దయనీయస్థితిలో రైతులు: వైఎస్ జగన్ | farmers are in troubles , says ys jagan mohan reddy | Sakshi
Sakshi News home page

దయనీయస్థితిలో రైతులు: వైఎస్ జగన్

Published Fri, Mar 20 2015 11:48 AM | Last Updated on Sat, Sep 29 2018 7:10 PM

farmers are in troubles , says ys jagan mohan reddy

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో రైతుల చాలా దయనీయమైన స్థితిలో ఉన్నారని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పడు చంద్రబాబు నాయుడు ఒకమాట...అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.  వైఎస్ జగన్ శుక్రవారం లోటస్పాండ్లోని పార్టీ కార్యాలయంలో ప్రెస్మీట్లో మాట్లాడుతూ రుణమాఫీ అమలు చేసే విషయంలో షరతులు వర్తిస్తాయంటూ ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు.

రూ.56వేల కోట్ల రుణాలు రైతులకు ఇవ్వాలనుకున్న బ్యాంకులు కేవలం రూ.13781 కోట్లు మాత్రమే ఇవ్వగలిగాయన్నారు. మిగిలిన రూ.40వేల కోట్లకు పైగా రుణాలను బ్యాంకుల గడప తొక్కలేక రైతులు బయట అప్పలు తెచ్చుకుంటున్నారన్నారు.  ఓ వైపు బ్యాంకులు రుణాలు ఇవ్వక, మరోవైపు రుణమాఫీ అవ్వక ...రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా కేస్స్టడీస్తో సహా మీడియాకు వివరించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement