ఫ్లీట్ ఫెస్ట్ | Today, the performance of international warships | Sakshi
Sakshi News home page

ఫ్లీట్ ఫెస్ట్

Published Sat, Jan 23 2016 12:53 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఫ్లీట్ ఫెస్ట్ - Sakshi

ఫ్లీట్ ఫెస్ట్

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూతో విశాఖకు సరికొత్త ఖ్యాతి
ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న నగరం
యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు  
 

తూర్పు నావికాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం.. అనేక ఆధునిక యుద్ధ వ్యవస్థలతో మన సైనిక సంపత్తిలో కీలక స్థానం సంపాదించింది. నేడు అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన నిర్వహించే స్థాయికి ఎదగింది. 50కి పైగా దేశాలు.. పెద్ద సంఖ్యలో యుద్ధ నౌకలు.. విమానాలు.. ఇతర ఆయుధ సంపత్తిలో యుద్ధ సన్నద్ధతను చాటే విన్యాసాలతో కనువిందు చేయనున్నాయి. అతి అరుదైన ఈ ఘట్టాన్ని.. దాని నేపథ్యాన్ని పాఠకుల కళ్లకు కట్టేందుకు నేటి నుంచి ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల సమాహారమే ‘ఫ్లీట్ ఫెస్ట్’..

 

ఏమిటీ ఫ్లీట్ రివ్యూ..
దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు సాగరంలో ఎదురుదాడికి దిగగల సత్తా చాటేందుకు నావికాదళ విన్యాసాలు ప్రపంచదేశాలకు చాటేందుకు నిర్ధేశించినివే ఫ్లీట్ రివ్యూలు.  భారత సుప్రీం కమాండర్ అయిన దేశాధ్యక్షుని గౌరవార్ధం ఈ విన్యాసాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే భారత్ 12 పర్యాయాలు ఈ విన్యాసాలు చేసింది.  వాటిలో తూర్పు నావికా దళం భాగమైంది. అయితే తొలిసారిగా భారత తూర్పు తీరం అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలకు వేదికైంది. 2001లో ముంబయ్‌లో తొలిసారిగా భారతదేశం ఇటువంటి విన్యాసాలకు వేదికైంది. 

 
ప్రపంచానికే నాగరికత నే ర్పిన దేశంలో తొలి టైడల్ డాక్‌ను భారత్ నిర్మించింది. చంద్రగుప్త కాలంనుంచే భారతీయులు సముద్రయానంపై మంచి పట్టు సాధించినట్లు చరిత్ర పేర్కొంటున్నది. నాటినుంచి నేటి అణుజలాంతర్గాముల నిర్మాణంలోనూ స్వయంఛాలితంగా ఎదిగిన భారత్ ప్రపంచదేశాలను ఆకర్షిస్తూనే ఉంది. అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనతో తాజాగా ప్రపంచదేశాలhttp://img.sakshi.net/images/cms/2016-01/51453489163_Unknown.jpg దృష్టి విశాఖ తీరంవైపు సాగనుంది. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం తొలిసారిగా భారత తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో పలు దేశాలకు చెందిన యుద్ధనౌకలు విశాఖ తీరంలో విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. గతంలో పదిహేనేళ్ళ క్రితం భారత పశ్చిమతీరంలో ఈ తరహా విన్యాసాలు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ప్రదర్శనకు వచ్చిన దేశాలకు రెట్టింపు దేశాల యుద్ధనౌకలు ఈసారి అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శన చేయనున్నాయి.

ఇప్పటికే యాభై దేశాలకు చెందిన యుద్ధనౌకలు విన్యాసాల్లో పాల్గొనేందుకు సుముఖత తెలపగా మరో 20 దేశాలకు చెందిన నౌకలు పాల్గొనే అవకాశాలు మెండుగా ఉన్నాయి.  దేశప్రతిష్టకు ప్రతిభింబించే ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి.  ఈ ప్రదర్శన పాఠవాలను వీక్షించేందుకు ఒకే రోజు దేశాధ్యక్షునితో పాటు దేశప్రధాని విశాఖకు రానుండడంతో పాటు ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనేదేశాలకు చెందిన ప్రముఖులు హాజరుకానుండడంతో ప్రపంచం యావత్తు విశాఖ తీరంవైపు దృష్టిసారించనుంది. ప్రబలశక్తిగా స్వయంగా అణుజలాంతర్గాముల్ని నిర్మించుకునే స్థాయికి ఎదిగిన భారత్ అందుకు ధీటుగా ప్రపంచ దేశాలను ఆకట్టుకోనుంది.
 
భారత్ ప్రదర్శనకు...
చైనా నేటికీ యుద్ధ విమానాలను తరలించే ఎయిర్‌క్రాఫ్ట్ కారియర్‌ను సముపార్జించుకునే స్థితిలోనే ఉండగా భారత్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య, విరాట్‌లను ప్రదర్శించనుంది. ముందువరసలో దూసుకుపోయే 75 యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో భారత్ తరపున పొల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్‌పుట్ క్లాస్, కమోర్తా క్లాస్, షివాలిక్ క్లాస్, బ్రహ్మాపుత్ర క్లాస్ తదితర తరగతులకు చెందిన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో http://img.sakshi.net/images/cms/2016-01/41453489293_Unknown.jpgపాలుపంచుకోనున్నాయి. తీరాలకు దూరంగా వెళ్లిపోయిన యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ టాంకర్లు, టోర్పెడో రికవరీ వెసల్స్‌తో పాటు టగ్స్, నీరీక్షక్‌లు పాల్గొంటున్నాయి. నావల్ ఎయిర్‌స్క్వాడ్రన్స్‌కు చెందిన యుద్ధవిమానాలు గగనతలంలో ఎంత ప్రమాదకారులో చాటనున్నాయి.  గాలిలో నుంచే సముద్రంలోని శత్రుదేశాల యుద్ధ నౌకల్ని నిర్ధేశిత లక్ష్యాలతో పేల్చేసే నైపుణ్యాల్ని ప్రదర్శించనున్నాయి. ఎనిమిదివేల టన్నుల బరువు కలిగిన అకులా తరగతికి చెందిన న్యూక్లియర్ పవర్డ్ జలాంతర్గామి ఐఎన్‌ఎస్ చక్ర హఠాత్తుగా సముద్రగర్భంలోంచి ఒక్కసారిగా పైకుబికి బయోత్పాపాన్ని కలిగించనుంది. భారత తీరరక్షణ దళం, మెరైన్ దళాలతో పాటు వాణిజ్య నౌకలు వరుసక్రమంలో ఐఎఫ్‌ఆర్ చివరి రోజున అలరించనున్నాయి.

గగనతలంలో..
సముద్రంలో విన్యాసాలతో యుద్ధనౌకలు అలరిస్తే నావికా దళానికి చెందిన 45 యుద్ధ విమానాలు 15 వరుసల్లో గగనతలంలో దూసుకుపోనున్నాయి. మిగ్స్, ఎల్‌ఆర్‌ఎంలు, పి81లతో పాటు కెఎం తరహా హెలికాఫ్టర్లు ఈ ఫ్లైపాస్ట్ విన్యాసాల్లో పాల్గొనున్నాయి. http://img.sakshi.net/images/cms/2016-01/61453489477_Unknown.jpg
రిహార్సల్స్ : భారత గణతంత్ర దినోత్సవమైన జనవరి 26వ తేదీనే ఐఎఫ్‌ఆర్ రిహార్సల్స్ ప్రారంభం కానున్నాయి. నౌకదళ యుద్ధ విమానాలు, నిఘా విమానాలు, హెలికాఫ్టర్లు చేసే విన్యాసాలను విశాఖ తీరంలో ప్రజలు తిలకించేందుకు అవకాశం ఉంది.  27న నమూనా విన్యాసాలు, 31న యుద్ధనౌకల సమీక్ష జరగనుంది. ఫిబ్రవరి 3న అంతర్జాతీయ నగర కవాతు జరగనుంది.  
 
చైనా నౌకలొస్తున్నాయి....
ఆసియాలో భారత్‌కు ధీటుగా ఉన్న చైనా దేశానికి చెందిన యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొనున్నాయి.  అయితే పాకిస్తాన్‌కు మాత్రం ఈ విన్యాసాల్లో పాల్గొనే అవకాాశాలు లేకుండా ఉన్నాయి. ఇక యూరప్‌కు చెందిన వాణిజ్య నౌకలు ఈ విన్యాసాల్లో అలరించనున్నాయి.  ఫిబ్రవరి తొమ్మిదో తేదీన ప్రపంచ దేశాల యుద్ధనౌకలు తిరుగుపయనం కానున్నాయి.
 
 
ఏ రోజు ఏమిటి..?
విశాఖ సాగరతీరంలోని యుద్ధవీరుల స్మారకస్థూపం వద్ద పుష్పగుచ్చాన్ని వుంచి మౌనం పాటించిన తర్వాత అంతర్జాతీయ యుద్ధనౌకల విన్యాసాలు ప్రారంభం కానున్నాయి.  1971లో దాయాది పాకిస్తాన్ భూభాగంలోని కరాచీ హర్బర్‌పై మిస్సైల్ బోట్లతో దాడికి దిగి విజయాన్ని సాధించడంలో అమరులైన నావికాదళ వీరుల స్మృత్యర్థం ఈ స్థూపం నిర్మించారు.  దీన్నే విక్టరీ ఎట్ సీ గానూ పేర్కొంటారు. http://img.sakshi.net/images/cms/2016-01/41453489401_Unknown.jpgసలామీ శాస్త్ర అనంతరం  షోక్ శాస్త ఆలపించి ఘనంగా నివాళులర్పించనున్నారు. ఫిబ్రవరి నాలుగోతేదీన సాయం వేళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇదే రోజున ఏయూ ఇంజినీరింగ్ గ్రౌండ్స్‌లో సముద్రయాన ప్రదర్శనతో ఐఎఫ్‌ఆర్ గ్రామాన్ని ప్రజల సందర్భనార్ధం ప్రారంభించనున్నారు. మేకిన్ ఇండియానే ప్రత్యేక అకర్షణ కానుంది. ఐదో తేదీనే ప్రారంభ వేడుక జరగనుంది. అదే రోజు దేశాధ్యక్షుడు, దేశ ప్రధాని విశాఖకు వేర్వేరు విమానాల్లో చేరుకుంటారు. ఆరో తేదీన భారత నావికా దళం బ్యాండ్ ప్రతిభతో ఓలలాడించనుంది. యాభయవ దశకంలో ప్రారంభమైన ఈబాండ్ అంతర్జాతీయంగానూ గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement