో ఆడజీవి ఎదకొచ్చిన సమయంలో మాత్రమే సంభోగం జరుగుతూ ఉంది. ఎదకొచ్చే అదను కొన్ని జంతువులకు ఏడాదికాలం పట్టొచ్చు, మరికొన్ని జంతువులకు నాలుగునెలలే పట్టొచ్చు. ఏడాదిలో తడవలు ఎన్నైనా, ఎదకొచ్చిన సమయంలో మాత్రమే ఆడది మగపొత్తును కోరుకుంటుంది, దాటేందుకు అనుకూలిస్తూంది. మిగతా సమయాల్లో వాటికి ఆ ధ్యాసే కనిపించదు. మగజంతువుగూడా ఎదకొచ్చిన వాసనకోసం కాచుకొని ఉంటుందే తప్ప, బలవంతంగా దాటేందుకు ప్రయత్నించడం అరుదు. మానవజాతి సెక్స్ ప్రవర్తన ఇందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఋతుస్రావం రోజుల్లో సంభోగం వలదని తనకుతానుగా ఏర్పాటుచేసుకున్న నియమం తప్ప, సంపర్కానికి వీలులేని రోజంటూ ఉండనే వుండదు. ఈ వైవిధ్యానికి కారణంగా ఏమిటి? - పరిశోధన చేసేందుకు తగిన పరికరాలు అందుబాటుకురాని కాలంలో సమస్యలకు దొరికే జవాబులు అంతకంటే మెరుగ్గా వుండే అవకాశమే లేదు. సుఖం, సంతోషం అనేవి మానసిక అవస్థలు. అవి మెదడున్న జీవికి మాత్రమే సాధ్యపడేవి. మరి మెదడే ఏర్పడని జీవులుగూడా సెక్స్‌ను ఎందుకు ఆశిస్తున్నాయి? సూక్ష్మ ప్రపంచాన్ని అలా వదిలేసి, తాటిచెట్టునే ఉదాహరణగా తీసుకుందాం. వీటిల్లో మగ, ఆడ చెట్లు వేరువేరుగా ఉంటాయి. అవి ఎక్కడెక్కడో దూరందూరంగా ఉంటాయి. మగచెట్టులో తయారయ్యే బీజం (పుప్పొడి) గాలికి ఎగిరొచ్చి ఆడచెట్టులోని అండాన్ని చేరుకుంటుంది. సంభోగం కాదుగదా, కనీసం స్పర్శ గూడా వీటిమధ్య వీలుపడదు. ఏ సుఖానికీ నోచుకోని తాటిచెట్టు సంతానం కోసం సెక్స్‌ను ఎందుకు అనుసరిస్తూంది? సంతానంతో అవసరంలేని జీవి ఉంటుందని మనం ఊహించలేం. ఉనికిని కాపాడుకోవడం, మనుగడకోసం జాతిని వృద్ధి చేయడం ఏ జీవికైనా ప్రాథమిక లక్షణాలు. సెక్స్ లేకుండా జాతిని విస్తరిస్తున్న జీవులు కొల్లలుగా మన ఎదుట కనిపిస్తున్నాయి. ఉదాహరణకు కొన్ని వృక్షజాతులనే తీసుకుందాం. మల్లె, జాజి, పెరటి గన్నేరు వంటి చెట్లు పువ్వులు పూస్తాయి. కానీ వాటిల్లో అండమూ ఉండదు, బీజమూ ఉండదు. సెక్స్‌తో అవసరమే లేకుండా అవి అంట్ల ద్వారా విస్తరిస్తున్నాయి. ఈ తరహా సంతానోత్పత్తిని ‘వెజిటేటివ్ ప్రొడక్షన్’ అంటారు. సొర, బీర, కాకర వంటి తీగల్లో మగ, ఆడ పువ్వులు ఒకే తీగ మీద వేరువేరుగా పుట్టుకొస్తాయి. సంయోగానికి పుప్పొడి గాలిలో ఎగిరి చేరుకోవలసిందేతప్ప, సుఖం కోసమని తీగెలు పెనవేసుకోవడం లేదు. ఎంతో ఉన్నతమైన సాంకేతిక పరికరాలతో, దాదాపు వెయ్యి సంవత్సరాల తరబడి జరుగుతున్న నిరంతర పరిశోధన తరువాతగూడా, ‘సెక్స్ అనేది ఎప్పుడు మొదలయింది, దాంతో జీవికి అవసరమేమొచ్చింది’ అనే ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలున్నాయి. ఇప్పుడున్న పరికరాల సహాయంతో సూదిమొన కంటే వెయ్యింతలు చిన్నదైన జీవిని చూడగలుగుతున్నాం, అది ప్రాణంతో జీవనచర్యలు సాగించే విధానాన్ని పరిశీలించగలుగుతున్నాం. వాతావరణంలో అంతోయింతో మార్పుల కృత్రిమంగా కల్పించి, మారిన పరిస్థితికి దాని ప్రతిచర్య ఎలావుంటుందో గమనించగలుగుతున్నాం. అయినా, రెండువందల కోట్ల సంవత్సరాలకు ముందు నివసించిన జీవిని ప్రాణంతో చూడనూలేము, అది ఎదుర్కున్న పరిస్థితులను ఊహించుకోవాలే తప్ప, సృష్టించనూలేము. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 53
ఆడ-మగ ‘సెక్స్’ అనే పదానికి తెలుగులో సమానార్థకం లేదు. ఇప్పుడు ఆ ఇంగ్లీషుపదమే పల్లెల్లోనూ వాడుకలో పడిపోయింది గాబట్టి, అనువాదం చేసే ప్రయాసం విరమించి, అందరికీ తెలిసిన ఆ పదాన్నే ఇప్పటి మన అవసరానికి వాడుకోవడం తేలిక. నలుగురు మిత్రులు సరదాగా మాడ్లాడుకునే సమయంలో ‘సెక్స్ అనేది ఎందుకు’ అనే ప్రశ్నే ఉదయిస్తే, సాధారణంగా మనకు వినిపించే వాదనలు రెండు రకాలు. మొదటిది - ‘సంతానం కోసం’ అనే వాదన. రెండవది - ‘సుఖం కోసం’ అనే వాదన. రెండవ కోవకు చెందిన వాదనలో సంతామనేది సెక్స్‌కు యాదృచ్ఛిక ఫలితం (బైప్రొడక్ట్). సంభోగం వల్ల సంతానం కలుగుతుందని ఒకనాటి మానవునికి తెలీనైనా తెలీదు. అయినా సెక్స్‌లో పాల్గొనేవాడు. జంతువులు మచ్చికైన తరువాతగానీ మనిషికి సృష్టిరహస్యం అర్థమైందిగాదు. పశువులు గూడా ప్రాణులే. తను దాటిన కారణంగానే గేదెకు సంతానం కలిగిందని దున్నపోతుకు తెలీదు. పశువులు సంభోగించడంలో సంతానేచ్ఛ మచ్చుకైనా కనిపించదు. ఈ వాదనే నిజమేనేమోననిపించే ఇతివృత్త మొకటి కృష్ణయజుర్వేదంలో కనిపిస్తుంది. అందులోని ద్వితీయకాండ, పంచమఃప్రశ్నలో - ‘‘త్వష్ట దేవతలకు దారుశిల్పి. అతని కుమారుడు విశ్వరూపుడు దేవతలకు పురోహితుడు. అదే విశ్వరూపుడు అసురులకు మేనల్లుడు. (అసురులకు మేనల్లుడు కావడమంటే, అతని తల్లి అసురుల ఆడబిడ్డై ఉండాలి.) ఆ విశ్వరూపునికి మూడుతలలు. స్వామిద్రోహం చేస్తున్నాడనే అనుమానంతో ఇంద్రుడు అతని తలలు నరికేస్తాడు. ఇంద్రుడికి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. ఆ పాపాన్ని ఎంతోకాలం భరించలేక, దాన్ని మూడు ముక్కలుగా విభజిస్తాడు. వాటిల్లో ఒక ముక్కను, అంటే మూడింటి భాగాన్ని, స్వీకరించమని భూమి అర్థిస్తాడు. అందుకు భూమి, ‘ఓ ఇంద్రుడా, నన్ను మానవులు యదేచ్ఛగా త్రవ్వేస్తున్నారు. ఆ బాధను భరించడం నాకు శక్యంగా లేదు. సంవత్సరం లోపు గుంతలు నిండితే నాకు కొంత ఉపశమనం కలుగుతుంది. (అప్పుడు నీ బాధను నేను పంచుకోగలను.)’ అంటుంది సమాధానంగా. ‘అంతకు పూర్వానివైన గుంతలు గూడా నిండేట్లు వరమిస్తున్నాను’ అన్నాడు ఇంద్రుడు. భూమి మూడింటిభాగం బ్రహ్మ హత్యను స్వీకరించింది. ఆ పాతకమే భూమిమీద ఏర్పడిన చవిటినేలలు. మరో మూడింటిభాగాన్ని స్వీకరించమని ఇంద్రుడు చెట్లను అర్థించాడు. ‘ఓ ఇంద్రుడా, జనులు మమ్మల్ని యధేచ్ఛగా నరికేస్తున్నారు. అది మాకు తీరని బాధగా ఉంది. (మా ఉనికికి ప్రమాదంగా ఉంది.)’ అన్నాయి చెట్లు. నరికిన చోట అనేక కొత్త మొలకలు ఉద్భేవించేలా ఇంద్రుడు వరమిచ్చాడు. చెట్లు మూడింటిభాగం పాతకాన్ని స్వీకరించాయి. నరికిన చోట జిగురుగా స్రవించేది ఆ పాతకమే. మిగిలిపోయిన మూడింటిభాగాన్ని తీసుకోమని ఇంద్రుడు స్త్రీలను అర్థించాడు. ‘ఓ ఇంద్రుడా, మేము ఋతుకాలంలో మాత్రమే పురుష సంపర్కానికి అర్హులుగా ఉన్నాము. నిరంతరం పురుషునితో సంభోగించే వరం మాకు ఇవ్వాలి’ అన్నారు స్త్రీలు. అతడు ఆ వరాన్నిచ్చి, చివరి మూడింటిభాగాన్ని స్త్రీలకు బదిలీచేశాడు. ఆ పాతకమే స్త్రీలకు ఋతుస్రావం అయింది.’’ రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 52
కొత్త ఒరవడి మేలిరకం పనిముట్ల ఆధరువు దొరికిందే తడవుగా చేతివృత్తుల నైపుణ్యం గణనీయంగా పెరిగింది. అది ఏ స్థాయికి పెరిగిందో సూచించే ఉదంతమొకటి మనకు ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋభువులు అనే ముగ్గురు సోదరులు మానవులు. త్వష్ట దేవతలకు దారుశిల్పి. త్వష్ట ‘చమసము’ అనబడే పాత్రనొకదానిని తయారుచేశాడు. ఆ పాత్రను ఋభువులు నాలుగు పాత్రలుగా చేశారు. త్వష్ట సిగ్గుతో తలదించుకున్నాడు. తమ వృత్తి నైపుణ్యంతో ఋభువులు దేవతలైనారు. ‘చమసము’ అన్నది చెక్కతో నిర్మించిందో లేక లోహంతో నిర్మించిందో చెప్పలేదు గానీ, ‘దారుశిల్పి’ అంటే వడ్రంగి కావడంతో, ఆ విన్యాసానికి ముడిసరుకు కొయ్యదే అయ్యుండాలి. వడ్రంగంలో సాధించిన ప్రగతి వల్ల ఎంతోకాలంగా మానవుడు కంటున్న కలల్లో మరొకటి ఫలించింది. ఎప్పుడో ఇరవై వేల సంవత్సరాలకు ముందే నిప్పు భయం అతనికి తీరిపోయినా, నీటి బెదురు మాత్రం ఇంకా తగ్గలేదు. నాగరిక జీవితం ముడిపడింది ఎడతెగకుండా పారే నదితో. అందువల్ల, నదిని సాధించితీరాలనేది మానవుని ఆశయమేగాదు, అవసరం కూడా. తీగెలతో దట్టంగా అల్లిన పొడవాటి బుట్టలకు తారు దట్టించి తేలడానికి చేసిన ప్రయత్నాలు కొన్ని; వెదురు బొంగులకు జంతు చర్మాన్ని సాగదీసిన దొన్నెలతో చేసిన ప్రయత్నాలు కొన్ని; తేలికైన దుంగలను చాపమోస్తరుగా పరిచికట్టిన తెప్పలతో తృప్తిపడిన రోజులు కొన్ని. ఇవన్నీ ప్రవాహానికి అనుకూలంగా పనికొచ్చే సాధనాలేగానీ ఎదురెక్కేందుకు వీలు కలిగించేవిగావు. పనిముట్లు మెరుగుపడటంతో ఇప్పుడు ప్రవాహానికి ఎదురెక్కే తెడ్లపడవ ఉనికిలోకి వచ్చింది. తెడ్లతోపాటు తెరచాపను కూడా వినియోగించుకుంటూ అది మరికొంచెం పెరిగి, కాలగమనంలో మరింత పెద్దదై, నదీముఖాల్లో తేలికపాటి అలలను తట్టుకునేంత పటిష్టమైన, ఒక దశలో సముద్రాన్ని సైతం ఈదగలిగే ‘ఓడ’గా ఎదిగింది. ఈ ఒరిపిడుల మధ్యన, ఆయా రంగాల్లో నైపుణ్యంవారీగా వృత్తుల్లో పని విభజన మొదలయింది. లోహంతో పనిచేసేవాడు కమ్మరి, బంకమట్టితో పనిచేసేవాడు కుమ్మరి, కలపతో పనిచేసేవాడు వడ్రంగి, రాయితో పనిచేసేవాడు వాస్తుశిల్పి - ఇలా, నేతతో సహా, దేనికదిగా విడిపోయి, స్వతంత్ర జీవనోపాధులుగా అవి నాగరికతకు అతుక్కుపోయాయి. మెరుగైన పనిముట్ల వల్ల వృత్తిపనుల్లో ఉత్పత్తి పెరిగింది. నాగరికత పెరగడం వల్ల, తయారైన వస్తువులకు గిరాకీ ఏర్పడింది. వాటిని గింజలతోనో, గొర్రెలతోనో, బర్రెలతోనో వస్తుమార్పిడి చేసుకునే సంతల్లో సందడి పెరిగింది. సంతలకు పేరుబోయిన ప్రదేశాలు క్రమంగా పట్టణాలుగానూ, నగరాలుగానూ విస్తరించాయి. క్రీ.పూ. నాలుగవ శతాబ్దానికి నగరాలుగా చెప్పుకోదగిన ప్రదేశాలు ఇరవైదాకా మెసొపొటేమియాలో ఉండినట్టు అంచనా. వాటిని చుట్టుకొనివున్న జనావాసాల్లో కొన్ని పట్టణాలుకాగా, తక్కినవి గ్రామాలు. ప్రపంచంలో అన్నిటికంటే ముందు నగరాలుగా ఎదిగినట్టు నిరూపించుకున్న ప్రదేశాలు ‘ఎరెచ్’, ‘నిప్పర్’లు రెండున్నూ మెసొపొటేమియాకు చెందినవే. పర్షియన్‌గల్ఫ్ తీరానికి సుమారు రెండు వందల కిలోమీటర్ల ఎగువన, యూఫ్రటీస్ నదీతీరంలో వెలిసిన నగరం ‘ఎరెచ్’. దీనికి ఉత్తరంగా, మరో వంద కిలోమీటర్ల దూరంలో, జంట నదులకు నడిమిగా ఏర్పాటైన నగరం ‘నిప్పర్’. మెసొపొటేమియన్లు ఆరాధించిన దేవతల్లో ప్రముఖుడైన ‘ఎన్లిల్’కు (ఋగ్వేదంలోని మరుత్తులతో పోల్చదగిన శక్తికి) ఈ నగరంలో ఒక దేవాలయం నిర్మించారు. చరిత్రకు తెలిసిన ఈ మొట్టమొదటి దేవాలయానికి ఆకాశాన్ని తాకేంత ఎత్తై గోపురాన్ని ఇటుకలతో నిర్మించారని ప్రతీతి. బైబిల్లో ప్రస్తావించిన ‘టవర్ ఆఫ్ బేబెల్’ ఇదేనని చరిత్రకారుల అభిప్రాయం. పురాతన నాగరికతల్లో అన్నిటికంటే విశాలంగా విస్తరించిన సింధూ నాగరికతలో నగరాల సంఖ్య తక్కువ, గ్రామాల సంఖ్య ఎక్కువ. నగరాలుగా ఎదిగినవి మామూలు నగరాలు కాదు, మహానగరాలు (మెట్రోపొలీస్). ఇకపోతే, ఈజిప్టు, చైనా నాగరికతల్లో వంశపారంపర్య పరిపాలన మొదలయిందాకా పట్టణాలూ, నగరాలు ఏర్పడిన దాఖలాలు కనిపించవు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 50
కొత్త ఒరవడి రెండోతరం చక్రాలు అచ్చంగా మన దేవాలయాల్లో ఊరేగింపులకు ఉపయోగించే రథాలకుండే చక్రాలవంటివి. నిలువు పట్టెలనూ, అడ్డ పట్టెలనూ పొరలు పొరలుగా అతికించి, దళసరిగా తయారైన తరువాత, వృత్తాకారంగా చెక్కిన కొయ్యచక్రం ఇది. ఈ తరహా చక్రానికి ఆనవాలుగా దక్షిణ యూరప్‌లోని స్లొవేనియాలో బయటపడ్డ బండి చక్రాలను తీసుకోవచ్చు. వాటి వయసు దాదాపు 5100 సంవత్సరాలని అంచనా. మన్నికకు పటిష్టమైనవే కావచ్చుగానీ, తూకం విషయంలోనే ఇవి మరో సమస్యను మోసుకొచ్చాయి. దాంతో, ఎక్కువ కాలం మన్నికయ్యేవేగాక, వీలైనంత తేలిగ్గా ఉండే చక్రాలకోసం పాకులాట మొదలైంది. ఆ తరువాతి అంచెగా, ఇప్పుడు లారీలకూ, బస్సులకూ టైర్లు తగిలించుకునే డిస్కుకు ఐదుచోట్ల సమాన దూరంలో కోడిగుడ్డు ఆకారపు కంతలు చూస్తున్నామే, అదేపద్ధతిలో కంతలు చేసి, తూకం తగ్గించే ప్రయత్నం జరిగుండొచ్చు. దాని మూలంగా చక్రమంతా ఒకే ఘనపదార్థంగా ఉండవలసిన అవసరం లేదనే కిటుకు తెలిసుండొచ్చు. ఫలితంగా అనతికాలంలోనే ఆకుల చక్రం (స్పోక్డ్ వీల్) ఉనికిలోకి వచ్చుండాలి. ఈ తరహా చక్రానికి అతిపురాతనమైన ఆధారం సింధూ నాగరికతలో దొరికిన బొమ్మబండ్లకుండే మట్టిచక్రాలు. అదే ప్రదేశంలో దొరికిన ముద్రికల (సీల్స్) మీద ఆరు ఆకులుండే చక్రం చిత్రలిపిలో కనిపిస్తుంది. క్రీ.పూ. 2000 కాలంలో ఈజిప్టులో వాడింది ఇదే తరహా ఆరాకుల చక్రం కాగా, ఇంచుమించు అదే సమయంలో గ్రీకులు వాడింది నాలుగాకుల చక్రం. చక్రం సాక్షాత్కారంతో నాగరికత రూపురేఖల్లో కొత్త జిలుగు ప్రవేశించింది. కుండలు చేసేందుకు సారె, నూలు వడికేందుకు రాట్నం వంటి పరికరాలు ఒకటొకటిగా జీవితానికి తోడుపడటం మొదలెట్టాయి. అంతదాకా కోతజంతువుగా మాత్రమే భావించబడిన పోతు జంతువుల హోదా హఠాత్తుగా మారి, ‘కాడిజంతువు’ ఉపయోగపడింది. ఎద్దులూ గాడిదల వంటి మందకొడి జంతువులు మాత్రమే. గుర్రం అప్పటికే పెంపుడు జంతువుల జాబితాలో చేరిపోయినా, దాని వేగానికి తట్టుకోగల బండిగానీ, సహకరించే రహదారులు గానీ ఇంకా రూపొందలేదు. గుర్రం వీపు మీద స్వారీ చేసే విధానం మొదట్లో లేదు. రథాలకు గుర్రాలను పూన్చడం మొదలైన చాలాకాలం తరువాత స్వారీ చేసే సాము అలవడింది. అందువల్లే, ఋగ్వేదంలో చెప్పిన ప్రయాణాలన్నీ రథాలమీదివి కాగా, గుర్రం మీద కూర్చున్నట్టు చెప్పే సందర్భాలు రెండు మాత్రమే కనిపిస్తాయి. అలాగే మహాభారతంలో గూడా గుర్రం మీది ప్రయాణం కనిపించేది రెండే రెండు చోట్ల. కురుక్షేత్ర యుద్ధం చివరిరోజున, రథం విరిగిపోగా కిందికి దిగిన దుర్యోధనుడు గుర్రమెక్కి యుద్ధ రంగం నుండి తప్పుకోవడం మొదటి సందర్భం. అనుశాసనికపర్వంలోని ఒక ఉపాఖ్యానంలో ‘భంగాశ్వనుడు’ అనే రాజు గుర్రం మీద వేటకు వెళ్లడం రెండో సందర్భం. వీటిని బట్టి, గుర్రం చాలా కాలం దాకా కోత జంతువుగానే ఉండిపోయిందని అర్థమౌతుంది మనకు. ఎట్టకేలకు, క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దం మధ్యలో, ‘ఇండో ఇరానియన్’దిగా చెప్పబడే సంస్కృతికి మూలపురుషులైన ‘ఆండ్రొనోవో’ తెగల నైపుణ్యంతో గుర్రాలు పూన్చేందుకు అనువైన రథాలు పురాతన ప్రపంచమంతా విస్తరించాయి. కాస్పియన్ సముద్రానికి తూర్పు తీరం మొదలు సైబీరియా దాకా విస్తరించిన ఈ ఆండ్రొనోవో తెగలు ప్రవేశపెట్టిన రెండు చక్రాల రథం అప్పట్లో అత్యాధునిక యుద్ధ శకటం. దానికి తొడిగిన చక్రానికుండే ఆకులు ఎనిమిది. ఒక వైపు చక్రాన్ని ఆధునీకరించటానికి ప్రయాసలు పడుతూనే, మానవుడు మరోవైపు ‘లోహం’ మీద అధికారం సాధించేందుకు ప్రయత్నాలు కొనసాగించాడు. లోహం మానవునికి కొత్తగా పరిచయమైన పదార్థం కాదు. ఆరుబయట ఎడతెరిపి లేకుండా మండే నానా రకాల శాఖల వేడికి పరిసరాల్లోని ఖనిజాలు కరిగి, నిప్పు చల్లారిన తావుల్లో తిరిగి గట్టిపడటం అతడు చాలాకాలంగా చూస్తున్నాడు. అది కేవలమొక వింతగా గమనించిన రోజులు గతించి, ‘ఎప్పుడు, ఎందుకు, ఎలా’ అనే ప్రశ్నలతో ఆలోచించడం మొదలెట్టిన తరువాత దాని ప్రయోజనం అతని చేతికి చిక్కింది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 45
నాగరికత కట్టడాలకు మెసొపొటేమియాలో ఉపయోగించింది ఇటుకలు మాత్రమే. ఆ ప్రాంతాల్లో రాయి అరుదైన పదార్థం. ఎండవేడికి పటిష్టంగా బిగుసుకునే బంకమట్టి కోరినంత దొరుకుతున్న కారణంగా, ఇంటి నిర్మాణానికి ఇటుక తప్ప వేరొకదాన్ని గురించి ఆలోచించే అవసరమే వాళ్లకు కలిగుండకపోవచ్చు. సామూహిక ప్రయత్నంతో తమ పరిసరాలను క్రూరమృగాల నుండి విముక్తి చేసుకోగలగడంతో, బల్లెం చేత్తో పట్టుకుని ఒంటరిగానైనా పొలాల్లో యథేచ్ఛగా సంచరించే స్వేచ్ఛను వాళ్లు సంపాదించుకున్నారు. చీకూ చింతాలేని జీవితం కావడంతో జనసాంద్రత అదివరకు ఎన్నడూ పెరగనంతగా పెరగడం మొదలెట్టింది. దాని మూలంగా గ్రామాల విస్తీర్ణం పెరిగింది, వాటి సంఖ్య పెరిగింది. అక్కడక్కడ కొన్ని జనావాసాలు గ్రామాల స్థాయిని దాటుకుని ‘పురాలు’గానూ, మరికొన్ని ‘నగరాలు’గానూ ఏర్పడ్డాయి. ఇప్పుడివి పచ్చికబయళ్ల కోసం ఇరుగుపొరుగుతో చావు బతుకులు తేల్చుకునేంత పోరాటానికి దిగే జనపథాలు ఎంతమాత్రం కావు. అవసరమైతే చేదోడువాదోడుగా నిలబడటం నేర్చుకున్న గ్రామాలు; పొలాలను తడుపుకునేందుకు ఏటికాలువల త్రవ్వకాలను ఉమ్మడిగా సమన్వయించుకునే గ్రామాలు. వాళ్లకిప్పుడు నరమేథంతో పురుషులను ఖతం చేసే అవసరం తీరిపోయింది. మిథునాల కోసం ఏ జనపథం నుండో స్త్రీ జనాన్ని దోచుకురావడం అనాగరికమైంది. అందుకోసం వరుసలూ, వియ్యాలూ పుట్టుకొచ్చాయి. అంతర్గతంగా ఎంత ప్రశాంతత సాధించినా, చుట్టుపక్కలుండే అనాగరిక తెగలతో మెసొపొటేమియాకు ఆటుపోట్లు తప్పలేదు. ఉత్తరంగా ఉండే ఆసియా మైనర్లో ఆటవికులు, తూర్పు దిశన మధ్య ఆసియాలో సంచార తెగలు, దక్షిణాన అరేబియా ప్రాంతంలో ఎడారి జాతులు - వాళ్ల నుండి క్రూరమైన దాడులను ఎదురుజూస్తూ ఏ పూటకాపూట వాళ్ల జీవితం బిక్కుబిక్కుమని గడుస్తుండేది. పోరాటానికి తెగించింది దాడిచేసే గుంపు. ఐనా, ఆ దాడులను నిగ్రహించుకుని మెసొపొటేమియన్లు నిలదొక్కుకున్నారంటే, అది కేవలం సంఖ్యాబలం, సమన్వయాల మూలంగా సాధించుకున్నదే. ఎంత నిలదొక్కుకున్నా యుద్ధం వల్ల అంతో ఇంతో నష్టం జరిగే తీరుతుంది. ఆ నష్టం కంటే దాడికి పాల్పడే గుంపుతో బేరం కుదుర్చుకోవడం క్షేమమనే ఆలోచన కొన్నిచోట్ల కలిగిందనటానికి మహాభారతంలోని బకాసురుని వృత్తాంతమే ఆధారం. ప్రాణహానిని ఎదుర్కోవడం కంటే, ఎంత అనుభవించినా తరగని సంపదలో ఎంతోకొంత ఎదుటి పక్షానికి ఒప్పందంగా అప్పగించి, అధిక నష్టాన్ని అరికట్టడం లాభదాయకమనే ఆలోచన భారతంలోన ఏకఛత్రపురవాసులకు కలిగినట్టే మరెంతోమందికి కలిగుండొచ్చు. బండి నిండా పంపించే వంటకాలతో తృప్తిపడకుండా, నరమాంసం కోరుకునే దురాశే బకాసురునికి లేకపోతే, అతని భావితరాలకు బహుశా ఈస్టిండియా కంపెనీవాళ్లు అడ్డుకునే దాకా నిరపాయంగా సాగిపోతూ ఉండేదేమో! మెసొపొటేమియా, ఈజిప్టు నాగరికతల్లో ఏది మిక్కిలి పురాతనమైందో చరిత్రకారులు ఇప్పటికీ తేల్చుకోలేకపోతున్న సందేహం. ఇవి ఒకదాన్నుండి మరొకటి పుట్టుకొచ్చినవా లేక దేనికది స్వతంత్రంగా ఎదిగినవా అనేది గూడా జవాబు దొరకని మరో ప్రశ్న. ఇప్పుడు ఉగాండా దేశంగా ఉన్న తావున పుట్టి, ఉత్తర దిశగా సూడాన్ దేశం నిలువునా ప్రవహించి, ఈజిప్టు ద్వారా మధ్యధరా సముద్రంలో కలిసే ‘నైలు నది’ పరీవాహక ప్రాంతం పొడవునా విస్తరించిన నాగరికతను ‘ఈజిప్టు నాగరికత’ లేదా ‘నైలునది నాగరికత’ అంటారు. స్థూలంగా దీనికీ మెసొపొటేమియా నాగరికతకూ వ్యత్యాసం కనిపించదు. మలిచేందుకు ఒదిగే సున్నితమైన రాయి నైలు ప్రాంతంలో దొరుకుతున్న సౌలభ్యం మూలంగా ఇక్కడి నిర్మాణాలకు రాయిని ప్రధానంగానూ, ఇటుకను సహకారంగానూ వాడుకున్నారు. బయటి నుండి జరిగే దాడుల విషయంలో ఇజిప్షియన్లు అదృష్టవంతులు. వాళ్ల రక్షణకు తూర్పున ఎర్రసముద్రం ఉంది, ఉత్తరాన మధ్యధరా సముద్రం ఉంది. పడమటి దిశలో ఎడారిగా మారుతున్న సహారా కాగా, దక్షిణంగా ఉండేది దాడికి సాహసించలేనంతగా వెనుబడిన నీగ్రో తెగలు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 44
నాగరికత అతలాకుతలమైన భూగోళపు ఉపరితలం కుదురుబాటుకు చేరుకుంటున్న తరుణంలో మానవుని పరిణామంలో ‘నాగరికత’ మోసెత్తింది. ఏ పదివేల సంవత్సరాలకు పూర్వమో విల్లనమ్ములు చేత్తో పట్టుకుని దశదిశలా విస్తరించిన మానవునితో మనకు ‘సంస్కృతి’ ప్రారంభం కాగా, నాగలి పట్టిన మానవునితో నాగరికత మొదలయింది. సంస్కృతి వేరు, నాగరికత వేరు. ఉమ్మడి ఆచార విశ్వాసాలు సంస్కృతి; ఉమ్మడిగా అనుభవించే సౌకర్యాలు నాగరికత. సంస్కృతి సంచార జాతుల్లోనూ ఉంటుంది. నాగరికత స్థిరనివాసుల్లో మాత్రమే కనిపిస్తుంది. ఏడాది పొడవునా నీటికి కొరత ఉండని జీవనదులను ఆశ్రయించి క్రీ.పూ.7000 ప్రాంతంలో నాగరిక నివాసాలు మొదలైనట్టు మనకు దొరుకుతున్న ఆధారాలు నిరూపిస్తున్నాయి. చిత్రమేమిటంటే - ఈ రెండు దశలూ కొత్తరాతియుగం అంతర్భాగాలే. లోహం గురించి అప్పటికి తెలీకపోవడంతో, కర్రు లేని నాగలితో సాగిందే సేద్యం; రాతి కొడవలితో బరుక్కున్నదే కోత! అతి పురాతనమైన నాగరికతలుగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాల్లో బహు విస్తారమైనవి - 1. మెసొపొటేమియా, 2. ఈజిప్టు, 3. సింధూ, 4. చైనా నాగరికతలు. వీటిల్లో ముందుగా చెప్పుకోదగింది ‘మెసొపొటేమియా’. యూఫ్రాటెస్,టైగ్రిస్ పేరుగల రెండు నదుల మధ్య విస్తరించిన ప్రాంతం కావడంతో దీనికి ఆ పేరొచ్చింది. ఈ నదుల మూలంగా, సిరియా మొదలు పర్షియల్ గల్ఫ్వరకు చాపంలా విస్తరించిన పీఠభూమి (ఫెర్టైల్ క్రిసెంట్) ప్రపంచంలోకెల్లా అత్యంత సారవంతమైనదిగా ప్రసిద్ధి. చరిత్రకు పితామహుడైన ‘హెరొడోటస్’ ప్రకారం, ఆ భూముల్లో విత్తిన ప్రతి గోధుమ గింజ రెండు వందల రెట్లు ఫలసాయం ఇచ్చేదట. అంతేగాదు, ఆరోజుల్లోనే గోధుమను ఇరుగారు పండించేవాళ్ళనీ, కోతలు పూర్తయిన తరువాత ఆ పొలాల్లో పశువులకు మేత పుష్కలంగా దొరికేదనీ, ఖర్జూరం మొదలు ఎన్నోరకాల పండ్ల చెట్లు ఆ ప్రాంతంలో విస్తారంగా ఉండేవనీ బైబిల్ కాలంనాటి చరిత్రకారులు చెబుతున్నారు. హెరొడోటస్ నాటికి గోధుమ బహుళ ప్రచారం పొందిన పంట కావచ్చుగానీ, తొలితరం వ్యవసాయదారునికి ఆ పైరును గురించి అవగాహన లేదు. అప్పట్లో తెలిసిన తృణధాన్యాలు జొన్న, బార్లీ మాత్రమే. గోధుమను తెలుసుకునేందుకు మరో రెండువేల సంవత్సరాలు పట్టింది. ఆహారంలో భాగంగా పప్పుదినుసులు ఎప్పుడు మొదలయ్యాయో చెప్పలేం గానీ, పలురకాల పప్పుధాన్యాలు మెట్టపైర్లుగా మెసొపొటేమియాలో ప్రవేశించాయి. వాళ్ళ వ్యవసాయం తడిపైర్లకు మాత్రమే పరిమితం కాలేదనీ, అది బహుముఖంగా విస్తరించిందనీ ఈ పప్పుదినసులు నిరూపిస్తున్నాయి. వీటిల్లో ‘నువ్వులు’ కూడా ఉండడం మరింత అపురూపం. నువ్వుల నుండి వచ్చింది ‘నూనె’. సంస్కృతంలో ‘తిల’ నుండి వచ్చింది ‘తైలం’. నూనెనిచ్చే పదార్థాలకు నువ్వుగింజ మొదటిది కావడంతో, ఆ తరువాత ఏ గింజనుండి అలాంటి పదార్థం లభించినా దాన్ని నూనెగానే వ్యవహరిస్తున్నాము - అవిసె నూనె, ఆవనూనె, కుసుమనూనె, వేరుసెనగ నూనె - ఇలా. మరో మూడువేల సంవత్సరాల తరువాత సింధూనది తీరంనుండి దిగుమతులు మొదలయ్యేవరకూ ‘పత్తి’ని గురించి మెసొపొటేమియాకు తెలీదు. దుస్తులుగా వాళ్ళు ధరించినవి ఉన్నితోనూ, నారతోనూ తయారైన బట్టలు. ‘మగ్గం’ ఇంకా అందుబాటులోకి రానందున, పడుగునూ పేకనూ చేతికర్రల సహాయంతో మార్చుకుంటూ నేసేదే నేత. లడక్, మేఘాలయా ప్రాంతాల్లో ఇప్పటికీ ఈతరహా నేత మనకు కనిపిస్తుంది. వాడుకునే దినుసులన్నీ ఒకే తావులో పండవు కాబట్టి ప్రయత్నం లేకుండా ప్రవేశించిన విధానం ‘వస్తుమార్పిడి’. దరిమిలా, సంతల రూపంలో వర్తకానికి పునాది ఏర్పడింది. వర్తకం అనగానే ప్రామాణికమైన కొలతలూ, తూకాలూ అవసరమౌతాయి. ఒకే పరిణామంలో తయారుచేసుకున్న గంపలతోనూ, ఇంచుమించు ఒకే బరువుండే గుండ్రాళ్ళతోనూ బహుశా వాళ్ళు ఆ అవసరాన్ని తీర్చుకోనుండొచ్చు. గింజకూ గింజకూ తూకంలో తేడా స్వల్పాతిస్వల్పమైన కారణంగా గురువింద గింజలను ఇటీవలి కాలందాకా బంగారు తూకానికి వినియోగించడం మనం చూసేవున్నాం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 43
నేరం ఇలాంటిదే మహాభారతంలో కూడా ఒక ఇతివృత్తం కనిపిస్తుంది. మనువుల్లో ఒకడైన వైవసత్వుడు స్నానం పూర్తిజేసుకుని కొలనుగట్టున నిలుచోనుంటాడు. ఒక చేప అతనికి దగ్గరగా వచ్చి, ‘అయ్యా, నేను చాలా చిన్న చేపను. ఈ కొలనులో ఉన్న పెద్ద చేపలతో నాకు భయంగా ఉంది. అపాయంలేని చోటికి నన్ను చేర్పించ’మని ప్రార్థిస్తుంది. వైవసత్వుడు దాన్ని తీసుకెళ్ళి ఒక నూతిలో విడుస్తాడు. కొద్దిరోజులకు ఆ చేప పెద్దదిగా పెరిగి, ‘అయ్యా, నీ దయవల్ల నా శరీరం పెరిగింది. ఇప్పుడు నుయ్యి నాకు చాలడం లేదు.’ అంటూ మొరపెట్టుకుంది. వైవసత్వుడు దాన్ని బావిలోకి మార్చాడు. అక్కడగూడా ఇమడనంతగా పెరగ్గానే పెద్ద మడుగులోకీ, ఆ తరువాత సముద్రానికీ దాన్ని మారుస్తాడు. అప్పుడు ఆ చేప వైవసత్వునితో, ‘నువ్వు నాకు చాలా ఉపకారం చేశావు. నీకు నేను ప్రత్యుపకారం చేస్తాను. వ్యవధి పెద్దగా లేదు; సముద్రాలు పొంగి ఏకం కాబోతున్నాయి. జీవరాసులన్నీ తుడిచిపెట్టుకుని పోనున్నాయి. తొందరగా నువ్వొక పెద్ద నౌకను తయారుజేసుకో. అందులో అన్ని విధాలైన ధాన్యాలనూ విత్తనాలనూ నింపుకుని, సప్తఋషులతో కలిసి సముద్రం ఒడ్డుకొచ్చి నన్ను తలుచుకో. కొమ్ముండే చేపగా నేను ప్రత్యక్షమౌతాను.’ అంటూ కటాక్షించింది. వైవసత్వుడు ఆ చెప్పినవి ఆచరించి చేపను తలుచుకోగానే, తలపైన పెద్ద కొమ్ముడే చేప ఒడ్డు దరికి వస్తుంది. ఆ చేపకొమ్ము కొసకు పొడవాటి మోకుతో నౌకను కట్టివేయగా, అచ్చెరువు కలిగించే వేగంతో అది ఆ నౌకను సముద్ర మధ్యానికి లాక్కుపోతుంది. ఆ నౌకమీదినుండి వైవసత్వుడు చూస్తుండగానే సముద్రాలుపొంగి, ప్రపంచమంతా ఒకే సముద్రంగా మారిపోతుంది. కొన్ని వేల సంవత్సరాలకు ఆ వరద తగ్గుముఖం పట్టగా, ఆ చేప వాళ్ళ నౌకను హిమాలయ పర్వత శిఖరం దాపునకు చేర్చి, ‘మీ నౌకను ఈ శిఖరానికి బంధించండి.’ అంటుంది. అలా చేసిన తరువాత, ‘ఈ ప్రళయం నుండి మిమ్ములను కాపాడాను. ఇక మీకు భయం లేదు. ఈ వైవసత్వమనువు చరాచర ప్రపంచాన్ని సృష్టిస్తాడు. నా దయవల్ల అతనికి పరమజ్ఞానం కలుగుతుంది’ అని చెప్పిన చేప అంతర్ధానమౌతుంది. పురాణాలను వదిలేసి, మరోసారి భౌగోళం సంఘటనలకు తిరిగొస్తే, సముద్రాల పొంగును నిగ్రహించుకోలేక మునిగిపోయిన నేలలు కొన్నైతే, భూగర్భంలో ఏర్పడిన ఒత్తిడికి సముద్రాల అడుగున్నుండి కొత్తగా పుట్టుకొచ్చిన నేలలుగూడా ఎన్నోవున్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది దక్షిణ రష్యా (ఒకప్పటి యు.ఎస్.ఎస్.ఆర్.). అక్కడుండే కాస్పియన్, ఎరల్ సముద్రాలు ఒకప్పుడు నల్లసముద్రంతో కలిసి విస్తారమైన అంభోరాసిగా ఉండేదట. సింధూనది కేవలం జలప్రవాహంగా కాక, ఆ రష్యన్ జలరాసిని హిందూ మహాసముద్రంతో కలిపే జలసంధిగా ఉండేదట. బహుశా అందుకేనేమో దానికి ‘సింధువు’ (సముద్రం) అనే పేరు అలాగే మిగిలిపోయింది. పొంగుకొచ్చిన లావాతో ఆ స్వరూపం మారిపోయి, రష్యాలోని సముద్రాలు దేనికదిగా విడిపోవడమే కాక, హిందూ మహాసముద్రంతో ఉన్న సంబంధం మూసుకుపోయి, మధ్య ఆసియా ప్రాంతాలకు (ఇప్పటి తుర్క్మెనిస్థాన్, తాజ్కిస్థాన్, ఉజబెకిస్థాన్లకు) దక్షిణదిశగా ఆఫ్గనిస్థాన్, ఇరాన్‌లతో అదివరకున్న సంబంధాలకు తోడు, ఉత్తర దిశగా ఓల్గా తీరాలతోనూ, ఈశాన్యంగా సైబీరియాతోనూ భూమార్గ సంబంధం ఏర్పడిందట. పూర్వం జలసంధిగా ఉన్న సింధువు కేవలం ‘సింధూనది’గా ఆధునిక చరిత్రకు మిగిలిపోయిందట. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 42
నేరం ఆ దశలో, అనుకూలించిన ప్రతిచోటా, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి మానవులంతా ఎక్కడికక్కడ స్థిరనివాసాలకు పనపడిపోయారని తీర్మానించుకోవడం పొరపాటౌతుంది; ఎందుకంటే, సమాజంలో ఏ పరిణామమైనా రెప్పపాటులో జరిగే మాయాజాలంగా ఉండబోదు. క్రీస్తుపూర్వం నాలుగువేల సంవత్సరాల ముందుదాకా స్థిరనివాసాల జనసంఖ్య ప్రపంచ జనాభాలో కేవలం మూడింట ఒకవంతు మాత్రమేనని తెలుసుకుంటే ఆ పరివర్తన ఎంత నింపాదిగా, ఎంత పలుచగా మొదలయిందో మనం సులభంగా ఊహించుకోవచ్చు. ఆ కారణంగానే ఈ నేలమీద ఎదుగుదలకు నోచుకోకుండా పాతరాతియుగం దశలో ఆగిపోయిన తెగలు అక్కడక్కడ ఇంకా మిగిలున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆదిమవాసులకు (ఆబొరిజినల్స్కు) విల్లనమ్ములు ఎలా ఉంటాయో ఇప్పటికీ తెలీదు. మానవ సమాజం పురిటినొప్పులు పడుతున్న అదే సమయంలో భూమి ఉపరితలం పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది. మంచు కరిగినకొద్దీ సముద్రాల్లో నీటిమట్టం ఎగదన్ని, భూమి బలహీనంగా ఉన్న తావుల్లో కోతలు పెడుతూ నేలను ముక్కలు ముక్కలుగా చీల్చేయడం మొదలెట్టింది. చీలిన ముక్కల్లో కొన్ని మునిగిపోగా, కొన్ని మాత్రం దీవులుగా నిలదొక్కుకుంటున్నాయి. అమెరిగా ఖండాన్ని ఆసియాతో కలిపుంచిన వంతెన నీటిలో మునిగి, చిరునామా లేకుండా కరిగిపోయింది. ఆసియాఖండానికి ఆగ్నేయంలో కలిసుండిన ఆస్ట్రేలియా, న్యూజిల్యాండులు దాన్నుండి చీలిపోయి దూరంగా జరిగిపోతున్నాయి. ఇంగ్లండు, ఐర్లండులు యూరప్ నుండి తెగిపోయి ద్వీపాలుగా ఏర్పడ్డాయి. దక్షిణ భారతదేశం నుండి శ్రీలకం తెగిపోయింది. ఇలా ప్రతి భూఖండం నుండి వందలాది ముక్కలు విడిపోయి దీవులుగా ఏర్పడుతున్నాయి. ఆ తరువాత, ఆఫ్రికా యూరప్‌లను చీలుస్తూ, మధ్యధరా ప్రాంతంలో అట్లాంటిక్ మహాసముద్రం చొరబడి, అదివరకు అక్కడున్న సరస్సులు రెండింటినీ సముద్రంగా మార్చేసింది. ఆ కోత అంతటితో ఆగకుండా ఇంకా తూర్పుకు విస్తరించి, మధ్యధరా సముద్రాన్ని నల్లసముద్రంతో కలిపేయడంతో ఆసియా ఖండానికి యూరప్‌తో ఉండిన భూమార్గం సంపూర్ణంగా తెగిపోయింది. ఈ దూకుడును ఓర్చుకున్న భూమి, ఎనిమిది తొమ్మిది వేల సంవత్సరాలప్పుడు క్రమంగా ఇప్పుడున్న స్వరూపానికి స్థిరపడింది. జ్ఞాపకశక్తి మొలకెత్తిన బుర్రల్లో ఆనాటి భూగోళంలో ఏర్పడిన అతలాకుతలం, చెప్పుకునేందుకు అర్హమైన మొట్టమొదటి చారిత్రిక సంఘటనగా నమోదైంది. బైబిల్లో చెప్పిన ‘నోవా అండ్ ది ఆర్క్’ వృత్తాంతంలో, జలప్రళయం సృష్టించి భూమిమీదున్న సకల జీవరాసులనూ తుడిచిపెట్టాలని దేవుడు సంకల్పించాడు. కానీ, నిజాయితీపరుడైన నోవామీద ఆయనకు జాలి కలిగింది. పెద్ద నౌకను తయారుజేసుకుని ప్రళయం నుండి బయటపడేందుకు సిద్ధం కమ్మని నోవాను దేవుడు ఆదేశిస్తాడు. ఆ నౌకను తిండిగింజలూ తదితర ఆహారపదార్థాలతో నింపుకుని, తానూ తన కుటుంబం యావత్తు అందులో చేరుకోమంటాడు. ప్రతి జంతువు నుండి ఒక పోతు ఒక పెంటి, ప్రతి పక్షి నుండి ఒక పుంజు ఒక పెట్ట ఉండేట్టుగా నౌకలోకి తీసుకోమంటాడు. నలభై రాత్రులూ నలభై పగళ్ళూ వర్షం ఏకధారగా కురిసి, సముద్రాలన్నీ ఏకమై భూమిని ముంచెత్తడంతో జీవరాసులన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. నౌకకు చేరిన నోవా కుటుంబం, జంతువులూ, పక్షులూ మాత్రమే మిగిలి, సంతానోత్పత్తితో తరువాతి ప్రపంచాన్ని నింపేస్తాయి. (పౌరాణిక గ్రంథాల్లో అన్నిటికంటే ముందుదిగా చరిత్రకారులు భావిస్తున్న ‘గిల్గమేశ్’లో, ఇదే ఇతివృత్తం, కేవలం పాత్రల పేర్ల మార్పిడితో లిఖితమైవుండడం గమనార్హం) రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 41
నేరం వీటన్నింటికంటే మనం ముఖ్యంగా ఆలోచించవలసింది వాళ్ళ గుడిసెల్లో కనిపించిన మట్టి పొయ్యిల గురించి, గుడిసె గుడిసెకు వేరువేరుగా సాగిన వంటావార్పులకు అవి సంకేతంగా నిలుస్తున్నాయి. అంటే, అగ్నిగుండం చుట్టూరా కూర్చుని, కలసిమెలసి భోంచేస్తూ, విడివిడి హోదాలకు తావులేని ‘సామూహిక జీవితం’ అంతరించింది అనేందుకు అవి ఆధారాలు. ఇప్పుడు ప్రతి కుటుంబానికీ ‘నాది’ అని చెప్పుకునే ఒక గుడిసె, కొన్ని పనిముట్లు, కొన్ని పశువులు - వాటాలుగా పంపకమై, అదివరకటి మానవుని ఊహకే అందని ‘సొంత ఆస్తి’కి స్వరూపం ఏర్పడింది. తద్వారా, హెచ్చుతగ్గులు లేని ఆదిమ సమాజపు గర్భంలో స్వార్థం (స్వ - అర్థం - సొంత సంపాదన), అవినీతి వంటి అనర్థాలకు హేతుభూతమైన రాక్షస పిండానికి బీజం ఏర్పడింది. ఇక ఉమ్మడి వ్యవహారంగా మిగిలినవి వ్యవసాయం, వేటామార్గం, యక్షగానాల వంటి వినోద కార్యక్రమాలు మాత్రమే. ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి ఆస్తి వాళ్ళది అయిన తరువాత, జనపథంలో నివసించే వ్యక్తుల మధ్య సమన్వయం ఉండేలా చూసేందుకు ఒక యంత్రాంగంతో అవసరం తన్నుకొచ్చింది. కొత్త జీవనవిధానంలో పుట్టుకొచ్చే సమస్యలకు పరిష్కారం, ఇకమీదట అలాంటివి ఉత్పన్నం కాకుండా ఉండేందుకు తగిన విధంగా చట్టాలు రూపొందించడం ఆ యంత్రాంగం నిర్వహించే కార్యక్రమం. అంటే, సంప్రదాయాల స్థానంలో వ్యవస్థీకృతమైన రాజ్యాంగానికి బీజం పడింది. సమస్యలనూ చట్టాలనూ చర్చించేందుకు పౌరగణమంతా పాల్గొనే సమావేశానికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహించే వృద్ధుడు ‘గణనాయకుడు’. అది కేవలం పెద్దరికం ద్వారా సంపాదించుకునే హోదా. గౌరవం మినహా గణనాయకునికి ప్రత్యేక సౌకర్యాలు అనుమతించే అలవాటు తొలిరోజుల్లో ఉండేదిగాదు. అధికారం ఎంత చిన్నపాటిదైనా మోతాదుకు తగిన ఆదాయం అందులో ఉండే వుంటుందన్న కనువిప్పుతో మానవుడు మరో మూడువేల సంవత్సరాలు తీసుకున్నాడు. స్థిరనివాసాలకు ఎంపిక చేసుకునే ప్రాంతాలు సహజంగా సారవంతమైనవి కావడంతో, ‘ఆత్మరక్షణ’ అనేది జనావాసాలకు ఎదురైన మరో ప్రధాన సమస్య. పంటలకూ పశుగ్రాసానికీ అనువైన నేలల మూలంగా ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న సంపదను కొల్లగొట్టేందుకు నలుదిశలుగా శత్రువులు తయారయ్యారు. ఉమ్మడి జీవితం, ఉమ్మడి ఆస్తి అంతరించి, ఎవరి వ్యాపకం వాళ్ళదిగా మారిన దశలో, జనావాసం రక్షణ సమర్థులైన సభ్యులకు అప్పగించక తప్పిందిగాదు. ఇలా ఏర్పాటైన సైనిక బృందానికి నాయకుడు ‘సేనాని.’ జనపథం తీర్మానాన్ని దృష్టిలో ఉంచుకుని ఆ సేనానిని ఆదేశించే అధికారం గణనాయకుడైన వృద్ధునిది. సొంత వ్యాపకాలను వదిలేసి మందికోసం రక్షణ బాధ్యతలు తీసుకున్న వ్యక్తులకు పరిహారం ఏర్పాటుజేసే విషయంగా కొంత తర్జనభర్జన జరిగుంటే జరిగుండొచ్చుగానీ, ఎట్టకేలకు సర్దుబాటై, సరుకుల రూపంలో పారితోషికం ఏర్పాటైంది. ఋగ్వేదంలో కనిపించే ఇంద్రుడు, బృహస్పతులు బహుశా ఈ నాయకద్వయానికి ప్రతీకలే అయ్యుండొచ్చు. వైదిక వాఙ్మయంలో మరో తరహా గణతంత్ర వ్యవస్థ కూడా కనిపిస్తుంది. అది కండబలం కలిగిన ఏకైక నాయకుని మీద ఆధారపడి ఏర్పడిన జనపథం. శత్రువును స్వశక్తితో మట్టిగరిపించి, ఆ నాయకుడు చుట్టుపక్కల జనాన్ని పోగుచేసుకుని ఒక వ్యవస్థను నిర్మిస్తాడు. అలాంటి జనపథానికి శాసనమూ అతడే, శాసకుడూ అతడే. ఈ తరహా పాలెగాళ్ళను ‘మనువులు’గా హిందూ మతగ్రంథాలు కీర్తించాయి. ‘మనువు’ స్వయంగా విష్ణుస్వరూపుడని హిందువుల విశ్వాసం. ఆ కారణంగానే తదుపరి పృధివీపతులుందరూ దైవాంశ సంభూతులుగా చలామణి అయ్యారు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 40
నేరం అదే సమయంలో మరొక పరిణామం కూడా మెల్లిగా ప్రారంభమైంది. ఆరుగాలం పచ్చికమేతకు కొరవలేని ప్రదేశాల్లో స్థిర నివాసానికి మానవుడు ఆలోచించడం మొదలెట్టాడు. బహుశా, వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు ఇందుకు ప్రధానమైన ప్రోత్సాహం అయ్యుండొచ్చు. స్థిరనివాసాలు ఏర్పడిన ప్రదేశాల్లో గుడారాల స్థానాన్ని గుడిసెలు ఆక్రమించాయి. ఐతే, వాటిని గుడారాలంత విశాలంగా నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం అలవడని కారణంగా, ఉమ్మడి జీవితానికి అనుకూలత చెల్లిపోయింది. దరిమిలా, ఒకే తెగ వేరువేరు కుటుంబాలుగా విడిపోయే ప్రక్రియ బహుశా ఆ దశలోనే జరిగుండాలి. శిథిలాలుగా బయటపడిన ఆనాటి గ్రామాలను పరిశీలిస్తే, అలాటి నివాసాలకు మొదట్లో తటాక తీరాలను ప్రధానంగా ఎన్నుకున్నట్టు కనిపిస్తుంది. ఏ గ్రామంలోనూ పది పదిహేను కుటుంబాలకు మించి నివసించిన ఆనవాళ్లు లేవు. గుడిసెల గోడలు మట్టివి కాగా, కలప ఆధారంగా పరిచిన కొమ్మలూ, ఆకులూ, వాటి ఉపరితలం మీద అలికిన బంకమట్టితో ఏర్పడింది కప్పు. నునుపుజేసి పేడతో అలికింది చప్పట. రాతితో, కొయ్యతో, ఎముకతో తయారైన పలురకాల పనిముట్లూ, చేత్తో చేసిన మట్టిపాత్రలూ, తీగెలతో అల్లిన బుట్టలూ, పేలాలుగా వేయించి పొడిజేసిన పిండి నిలువలూ, ధాన్యపు నిలువలూ, వంట చెరుకు నిలువలూ ఏ ఇంట్లో చూసిన సమృద్ధిగా కనిపిస్తాయి. మొదట్లో వాళ్లు సాగుచేసింది వర్షాధారపు పంటలైన బార్లీ, జొన్న. చాలా ఆలస్యంగా ప్రవేశించిన తృణధాన్యం గోధుమ. కాయధాన్యం ఆనవాళ్లు కనిపించవు. నారతో అల్లిన వలలూ, పేలికలైన బట్టలూ చాలాచోట్ల దొరికాయి. బట్టల నేతను సులభతరం చేసే యాంత్రిక పనిముట్లు ఉనికిలోకి రానందున దుస్తులుగా ఉపయోగించిన సరుకుల్లో చర్మాలే ఎక్కువగా ఉన్నాయి. కూర్చునేందుకు పీటలుగానీ బల్లలుగానీ వాడుకలోకి రాలేదు. బహుశా నేలమీద బాసుపీటలు వేసుకుని కూర్చోవడమే ఆనాటి అలవాటయ్యుండొచ్చు. లేదా చాపలు వాడుకోనుండొచ్చు. పెంపుడు జంతువుల్లో ప్రధానంగా కనిపించేవి ఆవులూ, గేదెలూ, మేకలూ, గొర్రెలు. మనుషులతోపాటు పశువులు ఒకే కుటీరాన్ని పంచుకున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి అలవాటు రాయలసీమలో ఇప్పటికీ కొనసాగడం గమనిస్తే అది పెద్ద చోద్యంగా కూడా ఉండదు. పెంపుడు జంతువుల జాబితాలో పిల్లి లేదు, పంది లేదు, కోడి లేదు, బాతు లేదు. అప్పటిదాకా ఎలుకలు కుటీరాలను మరగిన ఆనవాళ్లు కనిపించవు. విడ్డూరం ఏమిటంటే, గుడిసెల్లో దీపాలు వెలిగించుకోవడం ఇంకా వాళ్లకు తెలిసిరాలేదు. రక్షణకోసం గుమ్మం వెలుపల వేసిన మంటల వెలుతురే రాత్రివేళల్లో ఆధారం. నాగలి వంటి వ్యవసాయ పనిముట్లు దొరక్కపోవడానికి కారణం బహుశా అవి కాలానికి నిలువనంత తేలికపాటివైనా అయ్యుండాలి, లేదా అలాంటివాటిని పొలం దగ్గరే వదిలేయడం వల్లనైనా అయ్యుండాలి. సేద్యానికి పశువులను వాడుకునే వసతి ఇంకా తెలీకపోవడంతో పోతు జంతువులన్నీ కోత జంతువులే. పెంటి జంతువుల కోతమీద నిషేధం ప్రాచీన సాహిత్యంలో సర్వత్రా కనిపించడం గమనిస్తే, మందలు పెరిగేందుకు అవి అవసరమై నందున, బహు శ్రద్ధగా వాటిని కాపాడుకున్నట్టు తెలుస్తుంది. పాలు పితకడం ఇప్పుడు సరికొత్త వ్యాపకం. అయితే, పాలుగానీ, పాల ఉత్పత్తులు గానీ వర్తకపు సరుకులుగా ఇంకా మారలేదు. సహజమైన ఆహార పదార్థంగా పాలను గుర్తించకముందు, పెరుగు, మీగడ వంటి ఉత్పత్తులను మాత్రమే వాడుకోనుండవచ్చు. పులియబెట్టిన ‘సారా’ వంటి మత్తు పానీయాలు అప్పట్లో మచ్చుకైనా కనిపించవు. పులియబెట్టే విధానం తెలియనంత మాత్రాన అప్పట్లో మత్తు పదార్థాలు బొత్తిగా లేవని చెప్పేందుకు వీలులేదు. సహజసిద్ధంగా దొరికే ‘బంగి’ ఆకు, కోకా ఆకు, ఇప్ప పువ్వు, గసాలకాయ, సోమ తీగె వంటి మాదకాల ఊసే ఎరుగనంత అమాయకులుగా వాళ్ళను స్వీకరించలేం. రచన: ఎం.వి.రమణారెడ్డి (సశేషం) రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
టూకీగా ప్రపంచ చరిత్ర 39
నేరం ఇప్పటికీ నివాసం తోళ్లతో కప్పిన గుడారమే; ఇప్పటికీ బతుకు తెరువు అడవి జంతువులను వేటాడడమే; కానీ, ఇదివరకటిలా వాళ్లకు వేట ఏకైక జీవన మార్గం కాదు. వేట ఎంత ప్రధానమో, మచ్చికయ్యే జంతువుల కోసం వలలు పన్నడం అంతే ప్రధానమైంది. ఆకలి వేటకు కేటాయించే రోజులు కొన్నైతే, పశుసంపద పెంచుకునేందుకు కేటాయించే రోజులు మరికొన్నిగా విడిపోయాయి. కాలక్రమేణా, వేటాడేందుకు కొందరు, ప్రాణంతో జంతువులను సేకరించేందుకు మరికొందరుగా విడిపోయారు. ఒడుపును బట్టి ఆయా పనులు కేటాయించడంలో, వాళ్ల స్పృహతో నిమిత్తం లేకుండా సమాజంలో వృత్తి విభజన ప్రవేశించింది. జీవన విధానంలో ఏర్పడిన మార్పును బట్టి మానవుని ఆలోచనా విధానంలో గూడా తేడా వచ్చింది. మునుపటిలా ‘కడుపు నిండితే చాల’నే దశ దాటిపోయింది; ఇప్పుడు అతని తాపత్రయమంతా ‘సమృద్ధి’ని సాధించుకోవడం. మంద ఎంత పెరిగితే సంపద అంత పెరిగినట్టు లెక్క. సంపద మూలంగా ఏర్పడే సౌకర్యాలు ఒక ఎత్తై, దాంతోపాటు ప్రవేశించే చీకాకులు మరో ఎత్తు. ‘ఆస్తి’, ‘నేరం’ అనేవి ఒకే నాణెం మీది బొమ్మాబొరుసులు. పశువుల రూపంలో సంపద ఏర్పడగానే, ఏనాడూ ఎరుగని దొంగతనాలతో ‘నేరం’ సమాజంలోకి ప్రవేశించింది. ఋగ్వేదంలో కనీసం మండలానికి ఒక్కసారైనా దొంగల నుండి తమ గోవులను కాపాడమని దేవతలను అర్థించే స్తోత్రాలో, దొంగల బారి నుండి గోవులను విడిపించినందుకు చేసే అభినందనలో గమనిస్తే, ఈ నేరం చాలా ప్రాచీనమైందనీ, వేదకాలం నాటికి ఇది చాలా తీవ్రమైన సమస్యగా పరిణమించిందనీ స్పష్టమౌతుంది. దొంగిలించిన గోవులను నరికేస్తారని గూడా ప్రస్తావించడంతో (ఋగ్వేదం, 1వ మండలం, 61వ సూక్తం, 10వ బుక్కు), ‘నేరం’ ఒక్క దొంగతనంతోనే ఆగిపోలేదు; బావిలోకి తోసో, మోకులతో కట్టేసి నదిలో పడదోసో హత్యలకు ప్రయత్నించడం ఋగ్వేదంలోనే అనేక సందర్భాల్లో తారసపడుతుంది. మరోవైపు, పశువుల మందలు పెరిగేకొద్దీ పచ్చిక కొరత తీవ్రమైన సమస్యగా ఎదురయింది. కొత్త బయళ్లు వెదుక్కుంటూ ఏ దిశగా వలస పోయినా అప్పటికే మరో గుంపు అక్కడ ఉండనే ఉంటుంది. ఆక్షేపాలు భీకరమైన పోరాటాలకు దారితీసేవి. తగాదాలకు కారణం అదొక్కటేగాదు; ఉప్పు దొరికే ‘జేడె’ నేలలు గూడా ప్రత్యర్థుల నుండి కాపాడుకోవలసిన ఖజానాలే. ఉప్పు కేవలం రుచి కోసం వాడే పదార్థం మాత్రమే కాదు; శరీరంలో లవణాల కొరత ఏర్పడితే కండరాలు పనిచేయవు కాబట్టి అది తప్పనిసరి గూడా. మాంసం మాత్రమే ఆహారంగా కలిగిన జీవులకు ఆ అవసరం అంతగా ఏర్పడదు గానీ, శాకాహారులైన పశువుల్లోనూ, భోజనంలో భాగంగా ఇప్పుడు శాకపదార్థాలను గణనీయంగా పెంచుకున్న మానవుల్లోనూ శరీరానికి చాలినంత లవణం సమకూర్చుకోవాలంటే బీడు భూములు అవసరం ఎంతైనా ఉంది. పాత రోజుల్లో నియాండర్తల్ మానవుని తరిమేసినంత తేలికైంది కాదు ఇప్పుడు జరిగే పోరాటం. ప్రత్యర్థి పక్షం సమఉజ్జీ కావడంతో ప్రాణ నష్టం బాగా పెరిగింది. గెలుపును సాధించే దిశగా దండును నడిపేందుకు ఒక ‘దండనాయకు’ని అవసరం గూడా ఏర్పడింది. దాడిని సమర్థవంతంగా నిర్వహించే నేర్పుగల మనిషికి ఆ హోదా స్థిరపడింది. వ్యక్తిగత ఆస్తులు ఏర్పడనంత దాకా అది కేవలం గౌరవ సూచకమైన హోదా మాత్రమే. కాకపోతే గుంపు మొత్తం అతనికి విధేయంగా నడుచుకునేది; అతని గౌరవార్థం విందులు జరిగేవి; గాయకులు అతని గొప్పలను ప్రత్యేకంగా కీర్తించేవారు. తన జనానికి ప్రయోజనం చేకూర్చిన తృప్తి తప్ప నాయకులకు స్వప్రయోజనమనే ఆలోచనే ఉండేదిగాదు. గెలిచిన గుంపు ఓడినవాళ్ల సంపదను నిరాటంకంగా స్వాధీనం చేసుకునేది. ఆ సంపద ఉమ్మడి ఆస్తిలో భాగంగా కలిసిపోయేది. స్త్రీలు సంతానోత్పత్తి క్షేత్రాలు కాబట్టి, వంశం విస్తరించాలని ఆకాంక్షించే రోజుల్లో స్త్రీ జనాన్ని కుండల్లో కలుపుకోవడం ఆలోచించేపాటి సమస్యగాదు; పని చేసేవాడొకడూ, చేయించుకునేవాడు మరొకడూ ఉంటాడని తెలియని రోజుల్లో పట్టుబడిన పురుషులను ఏం చెయ్యాలన్నదే తేల్చుకోవలసిన సమస్య. ఆ సమస్యకు పరిష్కారమే ప్రాచీన సంప్రదాయంలో కనిపించే ‘నరమేధం’. నరికే ప్రక్రియను మేధం అంటారు. అగ్నిగుండం సమక్షంలో శత్రువును నరికివేయడం పవిత్రమైన యజ్ఞంగా వెనుకటి రోజుల్లో కొనసాగింది. అంతకు మించి వాళ్లకు గత్యంతరం లేదు కూడా. ఆ తరువాత చాలా కాలానికి, విశ్వామిత్ర మహర్షి చొరవతో నరమేధాలు ఆగినట్టు ఋగ్వేదభాష్యం ద్వారా తెలుస్తూ ఉంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర 38
కులాసాలు ఈ కథలు మినహా, ‘మాతృస్వామ్యం’ ఉండేదని నిరూపించే ఆధారాలు మరోరకంగా మనకు దొరకలేదు. పాతరాతియుగం దశలో జీవిస్తున్న ఇప్పటి తెగల్లోనూ ఆ విధానం ఏవొక్క తావునా గోచరించదు. అసలు వాళ్ళ జీవనవిధానంలో ‘స్వామ్యం’ అనేదానికి ఆస్కారమే శూన్యం. స్త్రీల మీద అధికారంగానీ, దౌరన్యంగానీ వాటిల్లో మాటవరుసకైనా కనిపించదు. ఈనాటి సామాజిక విధానాన్ని బుర్రనిండా నింపుకుని, ‘పెత్తనం’ అనేది పుట్టకపూర్వం నివసించిన మానవులకు దాన్ని అసందర్భంగా అంటగడుతున్నామేమోననిపిస్తుంది. ఆ తెగల నడవడికను గమనించిప్పుడు. మైధునానికి జతగట్టే విషయంలోనైనా, పాతరాతియుగం మానవుడు జంతు స్వభావం నుండి సంపూర్ణంగా విడిపోని దశలో ఉన్నాడు. ప్రకృతిలో పశువులనూ, పక్షులనూ గమనిస్తే - ఒక్క పెంపుడు కోళ్ళల్లో తప్ప, పెట్టమీద దౌర్జన్యం మరో పిట్టజాతిలో మచ్చుకైనా కనిపించదు. మిగతావన్నీ రకరకాల విద్యలతో పెట్టను మెప్పించేందుకే ప్రయత్నిస్తాయి. ఉదాహరణకు, నెమలి తన నాట్యంతో పెట్టను ఆకట్టుకుంటుంది. గిజిగాడు గూటిని అల్లే నైపుణ్యంతో ఆడపిట్టను ఆకర్షిస్తుంది. మచ్చికకాని జంతువుల్లోనూ పెంటిమీద దౌర్జన్యం ఎక్కడా కనిపించదు. అడవి పొటేళ్ళు గొర్రెమీద హక్కును చావు బతుకుల పోరాటంతో తేల్చుకుంటాయి. ఆ జాతిలో ఏర్పడేది శాశ్వతమైన జంటజీవితం కాకపోయినా, ఆ రుతువులో తనతో దాటేందుకు విజేత కోసమే గొర్రె కాచుకుని నిలుచుంటుంది. ఆఖరుకు వీధికుక్కల్లో కూడా పోటీదారులను దూరంగా తరిమేసే సత్తా కలిగిన మగకుక్కనే ఆడకుక్క అంగీకరిస్తుంది. పిల్లల పోషణ బాధ్యత ఏవిధంగా ‘స్త్రీ’ తత్వానికి ప్రకృతి అప్పగించిందో, అదేవిధంగా శక్తిమంతమైన వారసత్వ లక్షణాలను సృష్టిలో కొనసాగించే బాధ్యత గూడా అది స్త్రీకే అప్పగించింది. ఇద్దరు పురుషులు ఒకే స్త్రీని కోరుకుంటే, ఆ స్త్రీ సమక్షంలో వాళ్ళిద్దరూ కత్తి యుద్ధంలో తేల్చుకోవలసిన సంప్రదాయం క్రీ.శ. 16 వ శతాబ్దం దాకా యూరప్ దేశాల్లో కొనసాగినట్టు బోలెడన్ని గాథలు వెల్లడిస్తున్నాయి. ఇదే విషయాన్ని భారతీయ పురాణాల్లోని ‘స్వయంవరం’ గూడా మనకు స్పష్టం చేస్తుంది. సంపద మీద మగవాడికి ఏర్పడిన పెత్తనాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకునే మనస్తత్వం మనిషికి అలవాటయ్యేదాకా మానవ సమాజంలో స్త్రీల స్వేచ్ఛకు చిన్నమెత్తు అంతరాయం పొడసూపలేదు. నాగరికత పెరిగిన తరువాత మన దృష్టికొచ్చే మహిళారాజ్యం ‘షీబా.’ ఇది క్రీస్తుకు కొన్ని శతాబ్దాలు మాత్రమే పూర్వానిది. ఉజ్జాయింపుగా దీని విస్తీర్ణం - అరేబియా ద్వీపకల్పంలోని ‘ఎమెన్’, ఆఫ్రికాఖండంలోని ‘ఇథోపియా’లు. రాజధాని నగరం ఎమెన్‌లో ఉండేదని తవ్వకాలు నిరూపిస్తున్నాయి. ఇథోపియాలో చెప్పుకునే ఇతిహాసాల ప్రకారం. ఆ సింహాసనం మీద హక్కు కేవలం ఆ రాజవంశంలోని ఆడవాళ్ళకే. ‘వాళ్ళకు కూడా సంతానమే తప్ప, భర్తలు ఉన్నట్టు కనిపించదు. వాళ్ళల్లో చిట్టచివరిదైన రాణి - ఆమె పేరు ఒక్కోచోట ఒకోరకంగా చెపుతుండడంతో, ప్రస్తుతానికి ‘షీ బా సామ్రాజ్ఞి’ అనుకుంటే చాలు - పనిగట్టుకుని ‘ఇజ్రేల్’ బయలు దేరింది. అనేక తెగల ఒప్పందంతో ఏర్పడిన అప్పటి ఇజ్రేల్ రాజ్యానికి పాలకుడైన ‘సాల్మన్’ (ఉజ్జాయింపుగా క్రీ.పూ. 960నాటి రాజు) మహామేధావిగా ఆ రోజుల్లో ప్రసిద్ధి. మనం ‘మర్యాద రామన్న’ తీర్పులుగా తెలుగులో చెప్పుకునే కథలకు మూలం ఈ సాల్మన్ పేరుమీద పడమటి దేశాల్లో ప్రచారమైన పురాతన గాథలే. అతనితో కలిసేందుకు అంత సుదీర్ఘమైన ప్రయాణాన్ని షీబా సామ్రాజ్ఞి చేపట్టిన కారణం అతన్ని లొంగదీసుకునేందుకో, లేక లొంగిపోయేందుకో నిరూపించే ఆధారాలు చరిత్రకు దొరికేవికాదు. కథల ఆధారంగా మనకు తెలిసేది షీబా సామ్రాజ్యం చాలా సంపన్నమైందనీ, అక్కడి సంప్రదాయాలూ నమ్మకాలూ ఇజ్రేల్‌కు పూర్తిగా భిన్నమైనవని. ఇజ్రేల్ రాజ్యంలోని తెగలు ‘దేవుడు ఒకటే’ నని నమ్మేవి. ఇజ్రేల్ రాజధాని జెరూసలేంలో షీబా సామ్రాజ్ఞి గడుపుతున్న రోజుల్లో, ఆమె సంప్రదాయానికి సంబంధించిన పండుగొకటి సంభవిస్తుంది. అది మన వసంతోత్సవం లాంటి పండుగ; ప్రేమదేవతకు బిడిబిత్తల నైవేద్యం సమర్పించడం వాళ్ళ ఆచారం. ఆ దేవత ముందు ప్రదర్శించే నృత్యంలో ప్రతిభ ఆధారంగా పురుషులను స్త్రీలు ఎన్నుకుంటారు. అది అంతస్థులకు అతీతమైన ఎంపిక. ఇజ్రేల్ సంప్రదాయాలకు విరుద్ధమైన ఆ పండుగను, సామ్రాజ్ఞి గౌరవార్థం, రాజధానికి దూరంగా ఉన్న కొండ ప్రాంతంలో జరుపుకునేందుకు అతిథులను అనుమతిస్తారు. పండుగ జరిగే సమయంలో ఆ ప్రదేశానికి చేరుకోకుండా సాల్మన్‌రాజు నిగ్రహించుకోలేడు. ఫలితంగా, షీబా సామ్రాజ్ఞికీ సాల్మన్కూ మగశిశువు జన్మిస్తాడు. అతడు మొట్టమొదటి సామ్రాట్టుగా షీబా సింహాసనం అధిరోహించడంతో అక్కడ స్త్రీల పరిపాలన అంతరిస్తుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర -37
చరాచర పదార్థాలన్నిటికీ వ్యక్తిత్వం ఆపాదించే అలవాటు (personification) మన పురాతన సాహిత్యానికి ఈ తలీతలుగా ఉన్న కారణంగా, ఆ మహిషాసురుడు నిజంగా రాక్షసుడేనో, లేక భీభత్సంగా చెలరేగిన అడవి దున్నకు అసురునిగా ఆపాదించిన వ్యక్తిత్వమో చెప్పేందుకు వీలుగాదు. సూర్యుణ్ణి పురుషునిగా వర్ణించి, ‘ఛాయాదేవి’ని - అంటే నీడను, అతనికి భార్యగా సంపాదించారు. సర్వభక్షకుడైన అగ్నిని వ్యక్తిగా చూపించి, ‘స్వాహా దేవి’ని అతనికి భార్యగా అంటగట్టారు. ఇదేవిధంగా, శక్తివంతమైన ప్రకృతులన్నింటినీ పురుషులుగానూ, వాటి ఫలితాన్ని భార్యలుగానూ కథలల్లడం మన సాహిత్యంలో కొల్లలుగా కనిపిస్తుంది. కాళి కూడా అదే కోవలో, తన గుంపును క్రియాశీలకంగా సమన్వయించి, ఆ ఎనుబోతును ముక్కలకింద నరికిన స్త్రీ ఆయ్యిండొచ్చు. ఒకవేళ ఆమె నివాసం మైసూరు ప్రాంతమే అయ్యుంటే, దక్షిణాది నుండి ఉత్తర భారతం స్వీకరించిన ఏకైక సంప్రదాయం ‘దశరా’, లేక ‘నవరాత్రి’ ఉత్సవంగా చెప్పుకోవచ్చు. ఒక్క కాళికా శక్తినే కాదు. ఆమె అవతరాలుగా చెప్పబడే దుర్గ, చండి, భవాని తదితర దేవతలు గూడా దక్షిణ భారతదేశంలో విశిష్టమైన స్థాయిలో ఆరాధ్యులుగా ఉన్నారు. అదనంగా పెద్దమ్మ, చిన్నమ్మ, మారెమ్మ ఆరాధన కూడా దక్షిణాదిలో ముమ్మరంగా సాగుతూంది. విగ్రహం రూపంలో కనిపించే ప్రతి గ్రామదేవత చేతిలో, మొనకు నిమ్మకాయ గుచ్చిన కత్తి మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. వీళ్ళల్లో గంగమ్మ నీటికి, లేదా నదీప్రవాహానికి ప్రతీక; ఎల్లమ్మ వెల్లువెత్తిన ప్రవాహానికి ప్రతీక. సముద్రతీరాలు మినహాయిస్తే, మిగతా గుళ్ళల్లో సాధారణంగా గంగమ్మ, ఎల్లమ్మ కలిసే ఉంటారు. వీళ్ళ పూజకు అనుబంధంగా ప్రస్తావించే కులాలు విధిగా నీటితో విడదీయరాని సంబంధం కలిగిన చాకలి, బెస్త, యాదవ, రైతు వృత్తులవాళ్ళవే అయ్యుంటాయి. పెద్దమ్మ, చిన్న, మారెమ్మ వంటి ఇతర దేవతలను మశూచి, మంపులు, కలరా వంటి వ్యాధులతో పోల్చుకోవడం గమనిస్తే, ఈ గ్రామదేవతలు మానవుని భయాందోళనల నుండి పుట్టుకొచ్చిన (ఆపాదిత) వ్యక్తిత్వాలైనా అయ్యుండాలి. లేదా కుటుంబ వ్యవస్థ ఏర్పడక పూర్వం నివసించిన స్త్రీలైనా అయ్యుండాలి. ఈ గ్రామదేవతల్లో ఏవొక్కరికీ భర్త ఉండడుగానీ, సంతతి ఉంటుంది. అందుకే వీళ్ళ పురుషస్థానాన్ని ‘లింగం’ అంటారు. ఋగ్వేదంలో కనిపించే ‘అదితి’ పాత్రగూడా ఇంచుమించు ఇలాంటిదే. ఆమె ఇంద్ర, వరుణ మిత్ర దేవతలకు తల్లి. కశ్యప ప్రజాపతిని ఆమెకు భర్తగా పేర్కొన్నా, యజ్ఞానికి అందించే ఆహ్వానంలో ఏవొక్క చోటా ఆమెకు భర్తతో అనుసంధానం కనిపించదు. దక్షిణ భారతదేశంలోని ‘మళయాల’ ప్రాంతం ఆడవాళ్ళ రాజ్యంగా ఎలా ప్రచారమైందో ఆధారాలు దొరకవుగానీ, ఆ పునాది మీద తయారైన సాహిత్యం మాత్రం తెలుగులో బోలెడంత దొరుకుతుంది. వాటిల్లో ప్రధానమైంది ‘ప్రమీలార్జునీయం’ ఇందులో అర్జునుడు తన దక్షిణాది దండయాత్రలో భాగంగా, స్త్రీలు పరిపాలించే ‘ప్రమీల’ రాజ్యాన్ని గాండీవంతో కాకుండా మన్మథబాణాల సాయంతో జయిస్తాడు. ఇది మహాభారతంలో కనిపించే కథ కాదు; ‘శశిరేఖా పరిణయం’లో లాగే పాత్రల పేర్ల మతలబుతో మహా భారతంలోనిదిగా భ్రమింపజేసే పుక్కిటి పురాణం. అదే కోవలో మళయాలాన్ని చిత్రీకరించిన సాహిత్యం కందుకూరు విరేశలింగంగారి రచనలతో సహా, అనేక సందర్భాల్లో మనకు ఎదురౌతుంది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర - 35
రచన: ఎం.వి.రమణారెడ్డి కులాసాలు అప్పట్లో మానవునికి ‘దేవుడు’ అనే ఊహ ఇంకా ఏర్పడలేదు. వెలుగునిచ్చే సూర్యుడూ, చంద్రుడూ వంటి ప్రకృతి శక్తులు అతనికి ఆహ్లాదం; గాలి, వానల పట్ల భయమూ, భక్తి - అంతకుమించి ఆలోచన సాగే పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు. అందువల్ల, విందులూ వినోదాలతో ఆత్మీయతలు ప్రకటించుకోవడం మాత్రమే ఆ మేళాల ప్రయోజనం. విందుకోసం వేరువేరు తావుల్లో దొరికే వేటలు ప్రత్యేక వంటకాలు; వేరువేరు గుడారాల విద్వాంసులు ప్రదర్శించే పాటవాలు వైవిధ్యభరితమైన వినోదాలు. ఆకర్షణీయమైన ఇతివృత్తాలు పొలిమేరలు దాటుకుని విస్తరించేందుకు కారణం ఇలాంటి కార్యక్రమాలే. దాయాది తెగల్లోని పురుషునిమీద స్త్రీకి ఏర్పడే మోజు ‘వరుసలు’గా ఏర్పడేందుకు పునాదులు బహుశా ఇలాంటి సందర్భాల్లోనే పుట్టుకొచ్చుండొచ్చు. తరువాత కొద్దికాలానికి అదే జనావాసంలో పుట్టిన ఆడవాళ్ళంతా సోదరులుగానూ, పొరుగున జన్మించిన ఆడవాళ్ళు మిథునంగానూ ఆలోచించే ఆచారం ప్రవేశించింది. శిల్పం, చిత్రకళల మీద కొత్త రాతియుగం మానవునికి ఆసక్తి నశించిందని ఇదివరకు మనం అనుకున్నాం. అలా చెప్పుకోవడం కంటే, ఆ కళ పురుషుల నుండి స్త్రీలకు బదిలీ అయిందని చెప్పుకోవడం సబబుగా ఉంటుంది. ఎందుకంటే, గోడల మీద చిత్రకళ అంతరించిన తరువాత, అది మట్టి పాత్రల మీద పూజల రూపంలో (వంకరటింకర గీతలతో, చుక్కలతో తీర్చే అలంకరణ) తిరిగి ప్రత్యక్షమైంది. దోసిళ్ళతో నీళ్లు తాగడం, దొన్నెలతో తెచ్చుకోవడం తప్ప మగవాడు పాత్రలను గురించి ఊహించుకోలేడు. బహుశా చిన్నపిల్లలకు చేపను కాల్చి తినిపించే సందర్భాల్లో బంకమట్టి స్వభావాన్ని ఆడవాళ్లే గమనించి ఉండాలి. జంతు మాంసంలాగా చేపమాంసం నిప్పుల సెగను పెద్దగా ఓర్చుకోలేదు. చుట్టూ బంకమట్టిని దట్టిస్తే, మాడిపోయే నష్టాన్ని నివారించడం సాధ్యమని గుర్తించడం ఈ పంథాలో తొలిపాఠం. అలా బంకమట్టిని పూసి నిప్పుల మీద చేపను కాల్చుకునే అలవాటు ఏటివార పల్లెల్లో ఇప్పటికీ కనిపిస్తుంది. కుండల తయారీ ప్రయోగాల్లో బంకమట్టికి ఆకారం కల్పించేందుకు ఆకుదొన్నె చుట్టూ పూత పూయడం మలిపాఠం. కాల్చిన బంకమట్టి నీళ్లల్లో కరగకుండా నిలుస్తుందని తెలుసుకోవడం మూడవ పాఠం. దాంతో ఖుద్దుగా కుండల తయారీ మొదలయింది. నీళ్లు తెచ్చుకునేందుకు వాటమైనవి కొన్నీ, రాలిన గింజను ఊడ్చి నిలువచేసేందుకు వీలయ్యేవి కొన్ని - ఇలా మట్టిపాత్రల తయారీ ఒక వ్యాపకంగా పరిణమించింది. వాళ్లు చేసిన మట్టిపాత్రలో దేన్ని తీసుకున్నా, దాని చుట్టూరా పూజలతో అలంకరించిన కళానైపుణ్యం కనిపిస్తుంది. ఆహార పదార్థంగా ‘గింజ’ను ప్రవేశపెట్టిన ప్రశంసకు కూడా అర్హత ఆడవాళ్ళదే. చాలాకాలం దాకా అవి పశువుల దాణా కిందనే మానవుడు జమకట్టాడు. వేవిళ్లతో వున్న స్త్రీలకు ఏదిపడితే అది కొరికే అలవాటు ప్రకృతిసిద్ధమైన స్వభావం. గడ్డికి కాసే గింజ కూడా రుచిగా ఉంటుందని తెలుసుకునే అవకాశం అలాంటి సందర్భంలోనే కలిగుండాలి. గింజను పిండిగా చితగ్గొట్టి, నిప్పు నుండి దిగిన వేడివేడి మాంసానికి అద్ది, వేవిళ్ళ సమయంలో తినిపించడంతో గింజల ప్రయోజనం మానవ జీవితానికి వ్యాపించి వుండాలి. ఈనాడు మాంసాహార పదార్థాలకు ప్రపంచ ప్రఖ్యాతి వహించిన కంపెనీల నుండి ఆప్యాయంగా కొనుగోలు చేసే వంటకాలు ఇలా పిండిలో పొర్లించిన మాంసపు కండలే. దైనందిన కృత్యంలో భాగంగా తారసపడే దృశ్యాలకు కొద్దిగా మేధస్సును జోడిస్తే ఎన్ని ప్రయోగాలు ఫలిస్తున్నాయో, తద్వారా నిత్యజీవితానికి ఎన్ని సరుకులు అదనంగా తోడౌతున్నాయో గమనిస్తే ఒక్కోసారి దిగ్భ్రాంతి కలుగుతుంది. ‘పాడి’ అనే సంపద కూడా మానవుని జీవితంలో ఆవిధంగా ప్రవేశించిందే. దూడను కోల్పోయిన పెంటి జంతువుకు పొదుగు సలుపు చెయ్యకుండా చూసేందుకు పాలను పిండేస్తారు. కుండలు రాకముందు ఆ పాలు నేలపాలుగాక తప్పేది కాదు. పాలతో తడిసిన నేలను కుక్కలు నాకడం చూసినప్పుడు ఆ పదార్థం కుక్కలకు ఇష్టమని ఎవరికైనా తెలుస్తుంది. కుండలు వాడకంలోకి వచ్చిన తరువాత, పాలను అలా వృథాగా పిండేసేకంటే, కుక్కలకు పనికొచ్చినా ప్రయోజనమేనన్న అభిప్రాయం కలిగుండాలి. పాలతో కుక్కలను తృప్తిపరిచే అలవాటు ఇప్పటికీ గొర్రెల కాపరుల్లో కనిపిస్తుంది. సంకటిముద్ద మధ్యలో గుంతచేసి, అందులోకి గొర్రె పాలు పిండి, కొద్దికొద్దిగా సంకటిని ఆ పాలల్లో తడుపుతూ కుక్కకు విసిరేస్తారు. ఆ ఉండను నేలమీద పడనీయకుండా, ఎంతో హుషారుగా గాలిలోనే అందుకుంటుంది ఆ కుక్క. (సశేషం) రచయిత ఫోన్: 9440280655; email: mvrr44@gmail.com -
కొత్త దొంతర
టూకీగా ప్రపంచ చరిత్ర 33 అంతేగాదు, పశువుల పెంపకం మూలంగా మనిషికి మరికొన్ని విషయాల మీద దృష్టిని కేంద్రీకరించే అగత్యం ఏర్పడింది. వాటిల్లో మొదటిది సంఖ్యా పరిజ్ఞానం. పశుపెంపకం ఇప్పటికీ చేపట్టని ఆటవిక తెగలకు ఈనాడు కూడా నాలుగు లేదా ఐదుకు మించి లెక్కించడం చేతగాదు. అంతకుమించిన సంఖ్యలతో వాళ్ళకు అవసరం కూడా ఉండదు. మేత నుండి మంద మొత్తం తిరిగొచ్చిందో లేక ఒకటిరెండు జీవాలు తప్పిపోయాయో తెలుసుకోవాలంటే పశువుల కాపరికి ఎక్కువ సంఖ్యలను లెక్కించడం నేర్చుకోక తప్పేదిగాదు. అలా ఒకటిరెండ్లు పన్నెండుదాకా పెరిగాయి. గుమిగా లెక్కించేందుకు ఉడ్డాలూ, డజన్లూ ఏర్పాటయ్యాయి. మరో ఐదువేల సంవత్సరాల దాకా గణితంలో సున్నా ప్రవేశించలేదు కాబట్టి, దశమస్థానంలో తెంచుకుని లెక్కించడం వాళ్ళకు పరిచయం లేదు. ఆ తరువాత, స్థల కాలాలను అంచనా వేసే విధానం గూడా తప్పనిసరిగా సాధించుకోవలసిన పరిజ్ఞానమైంది. ఆ ప్రయత్నంలో తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం అనే పేర్లతో దిక్కులను గుర్తించే ఏర్పాటు చేసుకున్నాడు. చిన్న చిన్న దూరాలను అడుగుల్లోనూ, మధ్యరకం దూరాలను ‘పగ్గం’తోనూ, ఇంకా ఎక్కువ దూరాన్ని ‘గవ్యూతి’తోనూ కొలవడం నేర్చుకున్నాడు. దినాలు లెక్క పెట్టేందుకు చంద్రుణ్ణి ఆసరా చేసుకున్నాడు. సూర్యుడు రోజూ ఒకేలా కనిపిస్తాడు గాబట్టి, రోజుల నడక తెలుసుకునేందుకు సూర్యునితో ప్రయోజనం లేదనుకున్నాడు. క్రీ.శ. 16వ శతాబ్దంలో సూర్యమానం మీద ఏర్పడిన ‘సివిల్ క్యాలెండర్’ వాడుకలోకి వచ్చేవరకు ప్రపంచవ్యాప్తంగా అనుసరించిన క్యాలెండర్ చాంద్రమానమే. హిందువుల ముహూర్తాలూ, మహమ్మదీయుల పండుగలూ ఇప్పటికీ చాంద్రమానాన్నే అనుసరిస్తున్నాయి. చంద్రుని ఆధారంగా ఏర్పడిన పంచాంగంలో ఏడాదికి ఏర్పడే 336 రోజులను తిథులుగా, పక్షాలుగా, మాసాలుగా గుణిస్తారు. వారాలుగానీ, ఆది సోమ వంటి దినాలుగానీ అందులో ఉండవు. అందుకే మహాభారతంలో తిథులే కనిపిస్తాయి తప్ప వారాలు కనిపించవు. ఏడాదికుండే 365 1/4 రోజులను పూరించేందుకు ‘అధిక మాసాలు’ గుణించడం గమనిస్తే, సూర్యమానం ఏడాది గురించి ఋగ్వేదకాలం నాటికే కొంత తెలిసినట్టు కనిపిస్తుంది. అయితే, ఋగ్వేదం చెప్పిన సూర్యమాన సంవత్సరానికి 360 రోజులే. ఆ తరువాత క్రీ.శ.5వ శతాబ్దంవాడైన ఆర్యభట్టు, 6వ శతాబ్దం వాడైన వరాహమిహురుడు భారతదేశంలో సూర్యమాన పంచాంగాన్ని ప్రవేశపెట్టగా, 12వ శతాబ్దంవాడైన భాస్కరుడు కొన్ని సవరణలతో దాన్ని స్థిరీకరించాడు. పగ్గాల కోసం రకరకాల ‘నార’ను అన్వేషించే క్రమంలో కొత్తరాతి యుగం మానవునికి ‘అగిసె’నార తటస్థించింది. అది మిగతా పీచుపదార్థాలకంటే చాలా మృదువు, పోగు సన్నం. చాపల అల్లకంలాగా పోగుమార్చి పోగు దాన్ని అల్లుకోవడం మొదట్లో సరదాకింద తీసుకున్నా, తరువాత తరువాత అది నారబట్టల నేతకు దారితీసింది. ఆ వస్త్రం ఎంత ముతకదైనా, జంతు చర్మాలకంటే, భూర్జర పత్రాలకంటే చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి, నారబట్టలు కట్టుకునే అలవాటు సమాజంలో ప్రవేశించింది. ఆ బట్టలకు రంగులు అద్దిన ఆనవాళ్ళు మాత్రం ఇంతవరకు కనిపించలేదు. ఆ మాటకొస్తే, కొత్తరాతియుగం మానవునికి రంగులపట్లా, చిత్రకళపట్లా, శిల్పంపట్లా అభిరుచేలేనట్టుంది. ఎందుకంటే, అతని హయాంలో ఒక్కచోటున్నైనా గుహాచిత్రాలుగాని, దంతపు బొమ్మలుగాని నిదర్శనంగా దొరకలేదు. బహుశా, ఇప్పుడు సొంత సామర్థ్యం మీద కుదిరిన నమ్మకం అతన్ని తాంత్రిక విశ్వాసాల నుండి దూరంగా నడిపించిందో ఏమో! రచన: ఎం.వి.రమణారెడ్డి -
కొత్త దొంతర
టూకీగా ప్రపంచ చరిత్ర 32 లొంగిపోయిన మనుషుల భాష ఒకటి, లొంగదీసుకున్న మనుషుల భాష మరొకటి. ‘ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఎలా కుదిరింది?’ అంటే, మరోసారి వచ్చీరాని మాటల వయసప్పటి పిల్లలతో మన అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. వాళ్ళు నీళ్ళను ‘త్రువ్వ’ అంటారు, పాలను ‘బాయి’ అంటారు. గాయాన్ని ‘అబ్బు’ అంటారు. ఇలా ప్రతి వస్తువుకూ వాళ్ళ మాటలు వాళ్ళకుంటాయి. మనం గూడా కొంతకాలంపాటు ఆ భాషలో దిగిపోక గత్యంతరం ఉండదు. అప్పుడుకొంత అప్పుడుకొంత మనలాగే మాట్లాడటం నేర్చుకోక పిల్లలకైనా తప్పదు. ఈ రెండున్నూ ఒత్తిడి కింద జరిగే ప్రక్రియలే. చివరకు పిల్లలు క్రమంగా తల్లి భాషకు లొంగిపోతారు. కానీ, అదే ప్రక్రియ ముదుర్ల మధ్య సాగితే దనపు పదాలు భాషకు తోడౌతాయి. తన సుదీర్ఘ యాత్రలో మానవుడు నేర్చిన ఇతర విద్యలుగూడా ఎన్నెన్నో ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది జంతువులను మచ్చిక చేసుకునే విధానం. అన్నిటికంటే ముందు మనిషికి మచ్చికైన జంతువు కుక్క. అది మనిషిని వెదుక్కుంటూ తానై వచ్చిన జంతువు. నిప్పుల మీద కాలే చియ్యల వాసనకు అది మనిషిని సమీపించింది. సరదాగా విసిరేసే బొమికెల మాలిమితో మనిషికి నౌకరుగా మారిపోయింది. అంత దగ్గరగా, అంత చనువుగా ప్రాణంతోవున్న జంతువును చూడడం ఆ మానవునికి సరికొత్త అనుభవం. తాను తినేందుకు పనికొచ్చే జంతువుగూడా ఇలాగే తన చుట్టూ చేరితే ‘ఎంత సౌకర్యంగా ఉంటుందో’ అనే భావన ఆ పరిస్థితుల్లో తప్పకుండా మనిషికి పుట్టుకొస్తుంది. మందలో ఒకటి తరిగినా పెరిగినా జంతువులు గుర్తించలేవని అతనికి ముందే తెలుసు. అందువల్ల, మందను తనతోనే ఉంచుకుంటే పూటగడిచే దిగులే ఉండబోదనేఆలోచన కలిగింది. ఆ ఆలోచనే అతని తదుపరి ప్రయత్నానికి పునాది. అతి ప్రయాసమీద గానీ జంతువుల్లో మచ్చికయ్యేవి కొన్నే ఉంటాయని తెలిసిరాదు. ఎన్నో ప్రయత్నాల తరువాత కొత్త రాతియుగం మానవుడు మచ్చిక చేసుకోగలిగిన జంతువులు కొన్నే కొన్ని రకాలు. అందుకే, తనకు మొట్టమొదట మచ్చికైన జంతువు ఆ మానవునికి ఇతిహాసం. మచ్చిక చేసుకునేందుకు మొదట దొరికే జంతువుల్లో ప్రాంతాలవారీగా తేడా ఉంటుంది. భారతీయ మత సాహిత్యంలో గోవుకూ, పాశ్చాత్య మతసాహిత్యంలో గొర్రెకూ, అరేబియన్ సాహిత్యంలో ఒంటెకూ అత్యధిక ప్రాధాన్యత కనిపించడానికి కారణం ఆయా ప్రాంతాల్లో తొట్టతొలిగా మానవునికి మచ్చికైన జంతువులు అవే అయ్యుండటం. యావద్భారతదేశం పరమ పవిత్రంగా ఆదరించే మహాభారత ఇతిహాసం కుక్కతో మొదలై, కుక్కతో ముగుస్తుంది. మచ్చిక జంతువు ప్రవేశంతో మనిషికి సంపద ఏర్పడింది. భూలోకంలో మొట్టమొదటిగా ఏర్పడిన ఆస్తి ‘పశువు’. ఆ ఆస్తి వల్ల అతనికి మరో వ్యాసంగం మొలకెత్తింది. తన తిండిని గురించి తప్ప మరో లంపటం పెట్టుకోని మనిషికి ఇప్పుడు పశువుల మేత కోసం తారాడుకునే బాధ్యత మీదబడింది. పైగా పశువులకు రాత్రివేళల్లో గూడా మేత మేసే అలవాటొకటుంది. దాంతో, గడ్డి కోసుకొచ్చేందుకు మరో రాతి పనిముట్టుతో - ‘కొడవలి’తో, తలుగులుగా ఉపయోగించేందుకు మరో నారపనిముట్టుతో - ‘పగ్గం’తో, అవసరం ఏర్పడింది. గింజను ఆహారంగా ఉపయోగించడం ఇంకా మొదలవనందున, అప్పట్లో ప్రతి మొక్కా గడ్డికిందే లెక్క; ‘ఇది పైరు, ఇది కలుపు’ అనే విచక్షణతో అవసరమే లేదు. పశుపోషణ గూడా మాంసం కోసమే తప్ప, పాలకోసం కాదు. ఇప్పుడు, పచ్చిక సమృద్ధిగా దొరికే ప్రదేశంలో నివసించే గడువు బాగా పెరగడంతో, పెంపుడు జంతువు మూలంగా, నిలకడలేని సంచారజీవితానికి కాసింత కుదురుబాటు ఏర్పడింది. వేటాడటం మానకపోయినా, జీవన విధానం ఊహించనంతగా మార్పుకు తావిచ్చింది. బహుశా, ప్రాథమికమైన శ్రమవిభజన గూడా అప్పుడే జరిగుండొచ్చు. దానివల్ల, పశుపోషణ భారం స్త్రీలకు కేటాయించబడివుండొచ్చు. పశువుల కోసం మోసుకొచ్చే గడ్డి నుండి రాలిన గింజలు తడి తగలగానే మొలకెత్తడం ఆదిలో గమనించింది స్త్రీలు. ఆ పరిశోధనే తరువాతి రోజులోల్ మనిషిని వ్యవసాయానికి నడిపించింది. అందుకేనేమో భారతదేశంలో పాడినీ, పంటనూ, సంపదనూ స్త్రీపరంగా గుర్తించి ‘లక్ష్మి’ని దేవతగా ఆరాధిస్తారు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
కొత్త దొంతర
టూకీగా ప్రపంచ చరిత్ర 30 సుమారు పది పన్నెండు వేల సంవత్సరాలకు ముందు మరో కొత్త మానవుడు యూరప్‌లో ప్రవేశించడం మొదలెట్టాడు. ఇక్కడ ‘కొత్త’ అనే విశేషణం అతని శరీర నిర్మాణానికి సంబంధించిగాదు; శరీర నిర్మాణంలో పరిణామం క్రోమాన్యాన్ మానవుని దశ దగ్గర ఆగిపోయింది. ఆ తరువాత మానవుని ఆకారంలో వచ్చిన వ్యత్యాసాలన్నీ కవళికలకూ, చర్మం రంగుకూ సంబంధించినవి మాత్రమే. ఇప్పుడు ప్రవేశించిన మానవుని కొత్తదనం అతని చేతికి చిక్కిన రెండు సాధనాలవల్ల కలిగింది. వాటిల్లో మొదటిది ‘విల్లు-బాణం’. క్రీస్తు శకం 12వ శతాబ్దంలో తుపాకి ఆవిష్కరించబడేవరకు ‘ధనుర్బాణాలు’ ఈ భూ మండలంలో తిరుగులేని ఆయుధాలు. విల్లు మినహా, అతని మిగతా పనిముట్లు ఎప్పటిలాగా రాతివే; కాకపోతే, గతుకులు లేకుండా నున్నగా ‘పాలిష్’ పట్టిన పనిముట్లు. అదనంగా చెప్పుకోవలసింది రంధ్రం తొలిచిన రాతిగొడ్డలి. కర్రను తొడిగి జారిపోకుండా పురినారతో బంధిస్తే, గొడ్డలి పనితనం పెరుగుతుంది, చేత్తో పట్టుకుపోయేందుకు వసతిగానూ ఉంటుంది. ఆ రోజుల్లో నారకు పురిబెట్టడం వరకే తెలుసుగానీ ముప్పిరిబెట్టి మోకును పేనడం ఇంకా తెలుసుకోలేదు. అలవోకగా చేతిలో ఇమిడే గొడ్డలి ఇప్పుడు పనిముట్టు మాత్రమే కాదు, అవసరమైతే ఆయుధంగా గూడా మారుతుంది. లోహం గురించి అప్పటికి కూడా అతనికి తెలియకపోవడంతో ఈ మానవుని హయాంను రాతియుగం కిందే జమగట్టినా, అతని ప్రత్యేకతకు గుర్తింపుగా దాన్ని ‘కొత్త రాతియుగం’ అన్నారు. అతని రెండవ సాధనం ‘సంస్కృతి’. అవయవ నిర్మాణంలో మనం క్రోమాన్యాన్ మానవునికి వారసులం కాగా, సంస్కృతిలో మన వారసత్వం కొత్త రాతియుగం మనిషి నుండి సంక్రమించింది. ఐతే, ఆ సంస్కృతి అతడు విల్లనమ్ములు చేతికి తీసుకున్న తొలిరోజే ఏర్పడిందిగాదు. తొలిదశలో కొత్త రాతియుగం మనిషి గూడా కేవలం వేటగాడే. కొత్త ఆయుధం వల్ల వేటలో అతనికి సౌలభ్యం పెరిగుండొచ్చు; ఏ పొద మాటునుండో చెట్టు మీది నుండో జంతువుని చంపగలిగే సదుపాయం వల్ల భద్రత పెరిగిండొచ్చు; ఐనా, వేట మీద ఆధారపడిన జీవితం మునుపటిలాగే కొనసాగింది. రెండు వేల సంవత్సరాల తదుపరి, జంతువులను మచ్చికజేసే ఒడుపు ఏనాడు తెలిసిందో అప్పుడు అది ‘పశువుల కాపరి’ జీవితంగా మారిపోయింది. ఆ తరువాత మరో రెండు వేల సంవత్సరాలకు అతని జీవితం ‘వ్యవసాయం’ లో అడుగెట్టింది. క్రీస్తుశకం 16వ శతాబ్దంలో పారిశ్రామిక విప్లవం మరో తరహా సంస్కృతిని ప్రవేశ పెట్టిందకా, కొత్త రాతి యుగం మానవుడు నెలకొల్పిన సంస్కృతి మానవ సమాజాన్ని అవిచ్ఛిన్నంగా నడిపించింది. ఉత్తరార్ధగోళంలో కొత్తగా ప్రవేశించిన ఈ విల్లమ్ముల మానవుడు ఎక్కడివాడు? ఎక్కడివాడైనా కావచ్చు. ఇదివరకటిలాగే ఉత్తర ఆఫ్రికా, మధ్యధరా ప్రాంతాల నుండి బయలుదేరిన వాళ్ళు కొందరైతే, పశ్చిమ ఆసియా, మధ్య ఆసియాల నుంచి వచ్చినవాళ్ళు మరికొందరు. వచ్చింది ఎక్కడినుండైనా వాళ్ళ వలసలు ఉద్దేశపూర్వకరమైన ఆక్రమణలు కావు. ప్రీతికరమైన వేట కోసం పచ్చిక మైదానాలు గాలిస్తూ, ఎంతదూరం వస్తున్నామనే చింతలేక జరిగిన ప్రయాణాలు వాళ్ళవి. పుట్టిన చోట వదిలివచ్చిన ఆస్తులు లేవు; ఫలానిది సొంత ఊరనే మమకారం ఏర్పడలేదు. సౌకర్యం ఎక్కడ కుదిరితే అదే అప్పటి నివాసస్థానం. రుతుచక్రంలో రెండేళ్ళు గడ్డుకాలం సంభవిస్తే చాలు, ఆ మనుషులను వందలాదిమైళ్ళు ఎక్కడెక్కడికో అది నడిపిస్తుంది. ఈ వలసలకు కారణం రెండు రకాలు. ఒకే తావులో పదేపదే కొనసాగే వేట వల్ల వనరులు తరిగిపోవడం మొదటిది. అలాంటి సందర్భంలో మూకుమ్మడిగా వాళ్లు అన్వేషిస్తూ, ఏ గుంపుకాగుంపు విడిపోవడం తప్పనిసరి. వనవాసంలో ఉన్నప్పుడు పాండవులకు కూడా ఈ పరిస్థితి తటస్థించడం మహాభారతంలో కనిపిస్తుంది. దరిమిలా ద్వైతవనం నుండి కామ్యకవనానికీ, తిరిగి కామ్యకవనం నుండి ద్వైతవనానికీ వ్యాసమహర్షి సలహా మీద నివాసం మార్చుకుంటారు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
టూకీగా ప్రపంచ చరిత్ర
రచన: ఎం.వి.రమణారెడ్డి వెనుక తరాలు అందుకు నిదర్శనం గుహాంతరాల్లో క్రోమాన్యాన్ మానవుని చిత్రకళ. గుహ గోడల మీద, వీలైనంత ఎత్తున, రంగులతో అతడు రకరకాల జంతువులను చిత్రించాడు. ఎరుపు, పసుపు, నలుపు, ఇటుకవర్ణాలు అతడు వాడిన రంగులు. బొమ్మల్లో ఎద్దులూ, అడవి దున్నలూ, జింకలూ, గుర్రాలూ, ఎలుగుబంట్లూ, బొచ్చు ఏనుగులూ ఉన్నాయి. గుర్రం, బొచ్చు ఏనుగు బొమ్మల సంఖ్య మిగతావాటికంటే చాలా ఎక్కువ. ఒకటి రెండు చోట్ల జంతుకొమ్ములు ధరించి మంత్రగాడిలా తోచే మనిషిని తప్ప, ఇతరత్రా మనిషి బొమ్మలను అతడు సంపూర్ణంగా నిషేధించాడు. ఏ బొమ్మ తీసుకున్నా నిలుచున్న జంతువును పక్కల నుండి చూస్తే ఎలా కనిపిస్తుందో అదే భంగిమలో (ప్రొఫైల్‌లో) ఉంటుంది. ఎదురుగా చూస్తే కనిపించినట్టు చిత్రించడం అతని శక్తికి మించిన నైపుణ్యంలా ఉంది. ఒకటి రెండు తావుల్లో మినహా నాలుగుకాళ్ళూ కనిపించేలా గీసిన బొమ్మలు కనబడవు. ఆవలివైపుగా ఉండే కాళ్ళను చిత్రించడం గూడా అంత తేలికైన విద్యగాదు.చీకటిమయంగా ఉండే లోతైనగుహల్లో, కష్టంతోగాని చేరుకోలేని తావుల్లో, అందనంత ఎత్తున బొమ్మలను చిత్రించడం చూస్తే అవి వినోదం కోసం వేసినవి కావనీ, వాటి వెనుక ఏదో గూఢార్థం ఉందనీ సందేహం కలుగుతుంది. అందులోనూ ఆ జంతువుల్లో కొన్నిటికి బరిసెలు గుచ్చుకున్నట్టూ, గాయపడినట్టూ చూపడం అనుమానాన్ని బలపరుస్తుంది. క్రోమాన్యాన్ మానవుడు వాటిని ఏవో తాంత్రిక ప్రయోజనాల కోసం చిత్రించాడని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. జంతువులను అలా చిత్రించడం వల్ల వేటలో తనకు లాభం జరుగుతుందని అతని నమ్మకమైవుండొచ్చు. ఒక్క యూరప్‌లోనే కాక, ఇటువంటి గుహాచిత్రాలు ఇతర ఖండాల్లోనూ వెలుగులోకి వస్తున్నాయి. దక్షిణ భారతదేశంలోనే ఇటీవల అనేక గుహల్లో ఇలాంటివి కనిపించాయి. వందల వేల మైళ్ళు ఎడంగా జీవించిన మనుషుల్లో, ఒకరితో ఒకరికి సంబంధాలు ఊహించేందుకే వీలులేని కాలంలో, ఒకే తరహా విశ్వాసం ఇంత విస్తృతంగా నెరసుకోవడం ఎలా సాధ్యపడింది? జటిలమైన ఈ సవాలుకు జవాబు దొరకాలంటే, ‘అవసరం ఏమొస్తుందిలే’ అనుకుంటూ వదిలేసిన మరో పాతరను పెళ్ల్లగించాలి. ఇది జీవుల ప్రవర్తనకు సంబంధించిన రసాయనిక ప్రేరకాల సమాచారం దాగున్న పాతర. వెలుతురు ప్రసరించగానే వానపాము నేలపొరల లోతులకు కూరుకుపోవడం అందరికీ తెలిసిన విషయమే. అది చీకటిని ఆశ్రయించి బతికే జీవిగనుక, అలా వెలుతురును తప్పుకోవడంలో చోద్యం కనిపించదు. కానీ, చోద్యమల్లా - వెలుగును గ్రహించే ‘చూపు’గానీ, ఎలా నడుచుకోవాలో చెప్పే మెదడుగానీ సంతరించుకోని జీవి అంత చురుగ్గా స్పందించడమే. ఇంద్రియాలకు అతీతమైన ఈ స్పందననే మనం ‘ప్రాణం’ అంటున్నాం. ‘ప్రాణం’ అనే నిర్వచనానికి నాంది పలికిన ఏకకణజీవి మొదలు, ప్రాణికి ప్రాథమిక లక్షణాలైన ఆహార సముపార్జన, ఆత్మరక్షణ, చలనం, పెరుగుదల, సంతానోత్పత్తి వంటి అవసరాలకు ప్రేరేపించే జీవరసాయనిక పదార్థాలు ప్రతిజీవిలోనూ ఊరుతుంటాయి. ‘కణవిభేదన’ ఏర్పడిన ‘పురిటిదశ’ జీవుల్లో ఈ రసాయనాల ఉత్పత్తి ఏ కణానికి ఆ కణంలో జరిగిపోతుంది. ఆ తరువాతి దశలో వాటి ఉత్పత్తికి ప్రత్యేకకణాలు ఏర్పడి, అవి శరీరవ్యాప్తంగా విస్తరించి, తమ ఉత్పత్తులను రక్తప్రవాహంలో కలిపేయడం ద్వారా శరీరంలోని ప్రతి కణానికి వాటిని అందజేస్తాయి. మరింత ఎదిగిన దశ జీవుల్లో ఒకే తరహా పదార్థాల్ని ఉత్పత్తిజేసే కణాలన్నీ ఒక తావున పోగై గ్రంథులుగా రూపొందుతాయి. వీటికి నాళం ఉండదు గనుక, ‘వినాళ గ్రంథులు’గా వ్యవహరిస్తారు. ఇవి ఉత్పత్తి చేసే ద్రవాలను ‘హార్మోన్లు’ అంటారు. ఆత్మరక్షణ అవసరాల్లో తనకు తెలీకుండానే ఊసరవెల్లి చర్మంలో రంగులు మారేందుకు కారణం ఈ హార్మోన్లే. లింగవ్యత్యాసానికి కారకాలైన ‘స్టీరాయిడ్’ పేరుగల హార్మోన్ల ప్రేరణకు ఫలితం ఎలాంటిదో పరిశీలిస్తే, మానవుని శరీరం మీద వీటి పట్టు ఎంత పటిష్టంగా ఉంటుందో తెలిసొస్తుంది. నడకలో గానీ, నిలుచునే వాలకంలోగానీ, కూర్చునే తీరులోగానీ, మాటలను అనుసరించే ఆంగిక ప్రదర్శనలోగానీ, ఆటపాటలకు సంబంధించిన అభిరుచుల్లోగానీ ఆడపిల్లలకూ మగపిల్లలకూ తేడా నాలుగైదేళ్ళ ప్రాయంలోనే ప్రారంభమౌతుంది. యవ్వనం సమీపించే సమయానికి అవి కరుడుగట్టి, స్వరం మారుతుందీ, చర్మం నిగారింపు మారుతుందీ, వెండ్రుకల పంపిణీ మారుతుందీ, ఒంటి వాసన గూడా వేరౌతుంది. ఈ మార్పుల ప్రవేశంలో ఆలోచించే మెదడుకూ, నేర్చుకునే విద్యలకూ ప్రమేయమే ఉండదు. -
వెనుక తరాలు
టూకీగా ప్రపంచ చరిత్ర అది నాలుగవ హిమానీశకం బలహీనపడుతున్న సమయం. యూరప్‌లో ఆల్ప్స్పర్వత శ్రేణి వరకూ, ఆసియాలో కజకిస్థాన్, మంగోలియాల వరకూ, అమెరికాలో కెనడా దక్షిణ సరిహద్దు వరకూ ఉత్తరార్థగోళం చుట్టూరా కప్పుకున్న మంచుపొర అంచులు కొద్దికొద్దిగా కరిగిపోతూ, పొడినేలల బయటికి తేలుతున్నాయి. మంచుపరుపు ఉత్తరధ్రువానికి తిరోగమిస్తుండగా, మంచును వదిలించుకున్న నేలల్లో చెట్టూ చేమా మొలకెత్తి, నింపాదిగా ఉత్తరానికి ఎగబాకుతున్నాయి. వాటితోపాటు జంతువులు ఉత్తరార్థగోళానికి విస్తరించడంతో, వాటిని వెన్నంటి సరికొత్త మానవుడు యూరప్‌లో ప్రవేశించాడు. అతడే ‘క్రోమాన్యాన్’ మానవుడు. శారీరక లక్షణాల్లో క్రోమాన్యాన్ మానవుడు అచ్చం మనలాటి మనిషే. ఆరడుగుల ఎత్తుండే భారీకాయం, వెడల్పాటి ముఖం, విశాలమైన కళ్ళు, నిటారుగా వుండే నుదురు, కింది దవడలో చుబుకం - అంతా మనపోలికే. ఒంటిమీద బొచ్చుగూడా పలుచబడింది. అన్నికంటే ఆశ్చర్యం కలిగించేది అతని మెదడు పరిమాణం. అది మనదానికంటే కూడా కాస్త పెద్దది. కేవలం సైజేగాదు, మనకులాగే అతనిలో ఆలోచనకు సంబంధించిన మెదడుభాగం బాగా పెరిగింది. ఈ కారణాల వల్ల అతన్ని మనం కులం (స్పీసీస్)లోనే చేర్చి ‘హోమో సెపియన్’గా గుర్తించారు. అంటే, అతనితో మన సొంత చరిత్రకు తెర లేచిందన్నమాట. ఫ్రాన్సు దేశంలోని ‘క్రోమాన్యాన్’ గుహలో మొదటిసారిగా ఈ మనిషికి సంబంధించిన అవశేషాలు దొరకడంతో ఇతనికి ఆ పేరొచ్చింది. ఆ తరువాత యూపర్లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి అస్థికలు విశేషంగా లభించాయి. వాటిల్లో అత్యంత పురాతనమైనవి సుమారు 30వేల సంవత్సరాలవికాగా, చివరివి కనీసం 10వేల సంవత్సరాలనాటివి. పరిశోధనలు యూపర్లోనే ఎక్కువగా జరగడంతో అవశేషాలు విస్తారంగా అక్కడ దొరికుండొచ్చుగానీ, అతని జన్మస్థానం మాత్రం యూపర్ కాదు. ఉత్తర ఆఫ్రికాలోనో, దక్షిణ ఆసియాలోనో హోమో ఎరెక్టస్ నుండి అనేక సోపానాల్లో పరిణమించి, పరిపూర్ణమైన మనిషిగా ఎదిగిన తరువాత అతడు యూపర్‌లో ప్రవేశించాడు. అది ఒక దారిని ఎన్నుకుని పథకం ప్రకారం జరిగిన వలసగాదు; తనకు అలవాటైన వృక్షాలనూ, తనకి ఇష్టమైన జంతువులనూ అనుసరిస్తూ చెల్లాచెదురుగా జరిగిన విస్తరణ. ఆ ఇరవై వేల సంవత్సరాల్లో జరిగినంత మానవ విస్తరణ ఆ తరువాత ఈ భూమిమీద ఏ దశలోనూ జరుగలేదు. అలాంటి విస్తరణకు అప్పటి భౌగోళిక పరిస్థితులు బాగా అనుకూలించాయి. ఇప్పుడు మనం ఆసియా, ఐరోపా, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా ఖండాలుగా చెప్పుకుంటున్న భూభాగాలు దేనికదిగా అప్పట్లో విడిపోలేదు. రష్యాలోని సైబీరియాతో ఉత్తర అమెరికాలోని అలాస్కా నిరాటంకంగా కలిసి పోయుండేది. వీటిని కలిపివుంచిన భూభాగం ఆ తరువాత పసిఫిక్ మహాసముద్రంలో మునిగిపోయి బేరింగ్ జలసంధిగా ఏర్పడింది. మధ్యధరాసముద్రం అప్పట్లో రెండు పెద్ద సరస్సులుగా మాత్రమే ఉండేది. దానికి పడమటిదిశగా అట్లాంటిక్ మహాసముద్రంతోగాని, తూర్పుదిశగా నల్లసముద్రంతోగాని సంధి ఏర్పడలేదు. అందువల్ల ఆఫ్రికా ఉత్తర ప్రాంతం, ఆసియా పడమటి ప్రాంతాలు యూరప్‌తో కలిసిపోయి ఒకే అట్టగా ఉండేవి. అప్పట్లో ఎడారులుగూడా ఉండేవిగావు. ఆఫ్రికాలోని సహారా ఎడారి ఒక విశాలమైన పచ్చికబయలు. అలాగే రష్యాలోని సైబీరియా మైదానం మరింత విశాలమైన పచ్చికబయలు. పచ్చిక మేసే జంతువులను వెదుక్కుంటూ, గుంపులు గుంపులుగా క్రోమాన్యాన్ మానవుడు యూరప్‌లో ప్రవేశించాడు. అప్పుడింత అప్పుడింతగా లోపలికి చొచ్చుకుపోయాడు. మరోవైపు ఇండోనేషియా, చైనా, కొరియాలను అనుసరించి మొదట ఉత్తర అమెరికాకు చేరుకుని, అక్కడి నుండి దక్షిణ అమెరికాకు విస్తరించాడు. క్రోమాన్యాన్ మానవుడు చేరుకోకముందు అమెరికాలో మనిషీ లేడు, మనిషి పరిణామమూ లేదు. కానీ, అమెరికాలో స్వతంత్రంగా మానవ పరిణామం జరిగినట్టు నిరూపించాలని కొందరు అమెరికన్ శాస్త్రజ్ఞులు పనిగట్టుకుని ప్రయత్నాలు సాగించారు. చివరకు వాళ్ళ ప్రయత్నం జాతీయ దురహంకారానికి ఎల్లలుండవనే వాస్తవాన్ని మాత్రమే నిరూపించింది. రచన: ఎం.వి.రమణారెడ్డి -
దూరపుచుట్టం
టూకీగా ప్రపంచ చరిత్ర 24 అయితే, కనీసం ఒక్క విషయంలో అతని ప్రవర్తన మిగతా జంతువులకు భిన్నంగా లేకపోయిండొచ్చు. అది సంతానం పట్ల పోతు జంతువుకుండే నిరాసక్తత. జంతువుల్లో పిల్లల పోషణా రక్షణా సంపూర్ణంగా పెంటి జంతువు నిర్వహించే బాధ్యతలు. బహుశా అందుకు కారణం సంతానోత్పత్తిలో తనకు భాగస్వామ్యం ఉందని పోతుకు తెలియకపోవడం కావచ్చు. సంతానోత్పత్తి విధానాన్ని తెలుసుకునేంత ఆలోచన నియాండర్తల్ మానవునికి ఉండేదని మనం ఊహించలేం. స్త్రీ పురుష సంపర్కం వాళ్ళకొక ఆహ్లాదం మాత్రమే. ఇక చెప్పేందుకు మిగిలిపోయింది చరిత్రలో ఏర్పడిన గండి గురించి. హోమో ఎరెక్టస్ కాలం దాదాపు ఐదులక్షల ఏళ్ళనాటిది. నియాండర్తలెన్సిస్ కాలం ఒకటిన్నర లక్ష ఏళ్ళనాడు మొదలౌతుంది. ఈ మధ్యలో మిగిలిన మూడున్నర లక్షల ఏళ్ళు పరిణామక్రమం ఏమైపోయిందో ఇటీవలికాలం దాకా శాస్త్రజ్ఞులకు అంతుపట్టలేదు. 1933లో జర్మనీలోనూ, 1935లో ఇంగ్లండులోనూ దొరికిన అవశేషాలు రెండులక్షలూ యాభైవేల సంవత్సరాలనాటివిగా నిర్ధారణ కావడంతోనూ, లక్షణాలతో అవి నియాండర్తల్ నరుని పూర్వీకులవిగా నిరూపణ కావడంతోనూ కాసింత ఉపశమనం దొరికినా, ఆ నడిమికాలం అవశేషాలు ఎందుకు అంత అరుదయ్యాయనే సవాలు ఇప్పటికీ మనను వెంటాడుతూనేవుంది. నియాండర్తల్ మానవులు నాలుగవ హిమానీశకం అవాంతరాలను అధిగమించి లక్ష సంవత్సరాలకు పైగా యూరప్‌ను ఆక్రమించి జీవించారు. నేలమీద ఇంత సుదీర్ఘంగా నిలిచిన జాతి మరొకటి లేదు. కానీ, ముప్ఫైవేల సంవత్సరాలకు ముందు ఈ జాతి సర్వస్వం వారసత్వం లేకుండా అంతరించింది. దానికి కారణంగా ఆ తరువాత తెరముందుకు వచ్చిన ‘క్రోమాన్యాన్’ మానవుణ్ణి కొందరు నిందిస్తున్నారుగానీ, అది సమంజసంగా కనిపించదు. ఒక జాతిని సమూలంగా తుడిచిపెట్టే అవసరం ఆ రోజుల్లో మరొక జాతికి లేనేలేదు. అదీగాక నియాండల్తల్ నరుని శరీరం తరువాతి కాలంలో మరింత మోటుగా పరిణమించి, ఎదుగుదలకు అవరోధంగా మారిపోయింది. బహుశా హిమానీశకంలో చలి ప్రభావానికి అతని శరీరం అలాంటి ఆకారం తీసుకోనుండొచ్చు. మంచు పేరుకుపోయిన దశలో ఆహారానికి ఏర్పడిన కొరత మూలంగా ఆ నరునికి స్వజాతిమాంసం తినే అలవాటు (కెన్నెబాలిజం) గూడా అబ్బిందని కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. దాన్నిబట్టి ఆ జాతి రానురాను అంతరించే మార్గంలో పయనించిందేగానీ, తరువాతి దశకు ఎదిగిందిగాదు. అయితే, కొత్తగా వచ్చిన మానవునితో నియాండర్తలెన్సిస్కు నివాసం కోసం, వేట కోసం పోటీ ఏర్పడడం అనివార్యం. పోటీకి నిలువలేక అతడు ఆరుబయటి జీవితానికి తిరోగమించి, మారిన వాతావరణంలో సమూలంగా అంతరించిపోయిన దురదృష్టాన్ని అసంభవంగా మనం భావించలేము. ఈ నేలమీద వారసుణ్ణి నిలుపుకోకుండా అంతరించిన నియాండర్తల్ జాతికి సానుభూతి ప్రకటించడం మినహా మనం చేయగలిగింది ఈ సందర్భంలో మరొకటి లేదు. నియాండర్తల్ మానవులు మొత్తంగా అంతరించలేదనే వాదనలు గూడా ఉన్నాయి కొన్ని. యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో దొరికిన నియాండర్తల్ అవశేషాల్లో కొంత నాజూకుదనం కనిపించిన కారణంగా, అవి ‘ప్రోగ్రెసివ్’ నియాండర్తలెన్సిస్కు చెందినవనీ, వాళ్ళు ఆధునిక మానవునిగా పరిణించారనీ, అంతరించిపోయింది కేవలం ‘క్లాసికల్’ నియాండర్తల్స్ మాత్రమేననీ కొందరు శాస్త్రజ్ఞుల అభిప్రాయం. కానీ, సెంట్రల్ యూరప్‌లో ఆధునిక మానవుని పరిణామం జరగలేదనీ, పరిణామం చెందిన మానవుడు దక్షిణం నుండి సెంట్రల్ యూరప్ చేరుకుని క్రమంగా విస్తరించాడనీ ఎక్కువమంది శాస్త్రజ్ఞుల అభిప్రాయం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
నెగడు
టూకీగా ప్రపంచ చరిత్ర 20 మనం చూస్తున్న వాటిల్లో మచ్చికైన జంతువులను పక్కనబెడితే, నిప్పుకు జడుసుకోని జంతువు ఈ భూమ్మీద లేదు. ఉందంటే అది మనిషి మాత్రమే. ఒకానొకప్పుడు మనిషికి పూర్వీకుడు కూడా నిప్పును చూసి పరిగెత్తిపోయేవాడే. అప్పట్లో నిప్పుగానీ మంటలుగానీ ఏర్పడేది దావానలం వల్ల మాత్రమే. అది వ్యాపించే వేగం, విస్తృతి, అది కల్పించే బీభత్సం, ప్రాణాపాయాలకు భయపడకుండా నిలిచే అవకాశం ఏ జీవికీ లేదు. అది చల్లారిన తరువాత, అందులో చిక్కుకుని కాలిపోయిన జంతువుల మాంసం కోసం తారాడే మ్రుక్కడిమృగాలు అక్కడికి చేరి, బూడిదనూ బొగ్గులనూ మూతితో కాళ్ళతో కుళ్ళగిస్తాయి. అప్పట్లో సగమానవునికి సమానమైన ఆస్ట్రలోపిథికస్ వానరం తన ఆహారం కోసం పడుతున్న పాట్లు కూడా అలాంటివే. నిప్పును స్వాధీనంలోకి తెచ్చుకోక పూర్వం నరమానవ జీవితం దినదిన గండంగా సాగింది. క్రూరమృగాలకు కాలిన వేట రుచించదు. అవి కోరేది పచ్చిమాంసం, వేడినెత్తురు. వాటికోసం అవి వేటకు బయలుదేరేది చీకటివేళల్లో. నరమానవుని నివాసం రక్షణలేని ఆరుబయలు. చీకట్లో క్రూరమృగాలకు దృష్టి నిశితం. వాటి బలం నరమానవునికంటే ఎన్నోరెట్లు అధికం. మోటు తరహా రాతిపనిముట్లను అందుబాటులో ఉంచుకున్నా, బలమైన జంతువుకు హాని కలిగించే పాటివిగావు ఆ రాతితునకలు. ఆ అవాంతరాన్ని నిరోధించేందుకు ‘నిప్పు’ ఏకైక మార్గమని అప్పుడప్పుడే పెరుగుతున్న మెదడుకు ఏదో సందర్భంలో ఆలోచన తట్టివుండాలి. పది లక్షల సంవత్సరాలకు పూర్వం ప్రారంభమైన సీనోజోయిక్ యుగంలోని రెండవఘట్టంలో భూమిమీద వాతావరణానికి మరో తరహా వైపరీత్యాలు మొదలయ్యాయి. ఒకదాని తరువాత ఒకటిగా ఇప్పటికి నాలుగు ‘హిమానీశకాలు (గ్లేసియల్ పిరియడ్స్)’ సంభవించాయి. హిమానీశకంలో ధ్రువాల దగ్గర మంచు విపరీతంగా పోగై, అది భూమధ్యరేఖ వైపుకు పాకుతూ వస్తుంది. నేలను కప్పుకుంటూ కప్పుకుంటూ 50 డిగ్రీల అక్షాంశం దాకా పూడుకుపోతుంది. అంటే, ఇంగ్లండులోని థేమ్స్‌నది దరిదాపులకు ఉత్తరంలోనూ, అదేమేరకు దక్షిణంలోనూ భూగోళం చుట్టూ మంచు కప్పుకుపోతుంది. అంత భారీగా మంచు ఏర్పడేందుకు సముద్రాల్లోని నీళ్ళు 80 శాతం దాకా పీల్చుకుపోతాయి. అనేకచోట్ల సముద్రగర్భం బయటపడి భూఖండాల మధ్య వంతెనల్లాగా తేలుతుంది. మంచుతో కప్పుకు పోయిన ప్రాంతాల్లో అడవులు సమూలంగా నాశనమౌతాయి. భూమధ్యరేఖ దిశగా వలసపోని జంతువులూ నశిస్తాయి. అటువంటి క్లిష్టసమయాలను తట్టుకోలేక శాశ్వతంగా అంతరించిపోయిన జాతులు చెట్లల్లోనూ, జంతువుల్లోనూ కొల్లలుగావున్నాయి. ఇటువంటి హిమానీశకాల్లో మొదటిది ఆరులక్షల సంవత్సరాలకు పూర్వం సంభవించింది. 75 వేల సంవత్సరాలు అలాగే కొనసాగి, ఆ తరువాత మంచు క్రమంగా వెనక్కు తగ్గుతూ తిరిగి ధ్రువ ప్రాంతాలకు విరమించింది. దాన్ని దాటుకుని ప్రవేశించిన వెచ్చని వాతావరణంతో 25 వేల సంవత్సరాల ఉపశమమనం తరువాత, 5 లక్షల సంవత్సరాల నాడు, రెండవ హిమానీశకం ప్రవేశించి మరో 75 వేల సంవత్సరాలు పీడించింది. రెండున్నర లక్ష సంవత్సరాలప్పుడు మూడవది, లక్షా ఇరవైవేల సంవత్సరాలప్పుడు నాలుగవదీ ప్రవేశించాయి. 25 వేల సంవత్సరాలనాడు నాలుగవ హిమానీశకం ముగిసి, అప్పటినుండి ఇప్పటిదాకా ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రపంచం వర్ధిల్లుతూ వస్తూవుంది. ఆస్ట్రలోపిథికస్ది మొదటి హిమానిశకం కంటే ముందే ప్రారంభమైన జీవితం. ఆ జీవితం నిప్పుకు దూరంగానూ, రాళ్ళతో కర్రలతో కొట్టి చంపేందుకు వీలైన జంతువుల వేటతోనూ, లేదా వేటాడే జంతువులు వదిలేసిన మాంసం కోసం నక్కలూ కుక్కలవంటి జంతువులను తరిమేసి స్వాధీనం చేసుకోవడంతోనూ గడిచింది. హిమానీశకంలో అంతరించిన మేరకు అంతరించిపోగా, దక్షిణానికి నివాసం మార్చుకున్న మేరకు వాటి సంఖ్య కుదించుకుపోయింది. ఆరుబయట బతికే జీవికి ఒకేచోట ఉండాలనే అనుబంధం పెద్దగా ఉండదు. ఆ దశలో నరవానరానికి స్థిరనివాసమనే ఆలోచన కలిగుండే అవకాశమేలేదు. అయితే, రెండవ హిమానీశకంనాటికి వాటి జీవనశైలి మౌలికంగా మారిపోయింది. నిప్పును చూసి బెదురుకునే స్థితిని దాటుకున్నట్టు నిదర్శనాలు కనిపిస్తున్నాయి. ఆహారం కోసం జరిగే అన్వేషణలో మిగతా జంతువుల పోటీ నుండి నెగ్గుకురావాలంటే తాను ఒక అడుగు ముందంజలో ఉండాలి. రచన: ఎం.వి.రమణారెడ్డి -
నెగడు
టూకీగా ప్రపంచ చరిత్ర 19 ‘‘అగ్నిమిళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజమ్ హోతారం రత్నధాతమం॥ అగ్నిః పూర్వేభిరృషిభిరోడ్యో నూతనైరుత స దేవా ఏహ పక్షతి॥ అగ్ని నా రయమశ్నవత్ పోషమేవ దివేదివే యశనం వీరవత్తమమ్॥ అగ్నేయం యజ్ఞమధ్వరం విశ్వతః పరిభూరసి స ఇద్ దేవేషు గచ్ఛతి॥ అగ్నిర్హోతా కవిక్రతుః సత్యశ్చిత్రశ్రవస్తమః దేవో దేవాభిరాగమత్॥’’ (ఋగ్వేదం) (అగ్ని పురోహితుడు (ప్రాచీనుడు), దేవతల ఋత్విజుడు, హోత, సంపద ప్రదాత. అట్టి అగ్నిని స్తుతిస్తున్నాను. అగ్నిని పూర్వఋషులూ, ఇప్పటి ఋషులూ పూజిస్తున్నారు. అగ్ని దేవతా సహితంగా విచ్చేస్తాడు. అగ్ని వలన ధనమూ, విజ్ఞానమూ, సంపదలూ, శక్తీ కలుగుతున్నాయి. అగ్ని వల్ల కీర్తి, సంతానము కలుగుతున్నాయి. అగ్నియే యజ్ఞములను కాపాడుతున్నది. దేవతలకు చేరుస్తున్నది. అగ్నియే హోత, విజ్ఞాని, సత్యము, యశస్సు, అగ్ని దేవతాసహితుడై అరుదెంచేవాడు.) ఈ బుక్కుతో వేదం మొదలవుతుంది. ఋగ్వేదంలో 200 ఋక్కులకు పైగా కేవలం అగ్నిని స్తుతించేవే. దీన్నిబట్టి అనాది నుండి అగ్నికుండే ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకోవచ్చు. అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చిందంటే, అగ్నివల్ల ప్రాప్తించింది భద్రత, నాగరికతలు మాత్రమే కాదు; జీవరాసి సమస్తం నుండి అది మనిషిని వేరుచేసి, ప్రాణి ప్రపంచంలో అతనికి ప్రత్యేక స్థానం నెలకొల్పింది. భారతదేశానికి ఆర్యుల నుండి పురాణాలు సంక్రమించినట్టే యురోపియన్లకు గ్రీకుల నుండి పురాణాలు సంక్రమించాయి. వాటిల్లో అతి పురాతనమైందిగా చెప్పుకునేది ‘ఇలియడ్.’ అందులో అగ్నికి సంబంధించిన కథ ఒకటుంది. ప్రొమీథియస్ అనే మానవుడు చాలాగొప్ప బలశాలి. దేవతలకు యుద్ధం జేసే అవసరమొస్తే అతన్ని సహాయంగా పిలుచుకుంటారు. ఆవిధంగా దేవతలకు సమకూరిన ఒకానొక విజయం తరువాత ప్రొమీథియస్ గౌరవార్థం దేవతలు విందును ఏర్పాటు చేస్తారు. ఆ విందులో ‘కబాబ్’ వడ్డించారో ఏమో, దేవతలు నిప్పును ఉపయోగిస్తున్నట్టు ప్రొమీథియస్కు తెలుస్తుంది. ఆ వైభవం మానవలోకంలో లేదు. అందువల్ల, ఎలాగైనా దాన్ని మానవులకు చేర్చాలన్న తాపత్రయంతో, దేవలోకం నుండి నిప్పును దొంగిలించి భూలోకం తీసుకొస్తాడు. అది దేవతల ఆగ్రహానికి కారణమౌతుంది. ప్రతీకారం తీర్చుకునేందుకు వాళ్ళొక పథకం రచిస్తారు. చూడగానే మతి తప్పేంత అందమైన అమ్మాయిని ప్రొమీథియస్ దగ్గరకు పంపిస్తారు. ఆమె పేరు పండొరా. కన్యాశుల్కంగా తనవెంట ఆమె తీసుకొచ్చిన మందసం ‘పండొరాస్ బాక్స్.’ ఆమె హొయలు ప్రొమీథియస్ను జయించవుగానీ, అతని తమ్ముడు ఎపిమీథియస్ను లోబరచుకుంటాయి. అన్న హెచ్చరికలను ఖాతరు చెయ్యకుండా అతడు పండొరాను పెళ్ళాడి, ఆమె కానుకగా తెచ్చిన మందసాన్ని తెరవగానే, అందులో దాగున్న వ్యాధులన్నీ భూలోకంలో వ్యాపిస్తాయి. ఆ విధంగా మానవజాతి మీద దేవతల అక్కసు తీరుతుంది. ‘ఇది నమ్మదగిందేనా?’ అనేదిగాదు ఇక్కడ మన చర్చ. ఇలియడ్ చెప్పినా, భారతం చెప్పినా శ్రోతల ఆసక్తిని చూరగొనేందుకు కథకుడు పలురకాల కల్పనలు చేయడం ఆనవాయితి. కుతూహలం రేకెత్తించని కథ జనంలో నిలవదు. అందువల్ల, మనం దృష్టిని కేంద్రీకరించవలసింది నిప్పు కోసం దేవతలనైనా ఎదిరించేందుకు మానవుడు సిద్ధపడిన సాహసం మీద. ఒక చోట జరిగింది నిప్పు కోసం సాహసమైతే, ఇంకొకచోట దొరికిన నిప్పును కాపాడుకోవడం ‘నిత్యాగ్నిహోత్రం’ పేరుతో వ్రతమయింది. వెనుకటి రోజుల్లో నిప్పుకుండిన ప్రాధాన్యత ఎంత గొప్పదంటే, అది కథగానో వ్రతంగానో మానవుని మస్తిష్కంలో వేల సంవత్సరాలు నిలిచిపోక తప్పనంత బృహత్తరమైంది. అది మానవునికి సమస్త జీవజాలం మీద తిరుగులేని పెత్తనాన్ని కట్టబెట్టిన ఆయుధవిశేషం. రచన: ఎం.వి.రమణారెడ్డి -
చుట్టరికాలు
టూకీగా ప్రపంచ చరిత్ర- 18 జావా ద్వీపంలో డుబోయ్కి ఒక పుర్రె పైభాగం, ఒక తునక దవడఎముక, ఒక తొడ ఎముక లభించాయి. పుర్రె పైభాగం ఆధారంగా ఆ ఎముకల సొంతదారుకు మెదడు పరిమాణం వాలిడికి ఉండేకంటే పెద్దదనీ, తొడఎముక ఆధారంగా అది ఇంచుమించు నిటారుగా నడిచిందనీ, మనిషి పరిణామక్రమంలో అది ముందు తరానిదనీ ప్రకటించాడు. దానికి ‘పితికాంత్రోపస్ ఎరెక్టస్’ అని పేరుగూడా పెట్టాడు. కానీ, తన దగ్గరున్న చాలీచాలని సాక్ష్యంతో శాస్త్రజ్ఞుల ప్రపంచాన్ని ఒప్పించేందుకు వీలుపడకపోవడంతో, ఆయన పరిశోధన మరుగున పడిపోయింది. ఆ తరువాత ముప్ఫై సంవత్సరాలకు పరిశోధనారంగం చైనాకు మారింది. పీకింగ్ (ఇప్పుడు బీజింగ్ అనే నగరం) నగరానికి సమీపంలో ‘చౌకూటియన్’ అనే గ్రామం దగ్గరి గుహలో ఏవేవో ఎముకలు దొరుకుతున్నాయని విని, అక్కడి అనాటమీ ప్రొఫెసర్ డేవిడ్సన్ బ్లాక్ ఆ గుహలో పరిశోధనలు ప్రారంభించాడు. జావాలో దొరికిన పుర్రెలాంటిది ఆయనకు చెక్కు చెదరకుండా దొరికింది. ఆయన 1934లో మరణించగా, వీడెన్రీచ్ అనే మరో శాస్త్రజ్ఞుడు అదే స్థలంలో పరిశోధనకు పూనుకున్నాడు. ఎంతో ప్రయాసతోనూ, జాగరూకతతోనూ ఆయన పొరలుపొరలుగా నేలను పరిశీలిస్తూ త్రవ్వకాలు సాగించగా, ఆశించిన అవశేషాలు పరిపూర్ణంగా దొరికాయి. అవి నిటారుగా నడిచిన పూర్వీకునివి. వాటితోపాటు వేరు వేరు పొరల్లో ఎన్నో రకాల జంతువుల అస్థికలు దొరికాయి. వాటిల్లో ‘సేబర్ టీత్’ పులివంటి అంతరించిపోయిన జాతి క్రూరమృగాల ఎముకలు ఎన్నో ఉన్నాయి. అదే పొరలో ఆ సగంనరుడు ఉపయోగించిన రాతి పనిముట్లు కూడా దొరికాయి. అవి ఆస్ట్రలోపిథికస్ వాడిన పనిముట్లకంటే బాగా మెరుగైనవి. పై ఆధారాలను బట్టి, మనిషి అప్పటికి ఆరుబయటి జీవితాన్ని చాలించి తన నివాసాన్ని గుహల్లోకి మార్చుకుంటున్నాడని అర్థమౌతుంది. అంతకు ముందు ఆ గుహను ఆక్రమించిన క్రూరమృగాలను చంపో, లేదా అవి చనిపోయిన తరువాతనో అతడు ఆ గుహను ఆక్రమించివుండాలి. అతడు ఆహారంగా ఉపయోగించిన జంతువుల ఎముకలు కూడా చాలా దొరికాయి. వాటిల్లో జింక ఎముకలు చాలా ఎక్కువగా ఉండడంతో, అప్పటి మనుషులకు జింక మాసం అత్యంత ప్రీతికరమని తెలుస్తుంది. ఎముకలను బట్టి అతని ఆకారం ఊహిస్తే - నుదురు ఇప్పటి మనిషికున్నట్టు నిటారుగా కాక, ఏటవాలుగా పడుకోనుంటుంది. దవడలూ దంతాలు కాస్త పెద్దవి. చుబుకం లేదు. దవడలు ముందుకు పొడుచుకురావడం, చుబుకం లేకపోవడం, నుదురు నిటారుగా లేకపోవడం కారణంగా చూసేందుకు అతని ముఖం వాలిడికి మల్లే కనిపిస్తుంది. కానీ, వెడల్పాటి తుంటితో అతడు నిటారుగా నడవడమేగాక, మిగతా ఏ లక్షణం తీసుకున్నా మనిషికి చేరువగానే ఉంటుంది. అందువల్ల, అతనికి ‘హోమో’ తెగ కేటాయించారు. ‘హోమో’ అంటే ‘ఒకేలాటి’ అని అర్థం. పీకింగ్ అవశేషాలు ‘హోమో ఎరెక్టస్’వి కాగా, మనిషిది ‘హోమో సెపియన్’ తెగ. ఆ దశలో మనిషి వేసిన ముందడుగు నిప్పును ఉపయోగించడం. నిప్పును నియంత్రించడం నేర్చుకున్న దశ మానవుని చరిత్రలో అత్యంత విశిష్టమైందేకాక ఎంతో కీలకమైంది కూడా. ఇది మానవుని తొట్టతొలి పరిశోధనకు అమూల్యమైన ఫలితం; ఇది మిగతా జంతుజాలం నుండి మానవుణ్ణి సంపూర్ణంగా విడదీసిన మలుపు. కాల్చిన ఎముకలు దొరికినదాన్ని బట్టి, అతడు మాంసాన్ని నిప్పులమీద కాల్చి తినేవాడని తెలుస్తుంది. బహుశా, దావానలంలో చిక్కుబడి ఉడికిన జంతువుల మాంసాన్ని రుచిచూసిన తరువాత అతనికి వంటమీద ధ్యాస ఏర్పడి ఉండవచ్చు. నిప్పును స్వయంగా తయారుచేసుకునేవాడో లేక కాలిపోయిన అడవుల నుండి నిప్పులు సేకరించేవాడో చెప్పలేంగానీ, అదే పొరలో బొగ్గులు కనిపించడంతో కనీసం 4 లక్షల ఏళ్ళనాడే మనిషి నిప్పును సాధించాడని కచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఆ నేలపొరలు నాలుగు లక్షల సంవత్సరాలనాటివి అయివున్నాయి కాబట్టి. ఆ తరువాతి పరిశోధనల్లో ‘హోమో ఎరెక్టస్’ అవశేషాలు ఆసియాలోనే కాక, ఆఫ్రికాలోనూ బయటపడ్డాయి. టాంగ్యానికా సరోవరతీరంలోని ఆల్డువాయ్గార్డ్ కోనలో ఇరవైలక్షల ఏళ్ళనాటి పొరల్లో ఆస్ట్రిలోపిథికస్, ఆ తరువాతి పొరల్లో పితికాంత్రోపస్, ఐదు లక్షల ఏళ్ళనాటి పొరల్లో హోమోఎరెక్టస్ అవశేషాలు అంచెలంచెలుగా దొరికాయి. నేల పైపొరకూ అడుగుపొరకూ నడుమ దశలవారి పరిణామం సూచించే అనేక అవశేషాలు, ఈ శాస్త్రానికి జీవితాలను అంకితం చేసిన డా. లీకీ దంపతులకు పురస్కారంగా లభించాయి. ఇలా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలకు చెందిన ప్రాంతాలన్నిట్లో ‘హోమో ఎరెక్టస్’ అవశేషాలు దొరకడంతో, ‘మానవుని మొదటి నివాసం ఏదైవుండొచ్చు?’ అనే వివాదం తారాస్థాయికి చేరింది. నీగ్రోలూ, యూరోపియన్లూ, ఇండియన్లూ, చైనీయులూ వంటి జాతుల మనుషులు వేరు వేరు జంతువుల నుండి పురోగమించారని కొందరు వాదించారుగానీ, వాళ్ళ వాదనకు శాస్త్రీయ విజ్ఞానం దన్నుగా నిలువలేదు. ఇవి ఏ వంద సంవత్సరాల్లోనో వేల సంవత్సరాల్లోనో జరిగిన వలసలు కావు. లేదా, ఒకే దశ పరిణామంలోనూ జరిగినవిగావు. ఆహారం కోసం అన్వేషణలో లక్షల సంవత్సరాల పర్యంతం తన బ్రతుకుతెరువు ఆశలతో ఏ పరిణామదశలో జీవి ఏ దిశగా తారాడిందో ఊహించడం కష్టం. పైగా, అప్పట్లో భూఖండాలు ఇప్పటిలాగా లేవు. ఉదాహరణకు ఆసియాఖండంతో అమెరికా ఖండాన్ని విడదీసే ‘బేరింగ్ జలసంధి’ అప్పట్లో లేదు. ఈ రెండు ఖండాలూ రాకపోకలకు అనుకూలంగా కలిసే ఉండేవి. ఆ కారణంగానే, ఒంటెలూ లామాలూ ఒకే తరహా జంతువులైగూడా, మొదటి ‘హిమానీశకం’లో చలిని ఓర్చుకోగల ‘లామా’లు అమెరికాఖండానికి నివాసం మార్చుకోగా, ఒంటెలు ఉష్ణదేశంలో మిగిలిపోయాయి. రచన: ఎం.వి.రమణారెడ్డి -
చుట్టరికాలు
టూకీగా ప్రపంచ చరిత్ర- 17 అసలు, ఏ వానరానికైనా శాఖోపజీవితానికి విడాకులిచ్చి నేలమీదికి మారే అవసరం ఏమొచ్చుంటుంది? అలాంటి ఒత్తిడి వచ్చే ఉండాలి. ఎన్నో కోతులు అడవులు వదిలేసి కొబ్బరిముక్కల కోసం దేవాలయాలను ఆశ్రయించడం మనం చూస్తూనే వున్నాం. మరికొన్ని గుంపులు జనావాసాల్లోనే స్థిరపడ్డాయి. ఇవి మచ్చిక జంతువులైనా కాదు. తిండిని దొంగిలిస్తూ జీవనం సాగిస్తుంటాయి. ఒకప్పటి నివాసాన్ని ఇవి వదిలేసిన కారణం ఏడాది పొడవునా ఆహారం దొరికే సౌలభ్యమే. ఆదిమకాలంలోనూ అలాంటి అవసరమేదో వానర జీవితం మీదికి తోసుకొచ్చేవుండాలి. సీనోజోయిక్ యుగం మొదలైన మూడు నాలుగు కోట్ల సంవత్సరాల తరువాత భూమి మీద మంచుకురిసే వాతావరణం మొదలయిందని ఇదివరకే అనుకున్నాం. అప్పటి చెట్లు హిమపాతాన్ని ఓర్చుకునే సామర్థ్యం కలిగేందుకు అవకాశం లేదు. ఆ సామర్థ్యాన్ని సంపాదించుకునేందుకు కొన్ని చెట్లు ప్రకృతితో ఘర్షణ పడుతుండగా, మిగతావన్నీ మోడు వారడంతో వానరాలకు ఆహార సముపార్జనేకాక, ఆత్మరక్షణ కూడా సమస్యగా మారుండాలి. చెట్లు పలుచబడడంతో చెట్టు నుండి చెట్టుకు మారాలంటే నేలమీది నడక తప్పనిసరి అయ్యుండాలి. వెచ్చని వాతావరణంలో ఒకప్పటి చెట్లు ఏడాది పొడవునా ఫలాలనిచ్చేవే అయ్యుంటే, రుతుచక్ర ప్రవేశంతో వాటి స్వభావం మారుండాలి. ఇలాంటి ఏవేవో కారణాల ప్రోద్బలంతో కొన్ని వానరాలు బ్రతికేందుకు వీలుగా అలవాట్లనూ, శరీర నిర్మాణాన్నీ మార్చుకుంటూ రాగా, కొన్ని వానరాలు పాత వాతావరణాన్ని వెదుక్కుంటూ దక్షిణానికి వలసమార్గం చేపట్టాయి. వాటిల్లో ఏదోవొక మార్గాన్ని అనుసరించేందుకు వీలుపడని జంతువులు వారసత్వాన్ని మిగుల్చకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. ఆఫ్రికా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో జరిగిన తవ్వకాల్లో ఇటువంటి మరికొన్ని అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. కానీ, ఒకచోట పుర్రెలూ, ఇంకొకచోట తొడ ఎముకలూ, మరొకచోట తుంటి ఎముకలూ చెల్లాచెదురుగా దొరుకుతున్నాయే తప్ప, పూర్తి అస్థిపంజరం ఎక్కడా లభించలేదు. ఆ దొరికిన ఆధారాలతోనే ఆ జంతువులు నిటారుగా నడిచేవనీ, శాఖాజీవితాన్ని వదిలేసినవనీ, వాలిడి జాతులకు ఎంతమాత్రం సంబంధంలేనివనీ తేల్చి, ఆ జాతికి ‘ఆస్ట్రలో పిథికస్’గా నామకరణం చేశారు. నేలపొరల విశ్లేషణ ద్వారా అవి 20 లక్షల సంవత్సరాలకు పూర్వం నివసించినవిగా నిర్ణయించారు. వాలిడికీ, వాలిడిగాని వానరానికీ ఎముకల్లో ఉండే తేడాల్లో ప్రధానమైన కొన్నింటిని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అవి ఏమంటే - 1. మెదడుతో వెన్నుపాము కలిసేందుకు అనుకూలంగా పుర్రెలో ఉండే పెద్ద రంధ్రాన్ని ‘బృహద్రంధ్రం (ఫొరామెన్ మ్యాగ్నం)’ అంటారు. నాలుగుకాళ్ళ మీద నడిచే జంతువుకు ఇది పుర్రెకు పూర్తిగా వెనుకవైపు ఉంటుంది. అందుకే మొండెం నుండి వాటి తల ముందుకు చొచ్చుకొస్తుంది. వాలిడిలో ఈ రంధ్రం పుర్రెకు ఏటవాలుగా ఉంటుంది. అందువల్ల, ఎద మీద తల కూర్చోబెట్టినట్టు కనిపిస్తుందిగానీ, నిటారుగా తూకం పట్టుకునేందుకు అనుకూలించదు. మనిషి పుర్రెలో అది పూర్తిగా కిందిభాగాన ఉండడం మూలంగా, ఎదమీద తల కుదురుగా నిలిచింది. ఆస్ట్రలో పిథికస్ పుర్రెలో బృహద్రంధ్రం కిందివైపుగా ఉంది. అందువల్ల, నిటారుగా ఎంతసేపైనా నిలువగలదు. 2. వాలిడి జాతులకు కోరలు పెద్దవిగా ఉంటాయిగాబట్టి, నోరు మూతపడేందుకు అనుకూలంగా దవడలో వాటికోసం సందులు ఏర్పడివుంటాయి. ఆస్ట్రలో పిథికస్ కోరపళ్ళు చిన్నవిగా ఉండడంతో దవడల్లో సందులులేవు. 3. వాలిడికి కింది దవడ పెద్దదిగా ఉండడంతో, దాన్ని ఆడించేందుకు ఆ కండరాలు కూడా బలమైనవిగా ఉండాలి. దవడ కండరాలు అంత బలమైనవి కాబట్టి, పుర్రె పార్శాల్లో అవి పుట్టుకొచ్చిన తావున ఎముక మీద కుదుములు ఏర్పడివుంటాయి. ఆస్ట్రలో పిథికస్ పుర్రెకు అవిలేనందున, వాటి కిందిదవడ ఏమంత బరువైంది కాదని తేలింది. 4. వాలిడి జాతుల్లో జంతువులకు కాళ్ళకంటే చేతులు పొడవుగా ఉంటాయి. ఆస్ట్రలో పిథికస్ చేతులు కురచ. అవి శాఖాజీవితానికి పని కొచ్చేవిగావు. 5. వాలిడి తుంటి ఎముకలు కోసుగా కిందికి జారుంటాయి. వాటి జఘనం వెనకకాళ్ళ మీద కుదురుగా నిలబడేంత విశాలంగా విచ్చుకోనుండదు. ఆస్ట్రలో పిథికస్ తుండి ఎముక వెడల్పాటిది. జఘనం విచ్చుకోనుంటుంది. రెండు కాళ్ళ మీద నడవడానికే కాదు, పరిగెత్తేందుకు కూడా ఇది అనుకూలం. ఈ పరిశోధన మరింతమంది శాస్త్రజ్ఞులను ఆకర్షించడంతో, ఆఫ్రికా ఖండంలో తవ్వకాలు ఊపందుకుని, తరువాతి కాలంలో ఎముకలతో పాటు రాతి పనిముట్లు కూడా కలిసి కనిపించాయి. దాంతో, పనిముట్లను ఉపయోగించిన జంతువులు అవేనని నిస్సందేహంగా తేలిపోయింది. సీనోజోయిక్ యుగంలోని రెండవ ఘట్టంలో, తొలి ‘గ్లేసియల్ పిరియడ్ (హిమానీశకం)’ కంటే ఇవి 10 లక్షల సంవత్సరాల పూర్వానివి. పనిముట్లు చాలా చాలా మోటువి. ఆ జంతువులు ఆరుబయట నివసించే జీవితానికి అలవాటైనవి. పెద్దపెద్ద తండాలుగా నివసించాయని చెప్పేందుకు అవకాశం లేకపోయినా, పనిముట్లు కుప్పగా దొరకడాన్ని ఆధారం చేసుకుని, కనీసం గుంపులు గుంపులుగా కలిసి ఉమ్మడి జీవితాన్ని గడిపుంటాయని చెప్పుకోవచ్చు. ఆస్ట్రలో పిథికస్ అవశేషాలు ఆఫ్రికా తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో విశేషంగా దొరకడం మూలంగా మానవుని మొదటి నివాసం ఆఫ్రికాఖండమే అనే అపోహ బయలుదేరింది. కొంతమంది శాస్త్రజ్ఞులు దాన్ని సుతరామూ అంగీకరించలేదు. ఆస్ట్రలో పిథికస్ తరువాతి పరిణామదశకు చేరుకోలేదనీ, అది ఎప్పుడో అంతరించిపోయిన జంతువనీ వాళ్ళ అభిప్రాయం. మానవుని తొలినివాసం ఆసియాఖండంలోని దక్షిణ ప్రాంతాలు అయ్యుంటాయని వాళ్ళ అంచనా. ఆ వాదనకు బీజం 19వ శతాబ్దం మధ్యకాలానికే పడింది. ఆ శతాబ్ది చివరిరోజుల్లో, హాలెండుకు చెందిన యూజిస్ డుబోయ్ అనే శాస్త్రజ్ఞుడు దీన్ని నిరూపించేందుకు పూనుకున్నాడు. చేస్తున్న అనాటమీ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలేసి, ఆయన ఇండోనేషియా దీవుల్లో తవ్వకాలు ప్రారంభించాడు. రచన: ఎం.వి.రమణారెడ్డి -
బోనమెత్తిన శకటం సకల కళామకుటం
కొత్తగా ఏర్పడిన 29వ రాష్ట్రం తెలంగాణ గణతంత్రదినోత్సవాల్లో తన తొలి శకటాన్ని ప్రదర్శిస్తోంది. దేశ సార్వభౌమాధికారాన్ని చాటే ఉత్సవాల్లో తొలిసారి ’ తెలంగాణ స్వేచ్ఛా స్వరూపం, సంస్కృతీ సంప్రదాయాల ‘ప్రతిరూపం’ సగర్వంగా సాక్షాత్కరించనుంది. దేశ ప్రథమపౌరునితో పాటు అగ్రరాజ్యాధినేత ఒబామా సాక్షిగా తెలంగాణ వైభవం కనువిందు చేయనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ శకటానికి రూపుకట్టిన మన రాష్ట్ర ప్రసిద్ధ చిత్రకారుడు, హైదరాబాద్ నివాసి ఎం.వి.రమణారెడ్డి తన మనోభావాలను ‘ఫ్యామిలీ’తో పంచుకున్నారిలా.. - ఎస్.సత్యబాబు తొలి తెలంగాణ శకటాన్ని రూపొందించే అవకాశం నాకు దక్కడం ఎంతో సంతోషాన్నిచ్చింది. అనుమతి ఆలస్యం కావడం వల్ల అతి తక్కువ సమయమే ఉన్నా ఛాలెంజ్‌గా తీసుకున్నాం. మిగిలిన రాష్ట్రాల శకటాలకు థీటుగా 15 రోజుల రికార్డ్ టైమ్‌లో దీన్ని రూపొందించాం. తెలంగాణ సంస్కృతికి రెండు కళ్లలాంటివి బతుకమ్మ, బోనాలు. డిఫెన్స్ విభాగం సమకూర్చిన 45 అడుగుల పొడవు, 14 అడుగుల వెడల్పు ఉన్న ప్రత్యేక వాహనం వేదికగా... బోనాల వైభవాన్ని చాటుతున్నాం. ప్రస్తుతం మహిళల రక్షణ సమాజంలో అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో మహిళా రక్షకుడిగా, శక్తిమంతమైన పోతరాజును చూపుతున్నాం. ఈ శకటానికి ముందు భాగంలో పోతరాజు భీకర రూపం ఉంటుంది. వెనుక భాగం గోల్కొండ కోటను చూపుతుంది. సంప్రదాయదుస్తుల్లో బోనమెత్తిన ఇద్దరు మిహ ళలుంటారు. డప్పు, కొమ్ము, తష, పగడం... పరికరాలను వాయించే 25 మంది కళాకారుల ప్రత్యక్ష ప్రదర్శన మరో ప్రధాన ఆకర్షణ. దీనితో పాటే మహంకాళి అమ్మవారి మాటగా భవిష్యవాణిని చెప్పే మహిళ... అచ్చమైన బోనాల సందడితో, అణువణువూ అద్భుతమైన తెలంగాణ ప్రతిరూపంగా దీన్ని మలుస్తున్నాం. మన రాష్ట్రానికి చెందిన కొరియోగ్రాఫర్ రాఘవరాజ్ భట్, డప్పు కళాకారుడు శేఖర్,10మంది యువతులు... మరెందరో ఈ సందడిలో భాగం అవుతున్నారు. మొత్తం 18 రాష్ట్రాలు, 25 శకటాలతో 4కి.మీ సాగే ఈ పెరేడ్లో మన శకటానిది 9వ నెంబరు. వ్యక్తిగతం... సిద్ధిపేటలో పుట్టాను. తెలంగాణ బిడ్డగా... చిత్రకారుడిగా తెలంగాణ చిత్రకారులను ఏకతాటి మీదకు తెచ్చి తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరంను ఏడేళ్ల క్రితమే ఏర్పాటు చేశాను. పేద, ప్రోత్సాహం కరవైన తెలంగాణ చిత్రకారుల కోసం పదుల సంఖ్యలో పది జిల్లాల్లో ఆర్ట్ క్యాంప్ లు నిర్వహించాను. పేరు తెచ్చిన కాన్వాస్నే సాధనంగా చేసుకుని పుట్టిన గడ్డకు సేవ చేయాలనేదే నా లక్ష్యం.