కొండవెలగాడ పాఠశాలకు అందించిన రంగుమారిన గుడ్లు
విజయనగరం, నెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీతో పాటు మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో కుళ్లిన కోడిగుడ్లు పెడుతున్నారు. దీంతో విద్యార్థులు తినలేక బయట పడేస్తున్నారు. నగరపంచాయతీతో పాటు మండలంలోని 70 ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని నవప్రయాస్ అనే సంస్థకు ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. నెల రోజులుగా ఆ సంస్థే మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తుండగా.. అన్నం గట్టిగా ఉంటోందని, పప్పు పలుచగా ఉంటోందని విద్యార్థులు వాపోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వారికి సరఫరా చేస్తున్న గుడ్లు కూడా బాగుండడం లేదని విద్యార్థులు అంటున్నారు.
కుళ్లిపోయిన కోడిగుడ్లను తమకు పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మొదట్లో గుడ్లను పాఠశాలల్లోనే ఉడకబెట్టి విద్యార్థులకు అందించేవారు. అయితే సంక్రాంతి సెలవుల తర్వాత నవప్రయాస్ సంస్థే గుడ్లు ఉడకబెట్టి సరఫరా చేస్తోంది. రంగు మారి పోయిన గుడ్లను పాఠశాలలకు పంపిస్తున్నారు. తెల్లగా ఉండాల్సిన గుడ్లు ముదురు గోధుమ రం గులోకి మారిపోవడంతో దుర్వాసన వస్తోం దని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఎంఈఓ అంబళ్ల కృష్ణారావు ఇప్పటికే నవప్రయాస్ సంస్థ ప్రతినిధులకు హెచ్చరించా రు. అయితే తమకు కాంట్రాక్టర్ సరఫరా చేసే గుడ్లనే తాము పాఠశాలలకు అందజేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయంలో సంబం ధిత అధికారులు కల్పించుకుని విద్యార్థులకు నా ణ్యమైన గుడ్లు సరఫరా చేసేలా చర్యలు చేపటా ్టలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
రంగు మారిన గుడ్లు..
మా పాఠశాలకు రంగు మారిపోయిన గుడ్లు సరఫరా చేస్తున్నారు. ముదురు గోధుమ రంగులోకి మారిపోయిన గుడ్లు తినలేక విద్యార్థులు బయట పడేస్తున్నారు. నిర్వాహకులను అడిగితే తమకు కాంట్రాక్టర్‌సరఫరా చేసిన గుడ్లనే అందిస్తున్నామని చెబుతున్నారు. –పతివాడ త్రినాథ్, హెచ్‌ఎం, కొండవెలగాడ ప్రాథమిక పాఠశాల
హెచ్చరించాం..
మధ్యాహ్న భోజనానికి రంగు మారిన గుడ్లను సరఫరా చేస్తున్న విషయాన్ని నిర్వాహకుల దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లాం. నాణ్యమైన గుడ్లు సరఫరా చేయాలని హెచ్చరించాం. మారకపోతే ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. –అంబళ్ల కృష్ణారావు, ఎంఈఓ, నెల్లిమర్ల.
Comments
Please login to add a commentAdd a comment