
కాపు రిజర్వేషన్ల అంశం సున్నితమైంది
బీసీల్లో చేర్చే అంశానికి కట్టుబడి ఉన్నా: సీఎం
సాక్షి, విశాఖపట్నం: కాపులకు రిజర్వేషన్ అంశం సున్నితమైనదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కాపులను బీసీల్లో చేర్చే అంశానికి కట్టుబడి ఉన్నానని, వారికి అన్యాయం చేయనని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడున్న బీసీల రిజర్వేషన్లను కాపాడతానన్నారు. శనివారం రాత్రి ఆయన విశాఖ కలెక్టరేట్‌లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్‌ఆర్)పై కలెక్టర్, నేవీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కాపు గర్జన, సభల పేరుతో కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించే వారు రాజకీయాలు చేయకుండా ఆ అంశాన్ని ప్రభుత్వానికి వదిలిపెడితే న్యాయం చేస్తామన్నారు.
చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు
పింప్రీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుణేకు చెందిన పుణే మాయిర్స్ ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, భారతీయ ఛాత్ ్రసంసద్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు ఇచ్చాయి. ఈ సంస్థలు ఈ నెల 27వ తేదీనుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన 6వ భారతీయ ఛాత్ర సంసద్ (ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్) ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.