చిత్తూరు రూరల్ : కుష్ఠు వ్యాధిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని స్వీస్ కామన్ ఇండియా కన్స్‌ల్టెంట్ రాజన్‌బాబు అన్నారు. ఆయన గురువారం చిత్తూరు రూరల్ మండలంలోని బిఎన్‌ఆర్ పేట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుష్ఠు వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా నిర్మూలించవచ్చని చెప్పారు.
కుష్ఠు వ్యాధి రోగులను గుర్తిస్తే వారికి వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు సూచనలు, సలహాలు అందించారు.
'కుష్ఠు వ్యాధిపై అవగాహన కల్పించాలి'
Published Thu, Aug 20 2015 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 7:48 AM
Advertisement
Advertisement