International Fleet Review
-
అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు భారత యుద్ధ నౌకలు
సాక్షి, విశాఖపట్నం: జపాన్‌లో ఈ నెల 6న ప్రారంభం కానున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు భారత యుద్ధనౌకలు బుధవారం యెకోసుకా తీరానికి చేరుకున్నాయి. తూర్పు నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా యుద్ధ నౌకలు ఐఎఫ్ఆర్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ఈ ఐఎఫ్ఆర్లో 13 దేశాలకు చెందిన 40 యుద్ధనౌకలు, జలాంతర్గాములు పాల్గొంటున్నాయి. ఫ్లీట్ రివ్యూని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా సమీక్షించనున్నారు. ఐఎఫ్ఆర్లో పాల్గొన్న అనంతరం.. భారత యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ శివాలిక్, ఐఎన్ఎస్ కమోర్తా జపాన్‌లో జరిగే మలబార్ 26వ ఎడిషన్ విన్యాసాల్లో పాల్గొననున్నాయి. నవంబర్ 8 నుంచి 18 వరకు జరిగే మలబార్లో భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాల నౌకాదళాలు పాల్గొంటాయి. -
వైజాగ్ వాసుల స్ఫూర్తికి మోదీ సెల్యూట్!
విశాఖపట్నం: హుద్ హుద్ తుఫాన్ బీభత్సం నుంచి విశాఖపట్నం వాసులు 14 నెలల్లోనే తేరుకున్నారని, విశాఖ వాసుల స్ఫూర్తి అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌక సమీక్షలో ఆదివారం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖపట్నం అందమైన నగరమని, ఈ నగరం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. హుద్ హుద్ విలయం సృష్టించిన సమయంలో తాను విశాఖపట్నానికి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశాఖ వాసులకు స్ఫూర్తికి సెల్యూట్ అని పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష చరిత్రాత్మకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నౌకాదళానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే.. ఫ్లీట్ రివ్యూ (యుద్ధనౌకల సమీక్ష)ను అద్భుతంగా నిర్వహించిన నౌక దళానికి అభినందనలు ఈ అద్భుత కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు వచ్చారు తీరప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మారిటైమ్ ఉపయోగపడుతుంది సముద్రాల ద్వారానే 90శాతం వాణిజ్యం కొనసాగుతోంది సముద్వాల ద్వారా అంతర్జాతీయంగా 20 ట్రిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది సముద్ర మార్గ వాణిజ్యానికి సునామీ, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాలు విసురుతున్నాయి అన్ని దేశాల నౌకాదళాలు భద్రతపై సమిష్టిగా దృష్టి సారించాలి గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ కోసం మేం బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం ఈ ఏడాది ఏప్రిల్‌లో గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ నిర్వహిస్తాం తీరప్రాంత రాష్ట్రాలన్నీ యువతకు శిక్షణ ఇవ్వాలి తీరప్రాంత భద్రత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం భారత్ సముద్రతీర విధానాన్ని మారిషస్‌లో ఇటీవల ప్రకటించాం భారత్‌కు 7,500 చదరపు కిలోమీటర్ల తీరప్రాంతముంది సార్క్ దేశాలతో మన సంబంధాలు బాగున్నాయి సింధు నాగరికత నాటి నుంచి ప్రపంచదేశాలతో భారత్‌కు సత్సంబంధాలు ఉన్నాయి. -
అరకు కాఫీ అమోఘం: మోదీ
సాక్షి, విశాఖపట్నం: అరకు కాఫీ రుచి అమోఘమని ప్రధాని నరేంద్ర మోదీ కితాబునిచ్చారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో భాగంగా విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఐఎఫ్ఆర్ విలేజ్, మారిటైమ్ ఎగ్జిబిషన్లను శనివారం ప్రధాని సందర్శించారు. అందులోని స్టాల్ వద్ద ఏపీ సీఎం చంద్రబాబు అరకు కాఫీ విశిష్టతను మోదీకి వివరించారు. కాఫీ రుచి చూసిన ప్రధాని అద్భుతమన్నారు. ఐఎఫ్ఆర్ విలేజ్‌లో హస్తకళలు, చేతివృత్తులకు సంబంధించి వివిధ రాష్ట్రాలకు చెందిన స్టాళ్లను పరిశీలించి కళాకారులతో ముచ్చటించారు. మారిటైమ్ ఎగ్జిబిషన్లో నౌకాదళ ఆయుధ సంపత్తి, వాటికి సంబంధించిన శాస్త్రీయ వివరాలను ప్రధాని తెలుసుకున్నారు. మన శాస్త్ర, సాంకేతిక రంగం చేస్తున్న కృషి, సామర్థ్యం, సిగ్నలింగ్, నావికా స్థావరాలు, అస్త్రాల నమూనాలను అధికారులు మోదీకి వివరించారు. భారత నావికాదళ అధిపతి ఆర్కే ధోవన్, తూర్పు నావికాదళ అధిపతి వైస్ అడ్మిరల్ సతీష్‌సోనీ ప్రధాని వెంట ఉన్నారు. -
ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ
-
ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ
విశాఖపట్నం: విశాఖపట్నంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో మూడో రోజు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణిస్తున్నారు. అంతకుముందు రాష్ట్రపతి నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ తీరంలో బంగాళాఖాతంలో 6 వరుసల్లో 70 యుద్ధనౌకలను మోహరించారు. రాష్ట్రపతి, ప్రధాని ప్రయాణిస్తున్న ఐఎన్ఎస్ సుమిత్రను మరో 5 యుద్ధ నౌకలు అనుసరిస్తున్నాయి. యుద్ధ నౌకల సామర్థ్యాన్ని రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. -
విశాఖ చేరుకున్న రాష్ట్రపతి
విశాఖపట్నం: ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్లు విశాఖపట్నం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, గవర్నర్ నరసింహన్‌లు ప్రణబ్ ముఖర్జీకి ఘనస్వాగతం పలికారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
నేడు విశాఖ రానున్న రాష్ట్రపతి, ప్రధాని
విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు శుక్రవారం ఐఎన్ఎస్ శాతవాహన కమాండ్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ నేడు రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. -
నౌకాదళ పండుగ నేటి నుంచే
ఐఎఫ్ఆర్కు సర్వాంగ సుందరంగా ముస్తాబైన విశాఖ సాగరతీరం హాజరుకానున్న రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రపంచ దేశాల నౌకాదళాలు... సముద్ర జలాల ద్వారా ఐక్యత’ అనే నినాదంతో విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ నౌకాదళ ప్రదర్శన(ఐఎఫ్ఆర్)కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ వేడుకలకు విశాఖపట్నం సాగరతీరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. భారతదేశం రెండోసారి నిర్వహిస్తున్న ఐఎఫ్ఆర్లో దాదాపు 52 దేశాల నౌకాదళాలు పాల్గొననుండటం విశేషం. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ఏపీ సీఎం చంద్రబాబు, త్రివిధ దళాధిపతులు, ఇతర ప్రముఖులు ఐఎఫ్ఆర్కు హాజరుకానున్నారు. ఐఎఫ్ఆర్ షెడ్యూల్... ఫిబ్రవరి 4: విశాఖపట్నం బీచ్‌రోడ్డులోని అమరవీరుల స్మారక స్థూపం వద్ద సాయంత్రం 4 గంటలకు నివాళులు అర్పించడంతో ఐఎఫ్ఆర్ను లాంఛనంగా ప్రారంభిస్తారు. సీఎం చంద్రబాబు, నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ తదితరులు పాల్గొంటారు. అనంతరం ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో మారిటైమ్ ఎగ్జిబిషన్, ఐఎఫ్ఆర్ విలేజ్లను చంద్రబాబు ప్రారంభిస్తారు. ఫిబ్రవరి 5: నేవల్ బేస్‌లోని ఐఎన్ఎస్ శాతవాహనలో ఐఎఫ్ఆర్-2016ను గవర్నర్ నరసింహన్ అధికారికంగా ప్రారంభిస్తారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి ప్రత్యేక విమానాల్లో విశాఖపట్నం చేరుకుంటారు. ఫిబ్రవరి 6: ప్రధాని మోదీ భువనేశ్వర్ వెళతారు. త్రివిధ దళాల అధిపతి హోదాలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ భారత నౌకాదళ సామర్థ్యాన్ని సమీక్షిస్తారు. ప్రత్యేక యుద్ధనౌకలో సముద్ర జలాల్లో ప్రయాణిస్తూ యుద్ధ నౌకలను పరిశీలిస్తారు. సాయంత్రం నేవీకి చెందిన సాముద్రిక ఆడిటోరియంలో నేవల్ బ్యాండ్ సంగీత విభావరి నిర్వహిస్తుంది. దేశ, విదేశీ నౌకాదళ ప్రతినిధులకు రాష్ట్రపతి గౌరవ విందు ఇస్తారు. ఫిబ్రవరి 7: రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. రెండు రోజుల అంతర్జాతీయ మారిటైమ్ సదస్సును రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రారంభిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటలకు బీచ్‌రోడ్డులో నౌకాదళ విన్యాసాలను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. రాత్రి బీచ్‌రోడ్డులోని ఓ హోటల్లో దేశ, విదేశీ ప్రతినిధులకు నౌకాదళ అధిపతి ఆర్కే ధోవన్ విందు ఇస్తారు. ఇందులో ప్రధాని కూడా పాల్గొంటారు. ఫిబ్రవరి 8: ఐఎఫ్ఆర్ ముగింపు వేడుకలను నిర్వహిస్తారు. ఆకట్టుకున్న పరేడ్, కార్నివాల్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)లో దేశ విదేశీ నౌకలే కాకుండా కళాకారులు కూడా ప్రదర్శనలు ఇవ్వనున్నారు. వీటి సన్నాహాల్లో భాగంగా బుధవారం సాయంత్రం బీచ్ రోడ్డులో నిర్వహించిన పరేడ్, కార్నివాల్ సందర్శకులకు కనువిందు చేశాయి. కార్నివాల్లో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు సంప్రదాయ చిహ్నాలతో పాల్గొన్నారు. ఉగ్రవాదుల ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఐఎఫ్ఆర్కు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. -
కాపు రిజర్వేషన్ల అంశం సున్నితమైంది
బీసీల్లో చేర్చే అంశానికి కట్టుబడి ఉన్నా: సీఎం సాక్షి, విశాఖపట్నం: కాపులకు రిజర్వేషన్ అంశం సున్నితమైనదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా కాపులను బీసీల్లో చేర్చే అంశానికి కట్టుబడి ఉన్నానని, వారికి అన్యాయం చేయనని చెప్పారు. అదే సమయంలో ఇప్పుడున్న బీసీల రిజర్వేషన్లను కాపాడతానన్నారు. శనివారం రాత్రి ఆయన విశాఖ కలెక్టరేట్లో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)పై కలెక్టర్, నేవీ, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... కాపు గర్జన, సభల పేరుతో కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించే వారు రాజకీయాలు చేయకుండా ఆ అంశాన్ని ప్రభుత్వానికి వదిలిపెడితే న్యాయం చేస్తామన్నారు. చంద్రబాబుకు ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు పింప్రీ, న్యూస్‌లైన్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పుణేకు చెందిన పుణే మాయిర్స్ ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్, భారతీయ ఛాత్ ్రసంసద్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆదర్శ ముఖ్యమంత్రి అవార్డు ఇచ్చాయి. ఈ సంస్థలు ఈ నెల 27వ తేదీనుంచి 30వ తేదీ వరకు నిర్వహించిన 6వ భారతీయ ఛాత్ర సంసద్ (ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్) ముగింపు కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
ఆకాశంలో ట్రాఫిక్ జామ్!
-
ఆకాశంలో ట్రాఫిక్ జామ్!
* విశాఖలో ఫ్లీట్ రివ్యూ ప్రభావం * ల్యాండింగ్‌కు అనుమతి లేక విమానాల చక్కర్లు * ఆ క్రమంలో ఎదురుపడిన మూడు విమానాలు గోపాలపట్నం (విశాఖపట్నం): రోడ్డు మీదే కాదు.. ఆకాశంలోనూ ట్రాఫిక్ జామ్ అవుతోంది. ప్రమాదాలు జరిగే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా..? మన విశాఖలోనే. దీనికి కారణం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ప్లీట్ రివ్యూ ప్రభావమేనని తెలుస్తోంది. ఫ్లీట్ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చే విమానాలను ఇప్పటికే నియంత్రించారు. అలాగే విన్యాసాల రిహార్సల్స్ జరుగుతున్న సమయాల్లో కొన్ని విమానాల రాకపోకలు నిలిపివేయడం.. మరికొన్నింటిని దారి మళ్లించడం చేస్తున్నా విమానాల ల్యాండింగ్ సమయంలో ఉత్కంఠ నెలకొం టోంది. ఈ క్రమంలో గురువారం మూడు విమానాలు ఒకదానికొకటి ఎదురుపడ్డాయని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఆందోళన చెందారు. పరిస్థితి అదుపులోకి రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. నేవీ విన్యాసాల దృష్ట్యా విశాఖ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 4 నుంచి రాత్రి 7 గంటల వరకూ విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగింది. దీంతో సాయంత్రం 5 గంటలకు విశాఖకు రావలసిన ఎయిరిండియా విమానం రాత్రి 7 గంటలకు రన్‌వేపై ల్యాండైంది. అంతకుముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి సంకేతాలు రాకపోవడంతో ఈ విమానం ఎస్.కోట మీదుగా చక్కర్లు కొట్టింది. అలాగే సాయంత్రం 4.20కి హైదరాబాద్ నుంచి విశాఖకు రావాల్సిన ఇండిగో విమానం రాత్రి 7.05కి చేరింది. ఈ విమానం కూడా యలమంచిలి వైపు సుమారు నలభై నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. మరోవైపు హైదరాబాద్ నుంచి రాత్రి 7.10కి విశాఖకు చేరిన మరో ఇండిగో విమానం కూడా అరగంట సేపు చక్కర్లు కొట్టింది. ఇలా చక్కర్లు కొట్టే క్రమంలో ఈ మూడు విమానాలూ ఒకదానికొకటి ఎదురుపడ్డాయని సమాచారం. అధికారులు బయటకు ఏమీ చెప్పకపోయినా.. దీనిపై చర్చించుకున్నట్లు తెలిసింది. విమానాలు ఎదురెదురుగా రావడంపై వారొక ఊహా చిత్రం కూడా రూపొం దించారని తెలిసింది. ఇక ముందు ఈ పరిస్థితి రాకుండా చేపట్టాల్సిన రక్షణచర్యలపై విమానాశ్రయ అధికారులు చర్చిస్తున్నారు. సాగర తీరంలో గగుర్పొడిచే విన్యాసాలు విశాఖపట్నం: ఇటీవలే భారత నావికా దళంలోకి చేరిన ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మిగ్ 29కే యుద్ధ విమానాలు.. మరోవైపు సీ హారియర్స్ ముందుకు దూసుకువచ్చే సన్నివేశాలు విశాఖ సాగరతీరంలో నగర వాసులకు గగుర్పాటు కల్పించాయి. సముద్రంలో కొలువు తీరిన యుద్ధ నౌకల నుంచి గగనతలంలోకి బాంబులు ఒకదాని వెంట మరొకటిగా లక్ష్యాన్ని ఛేదించడం.. ల్యాండింగ్ డాక్ ప్లాట్‌ఫాం నుంచి సైనికులు తీరప్రాంతంలోకి దూసుకువచ్చి శత్రుస్థావరాలపై దాడి చేసే సన్నివేశాలు కనువిందు చేస్తున్నాయి. అంతర్జాతీయ నేవీ ఫ్లీట్‌కు సన్నాహకంగా బుధవారం ప్రారంభించిన రిహార్సల్స్ గురువారం సాయంత్రం కూడా కొనసాగించారు. పలు యుద్ధ నౌకలు, సీ హారియర్స్ వంటి యుద్ధ విమానాలకు తోడు యుద్ధ ట్యాంకులు, కమెండోలు, పారాట్రూపర్స్ ఈ ఆపరేషన్ డెమోలో పాల్గొని తమ ప్రతిభ చాటుతున్నారు. యుద్ధం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూపించారు. శుక్రవారం కూడా రిహార్సల్స్ జరగనున్నాయి. -
అన్ని దారులూ సాగరతీరం వైపే...
విశాఖపట్నం : యుద్ధ నౌకల విన్యాసాలు తిలకించేందుకు విశాఖ వాసులు సాగరతీరం బాట పట్టారు. తీరం వెంట ప్రజలు ఆశక్తిగా రెండో రోజు యుద్ధ నౌకల విన్యాసాల్ని వీక్షించారు. గగనతలంలోంచి అతి సమీపానికి వస్తున్న యుద్ధ విమాన విన్యాసాల్ని ఆసక్తిగా తిలకించారు. గురువారం జరిగిన రిహార్సల్స్‌లో భాగంగా దాడి నుంచి తప్పించుకునేందుకు యుద్ధ విమానాలు ఒక్కసారిగా తలక్రిందులౌతున్న సన్నివేశాలు గగుర్పాటును కలిగించాయి. దేశీయ యుద్ధ నౌకలతో పాటు అంతర్జాతీయ యుద్ధనౌకలు సయితం సాగరంలో కొలువుతీరాయి. యుద్ధ విమానాలు బాంబులు జారవిడుస్తున్న సన్నివేశాలు, యుద్ధ నౌకల నుంచి గగనతలంలోకి నిర్ధేశిత లక్ష్యాల నుద్ధేశించి ప్రయోగించిన మిస్సైల్స్ సాగరతీరం నుంచే వీక్షిస్తున్న ప్రజలను అబ్బురపరిచాయి. ఇతర ప్రాంతాల నుంచి లగ్జరీ కార్లు మర్రిపాలెం: ఇంటర్నేషల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే దేశీయ, విదేశీ ప్రముఖులకు లగ్జరీ కార్లను ఇతర ప్రాంతాల నుంచి సమకూర్చుతున్నారు. మెర్స్డెజ్ బెంజ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ, రేంజ్ రోవర్, తదితర లగ్జరీ కార్లను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. విశాఖనగరంలో ఖరీదైన కార్లు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తీసుకురావడానికి నిమగ్నమయ్యారు. లగ్జరీ కార్లను సమకూర్చే బాధ్యతలు డిఫెన్స్ అధికారులు చూస్తున్నారు. ఢిల్లీ, ముంబాయి, చెన్నై, కోల్‌కతా, తదితర ప్రాంతాలలోని ప్రముఖ ట్రావెల్స్‌కు చెందిన కార్లను రప్పిస్తున్నట్టు తెలిసింది. దేశం నలుమూలల నుంచి కార్లను తీసుకురానున్నారు. దాదాపు వంద కార్లు అవసరంగా అధికారులు గుర్తించినట్టు సమాచారం. విమానాశ్రయం నుంచి ప్రముఖుల రాకపోకలు, విడిది, పాల్గొనే ప్రాంతాలకు తగ్గట్టుగా వాహనాల ఏర్పాటుకు సిద్ధపడుతున్నారు. కమిషనరేట్‌లో టాక్సీలు అల్లిపురం : ఐఎఫ్ఆర్ 16కు నగరానికి విచ్చేసే అతిథులకు టాక్సీలు సిద్ధంగా ఉన్నాయి. ఫ్లీట్ రివ్యూలో సుమారు 3వేల వరకు టాక్సీలను ప్రభుత్వం వినియోగిస్తుంది. విశాఖ జిల్లా, నగరంలో 15 వందల వరకు టాక్సీలు ఫిట్ అయినవి ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన టాక్సీలు విజయవాడ, కాకినాడ, ముంబయి ప్రాంతాల నుండి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేశారు. ఫ్లీట్ రివ్యూ దగ్గర పడుతుండడంతో నగరానికి వివిధ ప్రాంతాల నుండి టాక్సీలు వచ్చి నగర పోలీస్ కమిషనరేట్‌లో పార్క్ చేశారు. -
ఆ ఐదుగురు పర్యాటకులే: విశాఖ ఎస్పీ
విశాఖ : తాము అదుపులోకి తీసుకున్న ఐదుగురు అనుమానితులను విశాఖ జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ పర్యాటకులుగా నిర్థారించారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలంలోని కాగిత (వేంపాడు) టోల్‌గేటు వద్ద అనుమానాస్పదంగా ఉన్న ఐదుగురు విదేశీయులను నిన్న అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర నిఘా బృందం కూడా ఇరాన్ దేశీయుల వద్ద ఆధారాలను పరిశీలించిందని, ఒడిశా పోలీసులు ఎందుకు వారిని అనుమానించారో తెలియాల్సి ఉందని ఆయన గురువారమిక్కడ తెలిపారు. మరోవైపు అదుపులోకి తీసుకున్న ఐదుగురి పాస్‌పోర్టులు, వీసాలను పోలీసులు పరిశీలించారు. -
ఫ్లీట్ రివ్యూపై ఉగ్ర గురి?
♦ కారులో ఐదుగురు ఇరానియన్లు ♦ వేంపాడు టోల్గేట్ వద్ద పోలీసుల పట్టివేత సాక్షి, విశాఖపట్నం/నక్కపల్లి: ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్)పై ఉగ్రవాదులు గురిపెట్టారా?.. వారం రోజుల్లో విశాఖలో ఐఎఫ్ఆర్ జరగనున్న నేపథ్యంలో ఐదుగురు అనుమానితులు పోలీసులకు పట్టుబడడం.. తాము ఇరాన్ దేశస్తులమని చెప్పడం.. వారి వద్ద ఆ దేశపు పాస్పోర్టులుండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తప్పించుకున్న వారే వీరా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం సాయంత్రం కలకలం రేపిన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి. తెల్లని టయోటా కారు(డీఎల్ సీసీజే-1520)లో కొందరు వ్యక్తులు వస్తున్నారని, వారిని అదుపులోకి తీసుకోవాలని జిల్లా పోలీసు ఉన్నతాధికారుల నుంచి నక్కపల్లి ఎస్ఐ రామకృష్ణకు బుధవారం సాయంత్రం 5.30 గంటలకు సమాచారం అందింది. దీంతో ఆయన రాత్రి 7.30 గంటల సమయంలో విశాఖ నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న ఆ కారును వేంపాడు టోల్గేట్ వద్ద తనిఖీ చేయగా.. అందులో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. వివరాలు అడగ్గా తాము ఇరాన్ దేశస్తులమని, భారతదేశం చూడ్డానికి వచ్చామని, ప్రస్తుతం భువనేశ్వర్ నుంచి వస్తున్నామని చెప్పారు. అనుమానం వచ్చిన ఎస్ఐ వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని నక్కపల్లి పోలీస్‌స్టేషన్ తరలించారు. అప్పటికే అక్కడికి చేరుకున్న నర్సీపట్నం ఇన్చార్జి డీఎస్పీ రాఘేవేంద్ర, యలమంచిలి సీఐ వెంకట్రావులు వారిని హుటాహుటిన విశాఖపట్నం తీసుకొచ్చారు. విదేశీయులు డ్రైవింగ్ చేసుకుని వస్తారా? ఇరాన్‌కు చెందిన వారుగా చెబుతున్న వీరు పరాయి దేశంలో సొంతంగా కారు నడుపుతూ వెళ్లడం, అదీ ఢిల్లీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో తిరగడం అనుమానాలకు తావిస్తోంది. ఇరాన్ వారైతే ఈ రాష్ట్రంలో స్థానికుల్లా పర్యటించడం పట్ల పోలీసులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే అనుమానితులు ప్రయాణిస్తున్న కారుకు ముందు భాగాన డీఎల్ 6సీజే-1520 నంబరు, వెనకన డీఎల్-సీసీజే-1520 నంబరు ఉంది. దీన్ని బట్టి వీరు కారును ఎత్తుకొచ్చి ప్రయాణిస్తున్నట్టు స్పష్టమవుతోంది. భువనేశ్వర్‌లో తప్పించుకున్న వారేనా? పట్టుబడిన వారు మంగళవారం ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పరారైన వారేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాము ఇరాక్‌కు చెందిన వారిగా హోటల్ వారికి చెప్పడంతో ఆరా తీసి గుర్తింపు కార్డులు అడగడం.. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో అక్కడ నుంచి ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారులో పరారైన సంగతి తెలిసిందే. వీరిని ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నామని ఒడిశా డీజీపీ కేబీ సింగ్ ఇప్పటికే ప్రకటించారు. 24 గంటలు గడవక ముందే ఐదుగురు కారులో వెళ్తూ పట్టుబడడం, అది కూడా ఢిల్లీ రిజిస్ట్రేషన్ కారు కావడం, ఇరాన్‌కు చెందిన వారవడంతో వీరు వారేనన్న విషయం స్పష్టమవుతోంది. అదుపులోకి తీసుకున్నాం.. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిని వేంపాడు టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నాం. వారి వద్ద ఇరాన్‌కు చెందిన పాస్‌పోర్టులున్నాయి. వారిని విచారిస్తున్నాం. పూర్తి వివరాలు గురువారం నాటికి చెబుతాం. - కోయ ప్రవీణ్, ఎస్పీ, విశాఖపట్నం -
ఫ్లీట్ రివ్యూపై ఉగ్ర గురి?
-
విమాన సర్వీసుల నియంత్రణ!
నేవీ ఫ్లీట్ నేపథ్యంలో అధికారుల ముందు జాగ్రత్త నిర్ణీత తేదీలు.. వేళల్లో విమాన సర్వీసుల రద్దు {పముఖులు, విదేశీ విమానాలకు అంతరాయం లేకుండా చర్యలు దేశీయ విమాన సర్వీసుల రూటు మళ్లింపు గోపాలపట్నం: అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూకు అత్యంత ప్రముఖులను తీసుకొచ్చే దేశ, విదేశీ విమానాల రాకపోకలను దృష్టిలో పెట్టుకుని విశాఖ విమానాశ్రయలు అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిర్ణీత తేదీల్లో కొన్ని సమయాల్లో విమానాశ్రయాన్ని మూసివేయాల్సి ఉంటుందని అంటున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీతోపాటు యాభై దేశాల నుంచి మంత్రులు, నేవీ ఉన్నతాధికారులు రానుండటంతో తూర్పు నావికాదళంతోపాటు ఎస్పీజీ తదితర భద్రతాధికారులు గత రెండు రోజులుగా అత్యంత అప్రమత్తంగా ఉన్నారు. ముందస్తు భద్రతా ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు. నేవీ ఫ్లీట్‌కు విమానాలు రాకపోకలు సాగించే సమయంలో దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల వల్ల అంతరాయం వాటిల్లకుండా ముందుజాగ్రత్త చర్యలు ప్రారంభించారు. ఆ మేరకు విశాఖ విమానాశ్రయాన్ని బుధవారం నుంచి ఆయా రోజుల్లో కొన్ని గంటలపాటు మూసివేయాలని నిర్ణయించారు. ప్రస్తుత విమానాశ్రయ రన్‌వేతో పాటు పాత విమానాశ్రయ కార్గో రన్‌వే, ఐఎన్ఎస్ డేగా రన్‌వేలను కూడా ప్లీట్రివ్యూ సందర్భంగా వినియోగించాలని నిర్ణయించారు. ప్లీట్‌కు వచ్చే విదేశీ విమానాలకు సముద్రం మీదుగా రూట్ ఇచ్చి, దొమస్టిక్ విమాన సర్వీసులను సింహాచలం కొండ ప్రాంతం ప్రామాణికంగా రాకపోకలు జరపాలని భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే నేవీ అధికారులు విమాన సంస్ధలకు సూచనలిచ్చినట్లు తెలిసింది. దీనిపై తమకు వర్తమానం అందిందని భారత విమాన ప్రయాణికుల సంఘ అధ్యక్షుడు డి.వరదారెడ్డి తెలిపారు. భద్రతా కారణాల వల్ల అధికారులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. మూసివేసే తేదీలు.. వేళలు.. విశ్వసనీయ సమచారం ప్రకారం విమానాశ్రయాన్ని మూసివేసే వేళలు తేదీల వారీగా ఇలా ఉన్నాయి.. ఈ నెల 27(బుధవారం) నుంచి 29 వరకు.. తిరిగి ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు ప్రతిరోజు సాయంత్రం 4 నుంచి రాత్రి 7.30 గంటల వరకు.. ఈనెల 30, 31, ఫిబ్రవరి 2, 4, 6 తేదీల్లో ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు విమాన సర్వీసులు ఉండవని తెలిసింది. -
ఫ్లీట్ ఫెస్ట్
-
ఫ్లీట్ ఫెస్ట్
→ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో విశాఖకు సరికొత్త ఖ్యాతి → ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న నగరం → యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం.. అనేక ఆధునిక యుద్ధ వ్యవస్థలతో మన సైనిక సంపత్తిలో కీలక స్థానం సంపాదించింది. నేడు అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన నిర్వహించే స్థాయికి ఎదగింది. 50కి పైగా దేశాలు.. పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు.. విమానాలు.. ఇతర ఆయుధ సంపత్తిలో యుద్ధ సన్నద్ధతను చాటే విన్యాసాలతో కనువిందు చేయనున్నాయి. అతి అరుదైన ఈ ఘట్టాన్ని.. దాని నేపథ్యాన్ని పాఠకుల కళ్లకు కట్టేందుకు నేటి నుంచి ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల సమాహారమే ‘ఫ్లీట్ ఫెస్ట్’.. ఏమిటీ ఫ్లీట్ రివ్యూ.. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు నావికాదళ విన్యాసాలు ప్రపంచదేశాలకు చాటేందుకు నిర్ధేశించినివే ఫ్లీట్ రివ్యూలు. భారత సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని గౌరవార్ధం ఈ విన్యాసాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే భారత్ 12 పర్యాయాలు ఈ విన్యాసాలు చేసింది. వాటిలో తూర్పు నావికా దళం భాగమైంది. అయితే తొలిసారిగా భారత తూర్పు తీరం అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికైంది. 2001లో ముంబయ్‌లో తొలిసారిగా భారతదేశం ఇటువంటి విన్యాసాలకు వేదికైంది. ప్రపంచానికే నాగరికత నే ర్పిన దేశంలో తొలి టైడల్ డాక్‌ను భారత్ నిర్మించింది. చంద్రగుప్త కాలంనుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర పేర్కొంటున్నది. నాటినుంచి నేటి అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంఛాలితంగా ఎదిగిన భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో తాజాగా ప్రపంచదేశాల దృష్టి విశాఖ తీరంవైపు సాగనుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం తొలిసారిగా భారత తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన యుద్ధనౌకలు విశాఖ తీరంలో విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. గతంలో పదిహేనేళ్ళ క్రితం భారత పశ్చిమతీరంలో ఈ తరహా విన్యాసాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ప్రదర్శనకు వచ్చిన దేశాలకు రెట్టింపు దేశాల యుద్ధనౌకలు ఈసారి అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన చేయనున్నాయి. ఇప్పటికే యాభై దేశాలకు చెందిన యుద్ధనౌకలు విన్యాసాల్లో పాల్గొనేందుకు సుముఖత తెలపగా మరో 20 దేశాలకు చెందిన నౌకలు పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దేశప్రతిష్టకు ప్రతిభింబించే ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శన పాఠవాలను వీక్షించేందుకు ఒకే రోజు దేశాధ్యక్షునితో పాటు దేశప్రధాని విశాఖకు రానుండడంతో పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనేదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానుండడంతో ప్రపంచం యావత్తు విశాఖ తీరంవైపు దృష్టిసారించనుంది. ప్రబలశక్తిగా స్వయంగా అణుజలాంతర్గాముల్ని నిర్మించుకునే స్థాయికి ఎదిగిన భారత్ అందుకు ధీటుగా ప్రపంచ దేశాలను ఆకట్టుకోనుంది. భారత్ ప్రదర్శనకు... చైనా నేటికీ యుద్ధ విమానాలను తరలించే ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్‌ను సముపార్జించుకునే స్థితిలోనే ఉండగా భారత్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య, విరాట్లను ప్రదర్శించనుంది. ముందువరసలో దూసుకుపోయే 75 యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భారత్ తరపున పొల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుట్ క్లాస్, కమోర్తా క్లాస్, షివాలిక్ క్లాస్, బ్రహ్మాపుత్ర క్లాస్ తదితర తరగతులకు చెందిన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాలుపంచుకోనున్నాయి. తీరాలకు దూరంగా వెళ్లిపోయిన యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టోర్పెడో రికవరీ వెసల్స్తో పాటు టగ్స్, నీరీక్షక్లు పాల్గొంటున్నాయి. నావల్ ఎయిర్స్క్వాడ్రన్స్కు చెందిన యుద్ధవిమానాలు గగనతలంలో ఎంత ప్రమాదకారులో చాటనున్నాయి. గాలిలో నుంచే సముద్రంలోని శత్రుదేశాల యుద్ధ నౌకల్ని నిర్ధేశిత లక్ష్యాలతో పేల్చేసే నైపుణ్యాల్ని ప్రదర్శించనున్నాయి. ఎనిమిదివేల టన్నుల బరువు కలిగిన అకులా తరగతికి చెందిన న్యూక్లియర్ పవర్డ్ జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర హఠాత్తుగా సముద్రగర్భంలోంచి ఒక్కసారిగా పైకుబికి బయోత్పాపాన్ని కలిగించనుంది. భారత తీరరక్షణ దళం, మెరైన్ దళాలతో పాటు వాణిజ్య నౌకలు వరుసక్రమంలో ఐఎఫ్ఆర్ చివరి రోజున అలరించనున్నాయి. గగనతలంలో.. సముద్రంలో విన్యాసాలతో యుద్ధనౌకలు అలరిస్తే నావికా దళానికి చెందిన 45 యుద్ధ విమానాలు 15 వరుసల్లో గగనతలంలో దూసుకుపోనున్నాయి. మిగ్స్, ఎల్ఆర్ఎంలు, పి81లతో పాటు కెఎం తరహా హెలికాఫ్టర్లు ఈ ఫ్లైపాస్ట్ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. రిహార్సల్స్ : భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీనే ఐఎఫ్ఆర్ రిహార్సల్స్ ప్రారంభం కానున్నాయి. నౌకదళ యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, హెలికాఫ్టర్లు చేసే విన్యాసాలను విశాఖ తీరంలో ప్రజలు తిలకించేందుకు అవకాశం ఉంది. 27న నమూనా విన్యాసాలు, 31న యుద్ధనౌకల సమీక్ష జరగనుంది. ఫిబ్రవరి 3న అంతర్జాతీయ నగర కవాతు జరగనుంది. చైనా నౌకలొస్తున్నాయి.... ఆసియాలో భారత్‌కు ధీటుగా ఉన్న చైనా దేశానికి చెందిన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. అయితే పాకిస్తాన్‌కు మాత్రం ఈ విన్యాసాల్లో పాల్గొనే అవకాాశాలు లేకుండా ఉన్నాయి. ఇక యూరప్‌కు చెందిన వాణిజ్య నౌకలు ఈ విన్యాసాల్లో అలరించనున్నాయి. ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రపంచ దేశాల యుద్ధనౌకలు తిరుగుపయనం కానున్నాయి. ఏ రోజు ఏమిటి..? విశాఖ సాగరతీరంలోని యుద్ధవీరుల స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని వుంచి మౌనం పాటించిన తర్వాత అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలు ప్రారంభం కానున్నాయి. 1971లో దాయాది పాకిస్తాన్ భూభాగంలోని కరాచీ హర్బర్‌పై మిస్సైల్ బోట్లతో దాడికి దిగి విజయాన్ని సాధించడంలో అమరులైన నావికాదళ వీరుల స్మృత్యర్థం ఈ స్థూపం నిర్మించారు. దీన్నే విక్టరీ ఎట్ సీ గానూ పేర్కొంటారు. సలామీ శాస్త్ర అనంతరం షోక్ శాస్త ఆలపించి ఘనంగా నివాళులర్పించనున్నారు. ఫిబ్రవరి నాలుగోతేదీన సాయం వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే రోజున ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో సముద్రయాన ప్రదర్శనతో ఐఎఫ్ఆర్ గ్రామాన్ని ప్రజల సందర్భనార్ధం ప్రారంభించనున్నారు. మేకిన్ ఇండియానే ప్రత్యేక అకర్షణ కానుంది. ఐదో తేదీనే ప్రారంభ వేడుక జరగనుంది. అదే రోజు దేశాధ్యక్షుడు, దేశ ప్రధాని విశాఖకు వేర్వేరు విమానాల్లో చేరుకుంటారు. ఆరో తేదీన భారత నావికా దళం బ్యాండ్ ప్రతిభతో ఓలలాడించనుంది. యాభయవ దశకంలో ప్రారంభమైన ఈబాండ్ అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకుంది. -
అగ్ని పరీక్షకు సన్నద్దం
‘ఐఎఫ్ఆర్’కు పకడ్బందీ ఏర్పాట్లు బయట నుంచి 17 వేల మంది పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత చర్యలు శాంతి భద్రతల పరిరక్షణకు {పత్యేక బృందాలు విశాఖపట్నం : వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖ నగరం ప్రతిష్టాత్మక స్థాయిలో ఆతిథ్యం ఇవ్వనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) పోలీసులకు ఓ సవాలు కానుంది. దాదాపు 70 దేశాల నుంచి ప్రముఖులు వస్తున్నారు. మరో వైపు ఈ చారిత్రక ఘట్టాన్ని వీక్షించేందుకు 1.5 లక్షల మంది ప్రజలు రానున్నారని అంచనా వేస్తున్నారు. దీంతో ట్రాఫిక్ నిర్వహణ పెద్ద సమస్యగా మారనుంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రముఖుల భద్రతకు భారీ బలగాలను రప్పిస్తోంది. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తోంది. ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్ల ద్వారా కమ్యూనికేషన్ వ్యవస్థను ట్రాఫిక్ నియంత్రణకు ఉపయోగించుకోనుంది. దేశంలోనే రెండోసారి, రాష్ట్రంలో మొదటిసారి జరుగనున్న ఐఎఫ్ఆర్కు ప్రధాన మంత్రితో పాటు దేశ ముఖ్య నేతలు, ఇతర దేశాల ప్రముఖులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. వీరందరికీ రక్షణ కల్పించడమనేది అధికారుల ముందున్న పెద్ద సవాలు. అయితే త్రివిధ దళాలు ఈ యజ్ఞంలో పాలు పంచుకుంటున్నందున కాస్త వెసులుబాటు కలుగుతుంది. సివిల్ పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్, ఆక్టోపస్, కౌంటర్ ఇంటెలిజెన్స్ వంటి ప్రత్యేక బలగాలు క్షేత్రస్థాయిలో భద్రత ఏర్పాట్లు చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నగర కమిషనరేట్ పరిధిలో 2,800 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. వారితో పాటు 16 వేల నుంచి 17వేల మందిని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరనున్నారు. అయితే వచ్చే సిబ్బందికి వసతి ఏర్పాట్లు చేయడం కూడా ముఖ్యం. దీనిపై కూడా కసరత్తు పూర్తయ్యింది. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఉన్నందున పాఠశాలలను విడిచిపెట్టి కళాశాలల్లో పోలీసు సిబ్బందికి వసతి కల్పించనున్నారు. పోలీసు అధికారులకు స్టీల్‌ప్లాంట్, ఎన్టీపీసీ, గీతం, ఏయూతో పాటు పలు సంస్థలు, ప్రైవేటు భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. బారికేడ్లు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పోలీసులు ఇప్పటికే ఓ స్పష్టతకు వచ్చారు. ప్రముఖులకు, సాధారణ ప్రజలకు వేరు వేరుగా పార్కింగ్ ప్రాంతాలను కేటాయించనున్నారు. నగరంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన 160 ప్రదేశాలను గుర్తించారు. అదే విధంగా ఐఎఫ్ఆర్ సమయంలో సెల్ఫోన్ల ద్వారా బల్క్ మెసేజ్‌లు అనుమతించకూడదనుకుంటున్నారు. దీనిపై మొబైల్ నెట్వర్క్ ప్రొవైడర్లతో చర్చించారు. కొత్తగా సెల్‌టవర్లు ఏర్పాటు చేయమని వారిని కోరారు. ట్రాఫిక్ అప్డేట్స్ను ఎస్ఎంఎస్ అలెర్ట్స్ రూపంలో అన్ని మొబైల్ నెట్వర్క్స్ అందించనున్నాయి. అయితే ఆ మెసేజ్‌లు పోలీసుల నుంచే వచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవస్థను పర్యవేక్షించడానికి ఇంటిగ్రేటెడ్ కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. సిద్ధమవుతున్నాం ఐఎఫ్ఆర్ నిర్వహణ మా ముందున్న పెద్ద బాధ్యత. దానిని విజయవంతం చేయడానికి మూడు నెలల నుంచే కసరత్తు ప్రారంభించాం. 16వేల నుంచి 17 వేల మంది పోలీసు బలగాలు అవసరమవుతారని నిర్ధారణకు వచ్చాం. మావోయిస్టులు, టైస్టుల కార్యకలాపాలను అడ్డుకునే కౌంటర్ పార్టీలు అవసరమవుతాయి. బలగాలను ఇతర జిల్లాల నుంచి ఇప్పించాల్సిందిగా డీజీపీని కోరనున్నాం. వచ్చిన వారికి వసతి కల్పించడం కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశాం. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్స్ నిర్వాహకులతో చర్చించాం. భద్రత ఏర్పాట్లపై జాగ్రత్త అవసరమని సూచించాం. - అమిత్‌గార్గ్, పోలీస్ కమిషనర్, విశాఖ సిటీ