న్యూస్‌లైన్ నెట్‌వర్క్ : అకాల వర్షాల కారణంగా గత నెలాఖరు వరకు సుమారు 12,910 హెక్టార్లలో పలురకాల పంటలకు నష్టం వాటిల్లినట్లు జి ల్లా వ్యవసాయ అధికారులు ఆ శాఖ కమిషనర్‌కు నివేదికలు పంపారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వరి 4435.8 హెక్టార్లలో, మక్క 1541.6 హెక్టార్లు, జొన్న 1707 హె క్టార్లు, పొద్దు తిరుగుడు 2197.8 హెక్టార్లు, చెరుకు 428 హెక్టార్లు, నువ్వులు 364.8 హె క్టార్లు, మిర్చి 392 హెక్టార్లు, టమాట 68.8 హెక్టార్లు, సజ్జలు 868 హెక్టార్లు, పెసర్లు 167.2 హెక్టార్లు, గోధుమ 17.2 హెక్టార్లు, శనగ 5.6 హెక్టార్లు, ఉల్లి 137 హెక్టార్లు, మామిడి పంట 10 హెక్టార్లలో నష్టపోయినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు.
ఊరూరా అదే పరిస్థితి
మంగళవారం కురిసిన వడగండ్ల వానతో నిజామాబా ద్ మండలంలోని కులాస్‌పూర్, కంజెర, మోపాల, న ర్సింగపల్లి, సిర్‌పూర్ గ్రామాలలో పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాళ్ల వర్షానికి మోపాలలో మూడు గొర్రెలు మృతి చెందాయి. బాల్కొండ మండలంలోని మెండోరా, బు స్సాపూర్, చాకిర్యాల్, సావెల్, కోడిచర్ల, దూదిగాం గ్రామాల్లో 385 ఎకరాలలో మొక్క జొన్న పంటకు న ష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆరబెట్టి న పసుపు కొమ్ములు, ఎర్ర జొన్నలు తడిసి ముద్దయ్యాయి. ఈదురు గాలులకు మొక్క జొన్న, ఎర్ర జొ న్న, నువ్వు పంట నేలకొరుగుతున్నాయి. మాక్లూర్ మండలంలోని మాక్లూర్, బొంకన్ పల్లి, మాదాపూర్, బోర్గాం (కె), మానిక్‌భండార్, దాస్‌నగర్, గాలిబ్‌నగ ర్, ముల్లంగి (బి), కృష్ణానగర్, గొట్టుముక్కుల, చిక్లీ, కల్లెడి, గుత్ప, దుర్గానగర్‌లో సుమారు 600 ఎకరాల లో టమాట, 100 ఎకరాలలో మిర్చి, వంకాయ, 200 ఎకరాలలో మొక్కజొన్న, 100 ఎకరాలలో పొద్దు తిరుగుడు పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
అధికారులెక్కడ?
వర్షాలకు టమాట పంటలు దె బ్బతిన్నప్పటికీ ఉద్యానశాఖ అధికారులు పరిశీలించడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. బోధన్ మండలంలో వడగండ్ల వర్షం మూడు గ్రామాలను అతలాకుతలం చేసింది. మండలంలోని సంగెం, మినార్‌పల్లి, భవానీపేట్ గ్రామాలలో వరి, మొక్కజొన్న పంటలు నేలమట్టమయ్యాయి.విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకొరిగాయి. డిచ్‌పల్లి మండలంలోని నర్సింగ్‌పూర్, రాంపూర్, మిట్టపల్లి, కమలాపూర్, ఖిల్లా డిచ్‌పల్లి గ్రామాలలో సుమారు 150 ఎకరాలలో ఉల్లి పంట కు నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. ఈదురు గాలులకు మామిడి పిందెలు రాలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తమ అధికారులు గ్రామాలలో తిరిగి పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారని జేడీఏ నర్సింహ తెలిపారు.
అన్నదాత దిగులు
Published Wed, Mar 5 2014 2:24 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement