పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య | farmer suicide in prakasam district | Sakshi
Sakshi News home page

పురుగులమందు తాగి రైతు ఆత్మహత్య

Published Thu, Nov 12 2015 9:48 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

farmer suicide in prakasam district

పర్చూరు: పంట ఎండిపోయిందనే మనస్తాపంతో బుధవారం ఉదయం పురుగుల మందు తాగిన రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన చిమటా ప్రసాద్(37) తనకున్న మూడెకరాలతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేకపోవ డంతో పంట ఎండిపోయింది. ఎండిపోయిన పంటను చూసి దిగులు చెందిన ప్రసాద్ పొలంలో పురుగుల మందు తాగాడు. అది గుర్తించిన గ్రామస్తులు హుటాహుటిన గుంటూరు తరలించగా..చికిత్సపొందుతూ ఈ రోజు ఉదయం మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement