కర్నూలు, న్యూస్‌లైన్: వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే భార్యాభర్తలకు నచ్చజెప్పి రాజీ చేయాల్సిన వారు కరువయ్యారు. డోన్, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, ఆదోని, నంద్యాల సబ్ డివిజన్ కేంద్రాల్లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలు ఉన్నప్పటికీ కింది స్థాయి సిబ్బందితో తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ప్రతి ఆదివారం కలహాల కాపురాలను రప్పించి సబ్ డివిజన్ అధికారి స్థాయిలో గంటలతో మాట్లాడి సమస్యలను పరిష్కరించి ఇద్దరినీ కలిపే ప్రయత్నం చేయాలి. అయితే పై అధికారుల ఆదేశాల మేరకు తూతూ మంత్రంగా సాగుతున్నాయన్న విమర్శలున్నాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఆదివారం 30-40 జంటల దాకా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి జంటల మధ్య ఏర్పడిన మనస్పర్థలు విని సర్దిచెప్పి కుటుంబాలను నిలబెట్టే కృషి జరగాలి.
డోన్‌లో రెండేళ్లుగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించడం లేదు. మొదట్లో ప్రతి ఆదివారం సబ్ డివిజన్ అధికారితో పాటు సభ్యులుగా మహిళా మండలి సభ్యులు ఇద్దరు, ఐసీడీఎస్ అధికారి, ఇన్నర్ వీల్ సభ్యులు ఇద్దరుతో పాటు మరో నలుగురు స్వచ్చంధసంస్థల సభ్యులు కుర్చొని భార్యాభర్తలకు కౌన్సెలింగ్ చేసేవారు. అయితే ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సేమియానా, కుర్చీలు, టేబుళ్ల అద్దె ఖర్చు భరించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ను ఎత్తివేసినట్లు సమాచారం.
ఆత్మకూరులో కుటుంబాల మధ్య కలహాలను తొలగించేందుకు పోలీస్‌శాఖ 2002లో ఫ్యామిలీ కౌన్సెలింగ్ ప్రారంభించింది. అప్పటి డీఎస్పీ మాధవాచారి, సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ పవన్‌కిశోర్ ఈ సమావేశాలను ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ దాదాపు 1025 కేసులు నమోదయ్యాయి.
ఆళ్లగడ్డలోఫ్యామిలీ కౌన్సెలింగ్ ఉందనే విషయం ఇప్పటి వరకు కోర్టులకు వెళ్లిన భార్యాభర్తలకు, విడిపోయిన రక్త సంబధీకులకు తెలియదు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన వారిని ఒక సారి ఎస్‌ఐ కూర్చో బెట్టి మాట్లాడటం వినక పోతే కేసు కట్టి కోర్టులో చూసుకో పొండని పంపుతున్నట్లు తెలిసింది
రాజీ కుదిర్చేవారేరీ!
Published Sun, Feb 2 2014 3:52 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement